Posts

ADBHUTA SIVA TANDAVAM-RAVANAKRTAM.

Image
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ******************************  1.జటాటవిగలజ్జల ప్రవాహ పావిత స్థలే.    ఇది శివతాందవము జరుగు ప్రదేశమును తెలుపు వాక్యము.ఆ స్థలము పవిత్రమైనది.ఎలా పవిత్రమైనదంటే,  జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,  గలజ్జల- పవిత్రమైన జలము,  ప్రవహించి_ ప్రవాహ  పావిత-పవిత్రమొనరించిన,స్థలే- స్థలము.  శివతాండవ వేదికను పునీతముచేయుటకై,అదవివలె జడలుగట్టిన శివశిరమునుండి జారి ప్రవహించి,గంగమ్మ నాట్యవేదికను పవిత్రమొనరించి,తరించినది. 2.గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.   స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే,  గలేవ-స్వామి మెడ  లంబ్య-చుట్టు  లంబితాం-చుట్టుకొనిన  భుజంగ-పాము  తుంగ మాలికా -పవిత్ర కంఠ హారముగా, మారినది.  స్వామి భక్తి గళమును చుట్టుకొనిన పామును సత్కార హారముగా మారునట్లు చేసినది. 3.డమడ్దమ నినాదవడ్దమర్వయం,  గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమ...

PASUPATI ASHTAKAMU

Image
పశుపతి అష్టకము ************** స్తుతించు పశుపతి, శశిపతి ,సతిపతిని స్మరించు నాగపతి, లోకపతి, జగపతిని జనార్తిహరుని చరణములు శరణమని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. నిత్యముకారు రారు తలితండ్రులు, బాంధవులు సత్యముకావు చూడు, తరలు సిరిసంపదలు మృత్యువు కబళించువీని, కాలవశములని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. చిన్న మురజను ,పెద్ద డిండిమను శివుడు మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుడని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని, శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని . చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు మణికుండలముల భుజగ హారముల రేడు నగజనాథుని దయ నరశిరో రచితుని భజింపుము భక్తితో మనుజగిరిజపతిని. యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. జాలిలేని జరామరణములకు జడియక సారహీనపు సంసార భయమును తోసివేయుచు సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని ...

NIRVANASHATKAMU

Image
శివ స్వరూపులు నా అతిపెద్ద సాహసమును మన్నించి,నన్ను ఆశీర్వదించెదరుగాక. నిర్వాణషట్కము ****************** 1. హృదయమునకు శ్వాసనందించు ప్రాణవాయువును కాను ఊపిరితిత్తులను పనిచేయించు అపాన వాయువును కాను సంకోచ వ్యాకోచ కారియైన వ్యానవాయువును కాను వాగ్రూప విలసితమైన ఉదాన వాయువును నేనుకాను జీర్ణావస్థను నిర్వహించు సమాన వాయువును కాను పంచ వాయువులు కాని నిరాకార నిరంజనమును నేను 2.త్రేణుపుగా వెలువడు గాలియైన నాగ ను నేనుగాను కనురెప్పకదలిక కారణమైన కూర్మ గాలిని గాను తుమ్ముటకు సహాయకారియైన కృకల వాయువును గాను మూసి-తెరచు హృదయ నాడుల ధనంజయ గాలిని గాను ఆవులింతలో దాగినదేవత్త దేవదత్త గాలిని గాను పంచోప వాయువులు కాని చిదానందమును నేను 3..నయన-కర్ణ-జిహ్వ-చర్మ -నాసికను నేనుకాను శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులును నేనుకాను అన్నమయ-ప్రాణమయాది పంచకోశములును రక్త-మాంస-చర్మాదులైన సప్తధాతువులను కాను నవరంధ్ర సహిత శరీరమును నేను కాను దశేంద్రియములకు అధీనుడను నేను కాను ఇంద్రియావస్థలు లేని శివస్వరూపమును నేను. 4.అరిషడ్వర్గములకు ఆకర్షితుడను నేను కాను ధర్మార్థకామమోక్షములకు అధీనుడను...

TVAM SOORYAM PRANAMAAMYAHAM.

