Posts

NA RUDRO RUDRAMARCHAYAET-29

Image
    న రుద్రోరుద్రమర్చయేత్-29   ********************  " జితం జితం తే జిత! యజ్ఞ భావన!    త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః    యత్ రోమగర్తేషు నిలిల్యురధ్వరాః    తస్మైనమః కారణ  సూకరాయతే."-యజ్ఞో వై విష్ణుః.   యజ్ఞవరాహ స్తోత్రము.  యజ్ఞ స్వరూపుడవై,యజ్ఞరక్షకుడవై,వేద స్వరూపుడవై,వరాహరూపములో ప్రకాశిస్తున్న నీ శరీరములోని ప్రతి రోమకణములోను సమస్త యజ్ఞ కార్యములు నిండి యున్నవి.నీ నాలుగు పాదములే ఋత్విక్కులు,నీ నేత్ర చకనమే ఆజ్యము.నీ నాసికయే పెద్ద స్రుక్కు.నాసికా రంధ్రములు చిన్నగరిటెలు.నీ ఉదరము యజ్ఞకుండములోని అగ్ని.నీ చెవులు సోమరస పాత్రలు.నీ నోరు ఆహుతులు.నీ దంతములు అగ్నిహోత్రములు.  యజ్ఞ కర్తవు-యజ్ఞ భోక్తవు-యజ్ఞ హర్తవు నీవే అని దేవతలు యజ్ఞవరాహమూర్తిని ప్రస్తుతిస్తున్నారు.  ప్రియ మిత్రులారా!  సనాతన ధర్మము నా (స్త్రీ) ఉపాధికి నియమించిన పరిమితిలో ,ఈ రోజు బిల్వార్చనమును "యజ్ఞ" శబ్ద వైభవమును గ్రహించే పయత్నము చేస్తాను.   చమకములో చెప్పినట్లు సామర్థ్యమునీయమని అమ్మను ప్రార్థిస్తూ,ప్రారంభిస్తాను.   పరమ పావనమైన  నీపాదరజ కణము...

NA RUDRO RUDRAMARCHAYAET-28

Image
    న రుద్రో రుద్రమర్చయేత్-28  ******************  "" ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం     వందే "మహోదార తర" స్వభావం  ఘృశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే"   స్వామి మహా ఔదార్యమును చెప్పకనే చెబుతున్నది పై ధ్యాన  శ్లోకం.   మనో వాక్కాయ కర్మలను మారుస్తూ స్వామి చేసే లీలను మానవమాత్రురాలిని నేనెలా గుర్తించగలను.  నేటి సాత్వికము రేపు తామసమునకు పెద్దపీట వేయగలదు.యుక్తాయుక్తమును దూరముచేయగలదు.మంచి-చెడుల మధ్య తాను దాగి మాయ,  మనలను ఆడించగలదు.లేవలేనంత పతనములోనికి పడవేయగలదు. అదియే తనలో నిజమును గ్రహించలేని మాయాజాలము.  మనము చెప్పుకోబోవు కథలోని రెండు పాత్రలు అక్కా-చెల్లెలు.ఒకరు మాయామోహితులు-మరొకరు మాయాతీతులు.  వారిలో ఒకరిని వశపరచుకొనిన అసూయ తీవ్రమై ఏ విధముగా దురాకృతములను చేయించినదో,మరొకరి దరిచేరలేని అరిషడ్వరగములు స్వామి మహోదారత వలె ,ఎంతటి ఔదార్యమును ప్రదర్శించినదో తెలుసుకుందాము.  ప్రియ మిత్రులారా!     ఈనాటి మన బిల్వార్చనలో మనము " అసూయ" అను పదము తెచ్చిన అనర్థములను గురించి,వానిని అవలీలగా దాటించిన మహోదా...

NA RUDRO RUDRAMARCHAYAET-27

Image
    న రుద్రో రుద్రమర్చయేత్-27  *************************  -బాణాసుర కృత శివస్తోత్రము.  ********************** 1. మహాదేవ మహాగురు సురేశ్వర నీలకంఠ    యోగబీజ యోగరూప యోగీశ్వర నమోనమః. 2.జ్ఞానబీజం జ్ఞానరూపం జ్ఞానానందం సనాతనం   తపోఫలానుగ్రహం దైవం సర్వసంపత్ప్రదాయకం 3.తపోబీజం తపోరూపం తపోధనం సదాశివం   కరుణబీజం కరుణరూపం చిన్ముద్రం చిదంబరం 4..నరకార్ణవతారణం భుక్తి-ముక్తి ప్రదాయకం   అశుతోషం సుప్రసన్నం అవ్యాజము అనుగ్రహం 5.హిమవాసం చంద్రమౌళిం శ్వేతపద్మ ప్రకాశకం   బ్రహ్మజ్యోతి స్వరూపము భక్తానుగ్రహ విగ్రహం. 6.పంచభూతం పంచేంద్రియం పంచామృతం బహురూపం   జలరూపం అగ్నిరూపం నింగిరూపం దిగంబరం 7.వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహాత్మకం   చిద్రూపం స్వస్వరూపం విరూపాక్షం విశ్వరూపం 8.శక్తిస్వరూపం ఈశ్వరం భక్తానుగ్రహ విగ్రహం   వేదస్తుతం పరమపూజ్యం త్రిభువనరక్షకం. 9..అపరిచ్చిన్నం ఆదిదేవం అవాఙ్మానస గోచరం   వ్యాఘ్రచర్మాంబరధరం మందస్మితం మహేశ్వరం   త్రిశూల పట్టిధరం కరుణం చంద్రశేఖరం. 0.శంకరం చరణంశరణం నిత్యం బాణసన్నుతం    భక్తహృదయనివాసం దుర్వ...

NA RUDRO RUDRAMARCHAYAET-26

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-26    **************************   " యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై   సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే."   సద్భక్తిని-ముక్తిని ప్రసాదించగల విశేషపూజనీయునకు నమస్కరించుచున్నాను.   ఈశ్వరార్చనకు ఉపాధి నియమములేదు అనుటకు మనము ఎన్నో కథలను విన్నాము.కావలిసినది నిష్కళంకభక్తి మాత్రమే.ఆ భక్తి తాత్కాలికమే అయినప్పుడు దాని వలన లభించిన వరప్రభావము కూడా బాహ్యముగానే ఉంటుంది కాని భగవంతుని చేరదానికి చేదోడు కాలేదు.   ప్రియ మిత్రులారా ఈ నాటి బిల్వార్చనలో మనము "యాతుధాన్య:" పదమును తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.  పెద్దల అభిప్రాయము ప్రకారము,  "యాతులు" అనగా దుఃఖమును కలిగించు మాయలు.అట్టి మాయలు కలిగినవారలు యాతుధాన్యులు.  నమకములో సైతము వీరి ప్రసక్తి వచ్చినది.  నమకములో అసుర శక్తులు-వానిని తొలగించి మనలను రక్షించే రుద్ర ప్రస్తావనము.  1. అనువాకము-6వ మంత్రము  " అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్    అహీగుంశ్చ సర్వాన్ జంభయంథ్ సర్వాశ్చ యాతుధాన్యః."   ఇందులోని ...

NA RUDRO RUDRAMARCHAYAET-25

Image
   న రుద్రో రుద్రమర్చయేత్-25   **********************  "మథురం శివమంత్రం మదిలో మరువకె ఓ మనసా  ఇహపరసాధనమే-       నరులకు సురుచిర పావనమే  ఆగమ సంచారా-నా స్వాగతమిదె గొనుమా  భావజ సంహార- నన్ను కావగ రావయ్యా."   ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనములో మనము "ఇషు" శబ్ద ప్రాశస్త్యమును తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము.  ధనుస్సు- నారి- బాణములు విలుకాని ఆభరణములు.  సంరక్షణకు ఆయుధములు.  అందులో మనకు కనిపించునవి పదునైన బాణములు చేయుచున్న పరాక్రమములు.కాని నిజమునకు ధనువు సహాయము చేయకపోతే అవి నిర్వీర్యము .ఆ ధనువునకు కట్టబడిన గుణము/నారి బిగుతుగా లేకపోతే విలువిద్య విలువేమిటో  తెలుసుకోగలమా?  కాని నిజమునకు విల్లు- నారి- శరములు  మన ప్రవర్తన           సంకేతములు.    మనము చర్చింకోబోతున్న కథనము నరునిది/అర్జునునిది.    కాదు కాదు నరులది.అంటే మనందరిది.  అందులో ప్రకటించిన కోపము-ప్రదర్శించిన రోషము జీవుని-దేవుని మధ్య అనవరతము జరుగుచున్నదనుట కాదనలేనిది.   తపము నెపము.తపమును తాపముగా/కోపముగా...

