Posts

PAHIMAM MAHISHASURAMARDINI-RAMYAKAPARDINI SAILASUTE-01

Image
      పాహిమాం మహిషాసురమర్దిని-రమ్యకపర్దిని శైలసుతే *********************** ॥ (సౌందర్యలహరి)  "భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం-   ఇతి స్తోతుం వాంఛన్ కథయతి" భవాని" త్వమితి యః ।   తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం   ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా."   తల్లీ భవానీ!  ముకుంద-బ్రహ్మేంద్రాదులు వారి రత్నమయ కిరీటములతో శిరసు వంచి నీపాదపద్మములకు హారతులు పట్టుచున్నారు అని అమ్మను సంస్తుతిస్తున్నారు శ్రీ ఆదిశంకరులు.    క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది. అందుకు ఉదాహరణమే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదులు,(మకుటనీరాజిత.)  భవాని త్వం దాసే అంటూ అమ్మను స్తుతించటము.    త్రిమూర్తులు మాత్రమే కాదు  శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి  "దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా"       ఆ పరాత్పరి అన...

PAHIMAAM sREERAJARAJESVARI-02

Image
   పాహిమాం మధుకైటభనాశిని-మంజులభాషిణి శైలసుతే  ***************************************  " ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం శిరః     శంఖం సందధీతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం       నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం       యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతం మధుకైటభం."     ఖడ్గము-చక్రము-గద-బాణములు-విల్లు-పరిఘ-శూలము-ఆయుధములుగా ధరించి,చేతిలో అగ్నిపాత్రతో,శంఖముతో,మూడుకన్నులతో,భూషణములతో,నీలమణి కాంతులతో ప్రకాశించుచు ,     ఎవరు   కలవరపడుచున్న కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మను,యోగనిద్రలో నున్న అనంత నాభుని మధుకైటభుల బారి నుండి రక్షించినదో,    ఆ జగన్మాత నిర్హేతుక కృప,నా కరమున కలముగా మారి,కళ్యాణప్రదమైన తన అనుగ్రహమును వివరించుచున్నవేళ,నన్ను గమనించనీయకుండా నా అహము దానిలో తప్పులను కుప్పలుగా కుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతూనే ఉంటుంది.  " యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం".....తత్సర్వం క్షమ్యతాం దేవి"   ఆ తల్లి నా దోషములను సవరించి,నన్ను మన్నించును గాక.    ఎవరీ మధు-కైటభులు...

PAAHIMAAM SREE RAAJARAAJESVARI-INTRO

Image
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి- కృపాకరి శంకరి ************************** "అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయినీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరి" ఏది ప్రమాదమో/ఏది ప్రమోదమో తెలియక జీవులు ఇంద్రియములచే బంధింపబడి,విచక్షణను మరచిపోయి,వింతపోకడలతో కన్నుమిన్నుకానక విధ్వంసమునకు సిద్ధమైన సమయమున, "దేహి ముదం దేహి సింహవాహిని దయా ప్రవాహిని" అని సకలజగములు నిస్సహాయులై ప్రార్థించుచున్న వేళ,అవ్యాజకరుణతో, "పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే" తల్లి తనకు తానే బహుముఖములుగా ప్రకటితమయే బాధ్యతను స్వీకరించి,భవబంధనములను తొలగించివేస్తుంది. అట్టి పవిత్ర చరితములను స్మరించుట వలన,శ్రవణము వలన కలుగు జ్ఞానము సైతము శ్రీమాతఅనుగ్రహమే..ముగురమ్మల మూలపుటమ్మ ,సురారులమ్మ నిర్హేతుక కరుణయే. దేవిశరన్నవరాత్రుల పుణ్యసమయము.శరత్కాలపు వెన్నెల అమ్మ దరహాస చంద్రికలేగా. " ప్రపంచం శించతీ" అన్నారు ఆదిశంకరులు అమ్మ సౌందర్యమును స్తుతిస్తూ. మనము చకోరములై ఆస్వాదించుటకు సిద్ధమౌదామా ప్ర...

