PASUPATI ASHTAKAMU

పశుపతి అష్టకము
**************
స్తుతించు పశుపతి, శశిపతి ,సతిపతిని
స్మరించు నాగపతి, లోకపతి, జగపతిని
జనార్తిహరుని చరణములు శరణమని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

నిత్యముకారు రారు తలితండ్రులు, బాంధవులు
సత్యముకావు చూడు, తరలు సిరిసంపదలు
మృత్యువు కబళించువీని, కాలవశములని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

చిన్న మురజను ,పెద్ద డిండిమను శివుడు
మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు
ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుడని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,

శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు
కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు
శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని
.
చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు
మణికుండలముల భుజగ హారముల రేడు
నగజనాథుని దయ నరశిరో రచితుని
భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.

యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను
యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు
దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

జాలిలేని జరామరణములకు జడియక
సారహీనపు సంసార భయమును తోసివేయుచు
సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.

హరి విరించి సురాధిపులు కొలువుతీరగ
యమ కుబేర దిక్పతులు నమస్కరించుచుండ
భవరోగ భంజనుని భువనత్రయాధీశుని
భజింపుము భక్తితో మనుజ గిరిజ పతిని.

కవి సూరి ఒక మహారాజు శివ భక్తుడు అన్నవివరములే లభ్యమైనవి.
పరమపవిత్రమైన ఈ స్తోత్ర పఠనము శ్రవనము స్మరనము సకలముక్తిప్రదము.
సర్వేజనా సుఖినో భవంతు.సమస్త సమ్మంగళాని భవతు.
సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి తథ్యం.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)