saundarya lahari-57

 సౌందర్య లహరి-35

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  అజ్ఞాన అంధకార సాగరములో  అనవరతము
  మునకలే  ముచ్చటనే  మూఢులమైన  మేము

  ఇడుములనే  ఉడుములే చేరెను మా సమీపము
  నిస్సార సం సారము చేసెను మమ్ము సమ్మోహనము

  చింతలతో చిన్నబోయి ఖిన్నులమై  ఉన్నారము
  లోతైన లోయలో లేవలేక ఉన్నారము

  నిఖిల జగము  వగచుచు  నీట మునిగియుండగా
  నీ పాదరేణువు  ఆదివరాహపుకోరయైన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 జయవిజయులు సనకసనందనాది శాపగ్రస్తులై నారాయణ విరోధులుగా మారిరి.హిరణ్యాక్షుడు భూమాతను సముద్రములో దాచివైచినపుడు అమ్మపదిగోళ్ళనుండి సృష్టించిన పది అవతారములలో మూడవదైన వరాహమూర్తి భూమాతను రక్షించి,అసురునకు ముక్తిని ప్రసాదించెను.కలియుగములో పాపముల సంఖ్య మితిమీరి అశక్తులైన ఆర్తులను రక్షిచుటకు ,అమ్మ అనుగ్రహము ఆదివరాహపు కోరయై,ఆశ్రిత రక్షణమును చేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI