Posts

JAI SREEMANNAARAAYANA-24

Image
 అన్రి వులగ మళందాయ్! అడిపోత్తి  శెన్రంగుత్తెన్నిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి  పొన్రచ్చకడం ఉదైత్తాయ్! పుగళ్ పోత్తి  కన్రు కుణిలా ఎఱిందాయ్! కజల్పోత్తి  కున్రు కుడైయా ఎడుత్తాయ్! కుణం పోత్తి  వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయిల్ వేల్పోత్తి  ఎన్రెన్రు ఉన్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్  ఇన్రుయాం వందోం ఇరంగేలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-24 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ఆరుసార్లు పలుకుచున్న మంగళాశాసనమైన అసుర సం హారకుని దివ్య ఆపాద మస్తకములో వాత్సల్యాతిశయమునకు మంగళాశాసనమైన గోవర్ధనగిరిధారి-పాలిత గోవుల-గోపాలురలో "సర్వేజనా-సుఖినో భవంతు"అను మంగళాశాసనమైన భక్తి-ప్రపత్తి స్తుతుల పోత్తి పాశురములో ఆ" బాల" గోపాలునికి మంగళాశాసనమైన దిష్టితీయుట అను గోపికల స్పష్టమైన ప్రేమలో రంగనాథ స్వామికి మంగళములు పాడరారె అంగనలారా! ఆండాళ్ అమ్మవెంట నేడే. భావము గోవర్ధనగిరిని ఎత్తి గోవులను-గోపాలురను రక్షించిన స్వామికి మంగళము.సర్వ జనులకు శాంతి-సౌఖ్యములనిచ్చే స్వామికి మంగళము.స్వామికి దృష్టి తగులకూడదని,...

JAI SREEMANNAARAAYANA-23

Image
మారిమలై మురైంజిల్ మన్ని క్కిడందు ఱంగుం శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందు దఱి మూరి నిమిరిండు మురంగిప్పు ఱప్పట్టు పోదరుమా  పోలే నీ పూవై ప్పూవణ్ణా ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరిళిక్కో ప్పుడైయ శీరియ శింగాశ నత్తిరుందు యాం వంద కారియం  ఆరాయ్ అందరుళ్ ఏలో రెంబావాయ్ .  ఓం నమో నారాయణాయ-23 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది హర్ష-వర్ష ప్రదమైన వ్రతమును చేయించు చున్నదైన గోదా తల్లి పలుకుచున్న " ఏలో రెంబావాయ్" లో అమ్మ పిలుపు వినబడి నిదురను చాలించిన వాడైన శీరియ సింగము భంగి గుహ వెడలిన స్వామిలో పరిమళ కేసరములు ప్రపంచీకరణమైన శంకలేని భక్తి చేయు గోపికల కైంకర్యములో సిం హాసనమధిస్టించమని వినయము వింజామరలైన వినుతుల తోడ్కొనిపోవు విభవ స్వాగతములలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము చెలులను వ్రతమును చేయుటకు పిలుచుచున్న అమ్మ్మను,అమ్మ పిలుపువిని నిదురను చాలించి సిం హము వలె గుహనుండి బయటకు వచ్చిన స్వామిని,స్వామి అనుగ్రహమును తన కేసరములతో అంతా వ్య...

ADIVO-ALLADIVO- TIRUMANGAI ALWAARU

Image
 సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనయే లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుక్కరయులూరులో  తిరువాలి దంపతులకు  నీలుడుగా ప్రకటితమైనది శ్రీహరి శార్ఙము  శత్రువులకు  కాలుడుగా శౌర్యము వెలువరచుచు  పరకాలుడు అను పేరుతో ప్రసిద్ధుడైనాడు  అప్సరస కుముదవతిని అర్థాంగిగా కోరిన  అద్భుత పంచ సంస్కారములతో పునీతుడై  అతివమీది  ప్రేమతో ఆచరించుచున్న వ్రతము  పెట్టిన పరీక్షలే భక్తికి పెట్టని గోడలాయె  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొను  పరమార్థము చాటిన తిరుమంగై ఆళ్వారు పూజనీయుడాయెగ .