NA RUDRO RUDRAMARCHAYAET-24

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-24    ************************     జటాజూటధారి-శివాచంద్రమౌళి    నిటాలాక్ష నీవే-సదా మాకు రక్ష.    ప్రియమిత్రులారా ఈనాటి బిల్వార్చనలో మనము జట శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   శిష్తరక్షన-దుష్టశిక్షణ చేయగల స్వామి ప్రకటన శక్తి జట.   భగీరథుని అనుగ్రహించినది స్వామి. జటాజూట సహకారమేకదా .శాపగ్రస్తుదైన చంద్రుని శిరోలంకారముగా మలచినది స్వామి జటాజూటమే.స్థితికార్య సంకేతము స్వామి జటాజూటమే.జీవుల శరీర నాడుల ముడులు స్వామి జటాజూటములే.  దక్షయజ్ఞ సందర్భముగా ఆ జటనుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని అహమును నశింపచేసినాడు కదా.   స్వామి ఆకాసతత్త్వమును చెప్పునది స్వామి ఊర్థ్వ కేశపాసమే కదా.   ఎన్నో పుణ్నదులను ప్రవహింపచేస్తున్నది స్వామి జటయే.   నమకములో జట శబ్దమును,  2.వ అనువాకము 5వ మంత్రము  " నమో హరికేశాయ ఉపవీతినే " స్వామిని హరికేశునిగా వర్ణించినది.    నల్లని కేశములుగా కనుక అన్వయించుకుంటే   నమః శివాభ్యాం-నవ యవ్వనాభ్యాం"   ఆకుపచ్చని కేశములుగా అన్వయించుకు...

NA RUDRO RUDRAMARCHAYAET-22

Image
   న రుద్రో రుద్రమర్చయేత్-23  *********************** " స్వస్తి ప్రజాభ్య: పరి-పాలయంతాం  న్యాయేన మార్గేణ మహీం మహీశ:  గో-బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం  లోకా: సమస్తాత్ సుఖినో భవంతు."             శాంతిమంత్రం.  విశ్వపరిపాలనలో గోవులను-బ్రాహ్మణులను సంరక్షించుటచే సమస్తలోకములు సుఖముగా నుండునుగాక.  ఇది" విశ్వశ్రేయో మంత్రము"   .ఇందులో వచ్చిన గో-బ్రాహ్మణ శబ్దములు అత్యంత  ముఖ్యమైనవి.సంస్కారవంతమైనవి.గో శబ్దము సకల దేవతా స్వరూపము.దేవతలనగా ఇంద్రియములు అనే అర్థమును కూడా చెబుతారు.అదేవిధముగా పంచభూతములను కూడా అన్వయిస్తారు.సమస్త వాక్కులను కూడా గో శబ్దముగా భావిస్తారు.అంటే ఒక విధముగా విశ్వమును గో శబ్దముతో సంకేతిస్తూ,దానిలో దాగిన,దానిలోనే కాదు,తనలో దాగియున్న ఈశ్వరచైతన్యమును-తాను చూస్తున్న చైతన్యమును బిబ-ప్రతిబింబములుగా. గ్రహించగలిగిన వాడు బ్రాహ్మణుడు.తనలోపల/తన చుట్టు ఉన్న ఈశ్వరచైతన్యమును గుర్తించి,గౌరవించుటయే బ్రహ్మజ్ఞానమని పెద్దలు చెబుతారు.  అహం బ్రహ్మాస్మి-నేను బ్రహ్మము కంటే వేరుకాదు అను తత్త్వమును అర్థముచేసుకొని ఆరాధించువేళ ...