Posts

PASURAM-12

Image
తిరుచిట్రంబలం-పాశురం-12 ************************ ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్ ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్ ***** ఆర్తా విషణ్ణా శిధిలాస్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికనము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము. జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి శ్రీ అదిసంకరులు భజగోవిందములో వచించినట్లు, పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పిరవి-తిరిగి తిరిగి, తుయిర్ కెడ-బాధలలో మునిగి సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్తుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక మనలను...

PAASURAMU-11

Image
తిరుచిట్రంబలం-పాశురం-11 *********************** ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్ శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు మరుంగుల్ మయ్యార్ తడంగన్ మడందై మణవాలా అయ్యా నీరాట్కొండ అరుళుం విడయాట్రిన్ ఉయివార్గళ్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిదోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలో రెంబావాయ్ తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో పుణ్యతీర్థ స్నానము మహిమ గురించి కీర్తిస్తున్నారు. " అపవిత్రో పవిత్రావ సర్వస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సః బాహ్య-అభ్యంతరః శుచిః" వశిష్ట ముని జనక మహారాజునకు చెప్పిన విధముగా సర్వదేవతాశక్తులును సత్వగుణసోభను సంతరించుకొని ద్రవరూపమై జలావాసమును చేయుచున్న సమయమున జీవుని పాప-పుణ్యములతో సంబంధములేక వేసిన మునక కల్మహములను హరించివేసి,సన్మార్గమును చూపి,సద్గతిని ప్రసాదిస్తుందని ఆర్యోక్తి. ప్రస్తుత పాశురములో వెణ్ణిరాడై ప్రాభవము ప్రస్తుతింపబడుచున్నది. వెణ్-తెల్లని నీర్-ఆడి-జలములో స్నానముచేసి శెల్వన్-ఐశ్వ్ర్య వంతులైన వారిని చెబుతున్నారు. తెల్లని జలములో స్నానము చేసి భగవంతుడు-భక...

PASURAM-10

Image
తిరువెంబావాయ్-10 ***************** పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్ పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్ వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్ కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్ ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్ ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్. విశ్వరూపాయ పోట్రి *************** ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్పురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపాన్ ధ్యాయేత్ ఈప్సితసిధ్ధయే ధృవపదం విప్రోభిషించే శివం. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా పోట్రి ****************************************** ప్రస్తుత పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామిని,బహువిధములుగా దర్శించి ప్రస్తుతిస్తున్నారు. స్వామి వేదస్వరూపుడు. వేదమేక గుణం జస్త్వా తదహ్నైవ విశుధ్ధ్యతే వేదం అంటే నాదం.దీనినే వేదం అణువణువున నాదం అంటు భక్తులు కీర్తిస్తారు స్వామిని.అంటే స్వామి శబ్దము ద్వారా ప్రకటింపబడుతున్నాడు/ప్రస్తుతింపబడుతున్నాడు/ప్రసన్నమగుతున్నాడు. స్వా...

PAASURAM-09

Image
తిరుచిట్రంబలం-పాశురం-09 *************************** తిరువెంబావాయ్-09 ************ మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్ ఎన్న కురయుం ఇలో మేలోరెంబావాయ్ ఉన్నడియార్ తొళుంబాయ్ పోట్రి ************************* భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి తిరుమాణిక్యవాచగర్ భగవదనుగ్రహమును పొందుటకు సులభమార్గమును ప్రస్తుత పాశురములో మనకు అనుగ్రహించుచున్నారు . ఎనిమిదవ పాశురము వరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపుతున్నట్లుగా బాహ్యమునకు /చేతనవంతులుగా మార్చుటకు ఆంతర్యములో జరిగిన ప్రయత్నమును వివరించినారు. ప్రస్తుత పాశురములో శివనోమునకు సిధ్ధపడుచున్న చెలులు తమోనిద్రను వీ డి జాగరూకులుగా నున్నవారే. భగవదనుగ్రహమును భక్తితో పొందగోరుచున్నవారే. దానికి కావలిసిన /చేయవలసిన కార్యాచరణమును అన్వేషించుచున్నవారే.. " శ్రవణం కీర్తనం విష్...