POOJALU-SARASVATEE NAMOSTUTE

Image
సరస్వతీ నమోస్తుతే ******************* జగమున శారద నమోస్తుతే _ గగనపు శారద నమోస్తుతే సుత నారద నమోస్తుతే -సిత నీరద నమోస్తుతే ఇందిర సఖి నమోస్తుతే -ఇందు ముఖి నమోస్తుతే వేదసారమా నమోస్తుతే - ఘనసారమా నమోస్తుతే పటిమ అనుపమ నమోస్తుతే - పటీర ఉపమ నమోస్తుతే మాఘ శుక్ల పంచమి నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే తల్లి ఆకార నమోస్తుతే -మల్లికాహార నమోస్తుతే నిషాద ఏలిక నమోస్తుతే - తుషార పోలిక నమోస్తుతే చేత కచ్చపి నమోస్తుతే - ఫేన స్వచ్చత నమోస్తుతే అజుని నాయికా నమోస్తుతే - రజతాచలమా నమోస్తుతే కాంతి సంకాశ నమోస్తుతే -కాస ప్రకాశ నమోస్తుతే పుష్ప కేశిని నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే భక్త మందార నమోస్తుతే - కుంద మందార నమోస్తుతే వసుధ నాదనిధి నమోస్తుతే - సుధా పయోధి నమోస్తుతే ఆశ్రిత పోషిత నమోస్తుతే _ సిత తామరస నమోస్తుతే ఆగమ విహారి నమోస్తుతే -అమర వాహిని నమోస్తుతే ఓంకార రూప నమోస్తుతే - శుభాకార రూప నమోస్తుతే పోతన శుభస్తుత నమోస్తుతే - శ్వేత వస్త్రధర నమోస్తుతే సకల బుద్ధివి నమోస్తుతే - సకల సిద్ధివి నమోస్తుతే సర్వశుక్ల రూపమా నమోస్తుతే -సరస్వతీ నామమా నమోస్తుతే మనసా-వచసా- శిరసా సతతం స్మరామి. పురు...

AMMA-08

Image
"అవిదితం కిం" ( తల్లీ నీకు తెలియనిదా!!) కడుపున పడగానే కడు సంతోషిస్తానమ్మా ఎదుగుతున్నన్నాళ్ళు ఒదిగిఒదిగి ఉంటానమ్మా హోరాహోరి పోరులో "నేను" కేరుమంటానమ్మా నా ఏడుపు నీ గెలుపుకు "అభినందనలే" అమ్మా. నేను,నీ ఒడిలో పడగానే ఒడుపుగ పట్టుకుంటానమ్మా ఆడపిల్లేమోనని అనుమానపు దిగులున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఏడాది నిండగానే తోడు నడుస్తానమ్మా ఆడపిల్లనని అక్కడే వదిలివెళ్ళుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా పాల బువ్వ పెడుతూనే మురిపాలు పంచుతానమ్మా ఆకలవుతున్నదని నన్ను అమ్మకానికి పెట్టుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఎదురుగా ఎదుగుతూనే మీ కీర్తిని ఎగురవేస్తానమ్మా ఆడపిల్ల నీవనుచు అవమాన పరచుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఏడడుగులు నడిచినా ఎదలో నింపుకుంటానమ్మా జోలి నిండుతుందని ముసలికి ఆలిని చేయుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా మెట్టినింట నేనున్నా పుట్టినింటికి వన్నె తెస్తానమ్మా వేరొక ఇంటిదీపం అని వివక్ష చూపించే అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా కాని,ఒక్కమాట అమ్మా, నీవు నాకొక అవకాశము ఇస్తేనే గదా నేను "అమ్మనై"" అభినందనలు" అందుకునే...

