Posts

30

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-30   **********************  భగవంతునిది హిమగిరి-భగవదంశది మహిమగిరి.   " బ్రహ్మాండ వ్యాప్తదేహ భసితహిమరుచా భాసమానా భుజంగైః     కంఠేకాలాః కప్ర్దా కలిత శశికలాశ్చండ కోదంద హస్తాః     త్రక్య్షా  రుద్రాక్షమాలా స లలిత వపుషః శాంభవా "మూర్తిభేదాః     రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా " నః ప్రయచ్చంతి సౌఖ్యం."  " ఓం కైలాసవాసినే నమః."    " కేళీనాం సమూహం కైలం-కైలస్య ఆవాసం కైలాసం."     సర్వాంతర్యామి  యైన స్వామి నివాసము చర్మచక్షువులకు హిమగిరి పర్వతశ్రేణులలోని కైలాసగిరి.ఇది స్వామి విభూతిమహిమ.కొంచము నిశితంగా పరిశీలిస్తే కైలాసము అను స్వామి నివాసమును ఇసుమంతయును దుఃఖ స్పర్శలేని పరమానందధామము.సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను పరమప్రీతితో పరమేశుడు ఎక్కడుండి తాను చేయునో అదియే కైలాసము.పార్వతీ-పరమేశ్వరుల పవిత్ర దర్శన ప్రసారమే అదే ప్రసాదమే కైలాసము.  " నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."   భక్తరక్షణకై కైలాస పర్వతమున ఉమామహేశ్వరునిగా స్థిరముగానున్నర...

MARGABANDHUVU

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-29  ***********************  భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే *******************************************  " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః."   లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు.  జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు.  ఆదిశంకరులే మనలను  ఆధ్యాత్మికామార్గమున నడిపించదలచి,అమూల్యమైన వరప్రసాదముగా శంకరునిగా,   శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలో,ఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని ,అంతా ఒకటే  అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు.   " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ." " న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు...

ADIYOGI.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-27   *************************   " సహస్ర సహస్రాది సంవత్సర పూర్వం     నరజ్ఞాన ఉధ్ధరణాయ సమర్పితం     ఆదియోగి నాద్యం సప్తర్షిభ్యో బోధితం     అతి శ్రేష్ఠం ఇదం విశాలం విజ్ఞానం     ఆదియోగి ప్రణమామ్యహం  ఆదియోగి నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర.   భగవంతుడు ఆదియోగి-భక్తుడు ఋషభ యును యోగియే.  " యోగేశ్వరాయ మహాదేవాయ-త్రయంబకాయ త్రిపురాంతకాయ    త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ    సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.'  "యుజ్" అనగా కలయిక.యుజనే సన్స్కృత ధాతువు నుండి యోగ/యోగము అను పదము ఏర్పడినది.యోగమనగా మన ఇంద్రియములను వశపరచుకుని,చిత్తమును ఈశ్వరుని యందు లయము చేయు ప్రక్రియ.జీవాత్మ పరమాత్మను తెలిసికొనుట.అభేదమును గుర్తించ గలుగుట ఈశ్వరానుగ్రహమను యోగము.    జ్ఞాన సృంగ వృషభారూఢా ప్రచండం విశ్వేశ్వరం    జటాజూటం భస్మాంగం ఆదియోగినం ప్రణమామ్యహం.    మానవమేథస్సు నిద్రాణమై యున్న సమయమున జనులు ఒక వింత విషయమును గురించి ముచ...

basava

Image
సకలదేవతా శివస్తుతి నః ప్రయచ్చంతి సౌఖ్యం.  ***********************  భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు.  " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః."   ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు.   ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత? నిర్హేతుక కృపయే నీ నిస్తుల నామవైభవముగా మారుచున్నవేళ,సదాశివుడు మనకొక అద్భుత లీలను వివరిస్తున్నాడు.   క్షీరసాగర మథనములో చీకటి వెలుగుల చిద్విలాసముగా పసందైన వస్తువులు ప్రభవించిన తరువాత ప్రళయాగ్ని తానుగా ప్రభవించినహాలాహలము సకలదేవతలను కిం కర్తవ్యం? అను సందిగ్ధములో పడవేసినది.ఆర్త్రత్రాణ పరాయణుని ఆరాధనను చేయించినది.అద్భుతముకదా ఆ విభూతి పూతలవాని చేతలు.   **************** 1. దేవదేవ త్రినేత్రాయ - శరణు శరణు మహేశ్వర    జటామకుట కపర్ది - శరణు శరణు మహేశ్వర 2.భూత భేతాళ నాథాయ - శరణు శరణు మహేశ్వర   రక్త...

