Posts

NAALGAVA MAJILEE-SARVA SAUBHAAGYADAAUAKA CHAKRAMU AMTE?

Image
    " భక్తుడు భగవంతుడా నువ్వెప్పుడు బయటకు వస్తావు నేను నిన్ను చూడటానికి అని అనుకుంటాడట,    భగవంతుడు భక్తుడెప్పుడు తనలోనికి తొంగి చూస్తాడా కనపడదామని అనుకుంటాడట."     ఎంతటి నగ్నసత్యము.  ఏకాకిని "భూమరూపా" నిర్ద్వైతా ద్వైతవర్జితా అని పరమేశ్వరిని కీర్తిస్తుంది స్రీ లలితా రహస్య సహస్రనామస్తోత్రము.  అన్నిరూపములుఇందే ఆవహించెను అని కీర్తించాడు అన్నమాచార్యులు.    అంతర్యామిగా అన్ని ఉపాధులు తానైన పరమాత్మ ఏదో ఒక ఉపాధితో మనకు మనలను తెలుసుకోవటానికి చేతిని అందిస్తూనేఉంటాడు.  ఆ చేతిని నమ్మకముతో గట్టిగా పట్టుకుని,విడువకుండా మరొక మెట్టును ఎక్కించేది/ఆవరనములోనికి ప్రవేశింపచేసేది "సౌభాగ్యము" .  ప్రయాణికుడు అమ్మదయతో పదునాలుగుకోనములు కల వృత్తాకార చక్రము లోనికి ప్రవేశిస్తున్నాడు.దీనినేచతుర్దశార చక్రము అని కూడా పిలుస్తారు.  మూడు అవస్థలను దాటి,మూడు దేహములను అర్థముచేసుకుంటూ,స్పూక్ష్మము వైపునకు అడుగులు వేయిస్తున్నాయి ఈ పదునాలుగు కోణములు.చురుకుదనమును మెదడుకు అందిస్తూ.  పదునాలుగురు మాతలు ఈ ఆవరణములో ప్రకాశముతో వెలిగిపోతున్నారు.జడత్వమునకు తావులే...

MUDAVA MAJILEE-SARVA SAMKSHOBHANA CHAKRAMU AMTE?

Image
     "అష్టదలకమలమందు నిష్టతో నీ ప్రతిమనిలిపి   అర్ష్టికర్తవనుచు నీదు చరనములనే నమ్మితిని   పరమేశ్వరి  నీకిదిగో వందనం"   స్థూలదేహముతో త్రైలోక్యమోహన చక్రమనే మూడుగీతలు కలిగిన ప్రాకారములోనికిప్రవేశించిన ప్రయాణికుడు అక్కడ సిద్ధిమాతల-సప్తమాతృకల-ఉద్రాశక్తుల సహాయముతో చక్రేశ్వరి ఆశీర్వచనముతో ఒకమెట్టిపైకెక్కి సర్వాశాపరిపూరక చక్రమను పేరుతో నున్న పదహార్రు వికసిత దళములతో వృత్తాకారముగానున్న ఆవరనములోనికి ప్రవేశించి పదహారు అద్భుత శక్తిమాతల,సిద్ధిమాత,ముద్రామాత సహాయముతో స్వప్నావస్థను మనసుతో ల్కలిసిన సూక్ష్మ శరీరముతో అనుభవించి తాత్కాలికమైన ఆనందమునకు లొంగక అణిమలోని మహత్తును,లఘిమలోని పటుత్వమును అర్థముచేసుకుని,చక్రేశ్వరి దీవెనతో మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్రమను"పేరుగల మూడవ ఆవరనము లోనికి ప్రవేశిస్తున్నాడు.మహిమా సిద్ధిమాత-సర్వాకర్షన ముద్ర మాత సహాయమునకై తోడుగా ఉన్నారు.ముద్రాసక్తి న్యాసమును తెలియచేయుటతో పాటుగా,సందేహములను సైతము తొలగిస్తున్నది.  స్వప్నములకు ఇక్కడ చోటు లేదు.ఊహలు ఊసులాదవు.   ప్రయాణికుడు విశ్వ-తేజదశలను దాటి ప్రాజ్ఞుడవుతున్నాడు.అంటే జ్ఞానమును పరిచయముచేసుకు...

RENDAVAMAJILEE-SARVAASAA PARIPOORAKAMU AMTE?

