Posts

CHIRANJEEVULU.

Image
తరతరాలది కద తండ్రీ,తనయుల కథ, తీరములెరుగని మమతల ప్రవాహముల సుథ. అంకసీమకై ధ్రువుడు తారగ తరియించినాడు భూసురుడై రాముడు క్షాత్రము చూపించినాడు యెముక నిచ్చి దధీచి ధన్యుడైనాడు దశరథ తనయుడేమొ ఆదర్శం అయినాడు వయసునిచ్చె పురూరవుదు యయాతికి ఆనాడు సంసారమును ఇచ్చి శాంతనవుడు ప్రశంసాపాత్రుడైనాడు యేమని చెప్పగలము, యెందరో,మరి యెందరో

NIBBARAMU- ASAYE ASAYAMUGAA.

Image
నిబ్బరం కుత్తుక కష్టాలతో మొత్తము నష్టాలతో బిత్తరున్న బిడ్డలకు ముత్తెములుగ మారి సత్తువ  నిత్తానంటూ వత్తావుంటే  నిన్ను ............. జిత్తులమారి  ఎలినో సిత్తుగ  తరిమేస్తున్నదా పుత్తడి నేలను చేరనీక చిత్తడిగ  మారనీక విత్తు  విరగ పండనీక కొత్తదనము  రానీయక .................. వత్తాసుగ  ముచ్చులాగ చెత్త  పెత్తనాలతో కత్తివేటు కచ్చగా మొత్తం దోచేసిందా పచ్చదనము..*పచ్చి* అనగా ఊపిరికే ఉచ్చులతో ............. కానరాని వాన  రాల్చు కన్నీళ్ళను తలదాల్చి జాలువారు  కన్నీళ్లను జాలితో  మేళవించి పొలంగట్టు  కూకున్న హలంపట్టు రైతన్నా ............. భూతాలాంతి వన్నీను మనకు భూతకాలమైపోవా నిబ్బరమే అబ్బురమే అద్భుతాలు జరుపగా నీ  ధైర్యమే  పెట్టుబడి నిలబడగ...వరిమడి. NI

MAITRI-SRSHTI VAICHITRI.

Image
  మైత్రి,సృష్టి వైచిత్రి   ***************** మధుర సృష్టి వైచిత్రి అరమరికలు లేని మైత్రి ....................... గాలితోటి ఇసుకమైత్రి గగనమునకు ఎగురుతుంది నీటి తోటి ఇసుకమైత్రి నేల కృంగి పోతుంది   మిత్రలాభ-మిత్ర భేద వైరుధ్యములది మైత్రి ........... అంగములన్నిటిలోను అంగరంగ మైత్రి చూపేమో రెండుకళ్ళ నిండుమైత్రి వినుటేమో రెండు చెవులమెండుమైత్రి పలుకేమో రెండు పెదవుల కులుకుమైత్రి నడకేమో రెండుకాళ్ళ విడని మైత్రి   ద్వైతములో  అద్వైతమును తెలుపు అద్వితీయ మైత్రి .............................................. ప్రాణభయము తరిమెను పావురముల మైత్రి పాములను చంపినది చీమతల్లుల మైత్రి కరులబాధ తొలగించెను కుందేళ్ళ మైత్రి రిపుల సంహరించెను కపివరుల మైత్రి .................................... జీవన సంజీవనిలో రాజీవము మైత్రి గమనమేమో రేయిపవల మైత్రి జననమేమో జననీజనకుల మైత్రి ఊపిరేమో శ్వాసనిశ్వాసముల మైత్రి మంచీ,చెడు మనసు,బుద్ధి మైత్రి .................. మాయదారి మరబ్రతుకులో మరుగున పడినది మైత్రి మరమ్మత్తు చేసుకుందాం దాని గమ్మత్తును తెలిసికుందాం.

