Posts

TIRUVEMBAVAY-15

Image
 తిరువెంబావాయ్-15      ***************  ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్  శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర  నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్  పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్   పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు   ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం  విత్తకర్తాళ్   వారురువ పూణ్మలైయార్ వాయార్  ఆనాంపాడి   ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్  ఎం పెరుమాన్-నం పెరుమాన్ పోట్రి  *******************************  నామస్మరణం ధన్యోపాయం-నహి నహి దుఃఖం ....... ఈ పాశురములో తిరు మాణిక్యవాచగరు శివనోమును చేసూంటున్న పడుచులకు లభ్యమైన అంతర్ముఖ అనుగ్రహమును మనకు వివరిస్తున్నారు.  వారికి అంతా ఆధ్యాత్మిక ఆనందమయమే.ఆ ఆదిదేవుని ఆశీర్వాదానుభవమే.అన్యము తృణప్రాయమైనది.  వారి అనుభవసారమును నేనేమని వర్ణించగలను.? అంతటి భాగ్యశీలురు వారు. కనుకనే ,  అంతర్ముఖులైనవారు అప్పుడప్పుడు మంద్రముగా, మెల్లగా,  శీరొరుకాల్-శుభప్రదమైన   ఎం పెరుమాన్-మహాదేవుడు,  నం పెరుమాన్-మన సంరక్షకుడు అని పలవరిస్తున్నారు.పూర్తి...

TIRUVEMBAVAY-14

Image
  తిరువెంబావాయ్-14  *************  కాదార్ కుడైయాడ పైపూంకలానాడ  కోదై కురళాడ వండిన్ కుళామాడ  సీద పునలాడి చిట్రం బలం పాడి  వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి  శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి  ఆది తిరంపాడి అందం ఆమా పాడి  పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్  పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్    అరువం-ఉరువం-అరు ఉరువం పోట్రి  *****************************  తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో,  అరువం-అవ్యక్తము  ఉరువం-వ్యక్తము  అరు ఉరువం-వ్యక్తావ్యక్తము అను మూడు లీలా విశేషములను,సంకీర్తన సేవా మార్గము ద్వారా వివరిస్తున్నారు.  కనుకనే ఈ పాశురములో పరమభాగ్యవంతులైన కన్యలు స్వామిని నాలుగు విధములుగా సంకీర్తించి,దర్శింప చేసినారు. అవియే,  మొదటిది-అవ్యక్తము.  వేద పొరుళ్ పాడి-స్వామి శబ్ద స్వరూపముగా ప్రకటితమైనాడు.  రెండవది ఆ రూప వ్యాపకత్వము.  వేదము-సత్యము కనుక ఆ వేదస్వరూపము తానంతట తానై సమస్తమును విస్తరించి-వ్యాపించినది.  అప్పొరుళ్ ఆమాం పాడి. మూడవది-శోది తిరం పాడి.  అరూపము మన మీది అనుగ్రహముతో, ...

TIRUVEMBAVAY-13

Image
         తిరువెంబావాయ్-13  *****************  పైంగువళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్  అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్  తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్  ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ  పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు  శంగం శిలంబ శిలంబు కలందార్ప  కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్  పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్'  మీనాక్షి-సుందరేశనయే పోట్రి  *********************************    ఎంగళ్-మనందరి,  పిరాట్టి-పరిపాలకురాలు,  ఎంకోన్రుం-విరాజితమైన,  పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,  పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,  ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,  శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్న  మీనాక్షి సుందరేశాయ పోట్రి  **********************  తిరు మాణిక్యవాచగరు ఈ పాశురములో ,మడుగులో విరాజిల్లుతున్న నీలి కలువలను-ఎర్ర తామరలను సాక్షాత్తు మీనాక్షి తాయి-సుందరేశన్ అప్ప తమకు తాముగా కొలను ప్రసన్నతతో ప్రకటింపబడి పర...

TIRUVEMBAVAY-12

Image
    తిరువెంబావాయ్-12  *****************  ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం  తీర్థ నర్తిల్లై చిట్రంబలతె తీయాడుం  కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం  కాత్తు పడైత్తుం కరందుం విళయాడి  వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్  ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప  పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం  ఏత్తి ఇరుంచులై  నీరాడేలో రెంబావాయ్.   అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి   **********************************  ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు  "పూత్తిగళుం పొయిగై" అని ప్రస్తావించి-ప్రస్తుతించినారు.అనేక పద్మములతో అందముగా నున్నది ఈ కొలను.  ఇది బాహ్య దర్శనమునకు దృశ్యము.  కాని హ్రీంకారోపాసనమును నిరంతరము చేయుచున్న ఈ కొలనులోని పద్మములు స్వామి సమక్షములో నిరంతరమును నిస్తులనాదోపాసనమును చేయుచున్న అనేకానేక అద్భుత యోగి గణములు.   పొయిగై దగ్గరకు వచ్చిన పడుచులకు ఆ దివ్యనాదము రెండు విషయములను స్పురింపచేయుచున్నది.  మొదటిది- కూట్రం-     సమస్తమునకు-సమస్త నిర్మానమునకు మూలము.స్వామియే నిర్మాత-దర్శకుడు. ...

tiruvembavay-11

Image
  తిరువెంబావాయ్-11  *****************  ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న  కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్పాడి  అయ్యా వళియడియోం వాల్దోంకణ్ ఆరళల్పోర్  శయ్యా వెణ్ణిరాడి శెల్వ శిరుమరుంగుల్  మయ్యార్ తడంకన్ మడందై మణవాలా  మయ్యా నీలాడ్ కుండేర్ అరులం విడయాట్రిన్ ఉయ్యార్కల్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిందోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలోరెంబావాయ్.      అవ్యాజ కరుణామూర్తియే పోట్రి    **********************   తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో కోనేటి తీర్థమును గురించి,దానిలో చేయు పుణ్యస్నాన ఫలితములను గురించిస్వామిని సంకీర్తిస్తూనే మనకు వివరిస్తున్నారు.  పడుచులందరు కోనేటి దగ్గరకు వచ్చారు.  దైవత్వము జలమును అనుగ్రహించ్నపుడు తీర్థముగా పునీతము అగుతుంది.తనలో మునిగిన వారి కల్మషములను భౌతికముగా మానసికముగా నున్న వాటిని పూర్తిగా తొలిగించివేస్తుంది.ఇది కాదనలేని సత్యము.  ఇంకొక విషయము ఈ తిరునీరు ఒక్కొక్క సారి పన్నీరై,స్వామి అభిషేక జలమై కొంచము మనపై చిలకరింపబడుతు మనలను ఆశీర్వదిస్తుంది.  కాని పరమహంసలైన పడుచులు ఈ కొలనులో పూర్తిగా ముని...

TIRUVEMBAVAY-10

తిరువెంబావాయ్-10  *****************  పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్  పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే  పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్  వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం  ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్  కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్  ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.  విశ్వరూపాయ పోట్రి  ***************     తిరు మాణిక్యవాచగరు స్వామిని అరూపా-బహురూపా అంటు సంకీర్తిస్తూ స్వామి మన మీది అనుగ్రహముతో అర్థనారీశ్వరమై-మీనాక్షి-సుందరేశనుగా దర్శన భాగ్యమును ప్రసాదించిన వైనమును మహదానందకారకము.  స్వామి వ్యాపకత్వమును-స్వామి నివాస స్థలమును-స్వామి నామమును-స్వామి కుటుంబమును అపరిమితములు.అనితర సాధ్యములు.కనుకనే చెలులు ఈ విధముగా స్వామి వైభవమును మననము చేసుకొనుచున్నారు.  పాదాళం-పాతాళము,  కిందనున్న ఏడులోకముల,   అతల-సుతల-రసాతల  మొదలగువాటి కింద కిందకు వెళ్ళి వెతికినను,దేనిని? పాదమలర్ శొర్కళియ-స్వామి పాదపద్మములను వెతికినను కనపడలేదు.  అప్పుడు వారు,పోదుల్ పునై పునై-ఇంకా ఇంకా ...

TIRUVEMBAVAY-09

 తిరువెంబావాయ్-09  ************  మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై  పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె  ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో  ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో  అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు  శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం  ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్  ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్  తిరువారూర్ పూకోవెల  స్వామియే పోట్రి  ********************************  మొదటి ఎనిమిది పాశురములలో చెలులు నిదురించుచున్నవారిని మేల్కొలుపుచు,వారిని శివసేవా సన్నధ్ధులను చేస్తున్నట్లుగా కీర్తించారు.కాని,  తొమ్మిదవ పాశురములలో చెలులు అందరు సామి సనాతనత్వమును-సహృదయతను చాటుచు,నిత్యనూతనుడైన స్వామి నిరంతర నిష్కలంక సేవా సౌభాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. మున్నై పరం పొరుక్కుం-  అన్నిటికన్నా/అందరికన్నా ముందరగా నున్నది దైవము.అది సనాతనము.మూలము.దానికి ఆది-అంతము-కాలపరిమితి లేదు. మున్నై పరం పొరుళై-  బిందువు విస్తరించి వృత్తముగా మారునట్లు,మూలపదార్థము విస్తరిస్తూ,వ్యాపిస్తూ,ఎన్నో నూతన రూపములుగా ప్రకటిం...