Posts

TIRU MOOLAR NAAYANAAR

తిరుమూలర్ నాయనారు ******************* మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు. తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవుల...

ADIPATTA NAYANARU

అడిపత్త నాయనార్ **************** నాగపట్టణమునకు పరదవర్ అనగా బెస్తజాతినాయకుడు -పరమ శివభక్తుడు అడిపత్త నాయనార్.పరాశర మహర్షిచే అనుగ్రహింపబడిన వ్యాసుని తల్లియైన మత్స్యగంధి వంశమువాడు. ప్రతిరోజు చేపలు పట్టి,వానిని అమ్మి వచ్చిన ధనముతో జీవనమును సాగించుట కులవృత్తి.పట్టిన చేపలలో మొదటిదానిని(చిన్నదైన-పెద్దదైన)శివనైవేద్యముగా కడలికి తిరిగి సమర్పించుట ప్రవృత్తి. కాలాంతకుని లీలలు కాలమును ఒక్కరీతిగా గడువనీయదు కదా.కరుణ తాను కాసేపు కనుమరుగై కఠినత్వమునకు దారిచూపుతు తన పని కానిచ్చేస్తుంటుంది. మన నాయనారును క్రమక్రమముగా పరీక్షించసాగినది. పక్కనున్న బెస్తల వలలో పుష్కలముగా చేపలు.అడిపత్త వలలో మాత్రమే ఒకే ఒక చేపను చిక్కించి కాలము తన మాయా జాలము చేస్తున్నది.అడిపత్త అత్యంత భక్తిశ్రధ్ధలతో దానిని శివనైవేద్యముగా సమర్పించి,సంతుష్టాంతరంగుడై పస్తులను ఉంటూ ఏమాత్రము నొచ్చుకోకుండా వచ్చి (ప్రతిరోజు) వలవేసి,వచ్చిన దానిని స్వామికి నివేదనము చేసి వెళ్ళేవాడు. సరిలేనివాని కరుణకు సాక్ష్యముగా కఠినరూపముగా నాయనారు దరిచేరిన దారిద్ర్యము శివనైవేద్య నియమమును దూరముచేయలేకపోయినది.చింతను దగ్గరకు రానీయలే...

SAKTI NAYANARU.

శక్తి నాయనారు వ్యవసాయ కుటుంబమునకు చెందినవాడు.పరిణిజయూరు లో జన్మించాడు.అమితమైన సివభక్తి కలవాడు. ఎవరైనను రుద్రాక్షలు ధర్,విభూతి పుండ్రములు ధరించకున్నప్పటికిని,సదాచార సమోన్నులు కాకపోయినప్పటికిని,రుద్రాభిషేకములు చేయకపోయినప్పటికిని వారిని విమర్శించకుండ ఉండగలుగు సంస్కారము కలిగియున్నప్పటికిని,నాయనారు శ్రవణేంద్రియము మాత్రము శంభుదూషణుని క్షమించలేని కఠినత్వము కలది.భావములను భాషగా మార్చుటలో సహకరించుచున్న నాలుకను కత్తిరించివేయకుండా ఉండలేనిది. శివనాథు వర్ణించు జిహ్వజిహ్వ-దాని నియమము.అన్యము అనర్థదాయకమనుచు ,దానిని తీసివేయేసే మోటుదనములో దీటులేనిది. ఇది బాహ్యమునకు మనకు కనిపించుచున్న దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే పరమపూజ్యుడైన నాయనారు,అన్నమయ్య కీర్తించినట్లు, భావములోన-బాహ్యము నందున గోవింద-గోవింద అనికొలువవే ఓ మనసా అనుటకు నిలువెత్తు నిదర్శనము. కనుకనే అత్తినాయనారు-సత్తి నాయనారు-శక్తి నాయనారు అని సన్నుతించుటలోని ఆంతర్యమును కొంచము పరిశీలిద్దాము. అత్తి అనగా వటవృక్షముగా పోల్చి-ప్రళయానంతరము జగన్నాధుని సేవించినది. సత్తము అను తమిళ పదము శబ్దము అను అర్థమును తెలియచేస్తుంది.తీయ సత్తము ...