DEVAKARYA SAMUDBHAVA-RAKTESVARI/KALI

Image
  " రక్తబీజ వధే దేవి చండ-ముండ వినాశిని     రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి"       చందముండాసురులు చాముండ చేతిలో సమసిన తదుపరి దేవ-దానవ యుద్ధము కొత్తరూపును సంతరించుకున్నది.   తరగని తామసము తనసైన్యమునంతటిని కూడ దీసుకుని తల్లిని వధియింప వచ్చుచున్నది.దానికి మేము సిద్ధము అంటూ దైతేయులు-కంబులు-అనేకానేక వీర్యులు-ధౌత్రులు-కాలకులు-మౌర్యులు-కాలకేయులు శుంభ-నిశుంభ పక్షమున సన్నద్ధమగుచున్నారు.   వానితో కాసేపు వినెదించవలెననుకున్నదేమో మన తల్లి సప్త మాతృకలను పోరాదనిచ్చి వాని సైన్యమును సమరాంగనమును వీడిపారిపోవునట్లు చేసినది. ఈ ఘట్తములో తల్లి శివుని వానికదకు రాయబారిగా సాంతి సందేశతో పంపి శివదూతిగా కీర్తింపబడుతున్నది.   సైన్యము పలాయనము చిత్తగించుతను చూసి తమతో పోరాడుచున్న సప్తమాతృకలకు ధీటుగా సుంభ-నిస్-శుంభులు రక్తబీజుని రణరంగమునకు పరిచయము చేసిరి.  కొన్ని కథనముల ప్రకారము వీడు స్వయముగా మహిషుని తండ్రియైన రంభుడు అని దేవిపై పగ సాధించుతకై తన శరీరము నుండి కిందపడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరొక రక్తబీజుడు జనించు వరమును పొందియున్నాడు కనుక జయము తథ్యము అన్న నమ్మకము శుంభు...

DEVAKAARYA SAMUDBHAVAA-CHAMUMDAA

Image
   ధూమ్రాక్షుని మరణము శుంభునిలోని విచక్షణను మరింత దాచివేసి,వాచాలత్వమును మరింత ప్రకోపింపచేస్తూ,తన గొయ్యి తానే తవ్వుకొనుటకు చండ-ముండుల రూపములో ముందుకు వచ్చి నిలిచినది.   రాజసము తాను విశ్వరూపముతో పగను రాజిల్లచేస్తుంటే,వాడు చండ-ముండులతో,  " తథా శేషాయుధైః సర్వైః అసురః వినిహంత్యాం    తస్యాం హతాయాం దుష్టాయాం సింహేచ వినిపాతతే"    ఓ చండ/ఓ ముండ,   మీరు పెద్ద సైన్యముతో అటకేగి ఆ "ఆడుదానిని" తాళ్ళతో కట్టియో,తలపట్టుకుని ఈడ్చియో ,ఆయుధములతో యుద్ధము చేసియో సింహముతో సహా నా దగ్గరకు తీసుకుని రండి అని హుంకరించాడు.    స్వామి కార్యమునకై తక్షనమే బయలుదేరి శైలపర్వతమును చేరిన వారికి కాంచనశిఖరమునందు సింహవాహినియై మందహాసముతో నున్న దేవి దర్శనమిచ్చినది.    వారు కయ్యమునకు కాలుదువ్వుతూ,తమ వింటినారిని బిగుతుగా లాగి,కత్తులను చేత బట్టుకుని బంధించుటకు సిద్ధమైనారు.     తల్లి ముఖము నల్లగా మారినది.కోపము కోరలు సాచినదా అన్నట్లుగా కనుబొమలు ముడివడినవి.కాళి యను కొత్తశక్తి కదనరంగమున వారిపై యుద్ధముచేయుటకు సిద్ధమాయెను.   ఆ శక్తి,  " భృకుటీ కుటిలాత్తస్...

DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI

Image
 శుంభస్యైచ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని  రూపందేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి   శుంభ/నిశుంభులను ధూమ్రాక్షుని సంహరించి ధర్మమును కాపాడుచున్నతల్లి నా ఇంద్రియములను సైతము నిన్ను ఆరాధించుటకు సుముఖము చేసి నా అంతర్/బహిర్ శత్రువులనుండి నన్ను రక్షింపుము.    పరాశక్తి మధు/కైటభులను,మహిషాసురునికి సంబంధించిన అసురులను,వానిని,ధూమ్రాక్షుని,చండ/ముండులను ,రక్తబీజుని సంకేతనామములుగా నున్న ఇంద్రియముల బలహీనతలను నిర్మూలించినది.ఇక మిగిలిన వారు శుంభ/నిశుంభులు.నేను అను అహంకారము-నాది అను మమకారము.  వీటి గురించి వీటిచే ప్రభావితమైన ఇద్దరి గురించి మనము ఒకసారి మాట్లాడుకుందాము.    మార్కండేయ పురాణములో మహర్షి సురథుడు అను రాజు రాచరికమును కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుఋఋఅము నెక్కి అడవులకు పోయెను.  పేరు సురథుడు.దశరథుడు మనకు దుర్తుకు వస్తాడు కద.మంచి ఇంద్రియములు కల శరీరము కలవాడు.గుర్రమునెక్కి ,మనసు మాట విని అడవులకు పోయెను.ఒక విధముగా బుద్ధిని పనిచేయనీయనిచోటు.  కనుకనే పరహస్తగతమైన తన రాజ్యముపై భ్రాంతిని వీడలేని పరిస్థిలో నున్నాడు.    వేరొక వ్యక్తి సమాధి.వైశ్యుడు.ధనము ...

DEVAKARYASAMUDBHAVA-RAKTABEEJA

Image