Posts

GIRISAMCHA-ABHICHAKASI

గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తాను ఎట్లా ఉన్నానంటే, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే ఆ పరమాత్మ, గిరిశంచ-అభిచాకసీ. *************** నమకములో దర్శనీయమైనది చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయనము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ సక్తుల కేవ వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములోనికి-స్థూలముగా విశ్వశరీరములోనికి ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏమా అగ్ని? ఎవరా విష్ణువు? అన్న సందేహమునకు పెద్ద...

SAHASRAARAMU

AJNAA CHAKRAMU

VISUDHDHI

ANAHATAMU

MANIPURAKA CHAKRAMU.

Image
మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుతా- మూడవ చక్రమైన మణిపురము నాభీస్థానములో నుండును.జలతత్త్వముతో కూడినది.మణిపుర చక్రము కిందనున్న లోకములు చీకట్లతో/అజ్ఞానముతో నిండియుండుటచే ఇక్కడ శివశక్తులు మెరుపు-మేఘముల వలె నుందురు.గ్రహములో గురువునకు ప్రాధాన్యత.ఇక్కడి పద్మము పది ప్రాణములను పది రేకులను కలిగియుండును.జీర్ణవ్యవస్థను పరిరక్షించుచుండును.

SVAADHIStHAANA CHAKRAMU.

స్వాధిష్ఠాన చక్రము-02 **************** స్వతంత్రముగా తన స్థానములో కూర్చొనగల స్వభావము కలది ఈ చక్రము.ఇక్కడనున ధాతువు మేథ.శుక్రుడు గ్రహాధిపతి.మొసలి దీని స్వభావమును పోలిన జంతువు.(అభిమానములేని స్వభావము)తన పిల్లలను తానే తిని తన ఆకలిని తీర్చుకొను నైజము.తనకు ప్రతికూల పరిస్థిలలో వాటిని ఎదుర్కొనక తప్పించుకొని పోవు విధానమును అవలంభించును.కన్ను ప్రధాన ఇంద్రియము.బాహ్య విషయములను అనుభవించుటనందు ఆసక్తిని కలిగి యుండును. స్వాధిష్ఠ అనగా ఆనందానుభూతులలో ఓలలాడు స్వభావముకలది.మూలాధారములోని నల్లని గంభీరమైన ఏనుగు స్థాణువులైన ధాతువులకు ప్రతీకగా ఉంటూ,ఇంకొంచము ముందుకు సాగుతు చైతన్యముతో కూడిన జలతత్త్వమును ప్రవేశిస్తుంది భౌతిక అవసరములను తీర్చుకొనుటలో మనసు కూడా జోక్యము చేసుకుని తలపులను విస్తరింపచేస్తుంది.