Posts

TIRUVEMBAAVAAY-17

Image
   తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్  కంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.  అరుణగిరిస్వామియే పోట్రి  **********************  ఓ అరాళ కుంతలా! ఓ సుగంధకేశిని! ఆ ఘతనాఘతనా సమర్థుడు,తన కరుణామృత దృక్కులతో,మధుర మకరంద మమతతో మనము సేవించుటకు తనకు తానే మన నివాసములకు వేంచేసి అనుగ్రహించుచున్నాడు.అ స్వామి మూలమును గుర్తించగలగమను బ్రహ్మ-విష్ణులు తమ అహంకారమునకు అవపోసన పట్టినారుకద.దేవతలు సైతము తమకు తామె పాదములను పట్టుకొందమనుకుని విఫలులైనారు.స్వామి కరుణయే పాదపుందరీకములను పట్టి పూజించుటకు అనుగ్రహించుచున్న సమయమున సాక్షాత్కార సంతోష సరస్సులో స్నామాడి-సంకీర్తనమును చేస్తూ,సంతుష్టులమగుదాము.  అంబే శివే తిరువడిగలే శరణం.    

TIRUVEMBAVAY-16

Image
 తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  **********************    తిరు మాణిక్యవాచగర్ స్వామి కరుణామృత వర్షమును ఆదర్శముగా తీసుకుని వర్షిమని వానను సంబోధిస్తున్నాడు. ఆ వానకు తల్లి కరుణ సంకేతముగా దాని ప్రతికదలిక తల్లి ఆభరనములను అనుగ్రహము,అవయవ అనుగ్రహముగా కీర్తించుచున్నాడు.  అమ్మ కరుణ వర్షమునకు ఋతువులతో సంబంధములేదు.కనుక సమయమునకు ముందరే అమ్మ కరుణ అనే మేఘము ( మన కష్టములనే) సముద్రజలమట్టమును తగ్గించివేసినది.ఆవిరిగా మారి ఆకాసములో నీలిమేఘముగా కొత్తరూపును సంతరించుకున్నది తల్లి రూపసారూప్యముతో ధన్యమైనది.తల్లి శూన్యమధ్య/సూక్ష్మ మధ్య.సన్నని నడుము కలది.తల్లి నడుమునకు ప్రతీకగా ఆ నీలిమేఘము మెరుపుతీగెలతో ప్రకాశించుచున్నది.అందెల...

TIRUVEMBAVAY-14

Image
   తిరువెంబావాయ్-14  *************  కాదార్ కుడైయాడ పైపూంకలానాడ  కోదై కురళాడ వండిన్ కుళామాడ  సీద పునలాడి చిట్రం బలం పాడి  వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి  శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి  ఆది తిరంపాడి అందం ఆమా పాడి  పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్  పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్  వైద్యనాథ తాయియే పోట్రి  *************************  తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో స్వామి దయాంతరంగమును తనను శర్ణుకోరిన వారికి సాక్షాత్తు తల్లిగా మారి ఏవిధముగా ప్రసవము చేసాడో చెప్పకనే చెప్పుచున్నాడు.  స్వామి వేదమయుడు.తేజోవంతుడు.ఒకటేమిటి అన్నియును తానైన స్వామిని తాయిని చన్నీటి జలములో మునిగి పునీతులమై మన కర్ణాభరణములు-ఇతర అభరనములు కదులు కుండగా-ఆ ఆభరములు సామాన్యమైనవికావు.సద్గుణరాశులు-సవినయ సమర్పితములు.సద్గుణభూషితులైన పడుచులు సవినయముగా స్వామిని కీర్తించుచున్నారు.దానికి తోడుగా వారు కేశములలో ముడుచుకున్న పూవులును స్వామిని కీర్తించుచున్నవట.పంచేంద్రియ సన్స్కారములే వారు ముడుచుకున్న పూవులు.అవి పరవశించి స్వామిని పరిపరివిధములుగా కీర్తించుచున్నవి ప్...

tiruvembavay-13

Image
      తిరువెంబావాయ్-13  *****************  పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్  అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్  తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్  ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ  పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు  శంగం శిలంబ శిలంబు కలందార్ప  కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్  పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్.  అర్థనారీశ్వమే పోట్రి  ************************  మాణిక్యవాచగర్ అవర్గళ్ మనకు బాలికలు స్నానముచేయుటకు వెళ్ళిన మడుగు/కొలను గురించి ఈ పాశురములో అద్భుతముగా/మహిమోపేతముగా ఉన్నదని వివరించుచున్నారు.  ఆ కొలను ఎలా ఉన్నదంటే,  పైంగుమళై-అతి సుకుమారమైన/మృదువైన,  కార్-నల్లని వర్ణముగల,  మలరార్-పువ్వులతో/నల్లని కలువతో నిండి యున్నది.  అంతే కాదు వాటితో పాటుగా,  శెం-ఎర్రని,అందమైన.చెన్నుగా నున్న,  కమల్-కమలముతో నిండి యున్నది.  ఆ కమలములు -నల్ల కలువలు చూచుటకు స్వామి సేవకు అలంకరింపబడుటకు కట్టిన మాలవలె తోచుచున్నది.  ఆ కొలనులో నీరు ఎలా సాగుతున్నదంటే,  స్వామికి ఎంతో ప్ర...

