Posts

01NAMONAMAHA

Image
నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తు...

PRASEEDA MAMA SARVADAA-09

Image
ప్రసన్న మమ సర్వదా-09 మాత సిధ్ధిధాత్రి నమోనమః "సిధ్ధ గంధర్వ యక్షాద్యైః అసురైః అమరైరపిః సేవ్యమానా సదా భూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయినీ". ధాత్రీ అను శబ్దమునకు అనుగ్రహించునది-ప్రసాదించునది అని అర్థము.అమ్మ మనకు సిధ్ధులను ప్రసాదిస్తుంది కనుక సిధ్ధిధాత్రి నామముతో కీర్తింపబడుచున్నది.తల్లి మనతో పాటు ఉంటూ,మనలను చైతన్యవంతులను చేస్తూ,సన్మార్గమును చూపిస్తూ,దానికి కావలిసిన సిధ్ధులను అనుగ్రహిస్తుంటుంది. మనలోని సద్గుణాల సమ్మేలనమే సిధ్ధులు.కాని ముఖ్యముగా అష్టసిధ్ధులు మనకు అనేక విషయములను తెలియచేస్తాయి.వాటికి అనుగునముగా మన ఇతిహాస కథలు వాటి ఉపయోగవిధానమును మరింత వివరించినవి.ఉదాహరనకు సూక్ష్మావస్థలో కూడా భగవ్తత్త్వమును గ్రహించగలగటము అణిమ-భగవతత్త్వమును అన్నింటా దర్శించకలగటము మహిమ-అంటే సూక్షముగా -స్థూలముగా నున్న భగతత్త్వమును గుర్తించగలుగుట.గరిమ-లఘిమ మరొక రెండు సిధ్ధులు.అతి తేలికగా మారుట-అత్యంత బరువుగా (రూపములో ఏమార్పులేకుండ) మారుట.ప్రాప్తి-ప్రాకామ్యము మరొక రెండు శక్తులు.శూన్యముగా పైకి కనిపించేదానిలో శక్తిని గ్రహించగలుగుట ప్రాప్తి అయితే దానిని పొందగలుగుట ప్రాకామ్యము.ఈశిత్వము-వశిత్...

PRASEEDA MAMA SARVADAA-08

Image
ప్రసీద మమ సర్వదా-08 మహాగౌరి నమోస్తుతే శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుభాః మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా" అష్టవర్షా భవేద్గౌరీ మహా అత్యంత గౌరి తెల్లని శరీరకాంతి కలది.అత్యంత గౌరవ ప్రదాయిని. శుంభ-నిశుంభులను రాక్షసులు తమకు పార్వతీదేవి పుత్రికతో తప్ప అన్యులతో మరణమును పొందని వరము కలవారైరి.వరబల గర్వితులైన వారు యుక్తాయుక్తములను మరచి ధర్మమునకు గ్లానిని కలిగించసాగిరి. పరమేశ్వరి లీలలు పరమదాయార్ద్రశీలములు.ధర్మసంస్థాపనకు శుంభనిశుంభులు నిర్గమించాలి.దానికి తన సరీరమునుండి ఒక మహాశక్తి తన పుత్రికగా ఆవిర్భవించాలి.దానికొక బాహ్య కారణమును చూపించాలి(మనకు అర్థమగుటకు) కనుక తల్లి తన కాళి రూపము లోని నల్లని రంగును నెపముగా మలచుకొని,దానిని విడనాడుటకు మానససరోవములో మునిగినది.తల్లి తలచుకుంటే కానిది ఏముంది? మానస సరోవరము తన బాధ్యతగా తల్లి నల్లని చర్మమును తల్లి నుండి వేరుచేసి,మహాగౌరిగా అమ్మను ప్రకాశింపచేసినది. తల్లినుండి విడివడిన చర్మమునుండి మహాద్భుత శక్తి "కౌశికి" గా (కోశమునుండి వెలువడినది) ఆవిర్భవించి,అసురుని అస్తమింప చేసినది.తమస్సు ఉషస్సును చేరినది.ఎంతటి దయామయి...

PRASEEDA MAMA SARVADAA-INTRODUCTION

Image
ప్రసీద మమ సర్వదా నవదుర్గ మాతా నమో నమః యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమ...

PRASEEDA MAMA SARVADAA-07

Image
ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరలమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారాథమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రా చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొన...

PRASEEDA MAMA SARVADAA-06

Image
ప్రసీద మమ సర్వదా-06 కాత్యాయినిదేవి నమోనమః " చందరహాసోజ్వలకరం శార్దూల వరవాహనం కాత్యాయినీం శుభం ధధాత్దేవి దానవ ఘాతినీ" దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా" కాత్యాయినీ మాత గుహ్యాతిగుహ్యముల గూఢతత్త్వము.పురుషసూక్త ప్రకారము తల్లి సమస్త విశ్వములోని నాల్గవ భాగమును మాత్రమే ప్రపంచముగా మనకు వ్యక్తముగా ప్రకటించి,మిగిలిన మూడు భాగముల అమృతమయమైన అవ్యక్తమునకును అధిస్ఠాత్రియై అలరారుచున్నది. నామరూపములను పరిశీలిస్తే,దైవకార్యార్థము "కతుడు" అనే ముని పుంగవుని ఆశ్రమములో జన్మించి-పెరిగినందున కాత్యాయినీ నామముతో కీర్తింపడుతున్నది తల్లి.తల్లి స్వభావమును పరిశీలిస్తే జ్ఞాన విజ్ఞతను అందిస్తూనే దానికి ఏల క్రియాశీలకత్వమును అనుసంధిస్తుందో సాక్షాత్తు గాయత్రీ స్వరూపముగా సకల శాస్త్ర విజ్ఞానమును సంహార రూపముతో యోధ గా క్రియాశక్తిని మేళవించి వాటిని సఫలీకృతము చేస్తుంది తల్లి. మరొక్క ముఖ్యమైన విషయము తల్లి తాను క్రోధస్వరూపిణిగా ఆవిర్భవించినది.కాని దానికి అరిషడ్వర్గములు కావు.కామ-క్రోధముల ఫలితములు వానిని ప్రేరేపించిన మూలకారణల బింబ-ప్రతిబింబములు.తల్లి ధర్మము నాలుగు పాదములతో నడువవలెనని...

PRASEEDA MAMA SARVADA05

Image
ప్రసీద మమ సర్వదా-06 స్కందమాత నమోనమః సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ అరవ నవదుర్గ స్కదమాతాదేవి.కూష్మాందా మాత అండరూపములో సమస్తమును తన గర్భములో నిక్షిప్తము చేసునినది కదా.దానిని ధర్మ రక్షనకు ప్రకటించవలసిన సమయమాసన్నమైనందున స్కందమాత గా అమ్మదనముతో మనలనందరిని తారకాసురుని బారి నుండి నెమ్మదింపచేయుటకై తన జాన-క్రియాశక్తులను శివశక్తితో కలిపేసి స్కందుని దేవసేనాధ్యక్షునిగా చేసినది తల్లి. స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును వాయువు-అగ్ని దాచిన గంగ దేవి ఒడిని చేరినదట.ఆ తల్లి ఆ దివ్యతేజమున రెల్లునందు దాచినదట. రెల్లునుండి తారకుని దుందగములను చెల్లు చేయుటకు అద్భుత బాలురు ఆవిర్భవించిరట.కృత్తిక నక్షత్ర శక్తులు ఆరు ఆ బాలునికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షన్ముఖుని ...