Posts

AALO REMBAAVAAY-02

Image
   రెండవ పాశురము-02 *************** వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టు ఎళుదోం మలరిట్టు నాం ముడియోం శెయ్యాదన  శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం ఐయముం  పిచ్చైయుం ఆందనైయుం  కైకాట్టి ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః    ***********************************  ప్రథమ పాశురములో నారాయణుని దయార్ద్రహృదయమును సంకీర్తిస్తూ,స్వామి మనమీది వాత్సల్యముతో రేపల్లెలో శ్రీకృష్ణునిగా అవతరించినాడని, ,నోము నిర్వాహకునిగా తానుండి , మనలతో కలిసి ఆడి-పాడి ,అనుగ్రహిస్తాడని , వారుచేయవలసిన వ్రతవిధానమును వివరించుచున్న ఆండాళ్ అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,రెండవ పాశురమును అనుసంధానముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   ప్రస్తుత పాశురములో అమ్మ నిశ్చయ -జ్ఞానము గోపికలను" వైయత్తు వాళ్వీర్గాళ్ అంటు గోపికల భూసురత్వమును గుర్తుచేసినది.మొదటి పాశురములో చిరుమీర్గాళ్ పసివారు అన్నది.అయినప్పటికిని శెల్వ చిరు మీర్గాళ్-అంటు వారి సంపదను ప...

AALO REMBAAVAAY-01 PASURAM

Image
    పాశురం-01     ఆండాళ్  తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము.అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నమక్కే మనకే తప్పక పరతరువాయ్-పరను అనుగ్రహిస్తాడు అన్న  అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ,  మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్  నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్ శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్  ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం  కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్  నారాయణనే నమక్కే పరై దరువాన్  పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ.      **********************     మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.వ్రతఫలితముగా స...

AALOREMBAVAY-09

Image
  తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.   నిత్యానుష్ఠానమునుండి నిరంతరానుష్ఠానమునకు చేర్చుచున్న హోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  మామా మాదవన్ వైకుందన్ శరణం.  నామ సంకీర్తనా వైశిష్ట్యమును తెలియచేయునది ప్రస్తుత పాశురము.ఆండాల్ తల్లి మనకు ప్రస్తుత పాశురములో,  మణిమయసౌధము  ప్రకాశ దీపములు  పరిమళ ధూపము  పవిత్ర పానుపు  పానుపుపై పవళించి-పరవశించు పడతి  మంత్ర మహిమ  మామీర్ అను మరో దేహ సంబంధమును పరిచయము చేస్తున్నది.  విచిత్రముగా లోపల నిదురించుచున్న గోపికను మేల్కొలిపే భారమును ఆమె తల్లియైన తన మేనమామ భార్యకు-అత్తకు అప్పగించినది.   సౌధము విషయమునకు వస్తే గోకులములోని గృహములకు బిరుద్ధముగా నున్న మణిమయసౌధము.  సురభుల...

AALO REMBAAVAAY-08

Image
ఎనిమిదవ పాశురము. ***************** కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్ దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్ ఆవా వెన్రాయాండు అరుడేలో రెంబావాయ్.  

AALOREMBAVAY-07

Image
  ఏడవ పాశురము **************** కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో? నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.

AALO REMBAAVAAY-05

Image
  ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.  పరమాత్మ తత్త్వమను వేదవృక్షమునకు విత్తనము వంటి తిరుప్పావై లోని ప్రథమభాగమైన మొదటి ఐదు పాశురములు స్వామి మనలనుద్ధరించుతకు తనకు తాను పర-వ్యూహ-విభ-సర్వాంతర్యామి తత్త్వములనుగ్రహించుతయే కాక అంతర్యామియై తన భక్త వాత్సల్యమును ఏ విధముగా తనకు తాను యశోదమ్మకు ఒక చిన్ని తాటితో కట్టబడినాడో సంకేతముగా వివరించుచున్నది గోదమ్మ.  ఇక్కడ మనము ఒక చిన్న విషయమును గమనించవలెను .గోదమ్మ విత్తు అనినది.గింజ అనలేదు.ఈ రెండు పదములలో భావప్రకటనలో వ్యస్త్యాసమున్నట్లుంది.  గింజలు మనకు ఆహారముగా అంతరించిపోవునవి.విత్తు తిరిగి తానొక మహావృక్షముగా రూపుదిద్దుకొని అనేక విత్తనములను సృష్టిస్తుంది.అదేవిధముగా తిరుప్పావై ఎందరెందరి మదిలో జీవనపరమార్థ భావములకు జీవము పోస్తుంది.  ఇంకొక ముఖ్యవిషయము తూయోమాయ్ ...

AALO REMBAVAY-04

Image
  నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః  ఓంగి ఉలగళంద్ పాశురములో స్వమి తానే త్రివిక్రమ వేషధారియై అవతారలీలావిశేషములౌ ప్రస్తుతించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో స్వామి తాను సూత్రధారియై,వరుణదేవుని పాత్రధారునిగా మలచి,పద్మనాభస్వామి స్వరూప-స్వభావ-విభవములతో పోలుస్తు,వరుణదేవుని లోక సంరక్షణాకార్యనిర్వాకునిగా అదియును పాపపుణ్యములను లెక్కించని సర్వత్ర వానగా స్వామి ఆనగా వర్షించు అని ప్రార్థిస్తున్నది.వారి నోము లోక సంక్షేమమునకు గాన జలకములాడుటకు తగిన వనరులను అర్థించుచున్నది.     ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశ...