Posts

CHIDAANAMDA ROOPAA-MOORKHA NAAYANAAR

Image
 చిదానందరూపా-10  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  తొండైనాడులో నుండెను పరమమూర్ఖ నాయనారు  అన్నసంతర్పణములుచేసి అమితానందమునొందెడివాడు  ఆస్తి కరిగిపోయింది, ఏమి చేస్తావని అడిగింది  పస్తులు తానున్నా సంతర్పణ కొనసాగిస్తానన్నాడు  జూద సంపాదన ధనము ఈశ్వరసేవా ఇంధనమైనది  నిర్బంధ వ్యవహారమో,భవబంధ పరిహారమో ఇది   న్యాయము ఏమొ  కాని ఇది నారద ఉపదేశమునందించినది   శివసాయుజ్యమునొందగ జూదము కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయ...

CHIDAANAMDAROOPAA-TIRUMOOLANAAYANAR

Image
 చిదానంద రూపా-9  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  అగణిత భక్తితత్పరుడు అగస్త్యమహాముని దర్శనార్థము  అడుగులు వేయసాగె దక్షిణదిశగ,మార్గ మధ్యమున  కావేరి స్నానమాచరించి,దేవర సేవకు బోవుచుండగా  కాపరిలేడని గొల్లుమను గోవులమందను చూచె జాలిగా  సకలదేవతా సాధుజీవులకు  సంతసమును తానందీయగ  ప్రాణములేకయున్న మూలరు కాయము ప్రవేశించెగ  చెట్టున పెట్టిన సాధుకాయము కనికట్టుగ మాయమాయె  పరమపదంబును పొందగ పరకాయ ప్రవేశమె కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.  తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెల్లుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమందవిచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమై...

CHIDAANAMDAROOPAA-ADIPATTA NAAYANAARU

Image
చిదానందరూపా-ఆదిపత్త బెస్త నాయనారు-9  ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో  మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని  ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు  ఏమాయెనొ  ఏమో మడుగున చేపలన్నియు వీనిని  మాయదారి జాలరివాడు  మనలను కాపాడుకొందమనుచు  మడుగువీడి పోవగా,రోజుకొక  మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక  భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ  పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ  తాత్సారముచేయక  పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ  విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక. "పత్రం-పుష్పం-ఫలం-తోయం' వీనిలో దేనినైనా భక్తితో సమర్పిస్తే,పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తాడని పెద్దలు చెబుతారు.జలచరములైన జలపుష్పములను నిష్ఠగ సమర్పించి శివసాయుజ్యమును పొందిన బెస్త ఆదిపత్త నాయనారు."మత్స్య-కూర్మ-వరాహస్య-న...

TIRU KURIPPA TOMDA NAAYANAAR

Image
 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  తిరుకురిప్ప తొండనాయనారు  నియమము  రజకవృత్తియందే యతిరాజ భక్తి సంయమనము  మాసిన బట్తల,మసిపూతల రేడు ఆ చాకిరేవులో  నాయనారు వ్రతభంగము చేసినాడు జోరువానలో  అపరాధము జరిగినదని ఆ బండరాయికే,తన  తలనుబాదుకొనుటయే సరియనినాడు,వెంటనే  తగదని,నిలుమని,కపర్ది కరుణించగ నాయనారు  తరియించగ తడివస్త్రము కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక. రుకొరిప్పు తొండనాయనారు వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు.స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రప...

CHIDAANAMDAROOPAA-MOORTI NAAYANAARU.

Image
"న మే ద్వేషరాగౌ న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః  న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం "   చిదానందరూపా--మూర్తి నాయనారు   ****************************** ******  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  డెందమున భక్తిమరందము చిందులువేయుచునుండ  ఆనందపుచందనపుసేవ  ఆ  కపర్దికి చేరుచునుండ  శివద్వేషిగ రాజు మతమార్పిడికోరెనాయె  వినలేదని చందనమివ్వరాదని శాసనమిడె  కాలకంఠుని ఆనతో కాలము వింతగ కఠినమాయెగా  చేతిని చందనపుచెక్కగ మలచిన పంతము జటిలమాయెగా  చయ్యనబ్రోవగ దలచినచిదానందుని మాయగ  భక్తితో తీసినరక్తచందనమే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలుగాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.    గంధము అనే భక్తిబంధమును భగవంతునికి బిగించిన భాగవతోత్తములో ఎందరో.ఉదాహరణకు"  గంధము పూయరుగా" అంటు త్యాగరాజు,"మృగమదా మోదాంకితం చందనం" అంటు ,"కుంకుమచందన లేపిత లింగము"...

CHIDAANAMDAROOPAA-TIRUNAVUKKARASAARU

Image
  చిదానందరూపా-తిరునవుక్కరసారు.6   కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా   మనసులోని చీకట్లను తరిమేసే మరుల్ నీకియారు   అచంచల భక్తులలో అతనికెవరు  సాటిరారు   వ్యాధి దరిచేరి అప్పారును రాజధిక్కారిగ మార్చినది   కఠిన శిక్షరూపమై బండతో పాటుగ కడలిలో ముంచినది   తేవారములే నాయనారును కడతేర్చే పరిహారములైనవి   పశ్చాత్తాప పల్లవ గుణభారవీహారముగా  మార్చినది   తిరువాయుమూరుకు  తిరిపెమెత్తువాడు రమ్మనుట   వాగీశనాయనారు ముక్తికి వ్యాధియే  కారణమగుట   చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చుగాక.   మరుల్ నీకియారు అనగా చీకట్లను పారద్రోలేవాడు.భావి సూచకముగా తండ్రి సార్థక నామధేయుడవుతాడని ఆ పేరును పెట్టారేమో.తల్లితండ్రులను కోల్పోయిన బాలుని అక్క తిలకవతి తల్లియై సాకింది.తిలకవతి శివభక్తురాలు.తమ్ముడు శివుని నమ్మకపోయినా శివ వైభవములను నిరంతరము చెబుతుండేది.మరుల్ నీకియారు శివ దూషణ చేస్తూ మూర్ఖ వాదనలను చేసేవాడు.ఇలా వుండగా శూలవ్యాధి...

CHIDAANAMDAA-SAKKIYA NAAYANAAR

Image
  చిదానందరూపా-5  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  శివపూజకు అనుమతిలేని  పాలనలో  ఏమి తక్కువచేసెను   స్వామి లాలనలో  కనపడులింగము పూర్వము తానును  రాయియే కదా  ఆ రాయికి  రాతిపూజ అపూర్వపు సేవయే కదా  దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ  చాలు చాలు  భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు  అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు  సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.   నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచార...