Posts

SAUNDARYA LAHARI-51

 సౌందర్య లహరి-50  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  అధిష్ఠాన దేవునిగా ఆ రుద్రుడుండగా  వ్యాధినిరోధకత్వమైన అతి సున్నితచక్రముగా  పంచభూతములలోని వాయు తత్త్వముగా  పంచాక్షరి నామములోని "న" కారముగ నీవు మారి  క-ఖ-గ-ఘ-ఙ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ                అను అక్షరములు పన్నెండింటిని  పన్నెండు దళములుగల పద్మములో ప్రకటించుచు  హృదయములో నెలకొనిన బీజశక్తి రూపముగా  అనాహత చక్రములో నిన్ను చూచుచున్న వేళ,నీ  మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి. " చింతామణి గృహాంతస్థా" గా అమ్మవారు కీర్తింపబడేది ఈ అనాహతచక్రమే.అనాహత చక్రమునే అనంత చక్రము-నిరంతర చక్రము అని కూడ అంటారు.లేతనీలిరంగు పన్నెండు దళములతో ప్రకాశించు అనాహతము అజపామంత్ర స్థానము.సో-హం అను నిరంతర చింతనతో,శాంతి-సహనము.క్షమ-దయ-ప్రేమ-సంతోషముతో అలరారుతు భక్తుని యొక్క పరిపక్వతకు తగినంత స్థానమును కలిపిస్తుంది.యోగిహృద్యాన గమ్యం అయిన పరమాత్మ దర్శన పరిశోధన పటిష్ఠమై,అవ్యక్తాన...

SAUNDARYA LAHAR-50

సౌందర్య లహరి-49  పరమ పావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  అధిష్ఠాన దేవునిగ ఆ నారాయణుడుండగ  అవరోధములను అధిగమించి మరికొంచము పైకిపాకుతు  పంచభూతములలోని అగ్నితత్త్వముగ  పంచాక్షరి నామములోని " శి"అక్షరముగ మారి  డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ అను అక్షరములు పదింటిని  పది దళములుగల పద్మములో ప్రకటించుచు  నాభిస్థానము వెనుకనున్న జ్ఞానశక్తి రూపముగా  మణిపుర చక్రములో నిన్ను చూచుచున్న వేళ  నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.   మణిపుర చక్రమును నాభికమల చక్రము అని కూడ అందురు.తిరోధానముగ నున్న త్రికోణ చిహ్నమును (తలక్రిందులుగ నున్న త్రిభుజము) కలిగి ప్రాణ-అపాన వాయువులకు కలయిక స్థానముగా ఉంటుంది.పసిమి రంగు పది దళములతో ప్రకాశిస్తుంటుంది.సౌర-అగ్నితత్ త్వ మిళితమైన అరోగ్యప్రదాయిని.మంచిగుణములను మణులతో ,లక్ష్మీ-నారాయణ రూపముతో ప్రకాశించుచు,అనుగ్రహించుచున్న శ్రీ మాతను మణిపురచక్రములో నేను దర్శించగలుగుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనే...

SAUNDARYALAHARI-49

Image
సౌందర్య లహరి-48 పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము అధిష్ఠాన దేవునిగ ఆబ్రహ్మదేవుడుండగ పాము చుట్ట విప్పుకొని కొంచము పైకి పాకుతు పంచభూతములలోని జలతత్త్వముతో పంచాక్షరి నామములోని "మ" అక్షరము నీవై ప-భ-మ-య-ర-ల అను అక్షరములు ఆరింటిని ఆరు దళములు గళ పద్మములో ప్రకటించుచు జాగృతమొనరించుచున్న క్రియాశక్తి రూపముగా స్వాధిష్ఠాన చక్రములో నిన్నుచూచుచున్న వేళ నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి! ఓ సౌందర్య లహరి. స్వాధిష్ఠానచక్రము మూలాధార చక్రమునకు మూడు సెంటిమీటర్ల పైన, ఆరు దళములు గల పద్మముగా,లేత ఎరుపు రంగులోనుండును.ఇందులో జాగృతమైన మన చెడు భావనలు కుండలినీ శక్తిని మణిపుర చక్రమువద్దకు పోనీయక అడ్డుపడుచుండును.ఫలితముగా ఒక్కొక్కసారి కుండలిని అథోముఖమై మూలాధారమును చేరవలసి వస్తుంది.స్వాధిష్ఠాన చక్రము యొక్క చిహ్నము మొసలి.మరల మరల కార్య సిద్ధికి ప్రయత్నముచేసే స్వభావములేనిది.అలసత్వముతో (సోమరిగ) నుండును.రుచిని తెలుపుటకు-పునరుత్పత్తికి సహాయపడుచున్న స్వాధిష్ఠాన చక్రములో (అమ్మ దయతో) సూక్ష్మ రూపమున శ్రీమాతను గుర్తించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్...

SAUNDARYA LAHARI-48

Image
 సౌందర్య లహరి-46  పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  అధిష్ఠాన దేవుడిగ  ఆదిపూజ్యుడుండగా  పాము చుట్ట చుట్టినట్లు నెమ్మదిగ పడుకొని  పంచభూతములలోని పృధ్వి తత్త్వముగ  పంచాక్షరి నామములో "న" కారముగ నీవు మారి  వ-శ-ష- స అను అక్షరములు నాలుగింటిని  నాలుగు దళములుగల పద్మములో ప్రకటించుచు  అండ-పిండ-బ్రహ్మాండ కుండలినీ శక్తిగా  మూలాధార చక్రములో నిన్ను చూచుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  "అరుణాం కరుణాంతరంగితాక్షిం" తల్లి ఎర్రనైననది. కరుణతో నిండిన కన్నులు కలది .ఒక విధమైన అర్థమైతే,కరుణతో నిండిన అంతరంగము కలది అని కూడా మనము అన్వయించుకోవచ్చును.అదే విధముగా మూలాదార చక్రములో,మూడు చుట్టలు చుట్టుకొన్న "కుండలినీ శక్తి" కూడ అమ్మదయ ప్రసరించుటచే ఎర్రని రంగును కలిగి,పైకి పాకి మనలను చైతన్య వంతులను చేయుట అను స్వభావమును కలిగియున్నది.ఈ మూడు చుట్లు భూత-వర్తమాన-భవిష్య కాలములకు సంకేతములుగా భావిస్తారు.మూలాధార పద్మములోని నాలుగు దళములను మానవ...