falasritu.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-ఫలశృతి-శివోహం.   ************************************  " గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర    త్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే    దహనున్ కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవచే    సి,హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వరా!   అని పలికిన మహాకవి ధూర్జటి వాకు శివ శాసనము.   ఎల్లవేళలా సర్వజీవులకు శివమును-శుభమును కలిగించే స్వభావము కలవాడు శివుడు.జ్యోతిర్మయ శివలింగము ఏకము-అనేకము రెండును తానై విశ్వములోని విశ్వేశ్వరత్వమును మనకు ద్యోతకమగునట్లు చేయుచున్నది.ఈశ్వరేతరము సృష్టిలో లేదను విషయమును తెలిసికొనుటయే ఈశ్వరానుగ్రహము.   "అడుగడుగున గుడి ఉంది-అందరిలో గుడి ఉంది    ఆ గుడిలో దీపముంది-అదియే దైవం."    ఎంత అర్థవంతమైన పాట.  " విశ్వేభ్యో-విశ్వపతిభ్య్శ్చవో నమో నమః."   శివానుగ్రహమును తెలిసికొనుటకు ప్రయత్నించే ముందు మనము శివశబ్దము యొక్క గొప్పతనమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము .  నమో శ్రుతాయచ-శ్రుత సారాయచ."  శివ శబ్దముచేత శి...

meedushulu.

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-17   ****************************  భగవంతుడు- భక్తుడు మీడుష్టులే    సంపదలను వర్షించువారే.  "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"  మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.   " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.   కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం. " ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్."  కుబెరుని అసలుపేరు వైశ్రవణుడు.యక్షులకు రాజు.రావణునిచే ఓడింపబడిన వాడు.  కు అనగా వక్రము/వంకర.బాహ్యములో ఇతడు వంకర శరీరముకల వికారస్వరూపుడు బేరము అను పదమును శరీరమునకు అన్వయించుకుంటే.ఒకవిధముగా కుబ్జ వలె సరైన శరీరసౌష్ఠవము లేవి వికారరూపుడైనప్పటికిని విశ్వేశ్వర కృపాపాత్రుడు.గుణనిధి జన్మపరంపరలలో కుబేరునిది ఒకటి అని పెద్దల అభిప్రాయము.   జన్మతః లభించిన జంగమదేవ...

CHETTU

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-24      *******************************   " ఊర్థ్వమూలం అథః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం     ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స దేదవిత్."      ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా,బ్రహ్మయే ముఖ్య శాఖలుగా,వేదములే పర్ణములుగా గల ఈ సంసారరూప అశ్వస్థవృక్షమునకు నమస్కారములు.దానిని మూలసహితముగా తెలిసికొన్నవారికి నమస్కారములు.  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.   ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."    నింగి-నేలలను అనుసంధించే పరమేశ్వరుని అద్భుత ఆవిష్కరణలు వృక్షములు.చేతనాచేతనత్వములను భగవత్ప్రసాదములుగా కలిగినవి.కాండం అచతనమై-పై భాభాగములు చేతనత్వముతో చల్లని ప్రాణవాయువును అందించుచు పరమేశ్వర ప్రతి రూపములు.  సింధునాగరికతయు వృక్షపూజను నిర్వహించినదని,నాటి నుండి వృక్షములలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత పరిశోధకులు కాదనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నది.    జమ్మిచెట్టు,మారేడు చెట్టు,తెల్ల మద్దిచెట్టు,నేరేడు చెట్టు,ప్రత్యేకముగా ఉసిరి చెట్టు దైవస్వరూపములుగా ఆరాధనలనందుకుంటున్నాయి.     వృక్ష...