Posts

MEEDHUSHTAMA SIVATAMA-25

Image
   మీఢుష్టమ శీతమ-25  *******************   శివుడొక్కడే తలపు-శివుడొక్కడే పలుకు   శివుడె సర్వము మాకు చిత్తమంతయు శివుడె.       మనశ్చమే-చక్షుశ్చమే-శ్రోత్రంచమే అని ఆలయములో నుండి చమకము చెవులలో పడుతోంది సాధకుని.అలిసిపోయిన శరీరమో అది అలసత్వముతో నిండినదో కాని లేవాలనిపించటములేదు.చమక స్తోత్రము కొనసాగుతోంది .  " చక్షుః యజ్ఞేన కల్పతాం" అంటు, తట్టిలేపేసింది ఇట్టే.    అగ్నా-విష్ణో సజోష సేమా వర్ధంతు వాంగిరః" అని అభ్యర్థించి,వారిదయచే,   కన్నులతో చూడగలుగుచూ,,చెవులతో వినగలుగు  భక్తాగ్రేసరులు                                    . అదేచమకములో,  చక్షుః యజ్ఞేన కల్పతాం- అని అంటున్నారు.   యజ్ఞము వలన కన్నులు సమర్థవంతములగుతాయని అంటున్నారు.అవి వినగానే సాధకుని నిద్రమత్తు తనతో పాటు స్థిమితమును కూడా వెంట తీసుకెళ్ళీపోయింది.     రుద్రుడు వెళ్ళిపోవడానికి సిధ్ధమవుతున్నాడు.   సాధకుని చూస్తూ,నిన్న పూజ చాలా దివ్యముగా జరిగింది.మీ అందరు మీ బంధుమిత్రుల...

MEEDHUSHTAMA SIVATAMA-24

Image
   మీఢుష్టమ శివతమ-24   ***********************    మనసున మసలుము సదాశివా    మాయాతీత మహాదేవ నా    మనసున మసలుము సదాశివా.    ఏమిటీ వేళాకోళం రుద్రా.  మల్లయ్యను పిలువమంటే,మల్లయ్యతో,  మీరు శ్రమపడి రావద్దు.మీదగ్గరున్న కరంటును తెప్పించే శక్తిని మాత్రమే రమ్మన్నావు. వాడు రాలేదు.చీకటి పోలేదు.   విషయము అర్థమవ్వటములేదు నీకు.ఎవరిని పిలవాలో,ఎలా పిలవాలో, ఎలా పనులు చేయించుకోవాలో తెలియనట్లుంది నీకు అన్నాడు సాధకుడు చిరాకుగా.   అంతలోనే నాన్నా! తలుపు రెక్క విరిగింది.మూయటానికి రావటములేదు అంటూ వచ్చాడు పదేళ్ళ కొడుకు.  ఈసారైనా మర్యాదగా వచ్చి తలుపు బిగించివెళ్ళమని వడ్రంగికి చెప్పు.వాడిపేరు కూడా మల్లన్నే.     రుద్రుడు,   అసలేమి జరగనట్లు ఫోను తీసుకుని చేసాడు.కలిసింది.  అయ్యా ఇవతల రుద్రుడు మాట్లాడుతున్నాడు.అవతల మీరు.? .నా  పేరు మల్లన్న.వడ్రంగిని.  సాధకుని గారింట్లో తలుపురెక్క విరిగింది.మీరు మాత్రమే..నేను మళ్ళీ చెబుతున్నాను  వినండి.సామానులు-సంచీలు వద్దు.మీరు మాత్రమే వచ్చి తలుపు బిగించి వెళ్ళండి అన్నా...

