Posts

TVAM SOORYAM PRANAMAAMYAHAM.

Image
" త్వం సూర్యం ప్రణమామ్యహం."     ***************************  "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." వేదము.   సూర్యుడు ప్రసన్నంగా ఉదయిస్తాడు.ప్రచండముగా వెలుగుతాడు.తిరిగి ప్రసన్నముగా అస్తమిస్తాడు.ఉదయ-మధ్యాహ్న-అస్ తమయ సమయములందు సూర్య బింబము తామ్ర-అరుణ-గోరోజన వర్ణములతో విరాజిల్లుతుంటుంది.సూర్యుడు ఎప్పుడు ప్రచండముగానుండడు.ఎప్పుడు ప్రసన్నముగాను ఉండడు.క్షేత్ర-ఋతు ధరములననుసరించి సర్వమంగళములకై సౌరశక్తులను సద్వినియోగపరచుతుంటాడు ఆ ప్రత్యక్ష సాక్షి.   నమో నమః. " జపా కుసుమ సంకాశం -కాశ్యపేయం మహాద్యుతిం    తమోరి సర్వ పాపఘ్నం -ప్రణతోస్మి దివాకరం."   మాఘ శుద్ధ సప్తమి సూర్యారాధనకు ప్రసిద్ధి చెందినది.దీనిని రథ సప్తమి అని కూడా పేర్కొంటారు.పక్షములోని ఏదవ తిథి సప్తమి.స్వామిని ఆదుత్యుడు,భాస్కరుడు,రవి,మిత్రు డు,దినకరుడు,ప్రభాకరుడు అర్కుడు,సవిత్రుడు అంటు పలు నామములతో ప్రస్తుతులు చేస్తుంటారు.   సప్తవర్ణ శోభితుడు,సప్తాశ్వ వాహనుడు తన దక్షిణాయన గ్రహణము నుండి విడివడి,ఉత్తర దిక్కుగా పయనమును ప్రారంభించు శుభదినముగా "రథ సప్తమిని" పెద్దలు విశ్వసిస్తా...

pongal

Image
సంక్రాంతి శుభాకాంక్షలు ********************** పరమ పావనము పన్నెండురాశులలో పగటిదొర పరిభ్రమణము దినకరుడు మకర రాశితో జతకట్టుట మకర సంక్రమణము పనికిమాలిన వాటిపనిపట్టేయాలంటు పౌరుషము భోగి మంటలపై నునువెచ్చని సంతకమునుచేస్తున్నది భోగిపళ్ళ లోగిళ్ళుగ బోసినవ్వుల పరిణామము దిష్టిని తీసివేస్తు స్పష్టమైన ప్రేమగా సాక్షాత్కరిస్తున్నవి మా సరి ఎవరను వరికంకుల సరిగమల సంగీతము శృతి కలుపుతు హరిదాసుతో సంతోషము సాగుతోంది అదరహొ అనేలా చక్కని చక్కిలాలు-అరిశెలు-సున్నుండలు అందలమెక్కి తమను ఆస్వాదించమంటు ఆహ్వానిస్తున్నాయి అన్యాయం ఆసాంతం అదృశ్యం ఇక అంటు వీరము కోరమీసమై కోళ్ళపందాలనే యుద్ధానికి సిద్ధమౌతోంది పొంగుచున్న పొంగలితో- ముంగిట గంగిరెద్దు మేళము. రంగవల్లులు ఆ రంగనాథునితో తారంగము ఆడుతున్నవి రైతే రాజు అనే గాలిపటముతో గర్విస్తున్నది గగనము ఆశీర్వదిస్తు అన్నదాత కన్నుల్లో ఆనందమై కురుస్తోంది బడుగు రైతుల నీటికొరతను తరిమివేసేలా.

pasuram-30

Image
వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్ ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-30 అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,...

Sittam sirukale

Image
శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ పెత్తం మెయ్ త్తుణుం కులత్తిల్ పిఱందు నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు ఇత్తైపఱై కోళ్వాన్ అన్రుకాణ్ గోవిందా ఎత్తెక్కుం ఏడేడ్ పిఱవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం ఉనక్కే నామాళ్ చెయివోం మత్తైనం కామంగళ్ మాత్తు ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-29 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది పశువులు మేసిన తరువాతనే తాము భుజించెడివారైన మన గోపికను కలుపుకొనిన శ్రీ విల్లిపుత్తూరు గోపికలలో పాలు-పెరుగు-వెన్న-నెయ్యి రూపు మారిన పాలైన కొద్ది కొద్దిగ తమ మనసును దిద్దుకొనుచున్న గోపికలలో తామర పూసల మాలికలు గళమున ధరించిన వాడైన తామర నేత్రును కొలిచిన నారాయణత్వములో "వంగక్కడల్ కడైంద" మాధవ-కేశవ చింతనమైన అటు-ఇటు ఏడుతరములను కూడమంటున్న గోపికలలో పరాన్ముఖము ప్రత్యన్ముఖమగు పడతులార రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము సర్వేంద్రియములు భక్తిభావముతో నిండిపోయి, సర్వస్య శరణాగతి ప్రకటనమే గోపికలు.అటువంటి పవిత్రులు వారి ది...

