Posts

ALO REMBAVAY-25

Image
ఇరవై ఐదవ పాశురం   *****************  ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్  ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు     వళర  తరుకిల్లానాంగి  తాంతీంగు నినైన  కరుత్తై పిళ్ళైపిత్తు   క్కంజన్ వయిత్తిల్  నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై  అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్ తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!  " వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం    దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం."    ఎన్నినోములు చేసినదో-ఎన్ని పూజలు చేసినదొ-ఏమి సమర్పనమును చేసినదో ఆ,  ఓరిరవల్-ఆ అర్థరాత్రి.  స్వామిని ఎంత ప్రసన్నుని చేసుకున్నదో ఆ శ్రావణ బహుళాష్టమి రాత్రి-  భవదీయమై భాగ్యవంతమై-బహుముఖప్రదమై  ఎన్నెన్నో రహస్యములకు నిధియై,నిస్తులమై,నిర్మలమై-నీలమేఘశ్యాముని లీలలో తానొక భాగమై తాను తరిస్తు-మనలను తరింపచేసేందుకు.   రహస్యాతి రహస్యములను సదస్యముగాకుండ తనలోనే దాచుకుని తేజరిల్లుతున్నందుకు..ధన్యురాలివి నీవు.   అర్థరాత్రి సమయముసార్థకతను సంచరించుకుని,మనకు సాక్షాత్కరింపచేయుచున్నది గోదమ్మ ఈ పాశు...

ALO REMBAVAY-24

Image
    ఇరువది నాలుగవ పాశురం    *************************  అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి  శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి  పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి  కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి  కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి  వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి  ఎన్రెన్రు  ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్  ఇన్రుయాం వందోం ఇరంగేలోరెంబావాయ్.      అమందానంద సందోహాయ నమః   **************************    అవధులు లేని అనురాగము వాస్తవికతను మరుగున పడేస్తుంది.అన్నీ తామే-స్వామికి అని అనిపించేటట్లు చేస్తుంది.ఆశీర్వదించమంటుంది.హారతులను ఇప్పిస్తుంది.దిష్టి తీసేటట్లు చేస్తుంది.అర్థించుట మరిపిస్తుంది.ఆర్ద్రతతో ముంచేస్తుంది.అదే స్థితిలో నుండేటట్లు గోపికలను చేసాడు ఆ గోవిందుడు.వానికి,  జయమంగళం-నిత్య శుభమంగళం.    కిందటి పాశురములో చెప్పుకున్నట్లు గోపికలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు పరమాత్మకు దగ్గరగాచేర్చుచున్నది గోదమ్మ.స్వామియును తానొక్కొక్క మెట్టు దిగుతు వచ్చి వారిని చేరదీసుక...

ALO REMBAVAY-23

Image
         ఇరవదిమూడవ పాశురం       *********************  మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం  శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు  వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి  మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు  పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్  కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ  శీరియశింగాసనత్తు ఇరుందుయాం వంద  కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్   ఓం వ్యతస్త పాదారవిందాయ నమః   *****************************    మహాద్భుత-మంగళ పరిస్థితులను ఉదహరిస్తు గోదమ్మ మనలను ఈ పాశురములో మంత్ర ముగ్ధులను చేస్తున్నది.గోపికల సర్వస్య శరణాగతియే స్వామిని అపన్న ప్రపన్నుని-ఆహ్లాద ప్రసన్నుని చేస్తూ మనలను గమన సౌందర్యముతోను-ఆసీన సౌందర్యముతోను అలరించుటకు పూనుకున్నది. స్వామి,  శీరియ సింగము-పరాక్రమమైన సింహము  అంటే పర-పరమాత్మ ఇప్పుడు ఏవిధముగా నున్నాడంటే సర్వమును ఆక్రమించి,తనలో ముడివేసుకొని,నల్లనైన చీకటితో నిండిన ,  మలై-కొండయొక్క,  ముళింజిల్-గుహలో,ఎవరితో నున్నాడు?  మణ్ణిక్-భార్యతో/సివంగితో,  కిడందు-మై...

ALO REMBAVAY-22

Image
   ఇరువది  రెండవ పాశురము.     ********************* అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన పంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిల్ కీళే శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విరయావో తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్ అంగణ్ ఇరండు కొండుం ఎంగళ్మేల్ తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్ అంగణ్ ఇరండుం కొండుం ఎంగళ్మేల్ నోక్కుదియేల్ ఎంగళ్మేల్ శాపం ఇళిందేలో రెంబావాయ్.  ఓం పద్మపత్ర నేత్రాయ నమః  ***********************   స్వామి నీ అర్థనిమీలిత నేత్ర సౌందర్య దర్శనమును పొందుటకు మాకు ఏ శాపమో అడ్డుపడుతున్నది  కాని నీకు మాయందున్న వాత్సల్యలోపము మాత్రము కాదు.నీ నేత్ర సందర్శనము సర్వదుఖఃహరము.సర్వమంగళకరము.సమ్మోహనము.సాంత్వనము.సకలార్థసాధనము.కనుక మమ్ములను అనుగ్రహించి,  నీవు మేల్కాంచునప్పుడు నీ కన్నులు అనుభవించు అద్భుత సౌందర్యానుభూతిని దర్శించేభాగ్యమును మాకు ప్రసాదించు,అని గోదమ్మ గోపికలతో పాటుగా స్వామి నేత్ర సౌందర్యమును పరిపరివిధములుగా ఉపమానములతో పోల్చుచు,అవి స్వామినేత్రములతో పోల్చదగినవి కావేమో అని అనుమానించుచు,సమాన-అధికమైనవేమియును ...

