Posts

CHIDAANAMDAROOPAA- KARAIKKAAL AMMAYAARU NAAYANAARU

Image
 చిదానందరూపా-కరైక్కాల అమ్మవారు  ******************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  కరైక్కాలలోని వైశ్య ధనదత్తుని కూతురు పునీతవతి  కళ్యాణముతో అయినది యోగ్యుడు నిధిపతి శ్రీమతి  శివానుగ్రహము ప్రసాదించినది రెండు మామిడి పండ్లను  శివయోగికి ఆతిథ్యము ప్రసాదించినది  అనేక మామిడిపండ్లను  భార్యలో  మానవాతీత శక్తులున్నవని భావించెను నిధిపతి  మానవ మాత్రుడు తానని మళ్ళీ వివాహమాడెను  సాంబశివుని తన సౌందర్యమును హరించమని వేడెను సాధ్వి  భూతనాథుని కొలువగ భూతపు రూపును ఇచ్చెను స్వామి " న భూతో న భవిష్యత్ " అను నానుడి తీరున   కైలాసమున శిరముతో నడచుట కైవల్యమునకు కారణమాయెగ   చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును   కరైక్కాల్ లోని ధనదత్తుడను వైశ్యుని కుమార్తె పునీతవతి.ఎదుగుతు ఎదుగుతు శివధ్యానములో కాలను గడుపుచుండగా,వాగై ఓడరేవు పట్టణమునందు గల నిధిపతితో శాస్త్రోక్తముగా వివాహమును తండ...

CHIDAANAMDAROOPAA- TIRU JNAANA SAMBAMDHARU

Image
 చిదానందరూపా- జ్ఞాన సంబంధారు  *******************************  కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  శివపాదహృదయాల్ భగవతి దంపతుల పుత్రుడు  సుబ్రహ్మణ్యాంశతో పుట్టెను శిర్కోలిలో ఒక శివ భక్తుడు  తండ్రి నదీస్నానపు నెపము,త్రావించెను బాలుని జ్ఞానక్షీరము  ప్రకటితమైనది వాగ్వైభవము,ప్రసిద్ధ "తొడుదయ సెరియల్" గ్రంథము  ఏడవ ఏట జరిపించిన ఉపనయ సంస్కారము,నేరుగా  చూపించినది ఎద నిండిన వేదాధ్యయనము  స్వస్థత చేకూర్చెగ రాజుకు సంబంధారు  సంకీర్తనము  పరమపదమునందగ సరిగ పదహారేళ్ళే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు  తీర్చును గాక.   తిరుమారై జ్ఞానసంబంధార తల్లితండ్రులు శివపాద హృదయార్-భగవతియార్.సుబ్రహ్మణ్ యస్వామియే శిర్కళిలో జ్ఞాన సంబంధారుగా తల్లి స్తన్యపానమునకై అవతరించారని ఆర్యోక్తి.హృదయార్ పూజాదికములను నిఎవర్తించుటకై నదీస్నానమునకు వెళుతూ కుమారుడైన జ్ఞానసంబంధారుని తనతో తీసుకొనివెళ్ళెను.తాను...

CHIDAANAMDAROOPAA- APPAADI ADIGAL NAAYANAARU

Image
  చిదానందరూపా-అప్పడి ఆడిగళ నాయనారు   ***************************************   కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా   శివభక్తుడు తిరునవుక్కరుసరునకు భక్తుడు అప్పడి ఆడిగళు   తిరునామము స్థిరముగ నిలుపగ  ప్రతివస్తువు సార్థకతనొందె   చెలువపు భక్తితో సాగుచు చలివేంద్రము నొక్కటిగాంచె తిరునవుక్కరుసరు   వివరము సేకరించి వరమీయగ ఆతని ఇంటికేగె శివయోగిగ   అతిశయ భక్తితో స్వాగతమిచ్చి అతిథికి ఆరగింపుగా   అమృత పంచభక్ష్యములు అర్పణ చేయగ అరటి ఆకులో  కోయగబోయిన వానిసుతు చేతిపై వేసెను పాముకాటు  సడలని వారి భక్తి సర్వేశునిపొందగ కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు చింతలుతీర్చుగాక. అప్పూది ఆడిగళ్ అంటే సేవకునికి సేవకుడు.తిరునావుక్కరుసు పరమ శివ భక్తుడు.తిరునావుక్కరుసు భక్తుడు అప్పూడి ఆడిగళ్ నాయనారు.భ్కతుని ఔన్నత్యమును విని అతనిని చూడకనే భక్తుడాయెను.తన పెద్ద కుమారునికి మాత్రమే కాకుండ ఇంటిలోని ప్రతివస్తువునకు తిరునావిక్కరసు పేరు...

CHIDAANAMDAROOPAA- CHANDEESVARA NAAYANAARU.