Image
" త్వం సూర్యం ప్రణమామ్యహం."     ***************************  "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." వేదము.   సూర్యుడు ప్రసన్నంగా ఉదయిస్తాడు.ప్రచండముగా వెలుగుతాడు.తిరిగి ప్రసన్నముగా అస్తమిస్తాడు.ఉదయ-మధ్యాహ్న-అస్ తమయ సమయములందు సూర్య బింబము తామ్ర-అరుణ-గోరోజన వర్ణములతో విరాజిల్లుతుంటుంది.సూర్యుడు ఎప్పుడు ప్రచండముగానుండడు.ఎప్పుడు ప్రసన్నముగాను ఉండడు.క్షేత్ర-ఋతు ధరములననుసరించి సర్వమంగళములకై సౌరశక్తులను సద్వినియోగపరచుతుంటాడు ఆ ప్రత్యక్ష సాక్షి.   నమో నమః. " జపా కుసుమ సంకాశం -కాశ్యపేయం మహాద్యుతిం    తమోరి సర్వ పాపఘ్నం -ప్రణతోస్మి దివాకరం."   మాఘ శుద్ధ సప్తమి సూర్యారాధనకు ప్రసిద్ధి చెందినది.దీనిని రథ సప్తమి అని కూడా పేర్కొంటారు.పక్షములోని ఏదవ తిథి సప్తమి.స్వామిని ఆదుత్యుడు,భాస్కరుడు,రవి,మిత్రు డు,దినకరుడు,ప్రభాకరుడు అర్కుడు,సవిత్రుడు అంటు పలు నామములతో ప్రస్తుతులు చేస్తుంటారు.   సప్తవర్ణ శోభితుడు,సప్తాశ్వ వాహనుడు తన దక్షిణాయన గ్రహణము నుండి విడివడి,ఉత్తర దిక్కుగా పయనమును ప్రారంభించు శుభదినముగా "రథ సప్తమిని" పెద్దలు విశ్వసిస్తా...

pongal

Image
సంక్రాంతి శుభాకాంక్షలు ********************** పరమ పావనము పన్నెండురాశులలో పగటిదొర పరిభ్రమణము దినకరుడు మకర రాశితో జతకట్టుట మకర సంక్రమణము పనికిమాలిన వాటిపనిపట్టేయాలంటు పౌరుషము భోగి మంటలపై నునువెచ్చని సంతకమునుచేస్తున్నది భోగిపళ్ళ లోగిళ్ళుగ బోసినవ్వుల పరిణామము దిష్టిని తీసివేస్తు స్పష్టమైన ప్రేమగా సాక్షాత్కరిస్తున్నవి మా సరి ఎవరను వరికంకుల సరిగమల సంగీతము శృతి కలుపుతు హరిదాసుతో సంతోషము సాగుతోంది అదరహొ అనేలా చక్కని చక్కిలాలు-అరిశెలు-సున్నుండలు అందలమెక్కి తమను ఆస్వాదించమంటు ఆహ్వానిస్తున్నాయి అన్యాయం ఆసాంతం అదృశ్యం ఇక అంటు వీరము కోరమీసమై కోళ్ళపందాలనే యుద్ధానికి సిద్ధమౌతోంది పొంగుచున్న పొంగలితో- ముంగిట గంగిరెద్దు మేళము. రంగవల్లులు ఆ రంగనాథునితో తారంగము ఆడుతున్నవి రైతే రాజు అనే గాలిపటముతో గర్విస్తున్నది గగనము ఆశీర్వదిస్తు అన్నదాత కన్నుల్లో ఆనందమై కురుస్తోంది బడుగు రైతుల నీటికొరతను తరిమివేసేలా.

pasuram-30

Image
వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్ ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-30 అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,...

Sittam sirukale

Image
శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ పెత్తం మెయ్ త్తుణుం కులత్తిల్ పిఱందు నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు ఇత్తైపఱై కోళ్వాన్ అన్రుకాణ్ గోవిందా ఎత్తెక్కుం ఏడేడ్ పిఱవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం ఉనక్కే నామాళ్ చెయివోం మత్తైనం కామంగళ్ మాత్తు ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-29 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది పశువులు మేసిన తరువాతనే తాము భుజించెడివారైన మన గోపికను కలుపుకొనిన శ్రీ విల్లిపుత్తూరు గోపికలలో పాలు-పెరుగు-వెన్న-నెయ్యి రూపు మారిన పాలైన కొద్ది కొద్దిగ తమ మనసును దిద్దుకొనుచున్న గోపికలలో తామర పూసల మాలికలు గళమున ధరించిన వాడైన తామర నేత్రును కొలిచిన నారాయణత్వములో "వంగక్కడల్ కడైంద" మాధవ-కేశవ చింతనమైన అటు-ఇటు ఏడుతరములను కూడమంటున్న గోపికలలో పరాన్ముఖము ప్రత్యన్ముఖమగు పడతులార రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము సర్వేంద్రియములు భక్తిభావముతో నిండిపోయి, సర్వస్య శరణాగతి ప్రకటనమే గోపికలు.అటువంటి పవిత్రులు వారి ది...