Posts

SAUNDARYA LAHARI-16

Image
 సౌందర్య లహరి-16   పరమపావనమైన నీపాదరజ కణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా   అల్లకల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది   ఎర్రనైన కోపములో నేను వెర్రిపనులు చేస్తున్నా   చిర్రు-బుర్రులాడు మనసు నన్ను గుర్రుగా చూస్తోంది   తెల్లనైన తెలివితో నేను తెలిసికొనగ తప్పులన్నీ   తెల్లబరచె నాలోని  తెలివి తక్కువతనాన్ని      సత్వ-రజో-తమో   గుణములు సద్దుమణుగి, సత్వరముగ  పరాత్పరికి కర్పుర హారతిగ అర్పణము యైన వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  " అందరికన్న చక్కని తల్లికి సూర్య హారతి- అందాలేలె చల్లని తల్లికి చంద్ర హారతి"   అథాంగ పూజలో ఒకటైన ఆత్మ రతి యే హారతి.జీవాత్మ పరమాత్మను దర్శించి మమేకమగుటయే హారతి లక్ష్యము.వత్తులను ఆవు నేతిలో ముంచి హారతి ఇచ్చుట ఒక పద్ధతి. వత్తుల సంఖ్యను బట్టి హారతులు వర్గీకరించబడినవి.వత్తుల హారతియే కాక,బిల్...

SAUMDARYA LAHARI-15

సౌందర్య లహరి-15 పరమపావనమైన నీపాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము ఆలియే సర్వస్వమ్మన్న వాడి దారి మళ్ళించింది గొర్రెమేధ వానిని గొప్పకవిని చేసినది కఠినబోయవానిని ఆదికవిని చేసినది వివరము లేని వానిని వికట కవిని చేసినది ఆనంద మయునిగా అన్నమయను చేసినది మూక పంచశతి గ్రంథము నీ కృపచే వెలిసినది ఉన్న పాటుగా వారిని ఉన్నతులుగ చేసినది వారి వాంగ్మూలములు తాంబూలము అగుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! ఓ సౌందర్య లహరి. " తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రియ" తాంబూల చర్వణముతో ప్రకాశించే తల్లీ అని స్తుతించబడుతున్నది.తాంబూలము అంటే, " పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం" కొందరు కర్పూర చూర్ణమునకు ముక్తాచూర్ణము అని కూడ స్తుతిస్తారు.ఇందులో ఉన్న పదార్థములన్ని దైవత్వ ప్రత్యేకతను కలిగినవి. నాకవల్లీ క్రమముగ నాగవల్లీ గా వ్యవహరింపబడుతోంది.నాకము అనగా స్వర్గము కదా.వల్లీ అనదా తీగ.ఇంద్రుని ఐరావతమును కట్టిన స్తంభమునుండి నాగవల్లి తీగ తనంత తాను ఆవిర్భవించినదట.ఆ నాకవల్లి తీగ నుండి వచ్చు ఆకులే నాగవల్లి...

SAUNDARYA LAHARI-14

Image
సౌందర్య లహరి-14 పరమపావనమైన నీపాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం పసి శిశువుకు ఆకలియై పాలుకోరు ఇచ్చాశక్తి ముసురుకొన్న పాపాలను తొలగించే ఇచ్చాశక్తి పాలకొరకు అమ్మ స్తన్యమును జుర్రుకొనే జ్ఞానశక్తి ఆర్తితీర అమ్మ స్తవము జుర్రుకొనే జ్ఞానశక్తి పాలుతాగి కడుపు నింపుకునే క్రియాశక్తి మురిపాలు తీర అమ్మఒడి పరవశమగు క్రియాశక్తి మూడుపనులు చేయించే మూలచిచ్చక్తి అని భక్య భోజ్య చోహ్య లేహ్య పానీయలతో భక్తిపాత్రలో నింపి, భవతారక స్తుతులతో అనుభవైకవేద్యము మహా నైవేద్యము అయిన వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. " గుఢాన్న ప్రీత మానసా-హరిద్రాన్నైక రసికా-ధ్ద్ధ్యాన్నాసక్త హృదయా" అంటు శ్రీలలితా రహస్య నామ స్తోత్రములలో అమ్మవారికి పులిహోర-పెరుగన్నము-బెల్లముతో చేసిన పరమాన్నము ఇష్టమైన నైవేద్యములుగా పేర్కొనబడినది కేవలము.ఆహార పదార్థములను అమ్మవారికి సమర్పిస్తే అవి ప్రసాదమవుతాయా? అన్న సందేహమును తొలగించుకొనుటకు మరి కొంచము పరిశీలిద్దాము.(పెద్దలు నా భావనలోని తప్పులను సరిచేయుట అమ్మ అర్చనగా భావించగలరు. ఆహారపదార్థములను భక్ష్య-భోజ్య-చోహ్య-లేహ్యములుగా పెద్దల...

