MEEDHUSHTAMA SIVATAMA-12
మీఢుష్టమ శివతమ-12. ******************** న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శించలేడు-దయను పొందలేడు. హిరణ్యము కంటె క్షేత్రము విలువైనదా/క్షేత్రము కంటె హిరణ్యమా? ఆలయములో నుండి " అశ్మాశ్చమే-మృత్తికాశ్చమే" అని చమకము ,తనతో మమేకము కమ్మన్నట్లుగా వినిపిస్తూ,.తనదగ్గరికి రమ్మన్నట్లుగా అనిపిస్తోంది. అంటే గట్టి రాళ్ళనేలయందు-మెత్తని నల్లరేగడి నేలయు తానైన పరమాత్మను యజ్ఞసాధనకు-సామర్థ్యమునకు అర్థించమంటున్నదా? ఏమో? విహారయాత్రో/విజ్ఞానయాత్రో బస్సునుండి బిలబిలమంటు దిగారు విద్యార్థులు.వారితో పాటుగా ఉపాధ్యాయులు.వారిలో ఒక పెద్దాయన ఒక తెరను-ప్రొజెక్టరును అమరుస్తున్నాడు.అందరు ఆసక్తిగా అతనినే చూస్తున్నారు. " అదాభ్యశ్చమే" ప్రాణులకు వెలుగు నిచ్చుటలో అలసటలేని వానివలె ఉన్నాడు ఉత్సాహముగా. కదలాలనిపించటములేదు సాధకునకు. కథా-కమామిషు చూద్దామనిపిస్తోంది. వృక్షాశ్చమే. చిత్రము మొదలైనది.ఒకతను చేతిలో మఱ్ఱి విత్తనమును మనకు చూపించి భూమిలో నాటాడు.నీరు పోసాడు.రోజూ వచ్చి చూసి పోతున్నాడు.దానికి కంచె కట్టి కాపాడుతున్నాడు . రీలు వేగముగా తిరుగుతోంది.విత్తనము మొలకగా-మొక్క...