Posts

AALO REMBAAVAAY-06

Image
   ఆరవ పాశురం. *************  ఆండాళ్ తల్లికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, అనుగ్రహించినంత మేరకు మేల్కొలుపుల ప్రారంభ పాశురమైన ఆరవ పాశురమును అనుసంధానము చేసే ప్రయత్నమును చేసుకుందాము. పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో? పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.  వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై  ***********************   పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా.          మూలవిరాట్టు  దర్శనమునకు ముందు ఆలయ ప్రాకార ప్రదక్షిణము వలె భాగవత గృహ ప్రదక్షిణమును మనతో గోదమ్మ  చేయిస్తున్నది.   ఇంద్రియములు ప్రకృతిని అనుసంధానముచేసుకుంటే ప్రపంచము.అవే ఇంద్రియములు పరాత్పరుని అనుసంధానము చేసుకోగలిగితే పారమార్థికము.  ఆ విషయమును మనము సులభముగా గ్రహించుతకై గోదమ్మ "పుళ్ళుం"శబ్దమును ప్రయోగించినది.  పుళ్ళుం అంటే తెలుగుభాషలో పక్షులు.అ...

AALO REMBAAVAAY-05

Image
   ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనరూపా గోపాలా-ఊహాతీతము నీ లీల ******************** " పూర్ణమదం-పూర్ణమిదం  పూర్ణాత్ పూర్ణమిదుచ్యతే"  అన్నది వేదవాక్యము.దానిని విశదముగా ఈ ఐదు పాశురములలో సమన్వయపరచినది గోదమ్మ.మరింత స్పష్టము చేయుచు,నారాయణుడని వైకుంఠ ప్రస్తావనచేసినది పూర్ణస్వరూపమునే.దాని పొందుట బహుదుర్లభము.సుదీర్ఘ ప్రయాసతో కూడుకొనిన ప్రయత్నము.ఘోర తపశ్శక్తి  సంపన్నులకు మాత్రమే సాధ్యము.దానికంటె కొంచము సులభమైనది క్షీరాబ్ధిశయనుని  శయనునిది పూర్ణస్వరూపమే( పొందగలుగుట).బ్రహ్మాది దేవతలకు తమ వినతులను మాత్రమే సమర్పించుకొను సదవకాశమును కల్పించునది.అందరికి దుర్లభము.దానికంటె  కొంచము సులభతరమైనది అవతారమును  పూర్ణస్వరూపమే. వైభవము.కాని అది కాలపరిమితిని-కారణ పరిమితిని అనుసరించు ని...

AALO REMBAVAY-04

Image
     నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః *********************  గోకులములోని వారందరు తాము వింటున్నది-కంటున్నది-అంటున్నది కృష్ణునినే తక్క అన్యము కాదని భావించు భాగ్యశాలురు.వారి సమయము-సంభాషణము-సమస్తము శ్రీకృష్ణుడే.వారెవరిని తలచుకొనినా-కలుసుకొనినా-పిలుచుకొనినా వారి సంబోధనము మాత్రము ఒక్కటే.అదే, కణ్ణా! గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ పంచాయుధములను-పంచభూతములను-పంచేంద్రియములను సమన్వయపరుస్తూ,ప్రళయానంతరమున ప్రకటింపబడిన, పద్మనాభస్వామిని వరుణదేవునిగా ప్రార్థిస్తున్నది.  భావములోన-బాహ్యమునందున గోవింద గోవింద అన్నది వారి జీవనము.  నిత్యకర్మానుష్ఠానమునకు/మార్గళి స్నానమునకు కావలిసిన జలములను పుష్కలము నిమ్మని వారు స్వామిని వేడుకుంటున్నారు.   మగిళిందు మార్గళి నీరాడ   మనస్ప...

AALO REMBAAVAAY-02

Image
   రెండవ పాశురము-02 *************** వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టు ఎళుదోం మలరిట్టు నాం ముడియోం శెయ్యాదన  శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం ఐయముం  పిచ్చైయుం ఆందనైయుం  కైకాట్టి ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః    ***********************************  ప్రథమ పాశురములో నారాయణుని దయార్ద్రహృదయమును సంకీర్తిస్తూ,స్వామి మనమీది వాత్సల్యముతో రేపల్లెలో శ్రీకృష్ణునిగా అవతరించినాడని, ,నోము నిర్వాహకునిగా తానుండి , మనలతో కలిసి ఆడి-పాడి ,అనుగ్రహిస్తాడని , వారుచేయవలసిన వ్రతవిధానమును వివరించుచున్న ఆండాళ్ అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,రెండవ పాశురమును అనుసంధానముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   ప్రస్తుత పాశురములో అమ్మ నిశ్చయ -జ్ఞానము గోపికలను" వైయత్తు వాళ్వీర్గాళ్ అంటు గోపికల భూసురత్వమును గుర్తుచేసినది.మొదటి పాశురములో చిరుమీర్గాళ్ పసివారు అన్నది.అయినప్పటికిని శెల్వ చిరు మీర్గాళ్-అంటు వారి సంపదను ప...

AALO REMBAAVAAY-01 PASURAM

Image
    పాశురం-01     ఆండాళ్  తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము.అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నమక్కే మనకే తప్పక పరతరువాయ్-పరను అనుగ్రహిస్తాడు అన్న  అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ,  మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్  నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్ శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్  ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం  కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్  నారాయణనే నమక్కే పరై దరువాన్  పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ.      **********************     మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.వ్రతఫలితముగా స...

AALOREMBAVAY-09

Image
  తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.   నిత్యానుష్ఠానమునుండి నిరంతరానుష్ఠానమునకు చేర్చుచున్న హోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  మామా మాదవన్ వైకుందన్ శరణం.  నామ సంకీర్తనా వైశిష్ట్యమును తెలియచేయునది ప్రస్తుత పాశురము.ఆండాల్ తల్లి మనకు ప్రస్తుత పాశురములో,  మణిమయసౌధము  ప్రకాశ దీపములు  పరిమళ ధూపము  పవిత్ర పానుపు  పానుపుపై పవళించి-పరవశించు పడతి  మంత్ర మహిమ  మామీర్ అను మరో దేహ సంబంధమును పరిచయము చేస్తున్నది.  విచిత్రముగా లోపల నిదురించుచున్న గోపికను మేల్కొలిపే భారమును ఆమె తల్లియైన తన మేనమామ భార్యకు-అత్తకు అప్పగించినది.   సౌధము విషయమునకు వస్తే గోకులములోని గృహములకు బిరుద్ధముగా నున్న మణిమయసౌధము.  సురభుల...

AALO REMBAAVAAY-08

Image
ఎనిమిదవ పాశురము. ***************** కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్ దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్ ఆవా వెన్రాయాండు అరుడేలో రెంబావాయ్.