SAUNDARYA LAHARI-13

Image
 సౌందర్య లహరి  పరమ పావనమైన నీ పాదరజ కణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  కైమోడ్పులందించి తరియింపగ తలతుగాని  పొంచిన పైశాచికము  కొంచపు తలపును దించు  సంకీర్తనమొనరింప సన్నద్ధమగుదును గాని  దానవత్వము  దరిచేరి నా దారి మార్చు  జపతపాదుల నిను కొలువ నిశ్చయింతును గాని  మదిని నిశాచరము చేరి నే నిష్క్రమింతు  భావనామాత్ర సంతుష్టమొందు  భాగ్య వరమో నా  దైవాసుర చింతనలు  వింతగ  చింతామణిద్వీపమైన వేళ ,నీ  మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి  " భావనా  మాత్ర  సంతుష్టాయై నమః."   అమ్మను స్తోత్రములతో,సహస్ర నామాములతో,కీర్తనలతో సేవించుదామనుకొనగానే,నాలోని మాయ నా మనసును కల్లుతాగిన కోతి వలె నిలకడ లేకుండా చేస్తూ ఉంటున్నది .కాని ఎందరో భక్తులు తమ భావనతోనే అమ్మ అనుగ్రహమును తమపై ప్రసరించుచున్నదని,ధన్యులమైనామని చెప్పగానే,అమ్మ గురించి తలచుకున్న నా మనసు అమ్మ దయతో మణిద్వీపమును దర్శించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్ట...

SAUNDARYA LAHARI-12

   సౌందర్య లహరి-12   పరమపావనమైన నీపాదరజ కణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  శృంగనాద పరవశయై చిక్కిపోవు లేడివలె  దీపకాంతి మోహితయై నేలరాలు శలభము వలె  చర్మేంద్రియ లౌల్యముచే చతికిలబడు కరివలె  జిహ్వచాపల్యముచే పద్మమున చిక్కు తుమ్మెద వలె  ఎర వాసన తనకొరకు కాదను ఎరుకలేని చేప వలె  ఇంద్రియ లౌలత్యముతో మందబుద్ధి చెలిమి వలె  స్వప్నావస్థను వదిలి సత్యాన్వేషణ చేయలేని,నా  శాపములు అమ్మ పూజలో -దీపములగుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.      సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం                   గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం                   భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే            ...

SAUNDARYA LAHARI-11

    సౌందర్య లహరి-11   పరమపావనమైన నీపాదరజ కణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   లోభమునకు లోబడి రోగియైన నా మనసు   పనికిరాని పనులతో సతమతమౌతుంటుంది   కన్నుమిన్ను కానరాక కల్లుతాగిన కోతిలా  దండగ పనులను బహుదండిగ చేస్తుంటుంది   చిమటలా కొరుకుతూ చీదరపుట్టిస్తుంటుంది   మితిమీరిన తెలివితో తలక్రిందులు వేలాడుతు   చీకటిలో ఉబ్బితబ్బిబ్బౌ గబ్బిలము అవుతుంది   గబ్బిలమౌ మది పూజలో గుగ్గిలమగుచున్న వేళ  నీ మ్రోలనే  నున్న  నా కేలు  విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.   "దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం    ధూపం దాస్యామితే దేవి గృహాన పరమేశ్వరి"   సంబరేను చెట్టు వలన కలిగిన ధూప ద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల ఆకు,కాడ,బెరడు,ద్రవము మొదలగు వానినుండి వచ్చే సుగంధ ద్రవ్యములే దశాంగము.    పూజలను ద్రవ్య పూజ-భావ పూజ అని ఎండు విధములుగా పెద్దలు వివరించారు.ఆదిశక్తికి ద్రవ్యములను అర్పిస్తుచేసే పూజ ద్రవ్య పూజ.ద్రవ్యములు లేకుండ మనసులోనే భావిస్తు చేసే ప...

SAUNDARYA LAHARI10

Image
  సౌందర్య లహరి-10   పరమపావనమైన నీపాదరజ కణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   సకలవీర తిలకమే సకుంకుమ విలేపనముగ   సకల కళల లోగిళ్ళు నీ ఎర్రని చెక్కిళ్ళుగా   చిరునవ్వుల చూపులే సిరుల కంఠమాలలుగ   కరుణాంతరంగమే అరుణోదయ భంగిమగ   సకలము ఆవరించియున్న సత్ప్రకాశ మేఖలగ   అందరిని    ఆదరించు అమ్మ చీర కొంగుగా   లేత ఎరుపు ప్రకాశించె నీ ఎర్రని పాదాలుగా   సకల శాస్త్రాలు నీ ఎర్రని వస్త్రములగుచున్న  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  " సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషితా"   జలము అమ్మ స్పర్శచే పవిత్రమై తీర్థముగా మారుతోంది.అభిషేకానంతరము  లేత ఎరుపు రంగు(అరుణోదయ సూర్యకాంతి ) పరిణతనొందుచు నునులేతదై అమ్మ పాద కమలములను చేరి పునీతమైనది.కొంచము మారి లేతదనముతో అమ్మ నడుముకు మణిమేఖలయై (ఒడ్డాణమై) మరికొంచము సౌకుమార్యమును సంతరించుకొనుచు కరుణాంతరంగమును చేరినది.ధన్యోస్మి అంటు.మణిద్వీపము నందలి సువర్ణమయ ప్రాకారమును దాటి వెళ్ళగానే ప్రకాశించు పుష్యరాగమణి అమ్మ నుద...