SAUNDARYA LAHARI-47

Image
  సౌందర్య లహరి-46  పరమపావనమైన నీపాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  సర్వ వర్ణోపశోభితము  సహస్రారము కాగా  హంసవతీ-క్షమావతీ ఆజ్ఞా చక్రముగా  అమృతాది మహా శక్తులతో విశుద్ధిచక్రముగా  కాళరాత్రాది రేకులతో అనాహత చక్రముగా  డామర్యాదివిరచిత మణిపుర చక్రముగా  బందిన్యాది సమన్విత స్వాధిష్ఠాన చక్రముగా  వరద-శ్రీ షండ-సరస్వతీ మూలాధార చక్రముగా  నీ త్రివిక్రమ పరాక్రమము శ్రీచక్రముగా మారుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి. " శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే" అని అమ్మవారిని స్తుతిస్తున్నారు ఎందరో భక్తి ప్రపత్తులతో.  మన శరీరములోని విసర్జకావయమునుండి పైకి ఒక ఎముకల వలయము సాగుతుంది.(వెన్నెముక) దీనిని సుషుమ్నా నాడి అంటారు.ఆ నాడి తనలో ఆరుచోట్ల పద్మములవలెనున్న ఆరు చక్రములను కలిగిఉంటుంది.అవి మూలాధారము-స్వాధిష్ఠానము-మణిపురము-అనాహతము-విశుద్ధము-ఆజ్ఞా చక్రము అనునవి.వీనిని దాటిన లభించునది సహస్రారము.అదియే పరమాత్మ స్థానము.ఈ చక్రములు పంచభూత తత్త్వ...

SAUNDARYA LAHARI-46

  సౌందర్య లహరి-45  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  బిందువుగా  సృష్టి ప్రారంభమును కేంద్రీకరిస్తూ  దయా సింధువుగా  పంచభూత తత్త్వముతో  వ్యాపిస్తూ  శ్రీచక్ర సింహాసినివై  ఋతువులను  ఋతముచేస్తూ  సర్వకాల సర్వావస్థలలోను నీ అస్థిత్వమును ప్రకటిస్తూ  జగములను మోడుబారనీయని తోడునీడగా వీడక  అండ-పిండ బ్రహ్మాండములలో నిండిన అండవని తెలియక  జనన- మరణములు చర్విత చరణమగుచుండగా  శిశిరమైన చిత్తమునకు  చైత్రము నీవైన  వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి. ' " మృణాల మృదుదోర్లతా' అనియు," బిసతంతు తనీయసీ " అనియు శ్రీ లలిత సహస్ర నామములలో తల్లిని కీర్తిస్తారు.మృణాలము అంటే తామరతూడు.తామరతూడు కంటే మృదువైన మృదుత్వము కలవి అమ్మ చేతులు.అందుకే అవిఆశ్రిత మందారాలు.ఇక్కడ మన సుషుమ్నా నాడి షట్చక్రములనెడి పద్మములతో ప్రకాశించుచు,ఇళ-పింగళ నాడులు రెండు రెండు చేతులుగా మనలకు ఆధారమగుచున్నవి.సుషుమ్నా నాడి అను పద్మభరిత కాండమునకు గల రెండు మృదువైన కొమ్మలు.నయన ...

SAUNDARYA LAHARI-45

సౌందర్య లహరి-44 పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము దుర్గ,లక్ష్మి,సరస్వతి,గాయత్రి,రాధ ప్రకృతి పూర్ణరూపములు గంగ,చండి,తులసి,షష్టి,మానసా దేవి ప్రధానాంశ రూపములు అనసూయ,అరుంధతి,శచీదేవి,లోపా ముద్రా అమ్మ కళాంశ రూపములు పెద్దమ్మ,పోలేరమ్మ,ఎల్లమ్మ,మైసమ్మ అమ్మ అంశ రూపములు ప్రతి స్త్రీమూర్తిలో పవిత్ర అంశాంశను పదిల పరచగ ప్రతి స్త్రీరూపము పరమేశ్వరి ప్రతిరూపమే కాగ ఇలను పూర్ణముగా-అంశలుగ-అంశాంశలుగ-జానపదముగా గడ్డుతనము తొలగించి బిడ్డలను కాపాడుచున్నవేళ నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి పరాశక్తి-పరమేశ్వరి భక్త సంరక్షణార్థము పలురూపములను ధరించి,పరిపాలించుచున్నది.భక్తుల మానసిక స్థితిగతులకు అనుగుణముగా, " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు రీతి" భగవతి తన రూపమును-స్వభావమును-పూజా విధానమును అనేకముగా చేసినను,అనుగ్రహమును మాత్రము అవ్యాజముగా(అనుగ్రహించవలసిన కారణము లేక పోయినను) వర్షించుననుటకు పెక్కు ఉదాహరణలు కనిపించుచున్నవి. "శివ శక్త్యా   యుక్తా  ప్రభవతి" అని ఆదిశంకరులు కీర్తించినా,లోపా ముద్రార్చిత శ్రీమత్ చ...