Posts

TAPASYA MASAMU-PARJANYA

Image
  తపస్య మాస పాలనకై వర్షకారకుడైన ఆదిత్యుడు పర్జన్యుడు తన వృష్టి సర్జన కిరన ప్రసరనకు పయనమౌతున్న సమయమున భరద్వాజ ముని వేదపారాయణతో సుసంపన్నము చేస్తున్నాడు.సేనాజిత్ అప్సరస తన నాత్యముతో,విశ్వ గంధర్వుడు తన గానముతో విశ్వమును విలక్షణము చేస్తున్నాడు.ఐరావత సర్పము రథ పగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.రీతు అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తున్నాడు.వర్స రాక్షసుడు రథము వెనుక నిలబడి,రథమును ముందుకు జరుపుతుండగా అపాం మిత్రుడు పర్జన్య నామధారియై ప్రాణికోటికి జలమును అందించుటకు తన కిరణములను జరుపుచున్నాడు.   తం పర్జన్య ప్రణమామ్యహం.

TAPAS MASA-PUSHA

Image
 " పుష్ణాతి ఇతి పూషా". తన కిరణ శక్తులచే సర్వ జగములను పోషించువాడు పూషా నామధేయ ఆదిత్యుడు.మధ్యాహ్న సమయమును అధిష్టించియున్న సౌరశక్తి.గౌత ముని వేదపారాయణతో శుభారంభమునుచేయుచుండగా తపస్ మాస నిర్వహణకు తరలుచున్నాడు స్వామి.ఘృతాచి అప్సరస ఆనందముతో అడుగులు కదుపుచుండగా,సుసేన గంధర్వుడు గానమును ప్రారంభించాడు.ధనంజయ సర్పము రథ పగ్గములను పరిశీలించి,పటిష్టము చేయుచుండగా సురుచి అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేయుచున్నాడు.వాల రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా జగత్ పోషణకు జగన్నాథుడు తన కిరణములను జరుపుచున్నాడు.    తం పూషా ప్రణమామ్యహం.

SAHASYA MASA-BHAGA

Image
 సహస్యమాసము-భగ  *******************  " భర్జతీతి ఇతి భర్గ" భగ నామ ఆదిత్యుడు సహస్య మాసమునకు ప్రభువు.భ అనగా తేజము.గ అనగా గమనము.తేజోవంతమైన తన గమనముతో(కిరణ శక్తులతో) సమస్త అజ్ఞానమును భర్జింపచేసే మహాతేజస్సు.ఆయుర్ముని వేదపఠనమును ప్రారంభిస్తూ స్వామికి లాంఛనముగా మార్గమును చూపించుటకు సిధ్ధముగా నున్నాడు.పూర్వసిత్తి అను అప్సరస అభినయ నాట్యముతో స్వామిని సేవించుచున్నది.అపూర్వముగా అరిష్టనేమి అను గంధర్వుడు తన గళమును సవరించుచు,మాసమును మంగళప్రదమొనరించుచున్నాడు.కర్కోటక సర్పము రథపగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు పటిష్టము చేయుచున్నాడు.యక్షుడు ఊమ సప్తాశ్వములను రథమునకు అనుసంధానము చేస్తూ,ఆనందోత్సాహుడైనాడు.స్పూర్జ రాక్షసుడు రథము వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా సకల లోకములను తన కిరణ ప్రకాశముతో జ్ఞాన వంతము చేయుటకు సన్నధ్ధుడైనాడు స్వామి..     తం భగః ప్రణమామ్యహం.

SAHAS MASAMU-AMSUMAAN

Image
 " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" లోపల బయట సౌరశక్తిపరముగా వ్యాపించి తన కిరణములద్వారా చైతన్యమయము చేయగల పరంజ్యోతి అంశుమాన్ సహస్ మాస  సంరక్షణకు సన్నధ్ధుడగుచుండగా,పశ్యక (రక్షణ0స్వభావి కశ్యప మహాముని వేదోక్త ప్రారంభమునకు ఆయుత్తుడగుచున్నాడు.ఉర్విని మనోహర మధుకలశముగా మార్చవలెనన్న ఊహకలిగిన ఊర్వశి తన అదుఘులను అతిమనోహరముగా కదుపుచుండగా,ఋతుకర్తను కీర్తిస్తూ ఋతసేన నామ గంధర్వుడు తన గళమును కలుపసాగాడు.యక్షుడు తర్క్య సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,ఆనందోలాసుడైనాడు.మహాశంఖ సర్పము రథ పగ్గములను పరిశీలిస్తూ,పటిష్టము చేస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు.విద్యుత్చ్చాత్రు రథమును ముందుకు జరుపుటకు ఉద్యమించుచుండగా,ప్రశంసాపాత్రుడు అంశుమాన్ తన కిరణములను ప్రసరించుటకు సన్నధ్ధుడనాడు.  తం అంశుమాన్ ప్రణమామ్యహం.