Image
    " షోడశ కళానిధికి షోడశోప చారములు     జాడతోన నిచ్చలును సమర్పయామి"   పరమేశ్వరి అనుగ్రహముతో ప్రయాణికుడు ఒక అంతస్తు అక్కగలిగాడు.చాలా అందమైన వికసిస్తున్న పదహారు రేకులతో గుండ్రముగా ఉన్నది ఆ ఆవరనము."సర్వాశా పరిపూరక చక్రము" అని దానిపేరు అనిచెప్పారు.అక్కడచేరిన వారికి పదహారు శక్తులు అన్ని కోరికలను తీర్చి ఆనందమయులను చేస్తారట.  అణిమ సిద్ధి దేవత అహంకారమును ఏ వొధముగా తగ్గించుకోవాలో తెలియచేస్తూనే,అణూరణూనాం" అంటూ అణువు యొక్క గొప్పతనమును వివరించింది.అంతే కాక లఘిమా సిద్ధి అని శక్తిమాతను తోడుగా పంపించింది సహాయానికి.సర్వద్రావిణి అను ముద్రాశక్తి సైతము నన్ను సంస్కరించుటకు తాను వచ్చింది.  ఇంతకీ ఇప్పుడు నా స్థూలదేహము నిద్రలోకి జారుకుంది.ఏమిచేయాలో తోచని నామనసు ఇప్పుడు సూక్ష్మదేహముతో జతకట్టి ఎన్నెన్నో అందమైన కలలను కంటున్నది అనుకుంటున్నాడు ఆ ప్రయాణికుడు తన మజిలీలో.ఇది స్వప్నావస్థ అన్నమాట.ఎన్నెన్నో వింత అనుభూతులు.కాని,తెల్లవారగానే మెలకువ వచ్చింది.కల కరిగి పోయింది.అదే జీవితము.  చుట్టు తేరిపారచూశాను.పదహారు మంది మాత్రుమూర్తులు నన్ను పలకరిస్తున్నారు.  ఇప్పుడు నా నడక విధా...

MODATI MAJILEE-BHOOPURAMU AMTE?

Image
   " అంబ పరమేశ్వరి -అఖిలాండేశ్వరి    ఆదిపరాశక్తి పాలయమాం    త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి    ఆనందరూపిణి పాలయమాం"    అమ్మావ్యాజ అనుగ్రహము ఎన్నోజన్మల పుణ్యఫలముగా మారి ఆ తొమ్మిదంస్తులభవనమును ఎక్కాలనే కోరికను కలిగిస్తున్నది.పదములను/పాదములను అటువైపుగా నడిపిస్తున్నది.   ప్రవేశ ప్రాకారము మూడు రంగులగోడలతో చతురస్రాకారముగా నున్నది.నాలుగు వేదములు నాలుగు ప్రవేశ ద్వారములై స్వాగతిస్తున్నాయి.మొదటిగోడ నల్లని రంగులోఉన్నది.ఇక్కడ స్థూల దేహమునకు ప్రవేశము/ప్రాధాన్యము ఉంYఉంది.మనము మెలకువ ఉండే జాగ్రదావస్థ స్థిలో ఈ ఆవరనము ఉంటుంది.ఇక్కడ సిద్ధి మాతా స్వరూపములు సహాయ పడుతుంటారు.వారు చిన్నపరిణామముగా మారుట,పెద్ద పరిణామముగా మారుట,కోరికలు తీర్చుకోగలుగుట,కోరిన రూపమును పొందగలుగుట,వశపరచుకొనగలుగుట,పాలించగలుగుట మొదలగు శక్తులతో సహాయపడుతుంటారు.కాని అవన్నీ శాశ్వతము కాదు.తాత్కాలికమే.ఏదో ఒక ఐహిక ప్రయోజనమునకు ప్రదర్శించుకోవలిసినవే.  అమ్మభువనేశ్వరి.మూడు భువనములకు మహారాణి.కనుకనే తనవిస్తరనకు హద్దులు "త్రైలోక్య మోహనముగా" భూపురముతో నిర్ణయించినది.  వీనినే శాస్త్రములో, ...

DEVIKHADGAMALA AMTE?

Image
  శ్రీ మాత్రే నమః   ******************  " అమ్మవు నీవే  అఖిలజగాలకు-అమ్మలకన్న అమ్మవు నీవే    నీ చరణములేనమితినమ్మ-శరణము కోరితి నమ్మా భవాని"       అని వేడుకుంటున్న తన బిడ్డలను కరుణించకుండా ఉండగలదా ఆ పరమేశ్వరి.   అందుకే పరంజ్యోతిగా ప్రకాశములో ఇమిడి ఉన్న తాను దాని నుండి కొంత భాగముగా విడిపోయి,మనలను కాపాడుటకై దిగివచ్చినది అని నా నమ్మకము.  ఇంకొక విధముగా చెప్పాలంటే ఆలోచన+ఆచరణ అను రెండింటిని సమర్ధిస్తూ అయ్య+అమ్మ ఒకరు కనపడకుండ కథనడిపిస్తూ,మరొకరుకనపడుతు మనలను చేరదీస్తూ,ప్రపంచమనే గారడీని చేస్తున్నారన్నమాట లీలగ.  నిజమునకు వారిద్దరున్నది ఒకతొమ్మిది అంతస్తుల భవనము.ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క సుందరమైన ఆకారముతో,దాని ప్రాముఖ్యతను తెలియచేస్తుంటుంది.ప్రతి అంతస్తులో ఎందరో మహిమగల మాతృమూర్తులు మనకు పై అంతస్తు చేరుటకు సహాయపడుతుంటారు.పైకి చేరుతున్న కొలది వాతావరనము శుభ్రమైనట్లు,మన మనోభావములు కూడా పరిశుద్ధమగుతుంటాయి.    మనకు అవసరములేనివస్తువులు ఏవో గ్రహించి వానిని పైకి తీసుకుని వెళ్ళకుండ వదిలించుకుంటూటాము.ఏది నిజము/ఏది అబద్ధము తెలుసుకోగలుగుతామ...