INDEPENDENCE DAY-JAI HIND

Image
70 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ******************************************** శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక. అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ "తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు." బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా "వందేం అహింసా పరమో ధర్మ:" అను శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు". పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా "సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు." నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో జనగణమన గళముతో జనగణముల మంగళముతో "జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక. అమ్మలార రండి రండి-అయ్యలార రారండి పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి శ్రీ ...

SREE SIRIVENNELA SEETAARAAMA SASTRYJI.

https://www.youtube.com/watch?v=j3cZQwh19bs   -namaskaaramulatoe

PELLI PUSTAKAMU

Image
       పెళ్ళి పుస్తకము     ***************   "ధర్మేచ-అర్థేచ-కామేచ "    నాతిచరామి అని కన్యాదాత     నాతి  చరితవ్యామి   అని వరుడు పలుకు   వివాహ బంధము అనే వేద గ్రంథములో   వధూవరులుగా మొదటి పుటలోను   నవ దంపతులుగా  రెండవ పుటలోను   ఆలు-మగలుగా  మూడవ పుటలోను   అమ్మ-నాన్నలుగా  నాల్గవ పుటలోను   అత్త-మామలుగా ఐదవ పుటలోను   అవ్వ-తాతలుగా ఆరవ పుటలోను   షష్టిపూర్తి రూపం లో ఏడవ పుటలోను   తదుపరి ప్రతిపూట తన్మయపు మూటలుగా   పారదర్శికత కలిగిన దార్శనికతో   ఒకే ఆస మీదిగా-ఒకే శ్వాస మీదిగా   ఒకే మాట పలుకుతూ-ఒకే బాట సాగుతూ  "సం" పదమంటు   కదిలే "సం" సార రథ చక్రాలుగా   ఒకరికొకరు  తోడుగా  ఒద్దికైన వేళ  " సప్త పది" పయనము సకలాభీష్టములనిచ్చుగాక    ముక్కోటి దేవతల దీవెనలు చక్కని పూబాట అగుగాక   బంధుమిత్ర అభినందన సుగంధములు చల్లుగాక   "గట్టి మేళము" ఎపుడు మీ చేయి పెట్టి నడుపు గాక   " అర్థనారీశ్వర...

THOMAS JEFFERSON PARK

Image
 జెఫర్సన్‌ పార్కు ************** అందరికేమో అది ఆనందసుందరము అందమైన మదికేమో అధ్యయనమందిరము అందరిని అందముగ ఆదరించు మేదిని అది ఎందరికో శాంతముగ మోదమిచ్చు బాపూజి అది  అతివల  వలపునుదోచే అమ్మ ఒడి ఆ బడి  గతుకుల తలపులుతోలే కమ్మనిగుడి ఆ ఒడి కన్నపిల్లల చిన్నచిన పొరపాటును కనపడనీయదచట తల్లడిల్లు తల్లితండ్రుల తడబాటును వినపడనీయదెచట సఫరింగుని తొలగించే థామస్ జెఫర్సన్ పార్కు ముఫత్గా తగిలించా నేనొక తారీఫ్‌ రిమార్కు వస్తూనే అనుకున్నా నాకంతా తెలుసునని చూస్తూనే తెలుసుకున్నా నాకేమి తెలియదని చేస్తున్నా ప్రయత్నాన్ని అందరిని కలుసుకొని వ్రాస్తున్నా అనుకొన్నది నీ విలువ తెలుసుకొని బుధవారంనాడు తననుతెంచి మనసు తుంచినా మంగళవారం నాటి వరకు మదిని ఆశతో పెంచుతుంది పెనుతుఫాను సైతం నిను పెకలించలేదుకదా గడ్డితల్లి చెబుతుంది గడ్డుసమస్యలకు అర్థం తలవంచక తెలివితోడా మెలగుటకద పరమార్థం నా గుడ్డితనము తొలగించిన గడ్డితల్లీ; నీ ముందు నేనెంత? గాలమునకు పడనీయక జాలరినుండి దాచిపెట్టి చేపతల్లికి తానే ప్రాపై బ్రోచినట్టి నీటితల్లి చెబుతుంది పరోపకార పరమార్థం ...