Posts

OM NAMA SIVAAYA-75

Image
  ఓం నమః శివాయ-75   *******************  అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే  బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని  సరస్వతి చేరింది బృహస్పతిని చూసి  వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని  భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని  గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని  అవకాశము ఇది అని ఆకాశము చేరింది  ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని  పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే  పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే  స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది  నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా.  వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును  అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద.  యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ  కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం న...

OM NAMA SIVAAYA-74

Image
  ఓం నమః శివాయ-74   ***************  వెండికొండ దేవుడవని వెండికొరకు నే వస్తే  దండిగా ఉన్న మంచు వెండివెండి నవ్వింది  మేరుకొండ విల్లుందని మేరువుకై నేవస్తే  చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది  రాగిజటాజూటమని రాగికొరకు నేవస్తే  విరాగియైన జట మరీ విచిత్రముగా నవ్వింది  నీలలోహితుడవని ఇనుముకొరకు నేవస్తే  చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది  కుబేరుడు ముందున్నాడని ధనమునకై నేవస్తే  చేతులు కట్టుకున్నానని చేతకాక నవ్వాడు   ఎండమావులను నీళ్ళనుకుని కుండపట్టుకు వచ్చిన,    నా ఎక్కిళ్ళని ఆపవేర ఓ తిక్కశంకరా. ' రుద్రచమకములో శివుడు "హిరణ్యంచమే-సీసంచమే-త్రపుశ్చమే-శ్యామంచమే-లోహంచే ' అన్ని లోహములను పొందినవాడును-అనుగ్రహించగలిగిన వాడును అని చెప్పుకున్నాడని,భక్తుడు వాటికొరకు శివుని సమీపించి,ఘోరముగా పరాభవింపబడినను శివుడు చేతకాని వాడిలా కదలక మెదలక ఉన్నాడు.-నింద.   పసిడి నమః శివాయ-వెండి నమః శివాయ   రాగి నమః శివాయ -సీసము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.   రుద్రనమక-చమకముల అంతరార్థము అర్...

OM NAMA SIVAAYA-73

Image
  ఓం నమః శివాయ-73   ******************  నీకన్న నీగుడులు నిరతము కిక్కిరిసి పోతుండగ  నీకన్న నీ బసవని అనయము కొనియాడుతుండగ  నీకన్న నీసిగశశి చాంద్రమానమగుచుండగ  నీకన్న నీజటలో గంగ నీరాజనములను పొందుచుండ  నీకన్న నీ కృత్తిక నిఖిలకీర్తినొందుచుండ  నీకన్న నీనామము నలుదెసల నర్తించుచుండ  నీకన్న నీ పరివారము ప్రస్తుతింపబడుచుండగ  నీకన్న నీభక్తుల కథలు మారుమ్రోగుచుండగ  నీకన్న నీ భోళాతనమే వేళాకోళమగుచుండగ నువు చూసి-చూడనట్లుగా-తెలిసి తెలియనట్లుగా  పోనీలే అంటుంటే-కానీలే అని మిన్నకుంటే  తొక్కేస్తారుర నిన్ను ఓ తిక్క శంకరా  శివుని కన్న శివుని గుడులు-బసవడు-చంద్రుడు-గంగ-కృత్తిక-నామము-ప్రమథగణములు-పరివారము మిక్కిలి ప్రశస్తిని గాంచినవి కాని శివుడు మాత్రము కిమ్మనకుండా ముక్కుమూసుకొని జపము చేస్తూ కూర్చుంటాడు కాని తన వైభవమును ప్రదర్శించుటకు సిధ్ధముకాడు-నింద.  చంద్రుడు నమః శివాయ-బసవడు నమః శివాయ  కృత్తిక నమః శివాయ-కృత్యము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.   " నిత్యానంద రసాలయం సురమునిస్వాంతా...

OM NAMA SIVAAYA-72

Image
  ఓం నమః శివాయ-66   **********  నీ రూపము చూపించే కన్ను కన్నుమిన్నుకానకుంది  మళ్ళీ చూప్[ఇంచమంటే మళ్లను నేను అంటున్నది  నీ నామము వినిపించే చెవి చెవిటివాడనని అంటోంది  మళ్లీ వినిపించమంటే శంఖమూదరని అంటున్నది  నీ నామము పలికించే వాక్కు నన్ను సన్నగా నొక్కుతోంది  మళ్ళీ పలికించమంటే కిక్కిరుమనకు అంటున్నది  నీ చుట్టు తిరుగుకాలు నాపై ఒంటికాలిపై లేస్తున్నది  మళ్ళీ తిరుగుదామంటే పనిలేదా అంటున్నది  నీ చెంత వంగు తల నన్ను అతలాకుతలము చేస్తున్నది  మళ్ళీ వంగమన్నానని అవతలకు పొమ్మని అంటున్నది  శివునికేమి చేయాలని చీకాకుపెడుతున్న వాని  కొక్కిరాయి పనులను ఆపవేర ఓ తిక్కశంకరా.  శివుడు సర్వము తన కనుసన్నలలోనే నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటాడు కాని భక్టుడు తన ఇంద్రియములు తన మాట వినటములేదని మొరపెట్టుకుంటున్నా ,వాటిని మందలించి,సరిచేయలేని అసమర్థుడు-నింద.   కన్ను నమః శివాయ-కనుసన్న నమః శివాయ   కరుణ నమః శివాయ-కైవల్యము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.  " మనస్తే పాదాబ్జే నివసతుః వచః స్...

