Posts

CHAMAKAMUTO MAMAEKAMU-06

Image

OM NAMA SIVAAYA-71

Image
    ఓం నమః శివాయ-71    *********************** బూజుగూడు గుడియంటు మోజు పెంచుకున్నావు తెలిసికొనవు ఆ పురుగు కట్టినదది ఎంగిలిదారములతోనని మణులు పెట్టి కొలిచినదని మమత పెంచుకున్నావు తెలిసికొనవు ఆ పాము పెట్టినది విషపు కోరలతోనని ఏంచక్కటి అభిషేకమని ఏనుగును ఎనకేసుకొస్తావు తెలిసికొనవు థు థు అంటు చిమ్మినది తొండపునీళ్ళనని ఎన్నడు మూయని గుడియని ఎన్నో చెబుతుంటావు తెలిసికొనవు శిరముతెగిన రాహుకేతు పూజలకని దీపమును చూపిస్తూ,"వారెవా"వాయులింగమునంటావు తెలిసికొనవు దీపము గాలికి రెపరెపలాడుచున్నదని శ్రీకాళహస్తీశ్వరుడనని జాస్తి కబురులాడతావు,నీ పేరును ఒక్కరైన పిలువరురా ఓ తిక్కశంకరా.   శివుడు సాలెగూటిని గుడి అనుకుంటాడు.విషముతాకిన మణులను వినోదముగా స్వీకరిస్తాడు.తొండముతో నీళ్ళుపట్టుకుని తెచ్చి,లింగముపైన పోస్తే అభిషేకము అనుకుంటాడు.తన ప్రతిభకు రెపరెపలాడు దీపమును సాక్ష్యముగా చూపిస్తాడు.ఏదో చెప్పుకుని తృప్తి పడనీలే అనుకుంటే అంతటితో ఆగక గ్రహణ సమయములో కూడా తన గుడి తెరిచి ఉంటుందని తాను అనుగ్రహములను ప్రసాదిస్తుంటానని అంటాడు కాని ఆ సమయములో జరిగే పూజలు రాహు-కేతువులకు కాని త...

OM NAMA SIVAYA-108

Image
  ఓం నమః శివాయ-108   ******************   కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది   నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది   మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని   తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని   సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది   అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది  పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై  అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు  నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై  నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను  పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా  వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా  ధూర్జటి మహాకవి "శ్రీకాళహస్తీశ్వర శతకములో" నొక్కి వక్కాణించినట్లు,బిడ్ద పాలబువ్వను తినకుండా అరటిపండ్లు కావాలని మారాం చేస్తే,జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తు వెళ్ళి,వాటిని తెచ్చి,బిడ్దకు తినిపించి,తండ్రి ఎంతమురిసి పోతాడో,అదే వాత్సల్యముతో నిన్ను అణువణువునా నిందించి,నీ అవ్యాజకరుణను తెలిసికోలేని అహంకారముతో,అజ్ఞానముతో అనేకానేక పరుషపదప్ర...

OM NAMA SIVAYA-107

Image
  ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా   భక్తి మకరందమును  చందనముగ పూయనా   ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా   శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా   పాప రహితము అనే దీపము వెలిగించనా   పొగడపూల వాసనలనే పొగలుగ నే వేయనా   లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే  చేయనా   ఉచ్చ్వాశ-నిశ్వాస  వింజామరలను  వీచనా   అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా   హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా   దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా   నా పక్కనే  ఉన్నావురా  చూద చక్కనైన శంకరా! మును నేఁ బుట్టినపుట్టులెన్ని గలవో మోహంబుచే నందుఁ జే సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతిచినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా! తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నేను ఎత్తిన జన్మలెన్నో, వాటిలో నేను చేసిన కర్మలెన్నో నాకు తెలియదు.ఎంత ఆలోచించినా నేను తెలుసుకోనలేకున్నను. ఈ జన్మమే పారమార్థికమని భావించుచున్న నాకు ఈ జన్మలో చేసిన నీ ధ్యానపుణ్యముచేత ఇదియే కడగొట్టు జన...

OM NAMA SIVAYA-106

Image
 తిక్కవాడివై నీవుంటే భక్యుల మొక్కులెలా పెరుగుతాయి  మండే చెట్టూవై నీవుంటే పక్షులెలా వాలుతాయి   కరిగే కొండవై నీవుంటే మృగములెలా తిరుగుతాయి  పారని గంగవై నీవుంటే జలచరముఎలా బతుకుతాయి  స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరమెలా అవుతుంది  శితికంఠుడివై నీవుంటే స్థితికార్యమెలా జరుగుతుంది   లయకారుడివై నీవుంటే శృతిలయలెలా నిన్ను చేరతాయి  మన్నించమని నేనంటే నిన్నెంచను అని అంటావు  ఆదరమేమో నీది అవగతమయ్యెను అంతలోన  ఆ నిందా వాక్యములు అవి గతమయ్యెను వింతలోన  అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా  అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా. సంపద్వర్గముఁ బాఱద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశదోషంబులన్ జింపుల్చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్ జెంపల్వేయక నిన్నుఁగాననగునా శ్రీకాళహస్తీశ్వరా! తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! సంపదలను త్యజించి, అరిషడ్వర్గములను భేదించి, ఆశలను పక్కకుపెట్టి, పాపములను ప్రక్షాళన గావించుకుని, బంధుబాధలను విడిచి, వయస్సు దాని విలాసములను వదులుక...

OM NAMA SIVAAYA-105

Image
   శివ సంకల్పము-105  నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం  నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం  నీకేమి తెలియదంది నా అహంకారం  నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం  నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం  నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం  నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం  నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం  నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం  నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం  సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే  నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.  "ధీయంత్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః   ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతైః   హృత్కేదారయుతాశ్చ భక్తి కలమాః సాఫల్యమా తన్యతే   దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః."  బుధ్ధి యను యంత్రము ద్వారా వాక్కు అనే కుండతో చిన్న కాలువల వరుసలలో తీసుకురాబడిన సదాశివ చరిత్రమనే దివ్యజలము ద్వారా హృదయమనే పంటచేలలోకి భక్తి అనే పైరులు ఫలవంతముగా పెరుగు...

OM NAMA SIVAAYA-104

Image
ఓం నమ: శివాయ భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా  వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా (ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా. పుడమిన్నిన్నొక బిల్వపత్రమున నేఁ బూజించి పుణ్యంబునున్ బడయన్నేరక పెక్కు దైవములకున్ బప్పుల్ ప్రసాదంబులున్ గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బెట్టుచున్ జెడి యెందుం గొఱగాకపోదు రకటా శ్రీకాళహస్తీశ్వరా! తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! జనులు భూమిలో భక్తసులభుడవైన నిన్ను ఒక్క బిల్వపత్రముతో పూజించక ఇతర దేవతలకు నానావిధములైన ప్రసాదములు పెట్టి చెడి ఎందుకూ కొరగాకుండా పోవుచున్నారు కదా ........................