Posts

MRTA SANJEEVANI STOTRAMU

Image
మృత సంజీవని స్తోత్రము **********************    శివ మయమే ఈ పంచభూతాత్మక ప్రపంచము    శివ దయయే మృత్యుంజయ రక్షకవచము.    పరమపుణ్యము రహస్యములకే రహస్యము    మహాదేవుని మృత సంజీవని స్తోత్రరాజము    శుభకరమీ స్తోత్ర శ్రవణము భవ హరణము    కాలభీకరము మృత్యువు ఇక కడు దూరము    సర్వదేవ సంసేవిత వరదుడు శంకరుడు    కూరిమితో తూరుపు దిక్కును చూస్తుంటాదు    మూడుముఖములతో, ఆరుచేతుల రేడు చూడు    చేతిలో అగ్గిని దాచి ఆగ్నేయము రక్షిస్తాడు    ఖడ్గముచేత ధరించి గణములు పాలిస్తాడు    రక్షోరూపిగ కరుణను నైరుతి రక్షిస్తాడు    పదునెనిమిది భుజముల వాడు, కరుణను    దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు    పాశాభయ కరములు సముద్రుడు పూజిస్తాడు    విలుకాడై నిలకడ పడమర రక్షిస్తాడు   అభయము తానౌతాడు అరులను తుంచేస్తాడు   అవ్యయుడైన వాడు వాయవ్యమును రక్షిస్తాడు   కరమున శంఖము వాడు కలతలు తీసేస్తాడు   దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు ...

SIVA PRADOSHASHTAKAMU.

 శివ ప్రదోషాష్టకము. *********************** 1. ఓ మూఢ!    శివపాదము చూడవు-భక్తితో మోకరిల్లవు    శివనామము పలుకవు -తరియింపగలేవు    శివకథ చిత్తగించవు -వేగిర శరణను    శివపద నర్తనామయ ప్రదోషవేళనన్. 2.రత్నఖచిత సింహాసీనురాలు శ్రీగౌరి   ప్రసీద నృత్యమునకు సంసిద్ధమౌ శూలపాణి   కైలాసగిరి మీద కొలువైనారు వేడుకొన   సుర ప్రస్తుత పశస్తము ప్రదోష సమయము. 3. గంధర్వ యక్ష విద్యాధర సిద్ధ సాధ్య సకల    పశుపక్షి సర్ప అప్సరసాంగన సమూహము    కొలువ శివుడే ! ఇతరము లేదేది యనుచు    ప్రక్కననిలబడినారీ ప్రదోష వేళనన్. 4.శ్రీవాణి వీణ దివిజేంద్రిత బ్రహ్మాది సతతం   శ్రీలక్ష్మి గాత్ర-హరి మద్దెల నాద స్తోత్ర సేవ   ముకుళిత హస్త వలయస్థిత సురవందిత   పశుపతి పరమాద్భుత ప్రదోష వేళనన్. 5.సంసార జలధిని మునిగిన దరికానని   ఆర్తత్రాణ రక్షణము డమరుక రవం   శివ కరపద కదలిక క్షిప్ర కటాక్షము   పరమానంద ప్రదము ప్రదోషశివనృత్యము. 6.పరమేశ్వర పదాంబురుహ పూజనము పుణ్య...

BAANAASURA KRUTA SIVASTOTRAM

Image
 శివమే జగము-జగమే శివము-బాణాసుర కృత శివస్తోత్రము. *************************************************************** 1. మహాదేవ మహాగురు సురేశ్వర నీలకంఠ    యోగబీజ యోగరూప యోగీశ్వర నమోనమః. 2.జ్ఞానబీజం జ్ఞానరూపం జ్ఞానానందం సనాతనం   తపోఫలానుగ్రహం దైవం సర్వసంపత్ప్రదాయకం 3.తపోబీజం తపోరూపం తపోధనం సదాశివం   కరుణబీజం కరుణరూపం చిన్ముద్రం చిదంబరం 4..నరకార్ణవతారణం భుక్తి-ముక్తి ప్రదాయకం   అశుతోషం సుప్రసన్నం అవ్యాజము అనుగ్రహం 5.హిమవాసం చంద్రమౌళిం శ్వేతపద్మ ప్రకాశకం   బ్రహ్మజ్యోతి స్వరూపము భక్తానుగ్రహ విగ్రహం. 6.పంచభూతం పంచేంద్రియం పంచామృతం బహురూపం   జలరూపం అగ్నిరూపం నింగిరూపం దిగంబరం 7.వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహాత్మకం   చిద్రూపం స్వస్వరూపం విరూపాక్షం విశ్వరూపం 8.శక్తిస్వరూపం ఈశ్వరం భక్తానుగ్రహ విగ్రహం   వేదస్తుతం పరమపూజ్యం త్రిభువనరక్షకం.   జగమే శివము-శివమే జగము. 9..అపరిచ్చిన్నం ఆదిదేవం అవాఙ్మానస గోచరం   వ్యాఘ్రచర్మాంబరధరం మందస్మితం మహేశ్వరం   త్రిశూల పట్టిధరం కరుణ...

RISHI PATANJALIKRUTA SADAASIVAASHTAKAMU.

