Posts

YAADEVI SARVABHOOTESHU-02

Image
   సర్వాశాపరిపూరక చక్రము-రెండవ ఆవరణము  **********************************************   హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం  సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ ।  వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం  త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥    28 ప్రకటయోగినుల అనుగ్రహముతో సాధకుడు రెండవ ఆవరణమైన,ఊహా వృతాకారముతో 16 పద్మములరేకులవంటి ద్వారములున్న "సర్వాశాపరిపూరక చక్రములోనికి" ప్రవేశించబోతున్నాడట.    పిల్లలు మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు.ఒకరు ప్రారంభము అనగానే వెంటనే మాటలు ప్రారంభిస్తున్నాడు మరొకడు.ఆపమనగానే క్షణమాత్రము ఆలస్యము చేయకుండా ఆపివేస్తున్నాడు.వారినే గమనిస్తున్నా నేను విచిత్రకరమైన అనుభూతికి లోనయినాను.మాట్లాడుటకు పెదవులు అప్రయ్త్నముగా తెరచుకుని,అవసరము తీరినవెంటనే దగ్గరకు వచ్చి ముడుచుకుని పోతున్నాయి.చెవులు ఆ శబ్దమును స్వీకరించి మనకు వినపడేటట్లు చేస్తున్నాయి.అసలు ఈ శబ్దము ఎక్కడి నుండి వస్తున్నది వ్యక్తి నుండా వ్యక్తిలో దాగిన శక్తి నుండా?    మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమ...

YAADAEVI SARVABHOOTESHU-01

Image
ధ్యానం ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ । ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీ ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ॥    సంకల్పము-సామర్థ్యము-సాఫల్యము మూడు తానైన ఆ ఆదిశక్తి అనుగ్రహమా అన్నట్లుగా గమనము ప్రారంభమై శుభసంకేతముగా ప్రవేశద్వార తూర్పుదిక్కునకు చేర్చినది.ఈ ఆవరనము మూడు మార్గములతో విశాలముగా ఊహా చతురస్రాకారములతో భుజముల మధ్యన కొంత వంగి కరదీపికల వంటి కరుణాంతరంగులైన ఎనిమిది సిద్ధిదేవతలతో పాటు ప్రాప్తి-సర్వకామ అను మరో ఇద్దరితో ద్వారములదగ్గర ప్రకాశించుచుండగా పదిద్వారములను కలిగియున్నది.వాటినే శాక్తేయులు త్రైలోక్యమోహనచక్రము యొక్క మొదటి భూపురము అంటారట.మొన్న మా తాతయ్య చెబుతుంటే విన్నాను.వెంటనే మీరు నన్ను ఆ పదిద్వారములదగ్గరనున్న వారెవరు అని అడుగుతారేమో.వారిని అష్టసిద్ధులు ప్రాప్తి సర్వకామ అను మరో ఇద్దరు శక్తులను కలుపుకొని ఉంటారట.వారిని, 1.అణిమ 2.లఘిమ 3.మహిమ 4.ఈశిత్వ 5.వశిత్వ 6.ప్రాకామ్య 7.భుక్తి 8.ఇచ్చా 9.ప్రాప్తి 10.సర్వకామ అని పిలుస్తారట.    గరిమ సిద్ధి ఉందని కొందరు లేదని కొందరు వాదించుకుంటుంటా...

SARVANAMDAMAYACHAKRAMU-AVARANAMU-09

Image
శ్రీచక్ర నవమావరణదేవతాః శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,   శ్రీచక్ర నవమావరణదేవతాః శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

