Posts

PASURAM-19

Image
తిరు చిట్రంబలం-పాశురం-19 **************************** ఉన్ కయ్యర్ పిళ్ళై ఉనక్కే అడిక్కలం ఎన్రు అంగ పళంసోల్ పుదుక్కు ఎం అచ్చ్చత్తాల్ ఇంగళ్ పెరుమాన్ ఉనక్కొండ్రు ఉరేయ్ పోంగే ఎం కొంగై నిన్ అంబర్ అల్లార్ తోళ్ శేరక్క ఎంగై ఉన కళ్ళాదు ఎప్పడియుం శేయర్క కంగుళ్ పగళ్ ఎం కణ్ మట్టొణ్డ్రు కాణార్క ఇంగి ఇప్పరిశె యమకింకో నల్గుదియేల్ ఎంగళ్ ఎన్ న్యాయ ఇది యమక్కేలో రెంబావాయ్. ....... ఆదరమొప్ప మ్రొక్కిడిదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి. ************* తిరుమాణిక్యవాచగరు, శంకణ్ అవర్పాల్ అను పాశురములో చెలులు స్వామి, ఎళుందరుళె ఇల్లంగళ్ తిరళుం అని స్వామి మనందరి ఇళ్ళకు విచ్చేయనున్నడు అని చెప్పుకున్నారు.అది వాచ్యార్థము.కాని నిజమునకు స్వామి వారి అంతరంగమున కొలువైయుండుటకు విచ్చేసియున్నాడు. అన్నా మలయా పాశురములో వారు స్వామి స్వరూప-స్వభావములను సమగ్రముగా తెలిసికొన్నారు/మనకు తెలియచేసినారు. ప్రస్తుత పాశురములో చెలులు మనకు పంచేంద్రియ-పంచతన్మాత్రల అవినాభావ సంబంధమును అద్భుతముగా తెలియచేయచున్నారు. ఇంద్రియము పరమాత్మ అయితే దాని ఆత్మ పరాభక్తి.కనుకనే వారు, తమ దృక్కులకు స్వామి దివ్యమంగళ స్వ...

PASURAM-18

Image
తిరుచిట్రంబలం-పాశురము-18 **************************** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు నాకు భేదము పోరయదెందు నరయనేకత్వమునకు హానిలేదు వాడె నేనేనె వాడను వాడొకండె ముక్తుడట్టుల గాకున్న మూఢుడతడె" ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు పరమాత్మ ప్రక్షిత-నిక్షిత స్వేఛ్చాలీలను విశదపరుస్తున్నారు. కావున, పెణ్ణే! నిన్రాన్ కళల్ పాడి అని అంటున్నారు. సామాన్యార్థమును కనుక మనము భావించుకుంటే, నిన్రాన్-నిలబడి స్వామి కళల్ పాడి-పాదపద్మములను సంకీర్తించుట. కాని ఇక్కడ మనకు అందవలసిన సందేశము మన శరీరము నిలబడి అని కాదు. ఇక్కడ మనము నిలబెట్టవలసినది మన మనసును.త్రికరణశుధ్ధిని/ఏకాగ్రతను. అన్నా మలయన్-అన్...

PASURAM-17

Image
తిరుచిట్రంబలం-పాశురం-17 ************************* శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్ ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె శంగమల పొర్పాదం తందరుళం సేవగనై అంగణ్ అరసై అడియోగళ్ కారముదై నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్ పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ ..... శివపాదము మీద నీ శిరమునుంచరాదా భవసాగరమీద దుర్భరవేదన లేదా శివ శివ శివ అనరాదా శివనామము చేదా. తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో నామసంకీర్తనము-పాద సంసేవనము అను రెండుభక్తి మార్గములను జోడించి అనంతికలల-స్వామి తేజోవంతములైన ,దయా సముద్రములైన బంగారు పాదపద్నముల గురించి సంకీర్తించుచున్నారు. మున్ ఇక్కదలి చురుక్కి పాశురములో చెలులు ఏ విధముగా అమృతవర్షములో పునీతులైనారో తెలుసుకున్నాము.త్రికరణములు శుధ్ధమైన వారి పదములు స్వామి పాదార్చన సౌభాగ్యమునకు ఉవ్విళ్ళూరుచున్నవి. వారు తమతో తాము స్వామి పాదదర్శన వైశిష్ట్యమును ఈ వ్ధముగా ముచ్చటించుకొనుచున్నారు. పోతనామాత్యుల వారు చెప్పినట్లు, తను హృద్భాషణములను స్వామి కైంకర్...

PASURAM-16

Image
నూతన సంవత్సర శుభాకాంక్షలు ------------------------------ తిరు చిట్రంబలం-పాశురం-16 ************************** మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్ ----- " ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని పోట్రి" సలిలం వర్షయ వర్షయ "ఒరురకాల్" పాశురములో తనను తాను ఆవిష్కరించుకొనుటకు అంతర్ముఖమైన చెలి,అమ్మ అనుగ్రహముతో అమృతాకర్షిణియై-ఆనందామృత వృష్టిలో మునిగి పులకించినదై,తాను పొందిన దివ్యానుభవమును తన చెలులకు సైతమును అందింపచేయుతకై బహిర్ముఖమైనట్లున్నది. కనకనేతన చెలులతో చెలులారా! రండి రండి.మనమందరము, ఎన్నపొళయాయ్ ఎన్నగలేని/ఎంచలేని మళయేలో-వర్షములో రెంబావాయ్-మునకలు వేస్తూ/మునిగితేలుదాము అంటూ పిలిచినది. బయట నున్న చెలి బాహ్యములోని బహిరాకాశమును చూస్తూ తన అనుభూతిని వివరిస్తున్నది. బాహ...

PASURAMU-15

తిరు చిట్రంబలం-పాశురం-15 ************************* తిరువెంబావాయ్-15 *************** ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్ ...... ' పరా భక్త్యా యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి- న శోచతి ఆత్మారామోభవతి ************ అంతః బహిః యత్ సర్వం వ్యాప్త పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ................................................ తిరుమాణిక్యవాచగరు మనకు ఇప్పటివరకు అందించిన 13 పాశురములలో మనకు అగుపించిన పాత్రలు,పరిస్థితులు-పరిసరములు మానవ శరీర వివిధ అవస్థలను మనలను మనము ఉధ్ధరించుటకు సహాయపడుటకు ు సహకారములుగా నున్న బాహ్య సంకేతములు. కాదారై కుడై యాడ అంటూ కుండలముల ప్రసక్తితో ప్రారంభించిన పాశురములో ఆట-పాట ,పట్టు-విడుపులను చెబుతూ,ఒకదానిని పట్తుకొనవలె నంటేఏ విధ...

paasuram-14

Image
తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... "నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం." యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరణము మనకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావ...

PASURAM-14

తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం. యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరనము మ్నకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము...