Posts

SIVA SAAKIYAAR AMBE SIVAM.

Image
      అంబే శివం.      ************ 1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీద రాతలే మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.  ఓం నమః శివాయ ఓం నమః శివాయ 2.తెలియలేదు జనము-జగము నిజము కాదని   తెలియలేదు అణువు అణువు నీవు దాగినావని   తెలియలేదు నీవు-నేను వేరువేరు కాదని   తెలియలేదు నేననేది నాది కానేకాదని.  ఓం నమః శివాయ-ఓం నమః శివాయ. 3. నీది ఏది?నాది ఏది? నీదినాది కానిదేది?    జననమంటు-మరణమంటు ఆటలాడుతున్నదేది?    రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?   ఒక్కటైన రామరామరామ నీదు నామమే.   4.ఐదు శక్తులేగ సృష్టి ఐదు శక్తులేగ స్థితి   ఐదుశక్తుల కదలికేగ అంతరంగ పంచాక్షరి   అనాహతపు ఓంకారము అవగతమగుచున్నవేళ   నటరాజుని నాట్యమేగ నా దహరాకాశములో.   5. ఎడమకన్ను చంద్రుడు కుడిదిచూడు సూర్యుడు    ఎడమచేత శూలము కుడివైపున లేడిబూర    ఎడమకాలు ఎత్తితాకు ఎనిమిదైన దిక్కులను    ఎరుకలేకపోతినైతి ఎదలోదాగున్న నిన్ను.    6. ఊరు...

sattamuni

Image
"ఈశనే  శివగామి నీశనే" 'కుంభముని-మచ్చముని-సత్తముని-బ్రహ్మర్షి అంటూ "నటరాజపత్తు "సత్తముని యొక్క విశిష్టతను వివరిస్తుంది.స్వామి నాట్యమును ప్రత్యక్షముగా దర్శించే మహానుభావుడు. సుందర మహాలింగముగా ప్రసిధ్ధి చెందినది తమిలనాడులోని చతురగిరి.వేదనిలయముగా వేదవిదుల నిలయముగా ప్రసిధ్ధికెక్కినది.ఎన్ కురైగళ్-నా ఆపదలను పారద్రోలే తారకము.   లోకాసమస్తాత్ సుఖినోభవంతు అనే ఆశీర్వచనమునకు నిలువెత్తు మూలస్తంభములైన మహనీయులలో ద్రవిడ సంప్రదాయమునకు చెందిన సాక్షాత్ శివస్వరూపులు.సకల్సిధ్ధిలను తమ అధీనములో నుంచుకొనగలవారగుటచే ద్రవిడ సంప్రదాయము వీరిని సిధ్ధార్ అన్న గౌరవ నామముతో కీర్తిస్తుంది.  అన్నివిద్యలను ప్రప్రథమముగా అవపోసన పట్టుటయే కాదు దాని సత్ఫలితములను సమస్త ప్రజలదగ్గరికి చేర్చే సత్ హృదయులు.అనేకానేక మంది ఉన్నప్పటికిని సత్తముని తన లక్ష్యసాధనకై ఎన్నో త్యాగములను చేసిన మహనీయుడు.  "చదివించిరి ననుగురువులు  చదివితిని సర్వశాస్త్రమర్మములెల్లన్ "  అని ప్రహ్లాదుడు భాగవతములో నుడివినట్లుగా,  సిధ్ధార్ కరువురార్,సిధ్ధార్ భోగార్ సకలశాస్త్ర సూక్ష్మములను అందించినారు.ఉత్తరభారత గురువును అనుసరించి ఎన్నో ఉ...

