Posts

NITYA DEVIS-PARICHAYAMU

Image
    " ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా"    లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.     పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.  ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.  ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.  15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.  అమ్మవారు షోడశి నిత్యకళ.  ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,  కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.  ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.  నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.   వైదికులు సూర్యుని ఆత్మస్వరూ...

SREERAMANAVAMI-2024

Image
  " జానక్యా: కమలా మలాంజలి పుటే  యా: పద్మరాగయితా:    న్యస్తా రాఘవ మస్తకేచ  విలసత్ కుంద  ప్రసునాయితా:    స్రస్తా: శ్యామల కాయకాంతి  కలితా: యాఇంద్ర నీలాయితా:    ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"   రారా మాఇంటి దాక ! సీతారామా ********************************** స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి   నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, బుధ  వారము 177_04-2024,  ఉదయము గంటలు 11-30 నిమిషాలకు,  ఆశ్లేష  నక్షత్ర యుక్త   మిథున లగ్న పుష్కరాంశ  సుముహూర్తమున   యస్.బి.ఐ కాలనీ - కొత్తపేట్ లో  భక్తాగ్రేసరులచే   లోక కళ్యాణా రార్థము దిగ్విజయముగా /కన్నులపందుగగా జరుగుచున్న,      శ్రీ సీతారామ కళ్యాణములో **************************   తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా   జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత   వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి   అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు   కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు  ...

SVAMINI-YOGINI PARICHAYAMU

Image
     చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,  "మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.  శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.  అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.  ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.  కారణము,  బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.   తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.  ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.  భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.   మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.  అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగ...

KHADGAMALA-PARICHAYAMU

Image
   " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"    పరమేశ్వరుడు-పరమేశ్వరికి వివరించినది ఈ "ఖడ్గమాలా స్తోత్రము"  ఖడ్గము అంటేస్తుతివచనములు.ఖడ్గమాల అంటే బిందు-తికోణములుగా ప్రకటింపబడిన పరమేశ్వ-పరమేశ్వరి ప్రస్తుత వచనముల హారము.  మరొక అన్వయము ప్రకారము చేతనుని ఆవరించియున్న అమంగళములను/అజ్ఞానమును తొలగించి,స్వస్వరూపమును తెలియచేయు సాధనము.  ఒకే తత్త్వమును వివరించు రెండు విధములైన అనుగ్రహములు  1.శ్రీ చక్రము 2.దేవీ ఖడ్గమాల  ఒకటి రేఖా యంత్రము.రెండవది మాలా మంత్రము.మహా మాలా మంత్రము.  స్థూలముగామనచుట్తు-సూక్ష్మముగా లోగుట్టు తానే నిండిన చైతన్యమే ఆ దేవీ.  స్తోత్ర సంకల్పములో "మమఖడ్గ సిద్ధ్యర్థే"అని సాధకుడు తల్లి అనుగ్రహమనే ఆయుధమును సాధనముగా అభ్యర్థిస్తూ,మూలాధారము నుండి బిందువు వరకు ఒక్కొక్క మాయ అనే మూటను విడిచిపెడుతూ తల్లి ఒడిని చేరగలుగుతాడు.  ఈ పయనములో తొమ్మిది ఆవరణములను దాటవలసి వస్తుంది.  ప్రతి ఆవరణములోను చక్రేశ్వరి ఇతర సహాయక శక్తులతో సాధకునికి సహాయపడుతుంటుంది.  మొదటి మూడు చక్రములపయనమునందు స...

