Posts

SAUNDARYA LAHARI-69

 సౌందర్య లహరి-గౌరీదేవి  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  తారకాసుర సంహార తరుణమని  భావించి  పరమ శివునితో పరిణయ ప్రతినబూనె  పార్వతి  పంచాగ్నుల మధ్యనుండి ఘోరతపమునాచరించె  పర్ణగా-అపర్ణగా అకుంఠిత దీక్ష దక్షపుత్రి  అరుణకాంతి మాయమాతె-అసితామయమాయె  మేను  గురుతెరిగిన ప్రాణేశుడు  కాళిని గౌరిని చేసెను  అభయ-వరద ముద్రలతో,త్రిశూలము-డమరుకముతో  పెద్దతల్లి  గౌరమ్మ ఎద్దునెక్కి యున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  స్కాంధపురాణము-మత్స్య పురాణము-శివ పురాణము గౌరి నామములో అమ్మ తత్త్వమును దర్శించింది.ఆహారమునకు దూరముగా-పంచేంద్రియ లోలత్వమునకు దూరముగా నుండి పరమేశుని భర్తగా పొందగలిగినది తల్లి.కనుక ప్రత్యాహార సమాధి సమాధి భాజాం అని కీర్తిస్తారు.నల్లనిఛాయతో ప్రకాశించే తల్లిని భర్త "కాళి" నల్లని దానా అని మేలమాడినాడని,అందులకు చిన్నబుచ్చుకొని తపమాచరించుటకు కైలాసమును వీడి వెళ్ళగా,ఆసమయమున ఆడి అను అసురుడు పాముగా కైలాస ప్రవేశమును చేసి(మాయా...

SAUNDARYA LAHARI-68

 సౌందర్య లహరి-లలిత పరాభట్టారిక  పరమ పావనమైననీ పాదరజ కణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  బ్రహ్మా0ణడ పురాణంతర్గత  బ్రహ్మాండరూపిణి  ప్రాతఃకాల స్మరణము పరమ రమణీయము  హయగ్రీవ-అగస్థ్య సంవాద సుందరి  ప్రాతఃకాల భజనముసర్వ పాప భంజనము  చిదగ్నికుండ ప్రకటితమైన చిద్విలాసిని  ప్రాతఃకాల వందనము  ఆనందనందనము  వశిన్యాది-వాగ్దేవతా సేవిత శ్రీమన్నగర నాయకి  లలితా పరా భట్టారికగా కొలువుతీరియున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  "లాలనాత్ ఇతి లలితా".లాలనతో మనలను అనుగ్రహించు తల్లి లలితాదేవి.జ్ఞాన శాస్త్రమయమైన శ్రీ లలితోపాఖ్యానము,శ్రీ లలిత సహస్ర రహస్యనామ స్తోత్రములు,త్రిశతి,పంచరత్మ్న స్తొత్రము అనేకానేక విధములుగ జగములను ఉద్ధరించుచున్నవి.భక్తుల హృదయములలో క్రీడించు పరాశక్తియే లలిత.అనాది-అఖిలాధారయైన తల్లి,జ్ఞానముచే మాత్రమే దర్శనమును అనుగ్రహించు తల్లి, "లలిత-లలిత-శ్రీ లలిత-విశ్వ మోహిన శ్రీమాతగా భజింపబడుతు,నామ రూపములను అధిగమించి,తత్త్వ ప్రకాశినిగా అవగతమగు...

SAUNDARYA LAHARI-67

Image
8:00 AM (1 hour ago)   సౌందర్యలహరి-సరస్వతి  పరమపావనమైన  నీ పాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  జిహ్వాగ్రమున వసించు సరస్వతి జ్ఞానశక్తిగా  పలుకులే కావ్య-నాటక-అలంకారములుగా  మీమాంస-పురాణములు తల్లి కంఠపు పైగీతగ  ఆయుర్వేద-ధనుర్వేదములు కంఠపు నడిమి గీతగా  చతుషష్టి కళల చతురత క్రిందనున్న గీతగా  బాహువుల సంకల్పమే తంత్రాది రూపములుగా  అంతర్వాహినిగా  మా ఆపాద మస్తకము బ్రహ్మజ్ఞానముగా   సురపూజిత  భాసురముగ ప్రవహించుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి. "కేయూరాని న  భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా  న స్నానం విలేపనం  న కుసుమం న అలంకృత మూర్ధజాః  వాణ్యేక సమలం కరోతిపురుషం య  సంస్కృత ధార్యతే  క్షీయంతే ఖలు భూషణని సతతం వాగ్భూషణం భూషణం"  ఆభరణముల అలంకరించుకున్నను,విలేపనములు అలదుకొన్నను,పన్నీటి స్నానములు చేసినను,సుగంధ పుష్పమాలములను అలంకరించుకొన్నను విద్యావిహీనుడు వ...

SAUNDARYA LAHARI-66

 సౌందర్య లహరి-అన్నపూర్ణ  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  భూమిలోని సహనమువై,అగ్గిలోని వేడివై  మేఘములో జలమువై,జలము ఇచ్చు శక్తివై  విత్తులోని చెట్టువై,చెట్టులోని పండువై  పండులోని మధురమై,దాగిఉన్న దుంపవై  భక్ష్య-భోజ్య-చోహ్య-లేహ-పానీయములలో చేరి  పసి నుండి ముసలి వరకు  ఆహారముగా మారి  "భిక్షాం దేహి-మాతాన్నపూర్ణేశ్వరి" దయార్ద్రవై  " అన్నం పరబ్రహ్మ స్వరూపము"గ ఆకలితీర్చుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి. " అన్న పూర్ణే-సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే   జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహిచ పార్వతి"   " అన్న పూర్ణే విశాలాక్షి-అఖిల భువన సాక్షి! కటాక్షి" అని దీక్షితారు తరించారు.అన్ని అన్నివేళలా పూర్ణముగా కల తల్లి అన్నపూర్ణ.ఎడమ చేతిలో,దివ్యమైన అమృతాన్నముతోన్నిండిన మాణిక్య పాత్రతో,శుభకర కంకణముల కుడిచేతిలోని బంగారు గరిటతో ,సాక్షాత్ సదాశివునకు భిక్షను అనుగ్రహించుట,పరమేశ్వరార్పణము చేసిన తరువాత ప్రసాదమును స్వీకరించమని మనలకు చెప్పకనే చె...

SAUNDARYA LAHARI-65

  సౌందర్య లహరి-రాజేరాజేశ్వరి   పరమపావనమైన నీపాద రజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   ఇచ్చా-క్రియా-జ్ఞాన  శక్తుల అనుగ్రహదాయిని   అష్టసిద్ధులను అనుగ్రహించు సిద్ధిదాత్రివి నీవు   అంబా తత్త్వము వెల్లివిరియ ఆనందదాయిని   రాజాధిరాజులను రక్షించే ఈశ్వరివి నీవు   రజో-తమో-సత్వ భక్తిని మించినదైన పరాభక్తితో   రాగాతీత ఉపాసనను ఉత్కృష్టము చేయుచు   తేజోమయమైన  నీ రాజరాజేశ్వరి  రూపము   అపరాజితగా నాలో విరాజమానమగుచున్నవేళ   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-64

  సౌందర్య లహరి-మహా లక్ష్మి-63   పరమపావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   పువ్వులలో-ఫలములలో -ధాన్యములో-గడపలో   ముత్యములలో-మణులలో-వృక్షములలో-గోమాతలో   శంఖనాదములలో-శుభ గంటా నాదములలో   త్రిగుణాత్మక దీపములలో-తులసికోట మూలములో   ఆదిలక్ష్మి-ధాన్యలక్ష్మి-ధనలక్ష్మి-వీరలక్ష్మి   విద్యాలక్ష్మి-విజయలక్ష్మి-సంతా న లక్ష్మి-మహాలక్ష్మిగా   పలురూప నామములలో పరిఢవిల్లు నిన్ను చూచి   పాహిమాం-పాహిమాం అనుచు భక్తులు ప్రస్తుతించుచున్న వేళ   నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా   మానసవిహారి !ఓ సౌందర్య లహరి.   .  " యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" లక్ష్ అను ధాతువునుండి ఏర్పడిన పదము లక్ష్మి.లక్ష్యమును  నెరవేర్చునది లక్ష్మిదేవి.సర్వశుభలక్షణత్వమే లక్ష్మీతత్త్వము.నారాయణునికి  స్థితికారకత్వమునందు-సర్వ వ్యాపకత్వమునందు సహాయకారియైన తల్లి భృగు మహర్షి-ఖ్యాతి సాధ్విని కుమార్తెగా అనుగ్రహించి,భార్గవి నామముతో ప్రసిద్ధికెక్కినది.సనత్కుమార సేవిత హ...

SAUNDARYA LAHARI-63

 సౌందర్య లహరి- గాయత్రి   పరమపావనమైన  నీ  పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   సత్వ-రజో-తమో గుణములకు తోడుగా   ప్రకృతి తత్త్వము అనేనాల్గవ ముఖముతో   గుణాతీత స్వరూపముగా  ఆ ఐదవ ముఖముతో   ఆదిత్య మండలపు ఆ దివ్యశక్తి నీవుగా   అంతర్ముఖ-బహిర్ముఖ ఆరాధ్యదేవతగా   ఇరవై నాలుగు అక్షరములతో భాసించుచు   గాయత్రీ-సావిత్రీసరస్వతీ రూపాలుగా   మూడు సంధ్యలందు నీవు మూర్తీభవించు వేళ   నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.  "గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రి"అని దేవీ భాగవతము స్తుతిస్తున్నది.ఎవరు స్మరిస్తారో వారిని రక్షించే తల్లి ఛందోరూపిణిగా భాసిల్లు గాయత్రీమాత.పాంచభౌతిక తత్త్వపు ఐదు రంగులు కల( ముక్తా-ముత్యపు-తెల్లని,విద్రుమ-పగడపు-ఎర్రని,హేమా-పచ్చని పసిమి-బంగారపు,నీల-నీలమణి--ప్రకాశపు నీలపురంగు-ధవళ-వజ్రపు ప్రకాశముతో) ఐదు ముఖములతో,త్రిగుణాతీత తత్త్వముతో,సూర్య మండలములో ప్రకాశించు ప్రాణ శక్తియే గాయత్రీమాత. ప్రత్యక్ష దైవ స్వరూపిణి.గంధం-పుష్పము-...