JAANAPADAMAA/JNAANAPATHAMAA

Image
 జానపదమా/జ్ఞానపథమా  ****************  ఎడ్లుపాయె-గొడ్లుపాయె  ఎనమదొరల మందమాయె  పూలగొమ్మ నేలపూసె  కందిరీగ కరిసిపోయె  కోడి పాయె లచ్చమ్మది  కోడిపుంజుపాయె లచ్చమ్మది  బండిపాయె బస్సుపాయె  నీటికుండ రైలుపాయె  మరలినేను సూడపోతే  గాలిమోటరెక్కిపోయె  అరె అరె అరె  దూడబోయె లచ్చమ్మది  లేగదూడబాయె లచ్చమ్మది  కొండబాట అత్తుంటే  కోయిలమ్మ  కూత్తుంటే  వాగుబాటనొత్తుంటే  వాయిలాల సప్పుడాయె  పట్టనంత ఎగురుకుంటు  ఇంటిదారినొస్తుంటే    అరె అరె అరె  పోతుబాయె లచ్చమ్మది లేత పోతుబాయె లచ్చమ్మది  లచ్చన్న దారిలోన లంబాడియాతనాయె  సిగురారి     సంతలోన పోతలింగని గంతులాయె  బంతిపూలు తెంపపోతే గుమ్మడొచ్చి కరచిపోయె  అరె అరె అరె  గంపబాయె లచ్చమ్మది పూలగంపబాయె లచ్చమ్మది.  ఎంతటి వాక్చమత్కారమో వారిది.దొరల దౌర్జన్యాన్ని హెచ్చరిస్తున్న ఈ పాట ఎంతో సందేశాత్మకనక తప్పదు.  ఎడ్లుపాయె గొడ్లుపాయె అంటున్నారు అవి ఎక్కడికిపోయినాయి అనగానే ఎనమదొరలమందమాయె అన్నారు.చివరికి కోడి పాయె పుం...

జననీ జోహారులు.

Image
జననీ జోహారులు ఒదిగి ఒదిగి అందించే,ఒద్దికైన ప్రేమను పొదుగుతున్న కోడిలో,నీలో నే చూస్తున్నా చక్కని రూపమునిచ్చిన ఓర్పుకు నా జోహారులు .............. హారము రిపుసం హారమనే అపురూపపు ప్రేమను ఎగురుతున్న కాకిలో,నీలో నే చూస్తున్నా చల్లని జీవితమును ఇచ్చిన ఉక్తికి నా జోహారులు ..................... బుద్ధులను నేర్పించే సత్యబద్ధమైన ప్రేమను పూజిస్తున్న గోవులో,నీలో నే చూస్తున్నా విచక్షణను ఇచ్చిన శిక్షణకు నా జోహారులు .................... సందు సందు మారుచున్న అందమైన ప్రేమను దాస్తున్న పిల్లిలో,నీలో నే చూస్తున్నా అప్రమత్తతను ఇచ్చిన ఉదాత్తతకు నా జోహారులు ...................... వీక్షణమున రక్షించే లక్షణమైన ప్రేమను ఒడ్డునున్న తాబేటిలో,నీలో నే చూస్తున్నా కరుణను వర్షించే కన్నులకు నా జోహారులు ....................... వెనుకంజయే లేని వెన్నంటు ప్రేమను ఎగురుచున్న కంగారులో,నీలో నే చూస్తున్నా విడువక ముడిపడిన కడుపుతీపికి నా జోహారులు ....................... గుడ్లను గూటికి మార్చిన గుండెకోత ప్రేమను రాగాల కోకిలలో,నీలో నే చూస్తున్నా అనురాగము వెదజల్లు త్యాగమునకు నా జోహారులు .......... ఎన్నెన్నో రూపాలలో ఎన్నలేని ప్రేమను పరిమాణము కొ...

అమ్మా!!! నన్ను మన్నించు.

Image
  అమ్మా!!! నన్ను మన్నించు.  ************************     పదినెలల వ్యవధిలో,తన గర్భ పరిధిలో   పాపలా మారు నన్ను కనుపాపలా చేరుతూ   పుట్టగానే నన్నుచూసి ముసిముసిగా నవ్వావు   పదినెలల వ్యవధిలో నీ గర్భ పరిధిలో   రూపమే తెలియని నేను పాపగా మారుతూ   పుట్టగానే నిన్నుచూసి కసికసిగా యేడ్చాను   ముద్దొస్తూ పెరగాలని చనుపాలగా మారావు   యెద్దేవా చేశాను నా పాలబడ్డావని   నోరు కాలుతుందంటూ గోరుముద్ద పెట్టావు   నోరుజారి నేనేమో గోరుచుట్టువన్నాను   నిదురకై జోకొడుతూ జోలపాట పాడావు   చీదరగా చీకొడుతూ జోరీగవన్నాను   సుడిగుండములను దాటించగ ఈతగా మారావు   గుదిబండవని చాటుతూ రోతగా అన్నాను   కడుపులో తన్నినా,కడవరకు తన్నినా   చిలిపి చేష్టలన్నావు,చిరునవ్వే నవ్వావు   కల్లమాట కాదు,కానేకాదు వమ్ము   తల్లడిల్లనీదు నిజంగా నన్ను నమ్ము  మసక తొలగిపోయింది,అసలు తెలుసుకొమ్మంది  మాధవ నివాసమైన నీ మధుర గర్భవాసినై  తల్లీ తరియించనీ తరతరముల సాక్షిగా.

