Posts

TANOTU NAH SIVAH SIVAM-01@ SIVATANDAVA STTOTRAMU

Image
    తనోతు నః శివః శివం-01   *******************  " కైలాసగిరి  నుండి కాశికై    కాశికాపురి  నుండి దాసికై    దాసికై ఈ దక్షవాటికై    దయచేసినావయా హరహర హరహర."    లోక కళ్యానమునకై ఈశ్వరచైతన్యము సూత్రధారియై కొందరిని పాత్రధారులుగా మలుస్తుంది.వారిని అంటిపెట్టుకుని ఉండమని ఇంద్రియములను పిలుస్తుంది.వాటిని అరిషడ్వర్గములతో ఆటలాడుకొమ్మంటుంది.అయ్యో పాపం అంటూ అక్కునచేర్చుకుంటుంది.దానికిఉదాహరణమే,  నిరాకారము-నిరంజనము-నిర్గుణమైన ఈశ్వరచైతన్యము సాకారమై,తనతో పాటు మరికొన్నింటిని,మరికొందరినితాను ఆడుచున్న ఆటలో భాగస్వాములనుచేస్తుంది.తానొకవైపు-తన చైతన్య ప్రకటనము మరొకవైపు ఉండేటట్లు చేస్తుంది.          పరమాత్మతత్త్వము మనకు ఒకాద్భుత స్తోత్రరాజమును అందించాలనుకుంది.దానికి మరొకరిని కర్త అనుకునేటట్లుగా చేసి సంఘటనలను పొందుపరిచినది.వాటితే మనకేమి సంబంధము లేదు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్లే.  ప్రతి ఒక్కరి బదులుగా ఆ పాత్రలు భక్తిభావముతో స్వామిని సేవించుకుంటూ మనకు మార్గదర్శకముగా మారతాయి.మంచి-చెడు విచక్షణను కలిగించటానికి రె...

TANOTU NAH SIVAH SIVAM-INTRODUCTION.@ SIVA TANDAVA STOTRAMU

Image
     ప్రియ మిత్రులారా!        " తనోతు నః శివః శివం."      *****************     అణువణువు శివమే.అడుగడుగు శివమే.  శివానుగ్రహము అర్థముకానిది.అయినప్పటికిని అద్భుతమైనది.అది అట్టడుగున నున్నవారినిసైతము గట్టిగా పట్టుకుంటుంది.మత్తుకళ్ళనుతెరిపిస్తుంది.కొత్తదనమునుచూపిస్తుంది.స్వామికరుణ మనలను సందర్శింప చేస్తుంది.సంభాషిస్తుంటుంది.సన్నుతింపచేస్తుంది.సన్మార్గము చూపిస్తుంది .   కాని చమత్కారము.లీలగా,   మనలను మాయలో ముంచేస్తుంది.శివమును నిందింపచేస్తుంది.నిలదీస్తుంటుంది.నిష్టూరమాడుతుంది.   నేనే వ్రాస్తున్నానను భ్రమలో ముంచివేస్తూ,  "తనోతు నః శివః శివం" అను   శివమును విస్తరింపచేయు శివుని కీర్తించుటకు ప్రయత్నిస్తుంది.            శివునికి దాసోహమనాలన్న నన్ను తనకు దాసోహము చేసుకుని నా అజ్ఞానము కొసమెరుపులు దిద్దుతానంటూ,ముసిముసిగానవ్వుతూ,కొసరి కొసరి తప్పులను వడ్డిస్తుంటుంది.శివస్వరూపులు పెద్దమనసుతో నా దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకముతో,ఈ నా చిన్నిప్రయత్నమును మీతో పంచుకుంటున్నాను. ...

SREECHAKRADHAARINI-09-SARVANAMDAMAYACHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-09-సవానందమయచక్రము    ****************************  ప్రార్థన  ******  "తాదృశం ఖడ్గమాప్నోతి ఏనహస్త స్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."     ఇప్పటివరకు   ******** శూన్యము అని భ్రమింపచేసే బిందువుశూన్యముకాదు "పూర్ణము" అని తెలియచేస్తున్న శివశక్తుల నిక్షిప్త "మిశ్రబిందువునకు" శరణాగతులు.   ఆదిశంకరులు "సౌందర్యలహరి స్తోత్రము" లో కీర్తించినట్లు,        సకలమపి భిత్వా కులపథం  "సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే"   అని ప్రాణశక్తి యైన కుండలినీ ఊర్థ్వ పయనమును స్తుతించారు.     జగన్మాత  కులామృతై రసికా కులసంకేత పాలిని  కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ  అకులా సమయాంతస్థా.....సమయాచారతత్త్పరా.     అని వశిన్యాదిదేవతలకు తన తత్త్వమును అనుగ్రహించినది.       అమ్మ సదాశివ పతివ్రత.   సదాశివుని పతిగా పొంది సేవించునది ఒక భవముగా స్వీకరిస్తే   సదా ఎల్లవేళల సకలజీవుల ఉద్ధరనమే వ్రతముగా/నియమముగా అనుసరించు ఆదిశక్తి.    ఆ వ్ర...