OM NAMA SIVAAYA-71

  ఓం నమః శివాయ-71   ********************  నిను గుర్తించిన శ్రీ-కరి-కాళములకు గుడినే కట్టించావు  గుడిగోపురమును చూసిన పాపనాశనము అన్నావు  గుడ్డితనమును పోగొట్టి చూపునిస్తుంటావు  గురువుగా మారి వారిని తరియింపచేస్తావు  గుడిలో కూర్చుని గురుతర పూజలందుకుంటావు  గుహుని తండ్రివి వారి అహమును తొలగిస్తావు  గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింప చేస్తావు  గుణనిధిని కరుణించిగుండెలో దాచుకుంటావు  గుచ్చిన బాణమును చూపి పాశుపతమునిచ్చావు  గుర్తించని వారికి భక్తిగుళికలు అందిస్తావు  గుక్కతిప్పుకోకుండా ఎక్కిఎక్కి ఏద్చునన్ను,నీ  అక్కున చేర్చుకోవేమిరా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA--70

Image
  ఓం నమః శివాయ-70   ********************   ఎత్తైన కొండలలో భోగనందీశ్వరుడనని అంటావు   చేరలేనంత ఎత్తులో చార్ధాంలో ఉంటావు   లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు   దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు   కీకారణ్యములలో అమృతేశ్వరుడనని అంటావు   ఏదారులలో వేడుకగా అమృతేశ్వరుడనని అంటావు   కనుమల దగ్గర కామరూపకామాఖ్యుడనని అంటావు   జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు   భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు   ఈదలేనంత గంగఒడ్డున ఈశ్వరుడినంటావు   నామదిని వదిలేసావు దయలేక తెలియదుగా   నీకు ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా.  శివుడు ఎత్తైన కొండలలో-లోతైన లోయలలో-ఎడారులలో-కీకారణ్యములలో-ఎక్కడెక్కడో ఉంటాడు కాని నిత్యము నిర్మలభక్తితో కొలిచే భక్తుని మదిలో ఉండాలని తెలియనివాడు.-నింద.  ఎత్తు నమఃశివాయ-లోతు నమః శివాయ  అడవి నమః శివాయ -ఎడారి నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి శిఖరే   జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం   సదా యస్త్యైవాంతహ్కరణమప...

OM NAMA SIVAAYA-69

Image
  ఓం నమః శివాయ-49   ****************   రుద్రాక్షలు ఇష్టము-చిన్ముద్రలు ఇష్టము   అభిషేకము ఇష్టము-అవశేషము ఇష్టము   బిల్వములు ఇష్టము-బిలములు ఇష్టము   తుమ్మిపూలు ఇష్టము-తుమ్మెదలు ఇష్టము   తాండవము ఇష్టము-తాడనము ఇష్టము   అష్టోత్తరము ఇష్టము-నిష్ఠూరము ఇష్టము   చందనాలు ఇష్టము-వందనాలు ఇష్టము   కాల్చుటయు ఇష్టము-కాచుటయు ఇష్టము   లయగ ఆడుట ఇష్టము-లయముచేయుట ఇష్టము   మహన్యాసము ఇష్టము-మహాశివరాత్రి ఇష్టము   కష్టాలలోనున్న నాపై ఇష్టము చూపించకుండుట  నీ టక్కరితనమేరా ఓ తిక్కశంకరా.  శివుడు రుద్రాక్షలను-అభిషేకములను-తుమ్మిపూవులను,మారేడు దళములను-కొండగుహలను చందనములను ఇష్టమని ప్రకటించుకున్నాడు.ఇంతేనా ఇంకా ఏమైన వున్నాయా అని అడిగితే చిన్ముద్ర-అవశేషాలు-నాట్యములు-దండించుట-తుమ్మెదలు-నమస్కారములు కాల్చుట-కాచుట మహన్యాసములు ఇష్టమనినాడు.తనకు కావలిసిన సమాధానము రాలేదని ఇంకా ఏవైనా మరిచిపోయినావా శివా అని అడిగితే దరహాసం చేస్తాడు కాని తనపై దయ ఉందని మాత్రము అనడు-నింద.  బిలము నమః శివాయ-బిల్వము నమః శివాయ  కాల్చుట నమః శివాయ-...