Posts

TIRUVEMBAVAY-26

Image
        తిరువెంబావాయ్-26   *****************  పప్పర విట్టిరుం దుణరుం నిన్ అడియార్  పందనై వందరు దా అవరుం పలరుం  మైపురు కణ్ణియ మానుడత్తి    ఇయల్బి  వణంగు కిరార్ అనంగిన్ మణవాళా  శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్శూల్  తిరుపెరుం తురైయురై శివపెరుమానే  ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియుం  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.   గిరిజాసమేత మహాదేవాయపోట్రి   *******************************  గౌరి కళ్యాణ వైభోగమే-మహదేవ కళ్యాణ సౌభాగ్యమే,  తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములోశివ-శక్తుల పరిణయము-శుభకరపరిణామములను నర్మగర్భముగా తెలియచేస్తూ,అర్థనారీశ్వర తత్త్వ పరమార్థమును ప్రస్తుతిస్తున్నారు.  నమః పార్వతీ పతియే హరహర మహాదేవ శంభో.  స్వామి మీరు మా మైపురు కణ్ణియ-లేడికన్నుల వంటి కన్నులు కలిగిన పార్వతీదేవికి,  మానుదత్తి ఇయల్బి-తగిన వరుడు.  ఇది నిస్సందేహము.  ఈ సందర్భములో మనకు పోతన మహాకవిదర్శించిన,  "తగునీచక్రి విదర్భరాజ సుతకున్   తథ్యంబు వైదర్భియున్ తగు నీ చక్రికి"  మన మాణిక్యవాచగరు గిరిజ-గిరీశ...

TIRUVEMBAVAY-25

Image
     తిరువెంబావాయ్-25 ***************** పూదంగల్ దోరుం  ఎన్రాయిన్ అల్లాల్ పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్ గీదంగళ్ పాడోదల్ అడుదల్ అల్లాల్ కేట్టరియో ఉన్నై కణ్దరి వారై   శీదనంకోల్ వయిల్ తిరువ్ పెరుంతురై మన్నార్ శిందనక్క అరియాయ్  యేంగన్ మున్ వందు ఏదంగళ్ అరుత్తు ఎమ్మై  ఆండరు పురియుం ఎంపెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె   పంచభూత/సర్వభూత స్వరూపా పోట్రి   ********************************  వ్యూహ-అర్చా మూర్తి తత్త్వమును ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు అందించుచున్నారు.  1.పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్     స్వామి జగద్రక్షణ కోసము నీవు నిరాకార-సాకార స్థితులకు రాకపోకలు చేస్తావు.  స్వామి రాకపోకలు జరుపుతాడా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమును విజ్ఞులు చెబుతారు.  నిరాకార-నిర్గుణ-నిరంజన-నిస్తుల-నిశ్చలస్థితి పరమాత్మ స్వస్వరూపము.  అయినప్పటికిని సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను జరుపుటకు స్వామి  సాకార-సద్గుణ-సమ్రక్షణ-అను గుణములతో-స్వప్రకాశ దివ్య మంగళ స్వరూపముతో మనలకు అందుబాటులోనికి వస్తు,ఆశీర్వదిస్తూ-అ...

TIRUVEMBAVAY-24

Image
    తిరువెంబావాయ్-24  *************   ఇన్నిశయ వీణయన్ యాళినర్ ఒరుపాల్   ఇరుక్కొదు తోత్తిరం ఇయంబినర్ ఒరుపాల్   తున్నియ పిణై మలర్ కయ్యనార్ ఒరుపాల్   తొళి కయ్యర్ అళుకయ్యర్ కువల్ కయ్యర్ ఒరుపాల్   చెన్నియ అంజలి కుప్పినార్ ఒరుపాల్   తిరుప్పెరున్ తురై యురై శివపెరుమానే  ఎన్నయు అండుకొండు ఇన్నరుళ్ పురియుం  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె  అత్మనాథస్వామి తిరు వడిగలే పోట్రి  ***************************   తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో భగవదనుగ్రహము-భగవదారాధన,  ఏ విధముగా బహు ముఖములైభాసించుచున్నవో వివరించుచున్నారు.  భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని అర్చించుచున్నభగవద్భక్తి ఆధేయము.  స్వామి, అండుంకొండుం-అనేకానేకములైన/అనేకవిధములైన/ఈ తీరుననే అని నిర్ణయించలేనిదైన,  నీ అనుగ్రహ ఆశీర్వచనము ఎన్ని విధములుగా ప్రకటింపబడుతున్నదో,  పురియం-నాకు పరిచయముకావింప బడుతున్నదో,పరమ సంతోషాంతరంగముతో నీకు నివేదిస్తాను. ఈ పక్క-ఒరుపాల్,ఆ పక్క అనికాదు.ఎటు పక్క చూసినను నీ అర్చనావిధానము,అతి రమణీయమై అలరారు చున్నది.  మొదటిది...