SREECHAKRADHARINI-08-SARVA SAMPATPRADA CHAJRAMU

Image
   శ్రీచక్రధారిణి-08-సర్వసిద్ధిప్రద చక్రము   **************************   ప్రార్థన   *********   "తాదృశం ఖడ్గమాప్నోతి  యేనహస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."    ఇప్పటివరకు    ***********    ఏదవ ఆవరణమైన "సర్వరోగహర చక్రము" లోని అష్టవిధ తత్త్వములను తెలుసుకుంటూ,అత్యంత ప్రధానమైన స+అష్ట+ అంగ నమస్కార (అష్టాంగములు పరమాత్మ చైతన్యమే అను భావన) పరమార్థమును గ్రహించాము,     మనము సులభముగా శ్రీచక్ర తత్త్వమును అర్థము చేసికొనుటకు రెండు భాగములుగా విభజించి పరిశీలిస్తే మనము మొదటి భాగమును పూర్తిచేసుకున్నాము.   ఏడు ఆవరణములలోత్రిగుణములు-అరిషడ్వర్గములు-చతుర్విధ పురుషార్థములు-అనేకానేకములై,అనేకనామరూపములతో-స్వభావములతోనున్న యోగినీ మాతలు-వారిని పాలిస్తున్న చక్రేశ్వరులు-ముద్రా శక్తులు-సిద్ధి దేవతలతో విస్తరించిసాగినది.ప్రతి ఆవరణము ఇంకొక దానితో సంబంధమును కలిగియున్నది.   ఇప్పుడు   *****  ఎనిమిదవ ఆవరణములోని త్రికోణము.సర్వ స్వతంత్రము.ఇక్కడ అన్నిసంక్షిప్తముగాఉంటాయి" .కామకళ"    శివశక్తుల...

SREECHAKRADHARINI-07-SARVAROGAHARA CHAKRAMU.

Image
     శ్రీచక్రధారిణి-07-సర్వ రోగహరచక్రము    *****************************  ప్రార్థన  ******  " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్తస్థితే నవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."  ఇంతకు ముందు  ***********  సర్వరక్షాకర చక్రములోని వహ్నికళలు అన్నమయకోశమును ఆవరించియుండి, 1.భక్య-భోజ్య-చోష్య-లేహ్య-పేయ      రూపములుగా నున్న ఆహారమును జీర్ణముచేసికి స్థితికి సహాయపడేవి.  భక్ష్యము-తినదగిన పదార్థము(జుర్రుకుని)   పంచామృతములు మనము జుర్రుకుంటాము.  భోజ్యము-నమిలి తినునది.(దంతముల ప్రాధాన్యము)   చోష్యము-కొరికి తినునది(దంతముల ప్రాధాన్యము-పిండివంటలు,పండ్లు,గింజలు మొదలగునవి)   లేహ్యములు-నాలుక సహాయముతో స్వీకరించు పదార్థములు   పేయము/పానీయములు-గొంతు సహాయముతో (తాగునవి)  మనము ఆహారసిద్ధి-ఆసన సిద్ధి         ఆసన సిద్ధి-అభీష్ట సిద్ధి అన్న మాటను వింటుంటాము.    క్రమేణా సాధకుడు ఈ పంచభక్ష్యముల పచనముతో సంబంధమూ లేకుండా,విశ్వము నుండి నేరుగా ఆహారమును  గ్రహించి పచనము చేసుకోగలుగుతాడు....

SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARA CHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-06-సర్వరక్షాకరచక్రము   **************************   ప్రార్థన   ******  "తాదృశం ఖడ్గమాప్నోతితేనహస్తస్థితేనవై   అష్టాదశ ద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."  ఇప్పటివరకు   **********  మనము సృష్టి త్రయ చక్రములను విశేషములను తెలిసికొని,రెండవ భాగమైన స్థితిచక్ర త్రయములోని చతుర్దశారము-బహిర్దశారమును దర్శించి అత్యంత కీలకమైన (జ్యోతిర్మయ చక్రము/విజ్ఞాన చక్రము)లోనికి ప్రవేశించబోతున్నాము.  * గమనిక    *****  ప్రియ మిత్రులారా ఇప్పటివరకు ముచ్చటించుకున్న ఆవరణములలోనేను,  "అర్థముచేసుకున్న వారికి అర్థము చేసుకున్నంత"     అను వాక్యమును వ్రాసినది నా ఉపాధి అహంకారముతో కాదు.   భూపురము నుండి బహిర్దశారము వరకు మనము పూర్తిగా మాయచే/మాయమలముచే కప్పబడియున్నాము కనుక ఒకవేళ మనము పూర్తిగా అమ్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నించినప్పటికిని వీలుకాదు.   ఇప్పుడు మన మనసు గురువు తలపుతో-గురు పాదసరణాగతితో మాయను చాలావరకు తొలగించుకుని "గురు బోధనూ శ్రవణము చేయగల అదృష్తమును పొందియున్నది.     కనుక ఇకనుండి దే...

SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARACHAKRAMU.

     శ్రీచక్రధారిణి-05-    *******************************  ప్రార్థన  ******  "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"   ఇప్పటివరకు   *****8**      సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.   ఇప్పుడు   *****   తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.    స్తోత్రము    ******** శ్రీచక్ర పంచమావరణదేవతాః సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,     ...