Posts

OM NAMA SIVAYA-74

 ఓం నమః శివాయ-74  **********************  నీ కళ్యాణపు కర్తయైనాడుగ ఆ రతిరాజు  నీ సేమపు మామ యైనాడు ఆ హిమరాజు  నీ శిగపై కొలువైనాడు ఆ నెలరాజు  నీ మేనికి వస్త్రమైనాడు ఆ కరిరాజు  నీ కంఠపు కంటెయైనాడు ఆ భుజగరాజు  నీమ్రోలన్ నిలిచినాడు ఆ వృషభరాజు  నీతో పాటుగ కొలువైనాడు ఆ యమరాజు  నీవంటే నిరసనతో యున్నాడుగ ఆ దక్షరాజు  విరాజమానుడిని అని నీవు అన్నా,నువ్వు రాజువు కాదని  ఇందరు రాజులు నిన్ను ఆడించగ మందహాసముతో  నటరాజను ఒక రాజును నీకొసగిరి ,నీ  తక్కువ చాటేందుకేర ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAYA-73

Image
  ఓం నమః శివాయ-73   *****************  అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా  ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు  హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా  రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు  అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా  అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు  స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా  ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు  పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా  లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు  పెంపును అందించుతావో పంపు అని చంపుతావో  పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAYA-72

Image
  ఓం నమః శివాయ-72   *****************  పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో  పాలకడలి విషము మింగ పావుగా మారావు  అసత్యమాడిన ఆ బ్రహ్మ ఎంత చతురుడో  తన కపాలమును చూపి దొంగవని అంటాడు  ఫాలములో దాగిన కన్ను ఎంతచుప్పనాతిదో  అసలు తెరువనీయవని అలుకతో ఉంటుంది  తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో  అటుఇటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది  కుదురుగ ఉండలేని చంద్రునికెంత కినుకో  రాహుకేతు బాధను కబళించవు అంటాడు  కొంచమైనగాని  మంచి-చెడులు గమనించక  తొక్కేస్తున్నవట గదర ఓ తిక్క శంకరా,

OM NAMA SIVAYA-71

Image
  ఓం నమః శివాయ-71   ***************   కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా   సిగపూవగు గంగమ్మ సిరులను అందీయగలదా   కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలదా   నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములనందీయగలదా   కరమున నున్న శూలము వరములనందీయగలదా   పట్టుకిఉన్న పాములు నీకు పసిడిని అందీయగలవా   కరుగుచున్న నగము తరగని సంపదనీయగలదా   కదలలేని చంద్రుడు ఇంద్రపదవినీయగలదా   కాల్చున్న కన్ను నీకు కాసులనందీయగలదా   ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను నమ్మి   " ఒం దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ" అంటుంటే    ఫక్కుమని నవ్వారురా ఓ తిక్క శంకరా.   ఓం నమః శివాయ-71   ***************   శివుడు ధరించిన రుద్రాక్షలు-గంగమ్మ-ఎద్దు-శూలము-మంచుకొండ-చంద్రుడు-అగ్గి కన్ను సంపదలనిచ్చు శక్తిలేనప్పటికిని,భక్తులు అమాయకంగా   దరిద్రమనే దుఃమును కాల్చివేసి,ఐశ్వర్య ప్రదుడు శివుడని నమ్మి,  కీర్తిస్తుంటేనవ్వుకుంటూ వింటుంటాడేకాని,అది అబధ్ధమని చెప్పడు-నింద.   ధనికుడు-నమః శివాయ-దరిద్రుడు నమః శివాయ   భావము నమః శివాయ-...

OM NAMA SIVAAYA-70

Image
  ఓం నమః శివాయ-67   *********************  నీ పాదము పట్టుకుందమన్న చిందులేస్తు అందకుంది  నీ నడుమును అడుగుదామన్న పులితోలు అలిగింది  నీ హృదయము దరిచేర్చమన్న కుదరదు అని అంటున్నది  నీ మనసుకు మనవిచేద్దామంటే భక్తులను అదిచుట్టుకుంది  నీ చేతికి చెబుదామంటే చెడ్దపుర్రె అడ్డుకుంది  నీ చుబుకము పట్టుకుందామంటే విషము సెగలు కక్కుతోంది  నీ కన్నులకు కనిపిద్దామన్న కొంచమైన తెరువకుంది  నీ ముక్కుకు మొక్కుదామంటే మూసి జపము చేస్తున్నది  నీ జటకు ఉటంకిందామంటే గంగవెర్రులెత్తుతోంది  నన్ను రానీయక తమ సొంతమంటు గంతులేస్తున్నవి  నీదరి సేదతీరుతు ఆదరమునే మరచిన వాటి  టక్కరితనమును చూడరా ఓ తిక్కశంకరా.  సాధకుడు కష్టపడి శివానుగ్రహముతో తన ఇంద్రియములను వశపరచుకొని,శివదర్శనమునకై వస్తే.స్వామి ధరించిన పాదమంజీరము నుండి, జటలో నున్న గంగ వరకు అడ్డగించుచున్నవి.శంకరుడు తమకే సొంతమని దరిచేరనీయకుంటే,దయాళువుగా కీర్తింపబడు శివుడు నిర్దయతో తటస్థముగా నున్నాడు.దర్శన భాగ్యమును కలిగించుట లేదు-నింద.  హృదయము నమః శివాయ-ఆదరము నమః శివాయ  ఉపేక్ష...

OM NAMA SIVAYA-69

Image
ఓం నమః శివాయ-46   ***************  రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు  కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు  దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు  చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు  అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు  నింగిలోకి సాగుతాడు-నేలలో  దాగుతాడు  అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు  జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు  ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు  దాగుడుమూతలు ఆడుతు  పట్టుకోమంటాడు  సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు  ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAYA-68

Image
 ఓం నమః శివాయ-68  *****************  మాతంగపతిగ నువ్వుంటే ఏది రక్షణ వాటికి?  గణపతి అవతరించాడు కరివదనముతో  అశ్వపతిగ వుంటె నీవు ఏదిరక్షణ వాటికి?  తుంబురుడు వచ్చాడు గుఱ్ఱపు ముఖముతో  నాగపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?  పతంజలి వచ్చాడు మనిషి ముఖముతో  వానరపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?  నారదుడు వచ్చాడు వానర ముఖముతో  సింహపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?  నరసింహుడు వచ్చాడు సింహపు ముఖముతో  పశుపతిగ నీవుంటే అశువులకు రక్షణలేదని  ఒక్కటే గుసగుసలు ఓ తిక్కశంకరా.  శివుడు తాను పశుపతినని,వాటిని సంరక్షిస్తానని చెప్పుకుంటాడు కాని కళ్ళెదురుగానే శిరము వేరు-మొండెం వేరుగా ఎన్నో రూపములు కనిపిస్తూ,శివుని చేతగానితనమును ఎత్తిచూపిస్తున్నాగాని కిమ్మనక ఊరుకుంటాడు కాని దురాగతములను ఆపడు.-నింద.తాను కూడ శరభ రూపమును ధరించి మరొక్కసారి ఋజువు చేసాడు.  శిరము నమః శివాయ-మొండెము నమః శివాయ  పశువు నమః శివాయ-మనిషి నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.  " ఛందఃశాఖి శిఖాన్వితైర్ద్విజవరైవరైః సంసేవితే శాశ్వతే ...