SARVANAMDAMAYACHAKRAMU-PARICHAYAMU

Image
    "కదంబ వన చారిణీం ముని కదంబ కాదంబినీం    నితంబ జిత భూధరాం సురనితంబినీ సేవితాం    నవాంబురుహలోచనాం అభినవాంబుదశ్యామలాం    త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీం ఆశ్రయే"     అనిప్రస్తుతించారు అమ్మను ఆదిశంకరులు.  హయగ్రీవ-అగస్త్యసంవాదమైన లలితా రహస్య సహస్రనామస్తోత్రము,  "మూలప్రకృతి అవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణి"అని సంకీర్తించింది.  వ్యాపినీ వివిధాకారావిద్యావిద్యాస్వరూపిణి గా సన్నుతించింది.   మూలప్రకృతి అంటే ఏమిటి?   అది వ్యక్తరూపముగా ఎప్పుడుంటుంది?   అది అవ్యక్త రూపముగా ఎప్పుడుంటుంది?   పరమాత్మ తాను ప్రకాశ+విమర్శ రూపమైన పరంజ్యోతిగా ప్రకాశించటము పరారరహస్యయోగము.అదియే మనము బిందువు రూపముగా తెలుసుకోబోతున్న "సర్వానందమయ చక్రము" పరంజ్యోతి పరమేశ్వరి , 'సత్యజ్ఞానందరూపా-సామరస్య పరాయణా" గా ప్రకాశములో అంతర్లీనమైన అద్భుత సన్నివేశము.       సర్వానందమయ చక్రము-తొమ్మిదవ ఆవరణము     *****************************  సర్వసిద్ధిప్రద-సర్వమంగళకారిణి అయిన పరమేశ్వరి,  సర్వులకు-సర్వవేళల-సర్వవిధములుగా ఆనంద...

SARVASIDDHIPRADACHAKRAMU-PARICHAYAMU

Image
   " మహా బుద్ధిః మహాసిద్ధిః మహాయోగేశ్వరీశ్వరీ"     అనుగ్రహముతో,సాధకుడు సర్వసిద్ధిప్రద చక్ర ప్రవేశముబకు యోగ్యతను పొందగలుగుతాడు.    అదియును,  " నీరాగా రాగమదనీ-నిర్మదా మదనాశినీ    నిశ్చింతా-నిరహంకారా-నిర్మోహా మోహనాశినీ    నిస్సంశయా సంశయఘ్నీ-నిర్భవా భవనాశినీ"       కరుణా కటాక్షమే.  వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యా స్వరూపిణిగా/వ్యక్తావ్యక్తస్వరూపిణిగా నున్న పరమాత్మ,  ప్రకాశమైన శివతత్త్వము+విమర్శరూపమైన శక్తి తత్త్వము అవ్యక్తమైన బిందురూపముగ విరాజమైనప్పటికిని సృష్టిచేయు సంకల్పముతో విమర్శ తాను ప్రకాసము నుండి విడివడి,ఇచ్ఛా-క్రియా-జ్ఞానశక్తులను బిందువులను కలుపుతూ అథోముఖ త్రికోణముగా ప్రకటనమైనది.ఇది మొదటి శక్తి కోణము.దీనికి తక్కిన కోణములతో సంబంధము కానరాదు.  ఈ మూడు శక్తులనే , 1,మహా కామేశ్వరి 2.మహా వజ్రేశ్వరి 3.మహా భగమాలినిగా    సంకీర్తిస్తారు.  స్థూలములోని శక్తి కామేశ్వరి అయితే సూక్ష్మములో సామీప్యములోని యోగిని మహాకామేశ్వరి.ఈ తల్లినే బ్రహ్మీ శక్తిగాను ఆరాధిస్తారు.దేవీ భాగవత్ములో, "సంపత్కరీ సమారాధ్యా సిం...