Posts

Siva sankalpamu-39

 బావిలో నీవున్నావని  భక్తుడిగా  నేవస్తే  బాచిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది  కొండమీద నీవున్నావని కొలువగా నేవస్తే  బందరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది  బీడునేల నీవున్నావని  తోడు కొరకు  నేవస్తే  జోడువీడు అంటు బీడు  తనతో  పోల్చుకుంది  అటవి లోన నీవున్నావని  అటుగా నేవస్తే  జటలుచూడు అంటు అడవి  తనతో పోల్చుకుంది  చెట్టులోన నీవున్నావని  పట్టుకొనగ నేవస్తే  పట్టులేక ఉన్నావనిచెట్టు తనతో పోల్చుకుంది  సఖుడివి నీవై  సకలము పరిపాలిస్తుంతే  ఒక్కరైనపొగడరేల  ఓ తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-38

 దారుణ మారణ కాండను  కారుణ్యము అంటావు  పొట్టచీల్చి గజాసురుని  మట్టి కరిపించావు  చుట్టుకుంది  అతని తల నీ సుతు శరీరమునే  కన్ను తెరిచి మదనుని కన్ను మూయించావు  కన్నుల పండుగ అయినది నీ కళ్యాణముతో  బాణమేసి వరాహము ప్రాణమునే తీసావు  పాశుపతము చేరింది అర్జునుని ఆశీర్వచనమై  హరిని అస్త్రముగా వాడి త్రిపుర సం హారము చేసావు  విరచితమైనది  హరి మహిమ వీరత్వము చాటుతు  ఎటు చూసిన పాతకమే  నీ గతముగ మారితే  " మహాదేవం మహాత్మానాం మహా పాతక నాశనం" అను   మొక్కులందుకునేవురా  ఓ తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-37

  కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు   నీసిగముడుల చీకట్లలో  చింతిస్తు ఉంటాడట   కుబుసపు  మార్పుచేర్పులతో కదలాడు పాములు   నీలలోహిత చీకటిలో చిబ్తిస్తు ఉంటాయట   కునుకురాక  తెరువలేక కుదురులేని  మూడో కన్ను   తెరతీయని చీకటులలో చింతిస్తు ఉంటుందట   ఆకాశము నుండి జారి సాగ  అవకాశము లేని గంగ   బంధిఖాన చీకటిలో చింతిస్తు ఉంటుందట   చీకటులను తొలగించలేని జ్యోతి శివుడేనట   చింతను తొలగించలేని వింతయు శివుడేనట  దోషము తొలగించలేని  వానికి ప్రదోషపూజలా? అంటు  ఒక్కటే  గుసగుసలు  ఓ  తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-36

  పాల కడలి జనించిన గరళము నిను చేరితే   మురిపాల పడతి లక్ష్మి హరిని  శ్రీహరిని చేసింది   శరభ రూపమున నీవు  శ్రీహరిని  శాంతింప చేస్తే   విభవమంత  హరిదేగా  ప్రహ్లాద  చరిత్రలో   చిలుకు ఏకాదశినాడు చక చక నిద్ర లేచేసి   దామోదరుడు నిన్ను చేరినది  మోదము కొరకేగా   అభిషేక  జలాలతో నీవు  ఆనందపడుతుంటే   అలంకారాలన్ని  హరి తన  ఆకారాలంటాడు   అనుక్షణము నీవు అసురత చండాడుతుంటే   లక్ష్ణముగ హరి తులసిని పెండ్లాడాడు   అలసటయే  నాదని  ఆనందము హరిది అని   ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా!. 

SIVA SANKALPAMU-33

Image
    కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవ  సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద  కట్టుకున్న గజచర్మము నీకు పట్టు పుట్టములు అందీయగలద  నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలద  అలదుకున్న విభూతి నీకు వైభవమును అందీయగలద  కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయగలద  కరుగుచున్న నగము నీకు వరములు అందీయగలద  కాల్చున్న కన్ను నీకు కనక వర్షము అందీయగలద  పట్టుకున్న పాము నీకు రత్నరాశులను అందీయగలద  కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని అందీయగలడ  "ఓం దారిద్ర్య దుఖ: దహనాయ"అనగానే నువు ఔనంటే విని  ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-32

  సగము మహాదేవుడట  సగము మహాదేవి అట   సగము తేట తెలుపట సగము పసిడి పసుపట   సగము చంద్రబింబమట  సగము మల్లెదండలట   సగము జటాజూటమట  సగము సుందర థమ్మిల్లమట   సగము బూదిపూతలట  సగము కస్తురి తిలకమట   సగము నాగ హారములట  సగము నానా హారములట   డమరుక దక్షిణ హస్తమట  వరద  వామ హస్తమట   సగము పులితోలేనట  సగము చీనాంబరములట   సగమున తాందవ పాదమట సగము మంజీరములట   చెరిసగము  స్త్రీపురుషులట  కొనసాగించగ సృష్టి యట  నగజ-అనఘ జతలో మిగిలిన సగమేది అంతే  దిక్కులు చూస్తావేమిరా  ఓ తిక్క శంకరా!.  శివ పార్వతులు చెరిసగమైనారు కనుక మిగిలిన సగభాగముల గురించి అడుగగా శివుడు సమాధానము చెప్పలేదు.నింద.   చర్మ చక్షువులు తెలుసుకోలేని ఎన్నో గొప్ప విషయములు జ్ఞాన చక్షువులు తెలియచేస్తాయి.దిక్కులే వస్త్రములుగా గల శివుడు అర్థనారీశ్వర తత్త్వములో తనను పార్వతిలో దర్శింపచేసి అనుగ్రహించాడు.స్తుతి.   

SIVA SANKALPAMU-31

  భక్త పరాధీనతలో  బడలిపోయి  ఉన్నావని   నక్తపు నియమములతో  నకనకలాడుతున్నావని   భక్ష్య-భోజ్య చోహ్యములు లక్షనమగు లేహ్యములు   చవులూరు  చెరుకురసము  ఆహా అను అతిరసము   నారికేళ జలాలు  నానా తినుబండారాలు   మధురస మామిడిపళ్ళు  మంచి నేరేడు పళ్ళు   చక్కెరకేళి పళ్ళు  చక్కనైనద్రాక్షపళ్ళు   ఆరు రుచుల  ఆధరువులు  ఆత్మీయ  సమర్పణలు   పోషణలేక నీవు శోషతో సొక్కిపోతావని   మక్కువతో తినిపించగ గ్రక్కున నేనువస్తే  విషము రుచి నీకంత విపరీతముగ నచ్చిందా  ఒక్కటైన ముట్టవేర  ఓ తిక్క శంకరా!  భక్తులు శివునికి ఆకలిగాఉన్నదని అనేక మధుర పదార్థములను తినిపించాలని వస్తే,వాటిని కాదని విషమును తాగుతునాడని నింద.   విషమును లోకహితమునకై సేవించిన గరళకంఠుడు జగద్రక్షకుడని స్తుతి, .