Posts

murty nayanar

మూర్తి నాయనారు ************ శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా వెండికొండ చరియలందుండు వానికి దండాలు శివా మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా ******** [08:46, 10/11/2021] విమల: మూర్తి నాయనారు. ******* నిరాకార భగవత్స్వరూపముగా తాను సాకారముగా ప్రకటింపబడుటయే మూర్తిమంతము.ప్రకటింపబడిన స్వరూపముయే మూర్తి. మనము ఈ రోజు సాకారరూపియైన భగవంతుని మూర్తినాయనరుగా కీర్తించుకుందాము. " గంధము పూయరుగా-కస్తూరి గంధము పూయర్య్గా" అని యదునందనుని గంధపుసేవు గానముతో చేస్తూ పరవశిస్తూ ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. అదే విధముగా షోడశోపచారములలో ఒకటైన గంధపుసేవా ప్రాశస్త్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు మన మూర్తి నాయనారు. మంగళకరమైన మధుర పట్టనమున వ్యాపారకుటుంబములో జన్మించిన మూర్తి నయనరు గంధపుచెక్కల వ్యాపారమును చేసేవాడట. మధురలోని చొక్కనాథస్వామికి చందనసేవార్చనాసక్తుడు. ప్రతి ఉదయము స్వామికి తానే స్వయముగా చందనమును అరగదీసి స్వామికి అలంకరించి ఆనందించేవాడు.ఇది బాహ్యార్థము. కాసేపు మనము రాయిని పాంచభౌతిక ప్రపంచమన...

SAKKIYA NAYANAR

సక్కియ నాయనారు ****************** [05:42, 09/11/2021] విమల: ఆపదద్రి భేద టంక హస్తతే నమః శివాయ పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ పాపధారిణే లసన్నమస్తతే నమః శివాయ శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.(చంద్రుని శాపమును/పాపమును నశింపచేసిన శివా) చిదానందరూపా-సక్కియ నాయనారు ************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివపూజకు అనుమతిలేని పాలనలో ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో కనపడులింగము పూర్వము తానును రాయియే కదా ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబ నా చింతలు తీర్చు గాక. సత్యాన్వేషణ సాధనముగా ఏ మతమ...

TIRU MOOLAR NAAYANAAR

తిరుమూలర్ నాయనారు ******************* మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు. తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవుల...

ADIPATTA NAYANARU

అడిపత్త నాయనార్ **************** నాగపట్టణమునకు పరదవర్ అనగా బెస్తజాతినాయకుడు -పరమ శివభక్తుడు అడిపత్త నాయనార్.పరాశర మహర్షిచే అనుగ్రహింపబడిన వ్యాసుని తల్లియైన మత్స్యగంధి వంశమువాడు. ప్రతిరోజు చేపలు పట్టి,వానిని అమ్మి వచ్చిన ధనముతో జీవనమును సాగించుట కులవృత్తి.పట్టిన చేపలలో మొదటిదానిని(చిన్నదైన-పెద్దదైన)శివనైవేద్యముగా కడలికి తిరిగి సమర్పించుట ప్రవృత్తి. కాలాంతకుని లీలలు కాలమును ఒక్కరీతిగా గడువనీయదు కదా.కరుణ తాను కాసేపు కనుమరుగై కఠినత్వమునకు దారిచూపుతు తన పని కానిచ్చేస్తుంటుంది. మన నాయనారును క్రమక్రమముగా పరీక్షించసాగినది. పక్కనున్న బెస్తల వలలో పుష్కలముగా చేపలు.అడిపత్త వలలో మాత్రమే ఒకే ఒక చేపను చిక్కించి కాలము తన మాయా జాలము చేస్తున్నది.అడిపత్త అత్యంత భక్తిశ్రధ్ధలతో దానిని శివనైవేద్యముగా సమర్పించి,సంతుష్టాంతరంగుడై పస్తులను ఉంటూ ఏమాత్రము నొచ్చుకోకుండా వచ్చి (ప్రతిరోజు) వలవేసి,వచ్చిన దానిని స్వామికి నివేదనము చేసి వెళ్ళేవాడు. సరిలేనివాని కరుణకు సాక్ష్యముగా కఠినరూపముగా నాయనారు దరిచేరిన దారిద్ర్యము శివనైవేద్య నియమమును దూరముచేయలేకపోయినది.చింతను దగ్గరకు రానీయలే...

SAKTI NAYANARU.