SARVASIDDHIPRADACHAKRAMU-AVARANAM-08

Image
శ్రీచక్ర అష్టమావరణదేవతాః బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,    సర్వసిద్ధిప్రదచక్రము  ***********************   ఆత్మార్పణమే అతిరహస్యము.ఆత్మార్పనమును అందించే శక్తులు అతిరహస్య యోగినులు.సాధకుడు ఏడవ ఆబ్వరనములో ప్రసాదించబడిన ఆయుధములను సైతము ఇక్కడ విడిచివేస్తాడు.అవి సాధకుని గమ్యముచేర్చగల నిచ్చెన వంటి సాధనములు మాత్రమే.తత్ఫలితముగా త్రిగుణములు దూరమై దర్పణమువంటి తన మనసులో మూలశక్తి  ప్రతిబింబమును స్పష్టముగా దర్శించగలుగుతాడు.కనుక ఈ ఆవరనము సర్వసిద్ధిచక్రముగా కీర్తింపబడుతున్నది.   ఒకేఒకత్రికోణము సంకేతముగా మూడుబిందువుల స్థానములో మహా కామేశ్వరి,మహా వజ్రేశ్వరి,మహా భగమాలిని విరాజితమై త్రిగుణముల సమ్యమనమునకు సిద్ధమవుతోంది.   నిశితముగా పరిశీలిస్తే త్రికోణ బిందువులు సూత్రధారులు.నాలుగు దివ్య ఆయుధములు పాత్రధారులు కనుక వాటి ప్రస్తావన ఎంతో అర్థవంతము.  1.బాణిన్యై నమః.     బాణిని అనగా బాణము దేనికి సంకేతముగా చెప్పబడునది.    మన సంకల్పమునకు.నన్ను నేను తెలుసుకోవాలనే తలపు.న...

SARVAROGAHARACHAKRAMU-AVARANAMU-07

Image
శ్రీచక్ర సప్తమావరణదేవతాః వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,        శ్రీచక్ర సప్తమావరణదేవతాః వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,     నన్ను నేను తెలుసుకోవటానికి,  నన్ను నేను మార్చుకోవటానికి,  నన్ను నేను చేరుకోవటానికి,    నేను చేస్తున్న ఈ ప్రయాణములోని రెండు ప్రధాన ఘట్టములను,దాటి మూడవ ముముక్షత్వమును చూపించే ఈ ఏడవ ఆవరణము నన్నెంతో ప్రోత్సహిస్తూ,

SARVARAKSHAAKARACHAKRAMU-06

Image
శ్రీచక్ర షష్టావరణదేవతాః సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ, శ్రీచక్ర షష్టావరణదేవతాః సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,    సర్వరోగహరచక్రము    ********************** " సర్వజ్ఞా సాంద్రకరుణా" తల్లి అనుగ్రహముతో కులోత్తీర్ణ యోగినులు సాధకుని కుండలిని శక్తిని జాగృతమొనర్చీ,చక్రేశ్వరికి కృతజ్ఞతావిష్కారము చేసి,సాధకుడు,శివశక్తి సామీప్యమునకై,తదుపరి ఆవరనమైన "సర్వరక్షాకర చక్రము"లోనికినిగర్భయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.   ఈ ఆవరనము పదిత్రికోణముల సంకేతముగా రక్షింపబడుచున్న అంతర్దశారచక్రముగాను కీర్తిస్తారు.    సగుణ-నిర్గుణ సమాహారమే 10 సంఖ్యగా కనుక మనము అన్వయించుకోగలితే అంతా బ్రహ్మానందమే.తమస్సనకు చోటులేదు.అంతా ప్రకాశమయమే.  సర్వసౌభాగ్యప్రదములోని...

SARVARTHASADHAKACHAKRAMU-05

Image
శ్రీచక్ర పంచమావరణదేవతాః సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,  సర్వార్థసాధక చక్రము-05  ********************  "" కులం శక్తిః ఇతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే"  బహిర్దశార చక్ర పరివారదేవతలైన ఐదవ ఆవరనములో విలసిల్లుతూ,సధకునికి ఋజుమార్గ పయనమునకు సహాయపడు పదిశక్తులు కులయోగినులు.   అగ్నికి విస్పులింగములవలె పరమేశ్వరికన్న భిన్నముకాని ,పరమేశ్వరిచే విస్తరింపబడీ శక్తులు.    మరికొందరు వీరినే దశవాయువులుగాను,నారాయణుని దశావతారములుగాను కీర్తిస్తారు.    పది త్రికోణమూగా పదిశక్తులు ప్రకటితమయే ఊహాచతురస్రము.  అనంతశక్తులను దాటి,సర్వము తామై విలసిల్లే సర్వశక్తుల అనుగ్రహముతో సాధకుడు తన లక్ష్యమును సులభముచేసుకొనుచున్నాడు.  వారే,  1.సర్వసిద్ధిప్రదే  2.సర్వ సంపత్ప్రదే  3.సర్వ ప్రియంకరీ  4.సర్వ మంగళకారిణీ  5.సర్వకామ/కాయ ప్రదే  6.సర్వ దుఖః విమోచనీ  7.సర్వమృత్యుప్...