Posts

PADISAKTULA PARAMAARTHAMU-BHUVANESVARI

Image
  పదిశక్తులపరమార్థము-నాల్గవశక్తి-భువనేశ్వరి.   *************************************  భువనేశ్వరి తత్త్వము గురించి క్లుప్తముగా మూడువిషయములను పరిచయము చేసుకుందాము. 1 భూగోళము-ఖగోళము    భువనము అనగా ప్రపంచము.తల్లి తనవీక్షణతో పదునాలుగు భువనములను సృష్టించినది.భూగోళమునకు సహాయకారిగా ఖగోళమును సృష్టించి,దానిని విస్తరింప చేసింది.ప్రణాళిక ప్రకారమే జరిగినది.ఈ ప్రక్రియ.గ్రహములు-గ్రహగతులు నిర్ణయింపబడినది.అదేకద రాత్రింబవళ్ళు.విచిత్రముగా ఒక రోజు గడిచినది అంటాము గాని భూమి సూర్యుని చుట్టు తిరిగినది అనము. 2.కలి-ఆకలి.    భూగోళ-ఖగోళ పరిభ్రమణము జీవులలో ఆకలినితెలియచేసినది.కరువు-కాటకముల ఇబ్బందులు తెలిశాయి.కలి తమకడుపులో లేదని మనకు తెలియచేసేది ఆకలి.కలో-గంజో అని మనము అంటుంటాము కదా.ఆకలి ని తొలగించుటకుభువనేశ్వరి శాకములను- ఫలములను-ధాన్యములను తన శరీరమునుండి ఉత్పత్తి చేసి శాకంబరి గా మారినది.కలిని కొనసాగించుటకు భూగోళము లోని వృక్షములకు-ఖగోళములోని సూర్యులకు మైత్రి కలిపి ,జలములకు మేఘములకు పొత్తు కలిపి ఆకలిదప్పులను తీర్చుచున్నది. 3.మనదేహము-మణిద్వీపము.    మనదేహములోన...

PADISAKTULA PARAMAARTHAMU-SHOEDASI

Image
  పదిశక్తుల పరమార్థము-మూడవ శక్తి-షోడశి   ****************************** *****    శైశవము-బాల్యము-కౌమారము-యవ్వనము-వార్ధక్యము ఎప్పుడు ఎలా మనకు వస్తాయో మనము గుర్తించలేమో అదేవిధముగా ఈ పదిశక్తులు ఒకేతాటిపై నడుస్తూ ఎప్పుడు తమ స్వరూప-స్వభావాలలో మార్పులను కనబరుస్తాయో తెలిసికొనుట కష్టము.   రూపవిషయమునుపరిశీలిస్తే  నలుపు నీలమై నీలము సిందూరవర్ణమవుతున్నది.స్వభావము ను పరిశీలిస్తే అతిగాంభీర్యము కొంత ఉపశమించి,గంభీరత మరికొంత ఉపశమించి క్రీడావినోదత్వముగా మారుట దేవి లీలలు. మూడవ శక్తి యైన షోడశి గొంగళిపురుగు కాలక్రమములో సీతాకోక చిలుకగా మారినట్లు మూలతత్త్వమైన కాళి స్వభావము నుండి,దానిని ఆధారము చేసుకొని ఏర్పడిన తారా తత్త్వము నుండి బ్రహ్మ విద్య తత్త్వమునుగ్రహించినప్పటికిని, తనదైన ప్రత్యేకతను చాటుతూ సుందరీయోగముగా  విశ్వమును సుందరోపేతముగా మలచినది..పూలు-పళ్ళు-పక్షులు-నె మళ్లు అన్నీ అందాలే.వాటిపై మనుషులకు మోహాలే.అందుకే షోడశి తన చేతులలో చెరుకువిల్లు-పూలబాణములు,పాశము- అంకుశము ధరించి మోహమనే పాశ0ను అంకుశముతో తెంపేస్తుంది.ఇంకెందుకు కత్తి-కత్తెర?    బా...