AKARATRAYAMU

Image
కఱ్వైగళ్ పిన్ శెన్రుకానం శేరుందుప్బోం అఱివొన్రు మిల్లాద ఆయుక్కులత్తు ఉందన్నై ప్పిఱవి పిఱందనై పుణ్ణియం యాముడయోం కుఱైవొన్ఱు మిల్లాద గోవిందా! ఉందన్నోడు ఉఱవేల్ నమక్కు ఇంగొళిక్క ఒళియాదు అఱియాద పిళ్ళైగళోం అంబినాల్ ఉందన్నై చ్చిఱుపేరరైత్తనవుం శీఱి యరుళాగే ఇఱైవా ! నీ తారాయ్ పఱై యేలోరెంబావాయ్ ఓం నమో నారాయణాయ-28 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది నల్లనయ్య పుట్టిన గొల్ల వంశములో పుట్టినామన్న పున్నెమున్నవారైన కల్ల-కపటము తెలియని అల్లరి రేపల్లె గోపికలలో " కఱ వైగళ్ పిన్ శెన్ఱు కానం" అని అంటున్న వారైన "అంబినాల్" దూరముగానుంచుట కుదరదంటున్న గోపికలలో "గోవింద-గోపాల "అని చిన్న చిన్న పేర్లతో పిలుచుచున్న వారైన వీళ్ళా! అని చిన్న చూపు చూడకూడదంటున్న గోపికలలో "అనన్య శరణత్వం-ఉపాయత్వం-భోగత్వం" అకారత్రయమైన సర్వస్య శరణాగతినొందిన శుద్ధ సత్వ గోపికలలో రాసలీలలాడుదాము రమణులారా రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టి...

KOODARAI

Image
కూడారై వెల్లుం శీర్ గోవిందా!ఉందన్నై పాడిపఱై కొండు యాం పెరుసన్మానం నాడు పుగళం పరిశినాళ్ నన్రాగ శూడగమే తోళ్వళియే తోడై సెవిప్పువ్వే పాడగమే ఎన్రనైయ పల్కలనుం యా మణివో ఆడైయడు ప్పోం అదన్ పిన్నే పాల్ శోరు మూడనెయ్ పెయ్దు ముళంగై వళివార కూడి ఇరుందు కుళిరుందు ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-27 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది గాజులు-కడియాలు చీరెలు-సారెలుయైన శ్రీహరి దీవించుచున్న దీర్ఘ సుమంగళములో కర్ణిక చుట్టిన రేకులు కన్నని గోపికలైన పెరుమాళ్ళుకు తినిపించే పెద్ద సన్మానములో వేళ్ళసందు నంజుడున్న "భ్రాజిష్ణు: భోజనం భోక్త" యైన ఎంగిలి భోజనాల కూడారై పాశురములో చల్దులారగింప వేగ చెలులారా రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము మన గోపికకు స్వామి కరుణతో పోతన భాగవత తత్త్వము ప్రసాదింపబడి కూడారై ప్రసాద-పాశుర విశిష్టతను వివరించగలుగుతోంది. "కమలాక్షునర్చించు కరములు-కరములు" రీతిలో మనగోపికలు స్వామిని ప్రసాదించమన్నవి సౌభాగ్యములు. స్వామిని పద్మమునకు కర్ణికగా,గోపికలను చుట్టి...

SIVA TAANDAVA STUTI.

Image
     సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకు క్షమాపణ అభ్యర్థనలతో,        శివ తాండవ స్తుతి.        ********************  "ఏ వేదంబు పఠించె లూత అన్నట్లు ఏ సాహితీ విషయ పరిజ్ఞానము లేని నా దుస్సాహసమును మన్నించమని కోరుతూ,"  1.వడిన్ వడిన్ జటాటవిన్ జారి,గంగ సంప్రోక్షణంబైన స్థలిన్    ధగత్ ధగత్ గళంబునన్ సర్పదండ వీక్షణంబు వేడుకన్    డమర్ డమర్ కరంబునన్ రవంబుతో డమరుకంబు తోడుగన్    ధిమిత్ ధిమిత్ నర్తనంబు పరిభ్రమించు వరంబులన్ లీలనన్ 2. సుడుల్ సుడుల్ తిరుగుచున్నదదిగో సుర్గంగ జటాజూటములో  చమక్ చమక్ వెలుగుచున్నదదిగో వెండిపూవు శిరములో  చకిత్ చకిత్ దండనగ కందర్పుని కాల్చిన త్రినేత్రముతో  ధిమిత్ ధిమిత్ తాండవంబు సదా శివమును వర్షించుగాక. 3. ప్రభల్ ప్రభల్ చతుర్దిశల్ ప్రభల్ జిమ్ము భవాని శిరోమణితో  జ్వలిత్ జ్వలిత్ విలాసనేత్ర ప్రమోద ప్రదోష తాండవములో  తరిమి తరిమిపారద్రోలు పాపతతుల పదఘట్టనములో  తకిట తకిట తథాస్తుగ నామది నిండి తాండవించుగాక. 4.చమక్ చమక్ చంచరీక భూషణము...