Posts

ISHANA-VASUVU

Image
ఈశానాయ నమః ************* " ఈశానా సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం" శుధ్ధస్పటిక సంకాశుడు,ఈశాన్యదిక్పాలకుడు ,అష్టవసువులలో ఒకడైన ఈశానుని,పంచబ్రహ్మలలో నొకరిగా ఐత్తరీయ అరణ్యకము కీర్తిస్తోంది. వాక్ప్రదాతయైన ఈశానుని రూపము ఒకసారి స్వేతవృషభవాహన మూర్తిగా కొన్నిచోట్లను,పద్మాసన ధ్యానమూర్తిగా మరికొన్ని చోట్లను దర్శనమిస్తుంటుంది. త్రిశూలధారిగా ఒకసారి/ఖట్వాంగధారియై మరొకసారి,గొడ్దలితో ఇంకొకసారి అవిద్యను ఖండిస్తూ,మన వాక్కును,శబ్దమును,శ్రవణమును సంరక్షిస్తుంటాడు. విశ్వాత్మకుని వామనేత్రము నుండి ప్రభవించినట్లు కొందరి నమ్మిక.లింగపురాణము ఈశానుని సర్వాంతర్యామిగా సన్నుతిస్తున్నది.

ASHTA VASUVULU

Image
"ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః" పరబ్రహ్మము తూర్పుదిక్కునకు మహేందుని నామరూపములతో ఒక శక్తిని,తూర్పునకు దక్షిణమునకు మధ్యనున్న ఆగ్నేయ మూలకు అగ్ని అను ఒకశక్తిని,దక్షిణ దిక్భాగమునకు ధర్మ అను మరొక శక్తిని,దక్షిణమునకు పడమరకు మధ్యనున్న నైరుత మూలకు నైరుతి అను ఒక శక్తిని,పడమర దిక్కునకు ఆపః-వరున నామ జలశక్తిని,పడమర-ఉత్తర దిక్కునకు మధ్యనున్న వాయవ్య మూలకు అనిలః వాయు శక్తిని నిక్షిప్తపరచినాడు. సూర్యోదయమునకు కలుగు అరుణోదయమున ప్రత్యూషః-ప్రభాసః అను రెండు శక్తులను,ఉత్తర దిశవైపున ధృవ అను శక్తిని,సోమ అను (చంద్ర) శక్తిని అష్టవసువులుగా చెప్పుకుంటారు. ఇంద్రోవహ్ని: పిత్రుపతి:నైర్రుతో వరుణో మరుత్, కుబేర ఈశ: పతయః పూర్వాదీనాం దిశాంక్రమాత్. ఇంద్రుడు (తూర్పు), అగ్ని(ఆగ్నేయం), యముడు(దక్షిణం), నిర్రుతి(నైరుతి), వర్ణుడు(పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) మొదలైన దిక్కులను పాలించే వారే అష్టదిక్పాలకులు.

TIRUPALLI ELUCHCHI-10

Image
తిరువెంబావాయ్-10 ************* బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్ తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై పడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్ ఆరముదే పళ్ళి ఎరుందరుళాయ్ పరంజ్యోతియే పోట్రి ********************* "శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అయే ధామాని దివ్యాని తస్థుః" వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణః తమసః పరస్తాత్." శివనోమును నిష్కళంకమనముతో నోచుకొనిన చెలులు మనతో ఓ జీవులారా! పరమేశుని అనుగ్రహముతో మేము ఇప్పుడు, తమస్సునకు అవతలనున్న ప్రకాశ స్వరూపమును కనుకొనగలుచున్నాము.తద్వారా, మేము చావు పుట్టుకలను చక్రము బారిన పడకుండా భవబంధ విముక్తులము కాబోతున్నాము.ఎందుకంటే, దేహాభిమానమును వీడిన వెంటనే స్వస్వరూపమును తెలుసుకోగలముకదా. సురలకు సైతము సాధ్యము కాని స్వామి సాంగత్యము -సంసేవనము -మనకు లభించబోతున్నదికదా. ఆ పరమాత్మ పాద సంసేవనమునకై బ్రహ్మ-విష్ణు మిగిలిన దేవతలు సైతము మర్త్యలోకమునకు మరలుతున్నారు. జంతూనాం నరజన్మ...

TIRUPALLI ELUCHCHI-09

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-09 ******************* విణ్ణక్కత్ తేవరుం నన్నవుం మాట్టా విళుప్పొరుళె ఉన తొళుప్పొడి యోంగళ్ మణ్ణగ తేవందు వాళచ్చేదానే వన్ తిరప్ పెరుంతురై యాయ్ వళి అడియోం కణ్ణగత్ తేనిన్రు కళిదరుతేనే కడలముదే కరుంబే విరంబు అడియాల్ ఎణ్ణగ తాయ్ ఉలగిక్కు ఉయిరం ఆనాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుదరుళాయె. ....... త్వమేవ విద్వా నమృత ఇహభవతి నాన్యః పంధా అయనాయ విద్యతే ****************** పూదంగళ్ తోరున్ నిన్రాయ్ అంటు పరమాత్మ స్థూలరూపమును పరిచయముచేసిన మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో, న-ఇతి,నేతి, ఇది కాదు,ఇది కాదు అను సిధ్ధాంతముతో కానివాటిని గుర్తించి,వాటికి అతీతముగా నున్న దానిని పరబ్రహ్మముగా తెలుసుకోమని మనకు ఈ పాశురములో వివరిస్రున్నారు. చెలులు మొలబ్రహ్మాన్వేషనమును మొదలుపెట్తారు. వారు , విణ్ణక్కల్ తేవరు నన్నవు మాట్టా, ఆకాశవాసులైన సురలకు స్వామిపాదములు కనపడలేదు అని అంటున్నారు. ఇది బహిర్దర్శన సంకేతము.సామాన్యమైన చర్మచక్షువులతో చూడాలనుకోవటము. దానిలో దాగి,దానిని నడిపిస్తున్న శక్తిని గుర్తించలేకపోవటము.కనుకనే వారు, ఉలగిక్కు ఆనాయ్-ప్రపంచము నీవు, అని ఆగిపోకుండా, ఉయరిక్కు ఆనాయ్-అని ...