PADISAKTULA PARAMAARTHAMU-TAARAA SAKTI

Image
పదిశక్తుల పరమార్థము-తారాదేవి-ద్వితీయ శక్తి. ************************************** ఏకాత్మిక-నిర్మాణాత్మక చేతన శక్తియైన కాళి, తన రూప స్వభావములను కొంత మార్చుకొని,మరి కొంత చేర్చుకొని," నాలెడ్జ్ ఈజ్ ట్రాన్సిడెంటల్" అను సిధ్ధాంతమును మనకు ప్రసాదిస్తున్నది.మార్పులను పరిశీలిస్తే, 1.విస్తరణ-సహకారము మొదటిది. పరమేశ్వరి కాళి-తారా రెండు రూపములు,నలుపు-నీలపు రంగులు మొదలగునవి విస్తరణకు సూచన.శక్తి రెండు రూపాలుగా మారువిధానము మూలము నుండి వేరొక రూప కల్పనకు సహాయపడు బొడ్డుతాడును సృష్టించగల నాభీస్థానము తారాదేవి నివాసమనుట నిర్వివాదము.తాడు తల్లికి -శిశువుకు ఆధారమై రెండింటిని చూపించి వివరిస్తుందో అదే తారా తత్త్వము.కాళితత్త్వము నుండి తనకు కావలిసినది స్వీకరించు విధానము.అదియే కాళిరూపము తారాశక్తిగా విభజింపబడుట. 2.విరుధ్ధము-వివేకము రెండవ మార్పు. విస్తరణలో మనము కాళి తత్త్వములో చర్చించుకొనిన చీకటి-కాంతి,క్షణికము-శాశ్వతత్త్వము,స్థిరము-చలనము,వ్యక్తము-అవ్యక్తముల మేళవింపే కాళి-తారా శక్తులు.విరుధ్ధ భావములు,వస్తువులు రెండింటిని వంతెనయై తారాదేవి రెండింటిని చూపుతుంది.మన వివేకము మేల్కొలిపి...
Image
 ప్రియ మిత్రులారా,దేవీశరన్నవరాత్రుల శుభకామనలు.  ***************************************   తెలుగు మొదటి నక్షత్రమైన అశ్విని ని అనుసరించి, ఆశ్వయుజ-కార్తిక మాసముల శరద్రుతువును గౌరవిస్తూ ఆదిశక్తి రూపాలైన దశవిద్యా తత్త్వమును గురించి తెలుసుకొనేటందుకు చేసే ప్రయత్న్మే ఇది.మొదటి అడుగు.అమ్మ చేయి పట్టుకుని అర్థము చెప్పమని చేసే అభ్యర్థన ఇది.కనుక విజ్ఞులైన మీరు ఇందలి దోషములను సవరించుట అమ్మ సేవగా భావించి,నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ,  నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.   అమ్మ సేవలో అందమైన పరిమళ పద్యపుష్పములను సమర్పించుచున్న ప్రసాద్ నిమ్మగడ్డ ( నా తమ్ముడి ని) అభినందిస్తూ,ఆశీర్వదిస్తూ,అమ్మ కృప అనవరతము వర్షించాలని కోరుతూ,చిరంజీవి సాయి ప్రసన్న అమ్మరూపములో వచ్చి అత్యంత అమూల్యమైన సహాయ సహకారమును అందించినందులకు ఆశీర్వదిస్తూ మీముందుంచటానికి ప్రయత్నిస్తాను. శార్దూలము పాళీమ్ హార కపాలధారి రుధిరామ్ ప్రాముఖ్య మాలాన్వితాం కేళీమ్ జిహ్వ మహారుణారుచి భయక్రీడావచూడాస్ధి కం- గాళీ రాక్షస భంజనేన రణరంగాలింగనోత్సాహికామ్ కాళీమ్ కాలకలాప దంత ధవళా  కార్యానువర్తీమ్ శివమ్! భావము: కపాలముల సమ...

PADISAKTULA PARAMAARTHAMU.-KAALI.

 పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి.  ************************  ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు.కాని నా తపన అమ్మ తత్త్వములోని మీ అందరితో పంచుకోవాలనే .ఈ ప్రక్రియ ప్రణాలికకు తన అమూల్యమైన సమయమును-విజ్ఞానమును అందించిన భక్తునిపై ఆ తల్లి దయ అనవరతము వర్షించనీ.ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్ర్ర్పురుషులు ఉన్నట్లే శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాహారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా అనుకుంటు అనుగ్రహమునకు దూరమవుచున్నాము.   అర్థనారీశ్వరమైన మహాశక్తి కాళి తన సామర్థ్యముతో సామరస్యము కల్పిస్తూ,లయబధ్ధముగా ఊగిసలాడుస్తూ( కాలస్వరూపముగా)జగతిని ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపిస్తున్న కాళీతత్త్వము ఎంతగొప్పదో మనము అర్థముచేసుకుంటే మాట కరుకు-మనసు చెరుకు అన్నట్ల్కుగా కాళి తత్త్వము లోని సమభావము ( అగ్నితత్త్వముగా అన్ని వస్తువుల యందు సమభావము,కాలాతీత స్వభావము గతము తలచుకోదు-తెలియని భవిష్యత్తు ఆలోచించదు)సృష్టి-స్థితి-లయములకు ...

YAA DEVI SARVABHOOTESHU-02

   యాదేవి సర్వ భూతేషు-02    ********************   రెండవ దశమహావిద్య-తారాదేవి.   కాలికాదేవిని ఆదిమతమస్సుగా భావిస్తారని మనము చెప్పుకున్నాము.ఆ తమస్సునుండి తేజోపుంజముగా మేరుశిఖర మధ్యనుండి కాలిక సృష్టించిన జగమును సంస్కరించుటకు తేజోరేఖగా వెలువడిన తల్లి తారాదేవి.తన భక్తుడైన గణపతి ముని ఉమాసహస్ర పద్యములకు తన అంగీకారము-ఆనందమును తల్లి ఆకాశములో మెరుపు రూపముగా తెలియచేసినదని ఆర్యోక్తి.  " యాదేవి సర్వభూతేషు తేజోరూపేణ సంస్థితా." అమ్మా అనేక నమస్కారములు.   దేవతలు ధర్మసంస్థాపనకై కాళిమాతను ప్రార్థించగా తన రౌద్రరూపమును కొంతమేరకు తగ్గించుకొని(ఉపసంహరించుకొని) తారాదేవి రంగములోనికి దిగినదని భావిస్తారు.ఉదాహరణకు కత్తిని కత్తెరచేసినది.సంహరణను సవరణ గా మార్చినది. " యాదేవి సర్వభూతేషు సహన రూపేణ సంస్థితా."   కాళిక పునర్నిర్మించిన విశ్వమునకు తారాదేవి వాక్కును ప్రసాదించి సంస్కరించినది.వాక్కు పరా-పశ్యంతీ-మధ్యమా-వైఖరీ అని నాలుగు విధములుగా వర్గీకరించబడినది.మేఘగర్జన-గాలికి చెట్ల ఆకులు ఊగుతూ చేయు ధ్వనులు-పక్షుల-పశువుల అరుపులు మొదటి మూడు వర్గములకు చెందినవి.గుత్పప్రణవము శబ్...

YAA DEVI SARVABHOOTESHU-01 ( MAHAAKAALI)

Image
 యాదేవీ సర్వభూతేషు-01  ********************   దశమహావిద్యలలో కాళివిద్య మొదటిది.మహాకాళుని శక్తిగా లయకారిణిగా సంహారస్వరూపిణి అయిన కాళీవిద్య వేదములలో మంత్రరూపముగా తేజరిల్లుచున్నది.కాళి శక్తిది మంత్రశరీరము.మనవి మాంసశరీరములు.కనుక తల్లి ఘోరరూపమును,లావణ్యమును గురించి తర్కింపజాలము.అగ్ని స్వరూపిణి అయిన కాళిశక్తి నల్లని శరీరఛాయతో ప్రకటింపబడుట తల్లి లీలావిశేషము.ప్రళయానంతర ఆదిమ తమస్సుగా (కన్యారాశితో) జ్యోతిష్కులు పోలుస్తారు.  అధర్వణ వేద ప్రకారము దక్షిణాచార-వామాచార (తాంత్రిక) పూజావిధానములు శాంప్రదాయములు ప్రాంతీయ పరంపరా భేదములే కాని,పరమేశ్వరికి ప్రీతిపాత్రములు కాదనలేము.అంతర్యాగ-బహిర్యాగ విధానము కూడా అంతే.ఇది సరి అని ఇదమిథ్థముగా చెప్పలేము.నియమ నిష్ఠలతో,అకుంఠిత విశ్వాసముతో చేయు ఏ పూజావిధానమైనను.ఆచరణీయమే.అనుగ్రహ పాత్రమే.  అస్సాంలోని కామాఖ్యలో వెలిసిన కాళినుండి వరంగల్లు భద్రకాళి వరకు అన్నె అమ్మరూపాలే.   కఠినరూపము-కారుణ్య స్వభాముల మేళవింపు కాళి తల్లి.  అంధకారములో సమస్తమైన ఆకారాలు సమానముగ అయిపోయి గుప్తస్థితిని పొందుతాయి. ఈ గుప్త తత్త్వమే కాళిదసమహావిద్య." యాదేవి...