ELO REMBAVAY-21

Image
ఇరవైఒకటవ పాశురం    ****************    ఇరవైఒకటవ పాశురం    ****************         ఇరవై ఒకటవ పాశురము      *********************    ఏట్రి కలంగళ్ ఎదిర్ప్పొంగి మీదళిప్ప    మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుపశుక్కళ్    ఆట్ర పడైత్తాల్ మగనే  అరివురాయ్    ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్   తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్   మాట్రార్ ఉనక్కు వలితురైందు ఉన్ వాశల్ కణ్   ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే   పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.     ఓం నమో ఆశ్రితవత్సలాయ నమః   ***************************     గోపికలకు తలుపు తెరిచి,నీలాదేవి వారికి స్వామి ప్రస్తుత అవతార రహస్యములను ప్రస్తుతించుట తగిన ఉపాయముగా బోధించి,తానును వారిపక్షమై,స్వామిని మేల్కొలుపుచున్న భావనతో,గోదమ్మ  ఈ పాశురములో స్వామి నడయాడు గోకుల వైభవమును నాలుగు ఉదాహరణలతో తెలియచేస్తున్నది.  అవి, 1.గోవుల ఔదార్యము.  ఆ గోవులు ఎటువంటి స్వభావమును కలిగియున్నటువంటివి అంటే,  మాట...

ALO REMBAVAY-20

Image
 ఇరువదవ పాశురము.  ******************  ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు కప్పం తవిర్కుం కలియే ! తుయిళెరాయ్ శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా!తుయిళెరాయ్ శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్ నప్పినై నంగాయ్ తిరువే తుయివెళాయ్ ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.  ఓం అనంతకళ్యాణగుణనిధియే నమః  ******************************   కిందటి పాశురములో 'పంచశయనిత్తిల్ అని ఐదు విశేషగుణశోభితమైన -అర్థపంచకమును మనకు పరిచయము చేసింది గోదమ్మ.క్షిప్ర ప్రసాదముగా అవి వారికి లభించినట్లున్నాయి,వారు అక్కడనే వారి గడపముందే నిలబడి ఉన్నారు.అవి ఏమిటంటే, 1.స్వస్వరూపమును తెలిసికొనుట-గోపికలు తమను జీవులుగా గుర్తించారు.అదియే స్వస్వరూప జ్ఞానము.   2. పరస్వరూపము-స్వామిని పరమాత్మగాను ప్రశంసిస్తున్నారు.అదియే పరరూప జ్ఞానము.   3.స్వామిని మేలుకొలిపి అద్దము-విసనకర్రతో-పాటుగా స్వామిని తీసుకుని వెళ్ళి జలకములాడతలిచారు.భగవద్గుణగణములలో మునిగితేలుట.అది.అదియే పురుషార్థ జ్ఞానము.  4. ఎంత వేడుకున్నను స్వామి మేల్కొనుటలేదు.అనుగ్రహించుట...

ALO REMBAVAAY-19

Image
  పంతొమ్మిదవ పాశురము.   ******************   కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్   మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి   కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్   వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్   మైత్తిడం కణ్ణిణాయ్ నీ  ఉన్ మణాలనై   ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్   ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్   తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.   ఓం నమో లక్ష్మీ నారాయణాయనమః   ******************************     ఈ పాశురములో గోదమ్మ మనకు లక్ష్మీనారాయణుల అమలిన-అమరిన మైధునపు మహోత్కృష్టతను విశదపరుస్తున్నది.   గోపికలు క్షణమైననను స్వామిదర్శనమును మరచి ఉండలేని ధన్యులు .వారు నీలమ్మను మేల్కొలిపి స్వామిని వ్రతమునకు తీసుకుని రమ్మని చెప్పినను వారి అడుగులు ముందుకు సాగుటలేదు.ఒకసారి స్వామిని మేలుకొలిపి చూసి అమ్మను అనుగ్రహించమని అర్థించి తరలుదాము అని నీలమ్మ ఇంటిముందు నిలబడి మనసులో వారున్నస్థితిని దర్శిస్తూ,ప్రస్తుతిస్తున్నారు.   ఏ విధముగా చిన్నపిల్లలను భోజనముచేసావా? అని అడిగితే బిత్తరచూపులు చూస్తారో,ఆం తిన్నావా అని అడిగితే బదులిస్తార...