PASURAMU-08

Image
తిరుచిట్రంబలం-పాశురం-08 **************************** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళ్ పాడినో కేట్టిలైయో వాళియదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి అర్థనారీశ్వరయే పోట్రి *************** తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ప్రళయసాక్షిగా నున్న ఒకే ఒకడుగా మిగిలిన పరమాత్మ గుఇంచి ప్రస్తావిస్తూనే,మనలను చైతన్యవంతులుగా మలుచుతకు సులభమైన ఉదాహరనలతో, " అజాయ మాన బహుధా విజాయతే" అన్న సూక్తిని ప్రవేశపెట్టి నిద్వందమైన -ఒరువన్ ఒక్కటిగా గల పరమాద్భుతమును ముందు ద్వంద్వములుగా మనకు పరిచయము చేసినారు. ఇప్పటివరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపునపుడు ఉషోదయమును గురించి ప్రస్తావించలేదు. కాని ప్రస్తుత పాశురములో మన్ము వాటికన్న ఎంతో గొప్పవాళ్లమనుకొనే భావనలో నున్న మనలను చైతన్యపరచుటకు, కోళి శిలంబ-తెల్లవారుచున్నదన్న విషయమును తెల్లబరచుటకై కోడి కూయుచున్నది అని స...

pPASURAM-07

Image
తిరు చిట్రంబలం-పాశురం-07 *************************** తిరువెంబావాయ్-007 ****************** అన్నే ఇవయున్ శిలవో పల అమరర్ ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్ శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్ తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్ ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్ ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్ తెన్నాడుడయ ఇరైవా పోట్రి ఎన్నాట్టురుక్కుం ఇరైవా పోట్రి **************************** తిరుమాణిక్యవాచగర్ ప్రస్తుత పాశురములో పరమాద్భుతములను ప్రస్తావిస్తూ పరమేశుని వైభవమును ప్రస్తుతిస్తున్నారు. అన్నే-అమ్మా, ఓ వన్నెంజల్- రాతిహృదయమా, పాషాణ హృదయా, ఎన్నే తుయిలిల్-ఇది ఏమి నిద్ర అమ్మా! నీ చుట్టు జరుగుచున్న శివనాదార్చనమును నీ చెవులు నీ మనసునకు చేర్చలేకున్నవి. ఒకసారి కన్నులు తెరిచి చూడు. నాదం తనుమనిశం శంకరం అంటూ,చేతములు మాత్రమే కాక, శిన్నంగళ్-శివ వాయిద్యములు/కొమ్ము బూరలు సైతము చేతనత్వమును పొంది శివ సంకీర్తనమును చేయుచున్నవి. కాని చేతవైన నీవు ఆరాధనమును విస్మరించి నిదురించుచున్నావు. సక...

PASURAMU-06

Image
తిరుచిట్రంబలం-పాశురము-06 **************************** మానే నీ నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులర్దిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ నిజమేదో కల్లయేదో నీలకంఠుండెరుంగు ********************************** అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగక యున్న ఈశ్వరుడెరుగడా, అని వేమన నుడివి నట్లు ,తిరుమాణియవాచగరు మేల్కొలుపబడిన చెలుల వాక్చాతుర్యమును వివరిస్తూనే,ఒకామె తిత్తిక్క పేశువాయ్-వట్టి మాతలను మాత్రమే చెప్పినదని,మరొకామె పాలూర్ తేన్ పేశుం తేనెలో పాలలో నానిన పదార్థములు ఎంత మధురముగా ఉంటాయో వాటికంటె మధురమైన మాటలను మాత్రమే పలికినదని,ప్రస్తుత పాశురములోని చెలి,వీరిని మించిన వాక్చాతుర్యముతో తాను ముందటిరోజే వారి దగ్గరకు వెళ్ళి,తానే వారి నిదురను మేల్కొలుపుతానని చెప్పినది.కాని కార్యాచరణము జరుగలేదు. నీలవేణి మాటలు నీటిమూటలు-అన్నట్లుగా త్రి...