TIRUVEMBAVAY-23

Image
       తిరువెంబావాయ్-23  *****************  కూవిన పూంగుయిల్ కూవిన కోళి  కురుగుకు ఇయంబిన ఇయంబిన శంగం  ఓవిన తారకై ఒళిఒళి ఉదయత్తు  ఒరుప్పడు కిన్రాడు విరొప్పొడు నమక్కు  తేవన తెరికళల్ కాలి కాట్టాయ్  తిరుపెరుం తురైరురై శివపెరుమానే  యా వరుం ఆరివరి ఆయమ కడయాయ్   ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.   అనుగ్రహాభరణ పాదయే పోట్రి   *********************  తిరుమాణిక్యవాచగరు మనకు అందించిన ఈ అద్భుత సుప్రభాత సేవలో ఇంతవరకుపద్మములు-సూర్యుడు స్వామి ముఖారవిందకాంతిని తమతో తెచ్చుకుని ప్రకాశిస్తూ-ప్రశంసిస్తున్నారు.  ఈ పాశురములో కాంతిని నాదము అనుసరించి స్వామిని అర్చించుచున్నది. అవి ఏమనగా, కూవిన పూంగుయల్-కోకిల సుస్వరములు, కూవిన కోళి-కుక్కుట/కోడి సుప్రభాతములు, ఇయంబిన కురుగుకళ్-పక్షుల కిలకిలారావములు, శంగం ఇయంబిన-శంఖనాదార్చనలు,  శబ్దసేవతో పునీతములగుచున్నవి.  స్వామి నీ కనుసన్నలలో నడచు ప్రకృతి,నియమానుసారముగా ప్రవర్తించుచు నిన్ను సేవించుచున్నది.అవిగో, తారకె ఓవినై-నక్షత్రములు కనుమరుగగుచున్నవి.  ఒళి-ఒళి-తేజస్సును క్రమముగా ఒక పుంజ...

TIRUVEMBAVAY-22

Image
  తిరువెంబావాయ్-22 ***************   అరుణన్ ఇందిర దిశై అణుగీనన్ ఇరుళ్ పో   అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్   కరుణను శూరియ యళయళ నయన   కడిమలర్ మలరమర తణ్ణనల్ కణ్ణా   తిరనిరై అరుపదం మురల్వన్ ఇవైయో   తిరుపెరున్ తిరైయురై శివపెరుమానే   అరుళిరి తరువరం ఆనందమలయే   అలైకడలే పళ్ళి ఎళుందరుళాయె.  పూసలర్ పూజిత తిరువడిగళే పోట్రి.  ************************   తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో పద్మములు ఏ విధముగా స్వామి అనుగ్రహకాంతిని స్వీకరించి సంతోషముతో పరవశిస్తు-వికసిస్తూ-ప్రకాశిస్తున్నాయో సంకీర్తించారు.  ఈ పాశురములో స్వామి తన ముఖకాంతిని సూర్య కిరణములకు ప్రసాదించించి,జగములను చేతనవంతము చేస్తున్నాడో ప్రస్తుతిస్తున్నారు. శివపెరుమానే-మహాదేవా! ఇరుళ్-చీకట్లు నిష్క్రమించినవి.  ఎందువలన? అరుణన్-నీ అనుగ్రహమనే ఎర్రని సూర్యుడు, చేరుకున్నాడు-ఎక్కడికి? ఇందిరన్ దిసై-తూరుపు దిక్కునకు.  తత్ఫలితముగా మా హృదయపద్మములు వికసిస్తూ,తమోగుణమనే చీకట్లను తరిమివేస్తున్నాయి.  ఆ అరుణోదయ భానురేఖల భాగ్యమును నేనేమనగలను?అవి ఎంత ధన్యతను పొందినవో-సాక్షాత్తు నీ...