TIRUPALLI ELUCHCHI-08

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-08 ******************* ముందియ ముదల్నడు ఇరుదియం మాణా మువ్వరం అరికిలాల్ యవర్మట్రు అరివార్ పందణై విరళియుం నీయుం నిన్ అడియార్ పలంకుడి తొరుం ఎళుయుం అరుళియ పరనే శెందడల్ పురైతిరు మేనియుం కాట్టి తిరుపెరుం తురైయురై కోయిలుం కాట్టి అందణన్ ఆవదుం కాట్టి వందండాయ్ ఆరముదయె పళ్ళి ఎళుందరుళాయె. ..... "యత్ త్రికాలే అపి తిష్ఠతి తత్ సత్." ఏదిసర్వకాల సర్వావస్థలందును స్వయం ప్రకటితమో అదియే సత్తు. దాని ప్రకటనమే చిత్తు. ఉన్నదాని ఉనికిని తెలిసికొనుట సత్చిత్. తెలుసుకొనుటవలన లభించు దివ్య అనుభూతియే అలౌకికానందము.అదియే సచ్చిదానందము. ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు చెలుల సంభాషనము ద్వారా మనకు ఆ దివ్యమైన అనుభూతిని ఆరముదయె-మధురాతిమధురమైన మకరందమా అని సంబోధింపచేస్తున్నారు. ఆ మందార మకరందమును ఆస్వాదింపగలిగే మధుపముగా మన మనసు మారాలంటే మన ఇంద్రియములు స్వామి అనుగ్రహపాత్రములై ఉండాలి. మన కర్మలు స్వామి యొక్క నిజతత్త్వమును, మున్ముదల్ ఆణాయ్-ప్రపంచ సృష్టికి ముందున్నది ముదల్ ఆణాయ్-సృష్టి ప్రారంభమునందున్నది నడు ఆణాయ్-మధ్యమ స్థితిలో నుండునది ఇరుదియం ఆణాయ్...

TIRUPALLI ELUCHCHI-07

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-07 ****************** అదుపళచువ ఎన అముదెన అరిదర్కు అళిదెన ఎళిదెన అమరరుం అరియార్ ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే ఎంగళై ఆ ండుకొండు ఇంగెళుందు అరుళం మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ....... ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి ************************** అరుణగిరినాథర్ తో పాఉగా మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన, మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచెందుటక ఒక ఇతిహాసమును చెబుతారు. ఉత్తిరం అనగా ఉపదేశము.ఇక్కడ పరమేశుడు పార్వతీదేవికి ఉపదేశమును చేసినాడట. దేనిని ఉపదేశించెను అనగా కోశై-రహస్యమును/వేద రహస్యములను ఉత్తర కోశై మంగళనాథుడు/నటరాజు,తిరుపెరుంతూరు లోని ఆత్మనాథుడు ఒకరే అన్న రూపమును దాటిన తత్త్వమును మనకు పరిచయము చేయుచున్నారు. కనుకనే ఇదు అవన్-ఇది నీవే, ఇవన్-అవన్ ఎనవే-ఇది-అది-నీవే అదియేకాదు, అళుదెన-ఎళుదెన -కుడి-ఎడమ రెండును నీవే/అయ్య/అమ్మ అన్ని నీవే అనుచు స్వామి నీ...

TIRUPALLI ELUCHCHI-06

Image
తిరుపళ్ళి ఎళుచ్చి-06 ******************* పప్పర విట్టిరుందునరుం నిన్ అడియార్ పందనై వందరుదా అవరుం పలరుం మైపురు కణ్ణియ మానుడత్త ఇయల్బీ వణంగు కిరార్ అనంగిన్ మణవాలా శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్సోల్ తిరుపెరుంతురైయురై శివపెరుమానే ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. భవబంధ విమోచనాయ పోట్రి ************************ ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామీ నీవు మానుడత్తి ఇయల్బీ-తగిన వరుడవు ఎవరికి నీవు సరియైన వరుడవు అంటే, మైపురు కన్నియ-లేడి కనుల మా అమ్మకు/ఉమాదేవికి ఇది వాచ్యార్థము. సహజకవి బమ్మెర పోతమాత్యులు వివరించినట్లు, "తగు నీచక్రి విదర్భరాజ సుతకున్ తథ్యంబు వైదర్భితుం తగునీ చక్రికి" అన్నట్లుగా ఉమాదేవి నీకు తగిన కన్య-స్వామి నీవు మా ఉమాదేవికి తగిన వరుడవు ఇంత మంచిదవునే దాంపత్యమీ ఇద్దరిని తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. శివ పార్వతుల దాంపత్యము లౌకికముగా అన్వయించుకోలేనిది. స్థితి-గతుల సమాగమమే సృష్టి సంకల్పము శివ-శక్తుల సంగమమే సమస్త భువన భాండములు. ఇది కాదనలేని ఒక సిధ్ధాంతమైతే, మరొక విశ్లేషణ ప్రకారము పరమాత్మ యొ...