Posts

ఓం నమ: శివాయ-55

  ఓం నమ: శివాయ-55  మన్మథ బాణము అంటే మాయదారి భయము నీకు  కోపము నటించి వానిని మాయము చేశేసావు  కోరికలతో కొలుచు వారంటే కొండంత భయము నీకు  చేరువగ రాకుండా పారిపోతు ఉంటావు  అహముతో నిను కొలిచే అసురులంటే అంతులేని భయము నీకు  దారి ఏదిలేక వారికి దాసోహము అవుతావు  సురలందరు నిన్ను కొలువ కలవరమగు భయము నీకు  అనివార్యము అనియేగ గరళకంఠుడివి అయినావు  ధరించినవన్నీ తరలుతాయేమోనని దాచలేని భయము నీకు  జగములు గుర్తించకుండ లింగముగా మారావు  "నమో హిరణ్య బాహవే సేనానే దిశాంగపతయే"అని కీర్తించే  మొక్కవోని ధైర్యమురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-56

Image
     ఓం నమ: శివాయ-56  ఎంగిలి జలములతో నీకు అభిషేకము చేయలేను  ఎంగిలి పడ్డ పూలతో నీకు అర్చనలు చేయలేను  ఎంగిలున్న నోటితో ఏ మంత్రములు చదువలేను  సుగంధిపుష్ఠికర్తకు ఏ పరిమళము అందీయగలను  జ్యోతిర్లింగమునకు ఏ నీరాజనమును అందీయగలను  నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా  నైవేద్యానంతర సేవలు నా శివునికి చేయాలిగా  కాదనక కనికరించి కొనసాగనీయని పూజను  నిన్ను ధ్యానించమనిన తన పని కాదంటుంది  నిలకడగ ఉండమంటే అటు ఇటు పరుగిడుతుంది  బుద్ధి లేక ఉంటుంది,హద్దు మీరుతుంటుంది,నా  తైతక్కల మనసు నీది ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-57

       శివ సంకల్పము-57  పొగడ్తలకు పొంగిపోతే ఉబ్బు లింగడు అని అంటున్నారు  చిరాకును చూపిస్తుంటే చిందేస్తున్నాడంటున్నారు  కోపముతో ఊగుతుంటే మూడోకన్ను తెరిచాడంటున్నారు  చిట్టిచీమ కుట్టగానే శివుని ఆన అంటున్నారు  బిచ్చగాడివి నీవంటు ముచ్చటించుకుంటున్నారు  శుచిలేనిది చూస్తుంటే శివ శివ అంటున్నారు  కలసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు  అలసత్వముతో ఉంటే అచ్చోసిన ఆంబోతు అంటున్నారు  కన్నీళ్ళు కార్చుతుంటే నెత్తిన గంగమ్మ అంటున్నారు  దిక్కుమాలిన ఉపమానాలతో నిన్ను తొక్కేస్తున్నారు  మంచుకొండ దేవుడిలో మంచితనము ఏది అంటూ  ఎక్కిరించారురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ--58

Image
                 శివ సంకల్పము-58  పాశము విడువనివాడు యమపాశము విడిపించగలడ  గంగను విడువనివాడు నా బెంగను తొలగించగలడ  మాయ లేడిని విడువనివాడు మాయదాడిని ఎదిరించగలడ  పాములు విడువనివాడు పాపములు హరియించగలడ  విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడ  ఉబ్బును విడువనివాడు జబ్బును పోగొట్టగలడ  నృత్యము విడువనివాడు దుష్కృత్యముల బాపగలడ  భిక్షాటన విడువనివాడు శిష్ట రక్షణము చేయగలడ  చిన్ముద్రను విడువని వాడు ఆదుర్దాను గమనించగలడ  వింతరాగమున్న వీడు వీతరాగుడు అవుతాడా   అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారా   చుక్క చుక్క నీరు త్రాగు ఓ తిక్క శంకరా.    .

ఓం నమ: శివాయ-59

Image
         శివ సంకల్పము-59  కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవ  సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద  కట్టుకున్న గజచర్మము నీకు పట్టు పుట్టములు అందీయగలద  నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలద  అలదుకున్న విభూతి నీకు వైభవమును అందీయగలద  కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయగలద  కరుగుచున్న నగము నీకు వరములు అందీయగలద  కాల్చున్న కన్ను నీకు కనక వర్షము అందీయగలద  పట్టుకున్న పాము నీకు రత్నరాశులను అందీయగలద  కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని అందీయగలడ  "ఓం దారిద్ర  దుఖ: దహనాయ అనగానే విని   ఫక్కున నవ్వారురా  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-60

Image
         శివ సంకల్పము-60  మాతంగ పతిగ నీవుంతే ఏది రక్షణ వాటికి  గణపతి అవతరించాడు కరివదనముతో  అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో  నాగ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  పతంజలి వచ్చాడు పాము శరీరముతో  వానర పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  నారదుడు వచ్చాడు వానర ముఖముతో  సిం హ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  నరసిం హుడు వచ్చాడు సిం హపు ముఖముతో  పశుపతిగ నీవుంటే అశువుల రక్షణ లేకుంటే  ఎక్కడ న్యాయమురా ఇది ఓ తిక్క శంకరా .  

ఓం నమ: శివాయ-61

             శివ సంకల్పము-61  పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ  ప్రదక్షిణము చేసానని ప్రగల్భాలు పలుకుతాడు  సోమరియై నిదురబోవు తామసియైన దొంగ  నిష్కళంక సమాధియని నిష్టూరలాడతాడు  సందుచూసి విందుభోజనము చేయు ఒకదొంగ  వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడుతాడు  కడతేరుస్తారేమోనని కవచధారియైన దొంగ  కానుకగా నా ప్రాణమంటు పూనకమే పూనుతాడు  మాయదారి పనులనే మానస పూజలంటుంటే  ఆయాసము లేకుండా ఆ యశమే కోరుతుంటే  పోనీలే అనుకుంటూ వారిని నువు ఏలుతుంటే  మొక్కాలిరా నీకు ఓ తిక్కశంకరా.