Posts

OM NAMA SIVAYA-17

Image
 ఓం నమ: శివాయ-17 ********************** కంటిచూపు ఉన్నది కాల్చుటకు అని నిన్ను చూసి కాబోలు లంక చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆ హనుమ ఆలి ఉన్నది అగ్గిలో దూకించుటకే అని నిన్ను చూసి కాబోలు అయోనిజను కోరె అగ్గి పరీక్ష ఆ రాముడు అసత్యాల పుర్రెను ఆదరించిన నిన్ను చూసి కాబోలు అవలీలగ పలికాడు అసత్యమును ఆ ధర్మరాజు అడగకుండ వరమిచ్చే అలవాటుని నిన్ను చూసి కాబోలు అంతటి వ్యధను పొందాడు ఆ దశరథ మహా రాజు పొగడ్తలకు పొంగిపోవు నిన్ను చూసి కాబోలు కౌరవులకు అపాత్ర ఆదరణను ఇచ్చె ఆ బలరాముడు ఒక్కొక్కరు చేస్తున్న ఈ నికృష్టపు పనులన్నీ నిక్కచ్చిగ నీవిరా ఓ తిక్క శంకరా.   శివుడు కంటితో మన్మధుని కాల్చినాడని అదిచూసి హనుమంతుని లంకా దహనము,శివ పత్ని సతిదక్ష యజ్ఞ వాటికలో అగ్గిలో దూకుట చూసి శ్రీ రాముని సీత అగ్ని పరీక్ష,పరబ్రహ్మ మూలమును చూసానని అబద్ధము చెప్పిన బ్రహ్మ తలను ధరించి గౌరవించుటచే ధర్మ రాజు అశ్వథ్థామ హత: కుంజర: అని అబద్ధము చెప్పుట,శివుడు వరములను సద్వినియోగ పరచుట తెలియని వారికి వరములు ఇచ్చి కష్టములు తెచ్చుకొనుట చూసి,దశరథుడు తాను అదేపని చేసి...

OM NAMA SIVAAYA --16

Image
ఓం నమ: శివాయ-16 ******************* సూక్ష్మము నేనంటావు స్థూలముగా ఉంటావు వీరుడినని అంటావు పారిపోతు ఉంటావు ఆది నేను అంటావు అనాదిగా ఉంటావు సన్యాసిని అంటావు సంసారిగ ఉంటావు పంట భూమినంటావు బీడునేలవవుతావు జలాశయమునంటావు ఒయాసిస్సువవుతావు రాజుని నేనంటావు బంటుగా మారుతావు ప్రణవము నేనంటావు ప్రళయముగా మారుతావు స్థాణువు నేనంటావు తాండవమాడుతుంటావు అనుక్షణము సాగుతావు ఆరునెలలు దాగుతావు దాగుడుమూతలు చాలుర కుదురు లేకుంటేను వెక్కిరింతలేనురా ఓ తిక్క శంకరా. శివుడు చెప్పేది ఒకటి,చేసేది మరొకటి.విరుద్ధ స్వభావములు కలవాడు-నింద.  "కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే" రుద్రచమకము.  రుద్రా నీవు మా కొరకు దున్నిన పంటభూములయందు-దున్నని బీడు నేలల యందుండి మాకు కూడును-గూడును సమకూర్చి,మా ఆధ్యాత్మిక సాధనను సమర్థవంతము-సఫలీకృతము చేస్తున్నావు తండ్రీ అని స్తుతిస్తున్నది.- సర్వాంతర్యామి,సర్వ జగద్రక్షకుడు శివుడు అన్నీ తానుగా మారి మనలను,వాటిని రక్షించుచున్నాడు.స్తుతి.

OM NAMA SIVAAYA-15

Image
    ఓం నమః శివాయ-15   *****************   తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు   గలగల ప్రవహించనీయని గడుసువాడవని గంగ   చరచర పాకనీయవని చతురుడవని కాళము   పరుగులుతీయనీయవని పాశమున్నదని లేడి   క్రిందకు జారనీయవని నిందిస్తున్నది విషము   జరుగలేక  ఉన్నానని వంతపాడు జాబిలి   కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు   హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము   ఆ లయకారుడు ఆలయమున ఉంటాడా? అంటూ   మేమెంతో గొప్పవారలమని వంతులవారీగ   నీ చెంతనే ఉంటూ,కాని చింతలను చేస్తుంటే,వాటి   పక్కదారి మార్చవేర ఓ తిక్క శంకరా.     శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.(స్వేచ్చగా)పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.చంద్రుని కదలనీయడు.విషమును కంఠము జారనీయడు.ఎద్దును రంకెలు వేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వాటినేమిచేయలేడు-నింద.   రుద్ర చమకములో చెప్పినట్లు "యంతాయచ-ధర్తాయచ" ఎక్కడ-ఏవస్తువులు ఎలా ఉండాలో వాటి స్థానమును-స్వభావమును నియంత్రించి-పోషించగల ఆచార్యుడు శివుడు.-స్తుతి.   ఏకబిల్వం శివా...