URJAMASAMU-VSHNU

Image
 "విష్ణుం జ్ష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం."  ఉర్జ్య మాస రంరక్షకినిగా ఉద్యమిస్తున్న "ఆదిత్యానాం అహం విష్ణుః" కు అనేక కోటి నమస్కారములు. యాని నామాని గౌణాని అంటూ,విశ్వ శ్రేయస్సుకై విశ్వామిత్ర మహాముని వేదోచ్చారణమును ప్రారంభించాడు.శుభారంభముగా రంభ యను అప్సరస నాట్యమును ప్రారంభిస్తుంటే,గంధర్వ సూర్యవర్చ గానామృత గమకములతో గణుతిస్తున్నాడు.అశ్వత సర్పము పగ్గములను పరిశీలిస్తున్నాడు.యక్షుడు  సత్యజిత్ సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,అర్చించుకుంటున్నాడు.మఖపేత రాక్షసుడు స్వామి రథమును వెనుకనుండి జరుపుతూ,జగత్కళ్యానమును కోరుతుండగా వ్యాపకత్వ-అసుర సంహార లక్షనములతో స్వామి కదులుచున్నాడు.  " తం విష్ణుం ప్రణమామ్యహం."

ISHA MASAMTVASHTA.

Image
 " తనూ కరోతి ఇతి త్వష్టా" సృష్టి లోని ప్రతి పదార్థమునకు ఒక నిర్దిష్ట రూపమును కలిగించేవాడు.  "రూపము రూపం బహురూపం బభూవ" జగత్తులోని రూపములు ప్రకటింపబడటానికి,వాని గుర్తించగలగడానికి త్వష్ట యే కారణము.  స్వామి ఈష మాసమున వృక్ష నివాసము చేస్తూ,త్వష్ట నామధేయముతో పరిరక్షిస్తుంటాడు.పెద్దలు త్వష్ట అను నామమునకు మలుచువాడు/తొలుచువాడు అని సమన్వయిస్తారు.మనకు కావలిసిన హరితమును సంభరితము చేస్తూ,ఆహారమునకు కావలిసినవి ఉంచుతూ,కలుపులను తుంచుతూ హరితవాసము చేస్తాడు స్వామి."ఈశావాస్యం ఇదం సర్వం" అన్న సూక్తిని అనుభవైవేద్యము చేస్తాడు.ఆ స్వామికి జమదగ్ని మహాముని వేదసూక్తులతో మోదమునందిస్తుంటాడు.అప్సరస తిలోత్తమ్మ అనుపమాన నాట్యముతో పూజ్స్తుంటుంది.నృత్యం సమర్పయామి అంటూ.దానికి తోడుగా ధృతరాష్ట్రుడను గంధర్వుడు తన భుజబలముతో స్వామి యానగా అవనీతలమును కాపాడుతూ,ఆనందగానము చేస్తుంటాడు.కంబలాశ్వ సర్పము రథపగ్గములను పటిష్టపరుస్తుంటే,యక్షుడు శతాజిత్ తాళ్ళను మెలివేస్తూ,తరలుతున్న గమనశక్తికి గమకము అద్దుతున్నాడు.బ్రహ్మపేత రాక్షసుడు బ్రహ్మాండాధిపతి రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా,జగములకు తన కరుణ...

NABHASYA-VISVAVASU

Image
వ్యాపక లక్షణము కల పరంజ్యోతి వివస్వన్ నామధారియై విశ్వపాలనకు ఉపక్రమించుచున్న శుభతరుణమున భృగుమహాముని వేదపారాయణమునను మోదముతో ప్రారంభించి,స్వామి రథమునకులాంఛన ప్రాయముగా మార్గమును చూపించుటకు సన్నధ్ధుడగుచున్నాడు.అగ్నితత్త్వధారియైన ఆ పరమాత్మను ప్రస్తుతిస్తు అనుంలోచ అను అప్సరస అడుగులు కదపసాగగానే,ఉగ్రసేనుడను గంధర్వుడు ఉత్సాహముతో గానమును ప్రారంభించాడు.శంఖపాలుడను సర్పము పగ్గములను పరిశీలించి పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు అశరణుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తూ గమనశక్తిని గమనిస్తున్నాడు.వ్యాఘ్రనామ రాక్షసుడు రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా నభస్య మాస వైభవమును అందీయుటకు వివస్వంతుడు వెడలుచున్నాడు.     తం వివస్వన్ ప్రణమామ్యహం.