SREE CHAKRAPARICHAYAMU

Image
   "శ్రీ యన గౌరి నా బరగు" అన్న సూక్తి ప్రకారము మహాభట్టారికయైన యైన పరమేశ్వరి శ్రీ శబ్దముతో బహువిధములుగాప్రస్తుతింపబడుతున్నది. 1శ్రీయతే ఇతి " శ్రీః"  చేతనులు ఆశ్రయించే పరాత్పరి "శ్రీ." 2.శ్రేయతే ఇతి "శ్రీః"   ఆశ్రయించబడిన చేతనులకు పురుషకారత్వము/సహాయరూపముగా మారునది "శ్రీ" 3.శ్రుణోతి ఇతి "శ్రీః"   శరణార్తుల మొరలను ఆలకించునది "శ్రీ" 4.శ్రావయతి ఇతి "శ్రీః"   శరణార్తులమొరలను స్వామికి హృద్యముగా విన్నవించేది "శ్రీ". 5.శృణాతి ఇతి "శ్రీః"   పాపాలను నశింపచేయగల శక్తిస్వరూపిణి "శ్రీ" 6.శ్రీణాతితి ఇతి "శ్రీః"   కారుణ్యాది గుణములచే జగమంతా వ్యాపించి యుండి భక్తులకు కైంకర్యభాగ్యమును అనుగ్రహించే తల్లి "శ్రీ"   ఆ మహాకామేశ్వర కామేశ్వరి "యంత్ర " రూపముగా సాధకుని అనుగ్రహించు విధానమే చక్రము.  శ్రీచక్రము అంటే సులభతరముగాసాధకుడు తనమనోఫలకమున  అమ్మ తత్తమును ఆకారములుగా ఊహిస్తూ అర్చించే విధానము.  శ్రీచక్రము లోని వివిధ ఆకారములలో దాగిన స్వరూప-స్వభావములను సంకేతించిన , ప్రమాణములను-పరి...

UGADI GREETINGS-KRODHI

Image
 ఉగాది శుభాకాంక్షలు.  *****************  కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యాలలో   క్రోధిని నేనేనంటూ,అరవై వత్సరముల తరువాత,  అరుదెంచుచున్నావా   "ఆత్మీయ స్వాగతము."  ప్రకట క్రోధమెప్పుడును పరమాత్మ అనుగ్రహమే  స్థితప్రజ్ఞతనందించే పరిణామపు అనుభవమే   అసలు, అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని. మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60 అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.   ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,  , అరవై సంవత్సరములు,   జాబిలి కూతురులో లేదా నారద కుమారులో   వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని   వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో   వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో   గురువు-శని తమ  గమనములో ప్రతికూలమో/అనుకూలమో  కదులుతూనే ఉన్నారుగా.   గుణ-దోష భూఇష్ఠముల వాటిగమన  పరిణామములే   ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.   ఏది ఆదాయమో/ ...

DEVIKHADGAMALA-YOGINULU

Image
    దేవిఖడ్గమాల-యోగినులు    ****************  "అణిమాదిభిరావృతామ్మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవాని"  "యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా' అనికీర్త్స్తున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము ఆ జగజ్జననిని.   హ్రీంకారాసనల గర్భితానల శిఖ నుండి అనేకానేకములుగా ప్రకాశవంతముగా ప్రసరింపబడే కిరణములే యోగినులు.వీరిని "పరివార దేవతలు/శక్తులు"అనికూడా అంటారు.   నిరాకార-నిరంజన-నిర్గుణ మూలశక్తిని అర్థము చేసికొనుటకు సహాయపడు శక్తులు ఇవి.  ఒక విధముగా చేతనులకు యోగమునుకలిగించు శక్తులు.సాధకుడు ద్వంద్వమును వీడి తనలోని చైతన్యమునుగుర్తించుటకు ఆలంబనముగా ఈ సక్తుల సహాయమును తీసుకుంటాడు.  "దేహములో?ఉపాధిలో సూక్ష్మముగా దాగి దానినిచైతన్యవంతము చేయుచున్న మహాద్భుత శక్తిని తెలిసికొనుటయే "యోగము"   శ్రీదేవి ఖడ్గమాల అమ్మవారి యంత్ర స్వరూపమునకు సాకారమును దర్శింపచేయు స్తోత్రము.  ఈ యోగినులు ఒక్కొక్క ఆవరనములో నిర్దేశింపబడిన విధులను నిర్వర్తిస్తూ సాధకుని తరువాతి చక్రమును చేరుటకు సహాయపడుతుంటాయి.  నిర్దిష్ట పద్ధతిలో విస్తరించిన పరివార దేవతలు కొన్ని గుప్తముగాను,ఇంకొన్ని బాహాట...