సదాశివాష్టకము    ************* 1.స్వర్ణపద్మ సరోతీర సుందర మందిరవాసినే   అనంతకోటి సూర్యతేజ గరుడగమన సేవితే   ఫణిపతి కర్ణకుండల పాహి పార్వతీసమేత   సదానమశ్శివాయతే సదాశివాయ శాంభవే. 2.భాగీరథిసహిత బాలేందు చంద్ర ధారియే   భానుచంద్ర పావక భాసిత త్రినేత్రయే   భుజంగరాజ కుండలే బుద్ధిశాలి బాంధవే    సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 3.చతుర్ముఖానన వినుత చతుర్వేద కీర్తితే   చతుర్భుజానుజ సమేత  శరీర దివ్యతేజసే   చతుర్విధప్రదాత చతుర తాండవ ప్రియే    సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 4.శరత్చంద్ర కాంతులీను మందహాస మంజుల    పగడపెదవి ప్రతిఫలించు ముఖప్రకాశ సుందర    బ్రహ్మపుర్రె చేతదాల్చు సిరులతల్లి సోదర       సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 5. హరి సహస్ర కమలములతో ప్రారంభించెను వ్రతము    హరులీలన కానరాదు పూజకు చివరి కమలము    హరినేత్రము కమలమాయె వరమాయె సుదర్శనము     సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 6.ధరాతలము రథము సారథి విధాత ...

CHARANA-SRNGA RAHITA NATESA STUTI-RISHI PATANJALIKRUTAM.

Image
                                చరణ-శృంగ రహిత నటేశ నవకం-పతంజలి కృతం.                 ******************************************* 1. జగంబులు జయంబను చిదంబరపదం ఝణ ఝణం ఝణిత మంజుకడియం    పతంజలి దృగంజన నిరంజన నిరంతర జయం జనన భంజనకరం    కదంబ సుమలంకృత హరం శివం శంకరం శంభుం సుసుందర కంజయుగళం.    సుమంగళి సగం బుధహృదయంబుజ రవిం నట చిదంబర భజం సంతతం. 2.హరమసురసంహరం అనంతఫణికంకణం  అఖండదయమంతరహితం   ఇంద్రనుత సుందరం విరించి సుర సంహితం సర్వశుభలక్షణం శుభకరం   భస్మలంకృత ప్రియం యమనియమ భంజనం నగజవందిత పంకజపదం   శివంకరుణసింధుం మదమదన వంచన నట చిదంబర భజం సంతతం.   3.అఖండజగమనంత రక్షం భృంగి మృదంగ విజృంభిత పదనర్తనం    ఉన్మత్తముత్తుంగ గంగ జట బంధనం విప్రరక్షం యమగర్వబల భంజనం    విలంబిత కరం దశదిశం నిగమ మృగధరపర్వతవసం పశుపతిం    ధనంజయ తిమిరసమ్హర చంద్ర నయనం నట చిదంబర భజం సంతతం. .4.అనంత ...

APPAYYA DEEKSHITA MAARGABAMDHU STOTRAMU

Image
మార్గబంధు స్తోత్రము-శ్రీ  అప్పయ్య దీక్షిత కృతము ****************************** *************  శంభో మహాదేవ శంభో   శంభో మహాదేవ దేవా  శంభో మహాదేవ శంభో  శంభో మహాదేవ దేవేశ- శంభో  శంభో మహాదేవ దేవ. 1. తరిమింది జాబిలిని శాపం    తరియించింది బాలేందు రేఖ కిరీతం    కామ సంహారమే చేసింది నేత్రం    శుద్ధ తేజస్వరూపం-భజే మార్గబంధుం భజే మార్గబంధుం. 2.త్రాగినది విషజ్వాల సర్పం   వెన్నంటి నడిచినది శివుడే సమస్తం   జతగూడె గంగమ్మ జగమేలు బంధం   నిత్య చైతన్య రూపం- భజే మార్గబంధుం  భజే మార్గబంధుం. 3.నిత్యం చిదానంద రూపం   కృతకృత్యం శార్దూల కరిచర్మ వస్త్రం   దశకంఠ దర్పాతి నాశం   భక్త మందార దైవం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం 4.తొలగినది మన్మథుని  గర్వం   నెలవైనది కంఠమున ఘనమైన గరళం   కుంద మందార దంత దరహాసం   కోటి సూర్య ప్రకాశం భజే మార్గ బంధుం భజే మార్గ బంధుం. 5.కామితము తీర్చేటి వృక్షం   కవ్వపుగిరిని తలదన్ను దారుఢ్యం   క...

YAMAKRUTA SIVAKESAVA STUTI

Image
       యమధర్మరాజకృత శివకేశవ స్తుతి   ******************************** 1.గోవింద మాధవ ముకుంద మురారి   శూలపాణి శశిశేఖర శంభో శంకర   అచ్యుత జనార్దన దామోదర వాసుదేవ   స్మరణము యమభటులనుంచు దూరము. 2. అంధకాసురవైరి నీలకంఠ గంగాధర    కైటభాసురవైరి వైకుంఠ పద్మపాణే    భూతేశ ఖండపరశు మృదేశ చండికేశ     స్మరణము యమభటులనుంచు దూరము. 3. నారసింహ మధుసూదన చక్రపాణి పరాత్పర    గౌరీపతి  మహేశ్వర  చంద్రచూడ శంకర    నారాయణ  అసురాంతక మాధవ శార్ఙధర    స్మరణము యమభటులనుంచు దూరము. 4. ఉగ్రా! విషమేక్షణ కామవైరి మృత్యుంజయ    శౌరి! పీతవసన శ్రీకాంతుడ  నీలమేఘ    ఈశాన! కృత్తివసన త్రిపురారి లోకనాథ     స్మరణము యమభటులనుంచు దూరము. 5. శ్రీకంఠ  దిగంబర గౌరీపతి పినాకపాణి    శ్రీహరి  మధువైరి  శ్రీపతి పురుషోత్తమ    శ్రీమంత నాగభరణ పశుపతి చంద్రమౌళి    స్మరణము యమభటులనుంచు దూరము. 6.సర్వేశ్వర దేవదేవ త్రిపురాంతక శూలపాణి   గరు...