MEEDHUSHTAMA SIVATAMA-23

    మీఢుష్టమ శివతమ-23  ********************* ఈ రోజు నుండి పరమాత్మ బ్రహ్మశ్రీ సామవేదం వారి అమృతగుళికలతో మనలను ఆశీర్వదిస్తారు.  వారికి సభక్తిపూర్వక నమస్కారములు.  "హరిహరులకు ప్రియమైనది కార్తికమాసం  సరిలేని వ్రతపూజలు సలుపుటకవకాశం."   శ్రీ ఆకెళ్ళ విభీషణశర్మగారికి నమస్కారములతో.     రుద్రా! రేపు పూజచేసుకోవాలంటు ఇంట్లో ఒకటే పోరు.తప్పించుకోలేని హోరు.నేను పూజను పీటలమీదనుండి లేవకుండ కూర్చుని ముగించాలంట.పిల్లలు నిర్వహిస్తారన్న నమ్మకం లేదు.    పోనీ మానేద్దాం అంటే నాభార్య ససేమిరా వీల్లేదంటున్నది.ఏమి చేయాలో పాలుపోవటంలేదు అనగానే,   పాలుపంచుకోవటానికి నేనున్నానుగా సాధకా! ఇంకెందుకు దిగులు అన్నాడు   అసలది ఈశ్వర సంకల్పమేకదా సంకల్ప-వికల్పములను తొలగించుటకు జరుపబోవుచున్నది-జరుపుచున్నది.   రుద్రా! పీటలు.  రుద్రా!దీపములు.  రుద్రా! గంగాజలము.  రుద్రా! పుష్పములు.  రుద్రా! పంచామృతములు.  రుద్రా ఇది.రుద్రా అది  .రుద్రా! రుద్రా! రుద్రా!..చిరునవ్వుతో అందిస్తున్నాడు రుద్రుడు   " అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే ...

MEEDHUSHTAMA SIVATAMA-22

Image
  మీఢుష్టమ శివతమ-22  ********************    ఎందుకయా సాంబశివా-ఎవరు నీకు చెప్పేరయ్యా    ఈ అల్లరి చేతలు-ఈ బూడిదపూతలు    ఎందుకయా సాంబశివా ఎందుకయా సాంబశివా.   మార్గములో హడావిడిగా కనిపించారు వైద్యకవలలు.       అశ్వినౌచమ ఇంద్రశ్చమే.    అంతా క్షేమమే కదా అని వారినడుగుతు వీరు మన చిత్ర ఆరోగ్య విభాగమును నిర్వహిస్తారు.మన లక్ష్మణ్ మాస్టారుల వలె కవలలు.  ఒకే పేరు వీరిది.అశ్వనీ  12 అంటాము.  చెరొక పనిని పంచుకున్నారు.అశ్వనీ 1 గారు అనారోగ్య కారణమును మాత్రమే నిశితముగా పరిశీలించి,నిర్ధారణను చేస్తారు.రెండవ వారు దాని నివారణకు కావలిసిన ఔషధములను అందించి సంపూర్ణ ఆరోగ్యమును అందిస్తారు.    నమో భువంతయే  వారివస్కృతాయౌషధీనాం పతయే నమః.  భువంత-సర్వదా సర్వత్ర భవతి-ఎల్లప్పుడు-ఎల్లవేళలా ఉండువాడు.వరివః అనగా సేవ.సేవచేయువారు వారివస్కృతులు.భక్తులు.వారియందు ప్రీతికలవాడు వారివస్కృతుడు.వారిణి జలైవాసః-జలమునందు వాసము చేసినవాడు-నారాయణుడు.  పండిన వెంటనే నశించునవి ఔషధులు.  అవి నశించి మనకు ఆరోగ్యమునిస్తాయికదా. వాచ్యార్థమున...

MEEDHUSHTAMA SIVATAMA-21

Image
    మీఢుష్టమ  శివతమ-21   ********************  నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా  నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవె కావ  నన్నువిడిచి పారిపోకయా.   ప్రపంచ రథసారథి విపంచినాదముతో విరాజిల్లుచున్నాడా యన్నట్లు,  ఇంద్రగారు సరస్వతి అమ్మ తరగతిలోనికి ప్రకాశిస్తూ-ప్రవేశిస్తున్నారు.    సరస్వతీచమ-ఇంద్రశ్చమే కన్నులపండుగగా కదులుతుంటే,  నమ స్యూత్యాయ-అహంత్యాయ తానై ,చెరోరూపమైన అపురూప దర్శనమనిపిస్తున్నది.   ఈ అమ్మాయి సరస్వతి.సర్వతోముఖ ప్రజ్ఞావంతురాలు.ఏ విభాగములోని గమనమునైన ఇట్టే గ్రహించి,దానిని నటీనటులకు-సాంకేతిక నిపుణులకు సత్వరముగా అర్థమగునట్లు చేస్తుంది.  మొన్నటికి మొన్న సెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.నేను సమయానికి అక్కడలేను. మతల్లి ఎంతో చాకచక్యముతో వాటిని పలాయనము చిత్తగించేటట్లు చేసింది అన్నాడుమెచ్చుకోలుగా తనని చూస్తూ.    నమ అవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవో నమః."    అర్థంకాలేదా ఈమె ఇట్లా సాదాసీదాగా కనిపిస్తుందికాని అసాధ్యురాలు.  అందుకే అలా అన్నాను అని ఇంద్ర,    వ్యాధిని-అనగా వధించగల శక్తికలది. ...

