TIRUVEMBAVAY-12
తిరువెంబావాయ్-12 ***************** ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం తీర్థ నర్తిల్లై చిట్రంబలతె తీయాడుం కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం కాత్తు పడైత్తుం కరందుం విళయాడి వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్ ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్. అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి ********************************** ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు "పూత్తిగళుం పొయిగై" అని ప్రస్తావించి-ప్రస్తుతించినారు.అనేక పద్మములతో అందముగా నున్నది ఈ కొలను. ఇది బాహ్య దర్శనమునకు దృశ్యము. కాని హ్రీంకారోపాసనమును నిరంతరము చేయుచున్న ఈ కొలనులోని పద్మములు స్వామి సమక్షములో నిరంతరమును నిస్తులనాదోపాసనమును చేయుచున్న అనేకానేక అద్భుత యోగి గణములు. పొయిగై దగ్గరకు వచ్చిన పడుచులకు ఆ దివ్యనాదము రెండు విషయములను స్పురింపచేయుచున్నది. మొదటిది- కూట్రం- సమస్తమునకు-సమస్త నిర్మానమునకు మూలము.స్వామియే నిర్మాత-దర్శకుడు. ...