TIRUVEMBAVAY-12

Image
  తిరువెంబావాయ్-12  *****************  ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం  తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం  కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం  కాత్తు పదైత్తుం కరందుం విళయాడి  వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్  ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప  పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం  ఏత్తి ఇరుంచులైనీరాడేలో రెంబావాయ్.   అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి   **********************************  ఈ పాశురములో తిరుజ్ఞానసంభదార్ మనకు స్వామి మనకు అనుగ్రహించిన "పొయిగై" ను సరస్సును మనకు అందిస్తు-అనుగ్రహిస్తున్నారు.ఆ అనుగ్రహ సరస్సు తెల్లని జలముతో సత్వగుణ ప్రకాశముతో   తేజరిల్లుతుంటుంది.మనము ఉన్ పొయిగై పుక్కు-ఆ అద్భుత-అనుగ్రహ సరస్సులోనికి ప్రవేశించి,వెణ్ణీర్ ఆడై స్నానము చేసామంటే-మన జన్మజ్ఞమల సంతాపములు సమసిపోతాయి.  చెలి! నీకు ఈ విషయము తెలియనిది కాదు.మన స్వామి తిల్లై లో ఎడమచేతిలో అగ్నిని అలంకారముగా ధరించి,ధాచి,నాట్యమాడుతుంతాడు.   అదేకదు.స్వామి సృష్టి-స్థితి-లయ క్రీడాసక్తుడని మన కరకంకణములు మనతో ముచ్చటిస్తుంటే,...

TIRUVEMBAVAY-10

Image
  తిరువెంబావాయ్-10  *****************  పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్  పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే  పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్  వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం  ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్  కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్  ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.  విశ్వరూపాయ పోట్రి  ***************  ఈ పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామి సర్వతర్యామితత్త్వమును నిర్గుణ్ నిరాకార నిరంజనత్వమును ప్రస్తుతిస్తూనే మనలను అనుగ్రహించుటకు మనకై సుందరేశునిగా మన దగ్గరకు వచ్చినాడు.  ఏదవన్ ఊర్?  సర్వాంతర్యామి నీది ఏవూరు అని అడుగలేము   ఏదవన్ పేర్?  నీ పేరిమిటి? అని కూడ అడుగలేము.    ఎందుకంటే స్వామి ఒక్కక్క క్షేత్రములో ఒక్కొక్క పేరుతో వారణాసిలో విశ్వేశ్వరునిగా,శ్రీశైలములో మల్లికార్జునిగా,చిదంబరములో నటరాజుగా కీర్తింపబడుచున్నాడు.మనలను అనుగ్రహించుటకు నానా నామములతో,నానా రూపములతో నానా ప్రదేశములలో మనకు అనుకూలముగా సేవించి అనుభవించుటకు ఆవిర్భవించుచున్నాడు. ...

TIRUVEMBAAVAAY-09

Image
   తిరువెంబావాయ్-09  ************  మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై  పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె  ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో  ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో  అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు  శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం  ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్  ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్ భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి **************************  తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో భగవంతునికి-భాగవతునికి సారూప్యతను వివరిస్తున్నారు కనుకనే పడుచులు నీవు సనాతనమునకే సనాతనుడవు"మున్నై పరం పొరుక్కు" అంతేకాదు ఈ మాయా జగతిలో దానికి అనుగుణముగా ప్రకటింపబడుతు అనుగ్రహించువాడవు.మేము నీ బానిసలము.  నీ అనుగ్రహము మాకు నీకు నీ భక్తులకు మధ్య అభేదమును అర్థముచేసుకొనునట్లు చేస్తే,మేము సంతోషముతో నీ భక్తులపాదములను వినయముతో నమస్కరిస్తాము.వారితో సఖ్యముగా ఉంటాము.వారి ఆజ్ఞను శిరసావహిస్తాము.మాకు ఐహిక భ్రాంతిని తొలగించి నీ సేవాభాగ్యమును అనుగ్రహించుము అను అర్థించుచున్నారు.  అంబే శివ దివ్య తిరువడిళే శరణం.