Posts

Showing posts from December, 2018

SIVA TAANDAVA STUTI.

Image
     సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకు క్షమాపణ అభ్యర్థనలతో,        శివ తాండవ స్తుతి.        ********************  "ఏ వేదంబు పఠించె లూత అన్నట్లు ఏ సాహితీ విషయ పరిజ్ఞానము లేని నా దుస్సాహసమును మన్నించమని కోరుతూ,"  1.వడిన్ వడిన్ జటాటవిన్ జారి,గంగ సంప్రోక్షణంబైన స్థలిన్    ధగత్ ధగత్ గళంబునన్ సర్పదండ వీక్షణంబు వేడుకన్    డమర్ డమర్ కరంబునన్ రవంబుతో డమరుకంబు తోడుగన్    ధిమిత్ ధిమిత్ నర్తనంబు పరిభ్రమించు వరంబులన్ లీలనన్ 2. సుడుల్ సుడుల్ తిరుగుచున్నదదిగో సుర్గంగ జటాజూటములో  చమక్ చమక్ వెలుగుచున్నదదిగో వెండిపూవు శిరములో  చకిత్ చకిత్ దండనగ కందర్పుని కాల్చిన త్రినేత్రముతో  ధిమిత్ ధిమిత్ తాండవంబు సదా శివమును వర్షించుగాక. 3. ప్రభల్ ప్రభల్ చతుర్దిశల్ ప్రభల్ జిమ్ము భవాని శిరోమణితో  జ్వలిత్ జ్వలిత్ విలాసనేత్ర ప్రమోద ప్రదోష తాండవములో  తరిమి తరిమిపారద్రోలు పాపతతుల పదఘట్టనములో  తకిట తకిట తథాస్తుగ నామది నిండి తాండవించుగాక. 4.చమక్ చమక్ చంచరీక భూషణము...

SIVA MANGALA STUTI

Image
  శివ మంగళ స్తుతి    ******************   ఓం మంగళం- ఓంకార మంగళం   శివ మంగళం -శివ-శివాని మంగళం   జట మంగళం- జటాధారి మంగళం   గంగ మంగళం -గంగా ధర మంగళం   చంద్ర మంగళం-చంద్ర  మౌళి మంగళం   నాగ మంగళం -నాగాలంకార మంగళం     ఓం మంగళం _ఓంకార మంగళం.  ఫాలము మంగళం-ఫాల నేత్ర మంగళం    భస్మము మంగళం-భస్మధారి మంగళం    నయనం మంగళం -నందివాహన మంగళం    శ్రవణం మంగళం-శరణము మంగళం    కపోలం మంగళం-కైలాసము మంగలం    ఘ్రాణం మంగళం-వ్యాఘ్రేశ్వర మంగళం    ఓష్ఠం మంగళం-కాశి కాష్ఠం మంగళం    అథరం మంగళం-అభయము మంగళం    వాయి మంగళం-వామదేవ మంగళం    చుబుకం మంగళం-జంబుకేశ మంగళం    కంఠం మంగళం-నీలకంఠం మంగళం    రుద్రం మంగళం-రుద్రాక్ష మంగళం    కపాలం మంగళం-కపాల మాల మంగళం     ఓం మంగళం -ఓంకార మంగళం.  పావన మంగళం-పార్వతినాథ మంగళం  ప్రార్థన మంగళం-అర్థనారీశ్వర మంగళం  శంకర మం...