OM NAMA SIVAYA-14

Image
   ఓం నమః శివాయ-14    ****************   కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములను   అరిషడ్వర్గముల చేతిలో ఆటబొమ్మవైనావు   నీవు ఆదిదేవుడవనుటకు ఏదిరా ఋజువు?శివా   ఆహా! నీ కామము మోహినిని తల్లిగా చేసినది   అయ్యో! నీ కోపము కాముని కాల్చివేసినది   అమ్మో నీ లోభము చల్లదనపు ముల్లైంది   ఔరా! నీ మోహము భృంగిని అవమానపరచినది   అదిగో! నీ మదము సతీవియోగమునుచేసినది   అబ్బో! నీ మత్సరము సుతుని సంహరించినది   భద్రతను కలిగించే ఆ రుద్రుడివే నీవైతే   శుభముల ప్రతిరూపమగు ఆ శంభుడవునీవైతే   నీ లెక్కలు తెలుపరా ఓ తిక్క శంకరా.   శివుడు కామముతో మోహిని వెంటపడ్డాడు.కోపమూనకు అధీనుడై మన్మథుని కాల్చివేసాడు.లోభముతో చల్లదనముతో తనను బాధించుచున్నను,మంచు-గంగ-పాములు-గజచర్మము-హిమజనూ వదలేక చలితో వణూకుతు ఉంటాడు కాని వాటిని విడిచిపెట్టడు.పత్నీవ్యామోహితుడై విచ్చేసిన భృంగి మహామునిని స్వాగతించి,సపర్యలు చేయలేదు.నా అంతటి వాడికి దక్షయజ్ఞ ఆహ్వానము లేదన్న మదముతో సతిదేవితో దక్షయజ్ఞమునకు వెళ్ళలేదు.కైలసములో తనను అడ్దగించగలుగు మరోవ్యక్తిని చూస...

OM NAMA SIVAYA-13

Image
శివాయ అమ్మ గర్భశిశువు వలె,అలలలోని జలము వలె పాప నోటి పంటి వలె,పాలలోని వెన్న వలె చేనులోని పంట వలె,మేనులోని మేధ వలె భూమిలోని నీటి వలె,భూరుహుముల పండు వలె ఆయువగు గాలివలె సాయమగు జాలివలె వ్యక్తమవని శక్తివలె,వ్యక్తి లోని యుక్తి వలె కొయ్యలోని బొగ్గు వలె,కొమ్మలోని పువ్వు వలె సూక్ష్మమైన స్థూలము వలె,స్థూలములోని సూక్ష్మము వలె స్థాణువున చలనము వలె,సాధించిన సంకల్పము వలె గుడ్డులోని పిట్ట వలె,విడ్దూరపు భూభ్రమణము వలె విత్తులోని చెట్టు వలె,చిత్తులోని పట్టు వలె నిక్కి నిక్కి చూస్తావురా ఓ తిక్క శంకరా ................................................................ శివుడు పిరికితనముతో తల్లిగర్భములో,అలలఓ,పాలలో,పాపనోటిలో,భూమిలో,విత్తులో,చెట్టులో,కొమ్మలో,గుడ్డులో,చిత్తులో దాని ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని తొంగితొంగి చూస్తుంటాడు--నింద. " వ్యక్తావ్యక్త స్వరూపాయ వామదేవాయ తేనమః". వామదేవ నామియైన శివుడు సకలచరాచరసృష్టి విధానమునకునియామకుడై,ఒక నిర్ణీతక్రమములో నడిపిస్తు మనలను అనుగ్రహించుగాక.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం. ...

OM NAMA SIVAYA-12

Image
ఓం నమ: శివాయ -12 **************** చేతులార పూజసేయ చెంతకు రావాలంటే చెట్టువు కమ్మంటావని చెప్పలేని భయం కనులారా దర్శించి కొలవాలనుకుంటేను కుక్కవు కమ్మంటావని ఎక్కడో భయం పాహి పాహి అంటూ పాదములు పట్టుకోవాలంటే పాముగ మారమంటావని పాపిష్ఠి భయం తోడుగ ఉండమని వేడుకోవాలంటేను కోడివి కమ్మంటావని నీడలా ఏదో భయం హరహర మహదేవుడని వరముకోరుకోవాలనుకుంటే శరభము కమ్మంటావని నరనరములలో భయం అభయము అడగాలంటే అడుగడుగున భయము నాకు బిక్కుబిక్కునున్నానురా ఓ తిక్క శంకరా.     భక్తుడు పూజలు చేయుటకు శివుని సమీపించాలంటే మద్ది చెట్టుగానో,కుక్కగానో,పాముగానో,కోడిగానో,శరభము గానో (పక్షి శరీరము-సింహపుతల)శివుడు మారి పొమ్మంటాడని,భయమని నింద. 1.శ్రీశైలములో శివుడు తెల్ల మద్ది చెట్టు రూపములో (మల్లికార్జున స్వామిగా భక్తుల పూజలను,ప్రదక్షిణములను అందుకుంటు,అనుగ్రహిస్తున్నాడని,(చెట్టు నేపథ్యము) 2.కాశిలో ( నేపాలు,ఉజ్జయిని మొదలగు ప్రదేశములలో) శివుని గోటి నుండి జనించి,నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా అనుసరించుచుండగా,బ్రహ్మ రాక్షసుల పీడ (మన మనసుకు పట్టిన పీడ) తొలగిం...

OM NAMA SIVAAYA-11

Image
పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా. ........................................................................................................................................... ..................................నక్కతోక తొక్కటం మీద అనేక కథలు ఉన్నప్పటికి వాటి సారాంశము ఒక్కటే.కష్టపడకుండా అదృష్టముతో చాకచక్యముగా ఐశ్వర్యవంతులుగా మారటం.శివుడు ఎవరిని అడగకుండా,ఏమి కష్టపడకుండా ఇన్ని విధములైన ఇంతమంది భక్తులను పొంది ఐశ్వర్యవంతుడైనాడని నింద.ఈశ్వరుడు అను పేరులోనే ఐశ్వర్యము కలవాడు అని మనకు తెలుస్తోంది.పరమేశ్వరుడు భ...