tTIRUVEMBAVAY-21

Image
     పరమాద్భుతము పరమాత్మ అనుగ్రహము.ఆరుద్రనక్షత్ర దర్శన అడుత్తనాళ్-మరుసటిరోజు నుండి శైవ సనాతన ధర్మమును అనుసరించి తిరుమాణిక్య వాచగరు దర్శించి-స్తుతించిన,"తిరుపళ్ళిఎళుచ్చి" పది పాశురములతో,తురుపెరుం తురై లో కొలువైన అవుడయార్ కోవెల లోని ఆత్మనాథస్వామికి సమర్పించు "సుప్రభాత సేవ" గా దీనిని భావిస్తారు.  స్వామికి మన ఉపాధి ధర్మములను ఆపాదిస్తూ,మనలో ఒకనిగా భావిస్తు,తెలవారుచున్నదని,నిదురను చాలించి,మేల్కాంచి జగద్రక్షణను జరుపమనుట వాచ్యార్థము.  నిజమునకు స్వామి అనవరతము జాగరూకతతో మనలను కంటికి రెప్పవలె కాపాడుతుండుట కాదనలేని సత్యము. అయితే మరి ఈ  తిరు -శుభకరమైన,మంగళప్రదమైన  పళ్ళి-నిదుర-పవళింపు నుండి, ఎళుచ్చి-మేల్కొలమనటములోని అంతరార్థము ఏమిటి?  పళ్ళి అనే పదమునకు విజ్ఞులు పాఠము అని కూడ అన్వయిస్తారు.  స్వామి! ఓ అంతరాత్మ మేము ఉపాధి ధర్మమును అనుసరించి,స్వల్పకాలిక లయమును ముగించి తిరిగి జాగరూకులమైనాము. ( నీ అనుగ్రహముతో)  స్వామి మాకు యుక్తాయుక్త విచక్షణమను పాఠమును బోధించి మమ్ములను ఉధ్ధరించు.  పళ్ళి అనే పదమునకు ఉపచారమును కూడా కొందరు భావిస్తారు.  ఈ ఉపచారము మనక...

tiruvembavay-20

Image
     తిరువెంబావాయ్-20 *****************  పోట్రి అరుళగనిల్ ఆదియాం పాదమలర్  పోట్రి అరుళగనిల్ అందామన్ శెందళిర్గళ్  పోట్రి ఎల్లా ఉయిర్కుం తోట్రమాం పొర్పాదం  పోట్రి ఎల్లా ఉయిర్కుం బోగమాం పుణ్కళల్కళ్  పోట్రి ఎల్లా ఉయిర్కుం ఈరాం ఇళై అడిగళ్  పోట్రిమాల్ నాన్ ముగముం కాణాద పుండరీకం  పోట్రియాం ఉయ్య ఆర్ కొండరళుం పొన్ మలర్గళ్  పోట్రియాం మార్గళినీర్ ఆడేరో ఎంబావాయ్  పేరింబమా-పెరుకరుణయా పోట్రి  ***************************  తిరుమాణిక్యవాచగరు మహదానందముతో మన స్వామికి మంగళాశాసనములను చేయుచున్నాడు .  అచంచలభక్తి ఆత్మీయమై అచలాధీశునికి ,    పోట్రి-పోట్రి-పోట్రి జయము-జయము-జయము అంటు పరవశిస్తు దీవిస్తున్నది.     తిరుమాణిక్యవాచగర్ వాల్గ.   *******************   ఇంతటి అద్భుత అనుగ్రహమైన తిరువెంబాయ్ అను స్వామి సంకీర్తమును ముందుతరములకు అందించిన మహనీయ వర్ధిల్లు.  మాణిక్యవాచగరు స్వామి పాదపద్మములను పరిపరి విధములుగా,పలు నామములతో ,    పాదమలర్  శెందళిర్గళ్  పొర్పాదం  పుణ్కళల్ కళల్  ఇళై అడ...