NAANNA-NAANNA CHAYI

Image
జగత: పితరే వందేం పార్వతీ పరమేశ్వరం తన్మయమున నన్ను చూస్తున్న ఒక అమృతమూర్తిని అమ్మ పరిచయము చేసింది అపురూపపు నాన్నని అందిస్తు నన్ను తన అమూల్యమైన చేతికి ఆ నిమిషము నుండి అరనిమిషము వదలకుండ ఆశీర్వదిస్తున్నది అనవరతము ఆ చేయి ......... చరచరమను జ్వరముతో విచారముతో నేనుంటే ఆచారిగ మారి నా నుదురును సరిచేసింది. అవమానముతో కృంగి అశ్రువులతో నేనుంటే కన్నతల్లి తానై నా కన్నీటిని తుడిచింది ఈడు హోరులోపడి చెడుదారిలో నే వెళితే చెవి పాశమై చతురతతో నా దారిని మళ్ళించింది చిరుతిళ్ళను ఆశించి చిల్లర నేనీయకుంటే ముక్కుపిండి నా పనులను చక్కగ చేయించావు మందు చుక్క మింగలేక మందముగ నేనుంటే కందకుండ బుగ్గనొక్కి అందగాణ్ణి చేసింది ముద్దను రానీయనని మారాముతో నేనుంటే గోరుముద్దగా పెదవిని గోముగా తాకింది బ్రతుకులో భయపడి నే కాస్త వెనుకాడితే అభయము తానై నన్ను వెన్నుతట్టి పంపింది ముళ్ళదారి నా పాదాలు కందిపోతాయని గుబళించు గులాబిగ నా అడుగుకు మడుగు అయ్యింది తన చేతలతో నా పై ప్రేమను చాటిన ఆ చేయి ఘనతను కనుగొని నమస్కరిస్తు నేనుంటే అనయపు ఆశీర్వచనమై నా తలపైన కూర్చున్నది ........................ వాస్తవాలను గుర్తించి ప్రస్తుతించలేని నాకు సమస్...

NAANNA- A SAMASTAAT

Image
ఆ-సమస్తాత్ ( తానే సర్వం) బాలమిత్ర పుస్తకములో బాలరాజు కథకాదు కాల దోష చరిత్రలో ఎన్నటికి చేరిపోదు మీ నాన్నా మా నాన్నా మనందరి నాన్నల కథ తరాలెన్ని మారినా తరలించలేని కథ. మమకార సామ్రాజ్యపు మహారాజు కథ. ****************************** ** దైనందిన పనులలో సైనికుడిని అంటాడు పనిచేసే వేళలలో సేవకుడిగా మారుతాడు అక్షరాల అర్చనలో ఆచార్యునిగా మారుతాడు క్రమశిక్షణ నేర్పుతూ ఆరాధ్యునిగా అవుతాడు తాను సంపాదించిన సర్వస్వము నా కోసము అంటాడు సంస్కారపు సంపదకు కోశాధికారి అవుతాడు చెడుజోడు చేరనీక అరికడుతు ఉంటాడు ఒడుపున దునుమాడే దండనాథుడవుతాడు ఒడిదుడుకులలో రక్షించి గట్టి భద్రతను ఇస్తాడు పట్టువదలక నన్ను పట్టభద్రునిగా చేస్తాడు కుళ్ళు కుతంత్రాలను కుళ్ళగించి వేస్తాడు మళ్ళీ దరిచేరని మంత్రాంగం చేస్తాడు ఖచ్చితముగా తన సంతోషము ఖర్చు చేస్తుంటాడు నన్ను మెచ్చుకునేలా చేయుటకు నిచ్చెన తను అవుతాడు ఎవరెంత పొగిడినా భేషుగ్గా వింటాడు ఏ మాత్రము మారడు భేషజమే లేనివాడు రాజువని నేనంటే రాజీ పడనంటాడు "నాన్న",తనపై పూజనీయతకు రోజు రోజు మరింత చోటునిస్తు.