అమ్మకానిదేది?

Image
  ముక్కోటి దేవతలు మెచ్చిన నిచ్చెనరా   "కొనగలవా అమ్మను" కోట్లను వెచ్చించి    ఆశ్చర్యమున మనము అమ్మనే తలుస్తాము  " అమ్మ బాబోయ్" అంటూ ఉద్వేగం తోడుగా    ఆనతి కాదనలేక అమ్మనే తలుస్తాము    "అమ్మమ్మ ఎంతమాట" అంటూనే   ఉంటాము     ఆటపాటలలోను అమ్మనే తలుస్తాము     "అమ్మదొంగ" అంటు అల్లారు ముద్దుగా     ఆటవిడుపు సమయములో అమ్మనే తలుస్తాము     "అమ్మయ్య "అంటూ మనకమ్మని పలుకులతో         ఆక్రందనలోను అమ్మనే తలుస్తాము      "అమ్మా "అని అంటూ అప్రయత్నం గానే     అనవసరపు మాటలలో అమ్మనే తలుస్తాము     "అమ్మలక్క" కబురులు బహు కమ్మగ ఉంటాయంటు     ఆకలిలోను మనము అమ్మనే తలుస్తాము      అడగనిదే" అమ్మైనా" పెట్టదని అంటూ     అన్నిభావాలలో అపరంజిగ దాగినది     సప్తస్వర శోభిత "తప్తకాంచనముర అమ్మ"         తళతళలతో కళలెన్నడు తరగని జాబిల్లి     "అమ్మ కానిదేది లేదు" ఇది కమ్మని నిజము     అమ్మ "అమ్మకానికే లేదు" ఇద...

అమ్మంటే ఏమిటో నేను చెప్పనా - సంతకాల పుస్తకము.

Image
  అమ్మంటే ఏమిటో నేను చెప్పనా - సంతకాల పుస్తకము. ****************** వికారమును తనుభరించి, ఆకారమును ఇస్తుంది, అమ్మ ఒక "అద్భుతం." తాడు తాను సృష్టించి, ఆహారమును ఇస్తుంది, అమ్మ ఒక "అమృతం." కానరాని శక్తినిచ్చి, కదలికలను కలిగిస్తుంది, అమ్మ ఒక" అవ్యక్తం." గర్భసంచిని పెరగనిచ్చి, తాను జరుగుతూనే ఉంటుంది, అమ్మ ఒక "అక్షయం." శిశువు జననము గురించి, ప్రసవ వేదన తానై సహకరిస్తుంది, అమ్మ ఒక "అద్వైతం". కసిగా నన్నేడిపించి, ముసి ముసి నవ్వౌవుతుంది, అమ్మ ఒక "అనుభవం." పాలను పట్టించి, ఒట్టువేసినట్లే ఒడిలో కట్టిపడేస్తుంది, అమ్మ ఒక "అయస్కాంతం." ముద్దులతో మురిపించి ఒజ్జయై తీర్చిదిద్దుతుంది, అమ్మ ఒక" అధ్యయనం". సూర్య-చంద్రులను చూపించి సూక్ష్మాలను నేర్పుతుంది, అమ్మ ఒక "అభ్యాసం". పట్టుదలను అందించి నేను పడిలేస్తుంతే ఫరవాలేదు అంటుంది అమ్మ ఒక "అనునయం." కష్టమునకు తానోర్చి కావలిసినదేదైన కాదనలేనంటుంది, అమ్మ ఒక" అల్లాయుద్దీన్ అద్భుతదీపం." మనసారా దీవించి మానవత్వ విలువలను ప్రేరేపిస్తుంది, అమ్మ ఒక" అభ్యుదయం." ఆది...