MEEDHUSHTAMA SIVATAMA-20

Image
   మీఢుష్టమ శివతమ-20   *******************   నిన్నువదిలి ఉండలేనయా-కైలాసవాసా   నిన్ను వదిలి ఉండలేను కన్నతండ్రి నీవుకావ,   నన్ను విడిచి వెళ్ళిపోకయ్యా.  మిస్టర్ ఇంద్ర గారు మిస్టర్ ధాత మరియు మిస్టర్ విష్ణు గారలతో కలిసి,మరొక తరగతి విద్యార్థులకు తమ చిత్ర విశేషములను వివరిస్తూ,దానికి పనిచేసిన వారిని పరిచయము చేస్తూ-ప్రశంసిస్తూ పదములను (మాటలను) కదుపుతున్నారు.  " ధాతాచమ -ఇంద్రశ్చమే    విష్ణుశ్చమ-ఇంద్రశ్చమే" అంటూ,    ధాత-మరియు విష్ణువును కూడి వచ్చిన ఇంద్రగారు మా అధ్యయన మను యజ్ఞమును సమర్థవంతము చేసి,మమ్ములను ఆశీర్వదించెదరుగాక.   ఆలస్యము చేయకుండానే అసలు విషయములోనికి వస్తానంటు,ఇంద్రుడు తన గొంతును సవరించుకొని,   అమ్మ బ్రహ్మదేవుడో-బొమ్మతీరు మారెరో అంటుండగానే,    అర్థంగాక విద్యార్థులు సార్-సార్ అంటు,ఒక్క నిమిషము ఆగారు.    చిరునవ్వుతో ధాతను చూస్తు చమత్కరించాను , " నమో వృధ్ధాయచ-సంవృధ్ధనేచ"     తాను వృద్ధిపొందుతూ,అందరిని వృధ్ధి పొందించె ఈ ధాత చేతికి మేము తీసిన అస్తవ్యస్తముగా ఉన్న రీలులు వెళ్ళిన తరువాత వాట...

MEEDHUSHtAMA SIVATAMA-19

Image
  మీఢుష్టమ శివతమ-19  ********************  నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా  నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవుకావ  నన్ను విడిచి పారిపోకయా-    "పృధివీచమ ఇంద్రశ్చమ-అంతరిక్షంచమ ఇంద్రశ్చమే-ద్యౌశ్చమ ఇంద్రశ్చమే"  వినిపిస్తోంది చమకములోని అర్థేంద్ర అనువాకము.  ఈసారి భావమునుకూడ వివరిస్తున్నారు.భూమితో కూడివచ్చిన ఇంద్రుడు-ఆకాశముతో కూడి వచ్చిన ఇంద్రుడు-స్వర్గముతో కూడి వచ్చిన ఇంద్రుడు అంటూ.   రుద్రా! ప్రతిసారి ఇంద్రశ్చమే-ఇంద్రశ్చమే అని అంటున్నారు.వీరందరితో పాటుగా తాను వెళుతున్నాడు.వారు మాత్రం ప్రత్యేకముగా కనిపించటములేదు.ప్రతిసారి తనను పేరుపెట్టి పిలుస్తేనే వస్తానన్నాడా ఏమిటి? అని రుద్రుని చెవిలో గుసగుసలాడాడు.   "నమో బృహతేచ వర్షీయతేచ."  దేశము-కాలము-వస్తువు అను మూడువిధములైన పరిమితులు లేనిది బృహత్ శబ్దము అదే బ్రహ్మము.  గుణై వర్షీయతే.   గుణములచే అధికముగా నొప్పువాడు.స్వరూపమును వేడుకగా ధరించువాడు అగు రుద్రునకు నమస్కారములు.   ప్రారంభమైనది ప్రదర్శన.  మిస్టర్.పృధ్వి గొప్పదనమును చెప్పనారంభించాడు నిర్దేశకుడు ఇంద్ర. నమో విరూ...