Image
  చిదానందరూపా- చండీశ్వర నాయనారు   ******************************************   కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా   జ్ఞాన వల్లూరులోని శివభక్తుడు  విచారశర్మ నామధేయుడు   శివాపరాథమును  ఇసుమంతయు ఓర్వగలేనివాడు   పండినజ్ఞానము మెండుగ నిండగ గుండెను గోవుల   పాలన సేయగ ధర్మము నాలుగు పాదములనుండెగ   చుట్టిన భక్తితో స్వామికి మట్టితో గుడినే కట్టి,పాలతో   చేసిన అభిషేకము లీలన దోసమునే చూపెట్టగ తండ్రికి   కట్టలు తెంచిన కోపము పాలకుండనె పడగొట్టినదిగ   తండ్రిని కొట్టిన కర్రయె కరుణను పొందగ కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలుగాక   చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చండీశ్వర నాయనారుగా ప్రసిద్ధిచెందిన విచార శర్మ వేద ఘోషలకు,తపములకు నిలయమైన తిరుచాయ జ్ఞాన వల్లూరునందు జన్మించాడు.తండ్రి ఎత్తదత్తుడు సన్మార్గుడు.ఐదు సంవత్సరములునిండకముందే వేదవేదాంగములయందు అపారజ్ఞానమును పూర్వజన్మ సంస్కారముగా పొందినట్లు ఏడవ యేట గురువుచే కొనియాడబడినవాడు ...

CHIDAANAMDAROOPAA- ARIVAAL NAAYANAARU

Image
  " న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం    న మంత్రో న తీర్థం నవేదా న యజ్ఞః    అహంభోజనం  నైవ భోజ్యం  న భోక్తా    చిదానంద రూపః శివోహం శివోహం."  చిదానందరూపా--ఆరివాల్ నాయనారు  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  కేదారేశుని ఆరగింపుకు కేసరి బియ్యము ఆకు కూరలు  చేసిన పాకము తోడుగ నంజుటకు మామిడి ఒరుగులు  నిత్య నివేదనము చేసెడి ధన్యుడు ఆరివాల్ నాయనారు  హరుడు హరించెనేమో సంపదను ,పరీక్షను చేయగ  ముతకబియ్యపు అన్నము ఆకులు ఆహారముగా తిని  నిత్యము నిర్మల భక్తితో ఎర్రబియ్యపు విందే ఈశునికీయగ  నేలపాలైన నైవేద్యము కృంగదీయగ కొడవలితో తాను  నేరముచేసితిననుకొని తన మెడను కోయుట కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.   చోళదేశమున గల "గుణ మంగళ"పట్టణమందున్న తాయినారు వేదములయందు ప్రతిష్టితుడైన పరమేశ్వరునికి ఎర్రని బియ్యముతో వండిన అన్నమును ఆకు కూరలను,మామిడి ఒరుగులను ని...

CHIDAANAMDAROOPAA- MAARANAARU NAAYANAARU.

Image
  "అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి; త్రావుమన్న!రా   వన్న; శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్   గ్రన్నన మాన్ చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే   లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు చుమ్ము పుల్కసా!( రంతిదేవుడు)    చిదానందరూపా-మారనారు   **********************************   కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా   ఇలియాన్ కుడి  గ్రామనివాసి ఈశ్వరభక్తుడు   మారనారు నాయనారు మహేశ్వర సేవాసక్తుడు   విభూతి-రుద్రాక్షలధారులు విశ్వేశ్వరుడనుకొను   విధివిధాన చేసిన సేవలు శాశ్వతమనుకొను   పరమ ఉత్సుకతపూరిత  నిత్యోత్సవములే అట   పెరిగిన భక్తి పెంపున ధనమును కరిగించినదట   వానకు తోడుగ నిలిచెను అతిథిగ  శివుడే వాకిట   నాటిన విత్తులవిందే  సాక్షాత్కారమునకు కారణమాయెగ   చిత్రముగాక ఏమిటిది చిదానందుని  లీలలు గాక   చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక  మాతృదేవోభవ-పితృదేవోభవ-ఆచార్య దేవోభవ-అతిథి దేవోభవ అన్న కర్...

OMTARI MAEGHAMU.

Image
   ఒంటరి మేఘం        **************   ఒంటరి మేఘంలా  మింటను దిగులుగా  వెంటాడే దు:ఖంతో  జంటగా సాగుతుంటే  తలవని తలపుగా  తారస పడ్దాయి  మెచ్చుకోలు రూపాలుగా  పచ్చనైన పూలు  కిలకిల కేరింతలతో  చిరుగాలుల జావళులకు  తలలూపుచు మోహనముగా  ఆహా! అనిపించేలా  ఏటిగట్టు చెలిమితో  అలల పలకరింపులకు  తలపడుతూ పోటీగా  రాగం! వినిపించేలా  మిస మిస పరుపులతో  సువాసనల  తరలింపుకు  తలవాలిచి ముద్దుగా  సేవే! కనిపించేలా  కనలేమని కలవరముతో  తామె వచ్చు ఊహలకు  తలమానిక ధర్మంగా  అందం! అదిరిందనేలా. ( శ్రీ వర్ద్స్ వర్త్ గారి  డఫడల్స్ స్పూర్తితో -- )  నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.