guggila kalaya nayanaru

గుగ్గిల కలయ నయనారు ******************* " కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్నిదుష్టపాలతే నమః శివాయ మూలకారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధునా దయాలవాలతే నమః శివాయ" **** .బాలుని రక్షించిన కాలకాలునకు దండాలు శివా దక్షుని శిక్షించిన వీరభద్రునకుదండాలు శివా కార్య-కారణముల మూలకారణునకు దండాలు శివా నన్ను పాలించు దయాలవాలునకు దండాలు శివా *** షోడశోపచారములలో ఒకటైన ధూప సమర్పణముతో, " దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం ధూపం దాస్యామితే దేవ గృహేణ పరమేశ్వర" అంటూ, సాంబశివునికి సాంబ్రాణిధూపసేవ చేస్తూ పరవశించిపోయేవాడు. సంబరేణుచెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చి0చు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు. తిరుకడవూరులో అమృతలింగేశ్వరుని ఆశీర్వాదముగా, బ్రాహ్మణ(బ్రహ్మమును తెలిసికొనగలిగిన) వంశములో జన్మించిన కలయ నాయనారు పూజారిగా తన విధులను నిర్వ...

pusalar nayanar

పూసలరు నాయనారు ****************** : శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమఃశివాయ ధామలేశ ధూతకోక బంధవే నమః శివాయ నామశోషితాన మద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ. 1.శుభలక్షణమైన ఆత్మస్వరూపమునకు దండాలు శివా చిన్ని కాంతి సూర్యుడైన చిత్ప్రకాశమునకు దండాలు శివా సంతాపనాశకమైన చిదానందమునకు దండాలు శివా భవతారకమైన భక్త బాంధవునకు దండాలు శివా. ప్రకటిత భక్తి ప్రాధాన్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు రాజసిమ్హ బిరుదాంకిత పల్లవరాజు కదవర్కన్.మోక్షక్షేత్రమైన కాంచీపురములో అత్యద్భుత కైలాసనాథర్ దేవాలయమును అత్యంత బ్రహ్మాండముగా కట్టించాడు. శివలీలను గ్రహించగలుగుట సామాన్యమైన విషయమా? ఆటను ప్రారంభించాడు ఆదిదేవుడు. అదే రాజ్యములో,అదే కాలములో,అదే వేగముతో భిక్షాటనతో జీవనము చేస్తున్న అతి నిరాడంబర0గా నున్న, పూసలర్ మానసమందిర నిర్మాణమునకు నాంది పలికినాడు నందివాహనుడు.అదియే "హృదయేలేశ్వరాలయము" అంతా గోప్యము.అదియే దాని గొప్పతనము. పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు...

intro

ప్రియ శివస్వరూపులారా,నమస్కారములు. పాహిమాం హర హర మహాదేవ శంభో శంకర-పాహి-పాహి ************************************************************ పంచభూత సమమిళితము ప్రపంచము.నింగి-నేల-నిప్పు-నీరు-గాలి అను పంచభూతములు(ఐదు ప్రధానంశములు) పరోపకార ఫలితమే మన పర్యావరణము. చాంద్రమాన ప్రకారము చంద్రుడు కృత్తిక నక్షత్ర నివాసముచేయు మాసము కార్తిక మాసము.చంద్రునకు గల మరో పేరు సోముడు.పరమేశ్వరుని అర్థనారీశ్వర శక్తి ఉమ,తల్లి ఉమను కూడియున్న పరమేశ్వరుని సోముడు అని కీర్తిస్తారు. కార్తిక మాసములో పంచభూతములైన నింగి శరత్కాల వెన్నెలతో ఔషధములను అందించుచు ఆరోగ్య వంతులను చేస్తుంటుంది.నేల ఔషధులను ఉత్పత్తి చేస్తుంటుంది.నీరు వర్షపునీటిలోని ఔషధములను స్వీకరించి పరిశుభ్రమై పరిపుష్టినిచ్చుటకు సిద్ధముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కనుక నిప్పును సర్వరోగములను దహిస్తూ,సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంటుంది.గాలి పచ్చదనములోని ప్రాణవాయువును అందిస్తూ ప్రపంచ సౌభాగ్యమునకు ప్రధాన కారణముగా పనిచేస్తుంటుంది.కనుక ఈ మాసములో స్నానము,జపము,తపము,ఉపాసనము.దీపము,ధ్యానము,దానము సదాశివునికి సంతోషదాయకము.(మన లోపలి-బయటి ప్రపంచమునకు.) "...

CHANDEESVARA NAYNAR

యక్షరాజ బంధవే దయాళవే నమః శివాయ దక్షపాణి శోభికాంచనాళవే నమః శివాయ పక్షిరాజ వాహ హృచ్ఛయాలవే నమః శివాయ అక్షిఫాల వేదపూత తాలవే నమః శివాయ. ముట్టడించిన మన్మథుని గుట్టువిప్పిన వానికి దండాలు శివా పుట్టుట-గిట్టుటను మట్టుపెట్టువానికి దండాలు శివా బెట్టుసేయక వరములిచ్చే పట్టుకొమ్మకు దండాలు శివా గుట్టుగా నాలోన దాగిన గుట్టదొరకు దండాలు శివా