శక్తి నాయనారు వ్యవసాయ కుటుంబమునకు చెందినవాడు.పరిణిజయూరు లో జన్మించాడు.అమితమైన సివభక్తి కలవాడు. ఎవరైనను రుద్రాక్షలు ధర్,విభూతి పుండ్రములు ధరించకున్నప్పటికిని,సదాచార సమోన్నులు కాకపోయినప్పటికిని,రుద్రాభిషేకములు చేయకపోయినప్పటికిని వారిని విమర్శించకుండ ఉండగలుగు సంస్కారము కలిగియున్నప్పటికిని,నాయనారు శ్రవణేంద్రియము మాత్రము శంభుదూషణుని క్షమించలేని కఠినత్వము కలది.భావములను భాషగా మార్చుటలో సహకరించుచున్న నాలుకను కత్తిరించివేయకుండా ఉండలేనిది. శివనాథు వర్ణించు జిహ్వజిహ్వ-దాని నియమము.అన్యము అనర్థదాయకమనుచు ,దానిని తీసివేయేసే మోటుదనములో దీటులేనిది. ఇది బాహ్యమునకు మనకు కనిపించుచున్న దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే పరమపూజ్యుడైన నాయనారు,అన్నమయ్య కీర్తించినట్లు, భావములోన-బాహ్యము నందున గోవింద-గోవింద అనికొలువవే ఓ మనసా అనుటకు నిలువెత్తు నిదర్శనము. కనుకనే అత్తినాయనారు-సత్తి నాయనారు-శక్తి నాయనారు అని సన్నుతించుటలోని ఆంతర్యమును కొంచము పరిశీలిద్దాము. అత్తి అనగా వటవృక్షముగా పోల్చి-ప్రళయానంతరము జగన్నాధుని సేవించినది. సత్తము అను తమిళ పదము శబ్దము అను అర్థమును తెలియచేస్తుంది.తీయ సత్తము ...

guggila kalaya nayanaru

గుగ్గిల కలయ నయనారు ******************* " కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్నిదుష్టపాలతే నమః శివాయ మూలకారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధునా దయాలవాలతే నమః శివాయ" **** .బాలుని రక్షించిన కాలకాలునకు దండాలు శివా దక్షుని శిక్షించిన వీరభద్రునకుదండాలు శివా కార్య-కారణముల మూలకారణునకు దండాలు శివా నన్ను పాలించు దయాలవాలునకు దండాలు శివా *** షోడశోపచారములలో ఒకటైన ధూప సమర్పణముతో, " దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం ధూపం దాస్యామితే దేవ గృహేణ పరమేశ్వర" అంటూ, సాంబశివునికి సాంబ్రాణిధూపసేవ చేస్తూ పరవశించిపోయేవాడు. సంబరేణుచెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చి0చు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు. తిరుకడవూరులో అమృతలింగేశ్వరుని ఆశీర్వాదముగా, బ్రాహ్మణ(బ్రహ్మమును తెలిసికొనగలిగిన) వంశములో జన్మించిన కలయ నాయనారు పూజారిగా తన విధులను నిర్వ...

pusalar nayanar

పూసలరు నాయనారు ****************** : శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమఃశివాయ ధామలేశ ధూతకోక బంధవే నమః శివాయ నామశోషితాన మద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ. 1.శుభలక్షణమైన ఆత్మస్వరూపమునకు దండాలు శివా చిన్ని కాంతి సూర్యుడైన చిత్ప్రకాశమునకు దండాలు శివా సంతాపనాశకమైన చిదానందమునకు దండాలు శివా భవతారకమైన భక్త బాంధవునకు దండాలు శివా. ప్రకటిత భక్తి ప్రాధాన్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు రాజసిమ్హ బిరుదాంకిత పల్లవరాజు కదవర్కన్.మోక్షక్షేత్రమైన కాంచీపురములో అత్యద్భుత కైలాసనాథర్ దేవాలయమును అత్యంత బ్రహ్మాండముగా కట్టించాడు. శివలీలను గ్రహించగలుగుట సామాన్యమైన విషయమా? ఆటను ప్రారంభించాడు ఆదిదేవుడు. అదే రాజ్యములో,అదే కాలములో,అదే వేగముతో భిక్షాటనతో జీవనము చేస్తున్న అతి నిరాడంబర0గా నున్న, పూసలర్ మానసమందిర నిర్మాణమునకు నాంది పలికినాడు నందివాహనుడు.అదియే "హృదయేలేశ్వరాలయము" అంతా గోప్యము.అదియే దాని గొప్పతనము. పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు...