Posts

AALO REMBAAVAAY-11

Image
  పాశురము-11  *************  కుండలినిశక్తిలా చుట్టుకునియున్న జీవాత్మా  నీవు అనేక గ్రంధులను ఛేదించుకొనుచు ముగిల్వణ్ణన్ అను  సహస్రారమును  చేరవలసిన పున్మయిల్ వనమయూరివి.తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా అంటూ అన్యాపదేశముగా యోగరహస్యములనందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నము చేద్దాము.    కట్రుక్కరవై కణంగళ్ పలకరందు    శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం    కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె    పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్    శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్    మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ    శిట్రాదే-పేశాదే సెల్వన్ పెండాట్టి, నీ    ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.    నమో భగవతే శిఖి పింఛాయ నమః.    ************************  ప్రస్తుత పాశురములో :కుట్రం ఒన్రిల్లాద" ఒక్క దోషమును,లేశమైనను కానరాని గోపిక నిదురలేపబడుచున్నది.  మరొక్క విషయము కణంగళ్ -సమూహములు...

AALO REMBAAVAA10

Image
   పాశురము-10  *************  మనకు రామావతార విశేషములను పరిచయముచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పదవ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. *************************** పాదములలదుకున్నవి వేదగంధమును పెదవులందించునుగద నాదగంధమును నలువనందించిన నడుమున కమలగంధంబు మెడమీడ నడయాడు తులసిగంధంబు నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను గోద పూమాలల గంధంబు మోదమందించుట నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.    తులసిగంధముతో పరిమళించు ప్రస్తుత పాశురములో,  నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్ మాట్రావుం తారారో వాసల్ తిరవాదార్ నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్ పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ పండొరునాళ్  కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం తోట్రుం ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో అట్ర అనందన్ ఉడయాయ్ అరుంగలమే తేట్రమాయ్ వందు తిరవేలో రెంబోవాయ్.       ఐదవ గోపికను గోదమ్మ "అమ్మణాయ్"( స్వామిని) అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనన...

AALO REMBAAVAAY-08

Image
       పాశురము-08       ************   గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.  కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు  మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం  పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు  కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ  పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు  మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్  దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్  అవావెన్రు ఆరాయంద్రు అరుళేలో  రెంబావాయ్.   ఓం నమో నారాయణాయ   ********************  తెల్లవారుచున్నది.తూరుపున వెలుగురేఖలు కనబడుచున్నవి.పశువులు చిరుమేతకు తరలినవి. దేవాదిదేవుని నోమునకు వెళ్లుచున్నవారిని/వెళ్లుటకు సిద్ధమగుచున్నావరిని,కొంతసమయము నిలువమని మేము నిన్ను మేల్కొలుపుటకు వచ్చి,నీ గుమ్మము ముందర నిలబడి నిన్ను పిలుస్తున్నాము.అన్నది వాచ్యార్థము.  కోగులం ఉడయ-కుతూహలము కొత్తచిగురులు తొడుగుచుందగా   1.తూరుపుదిక్కు చీకట్లను పారద్రోలుచు వెలుగు రేఖలను ప్రసరించుటకు కుతూహల పడుచున్నది.   2.పశువులు (ఎరుమై) కొంచము...

AALO REMBAAVAAY-07

Image
     పాశురము-07    **********  గోదమ్మకు అనేకానేక దాసోహములను  సమర్పించుకుంటు.అనుగ్రహించినంత మేరకు అనుసంధానమును చేసుకుందాము.  కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో? నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.  నారాయామంత్రం-శ్రీమన్నారాయణ భజనం.  ******************************     ఓ కర్ణేంద్రియమా జాగృతము అయ్యి శ్రవణభక్తిని ఆచరించి ఆస్వాదించు పరమాత్మ ప్రసన్నతను అంటూ ఆరవ పాశురములో చెప్పినట్టుగానే,  కేట్టిలియో?-వినలేదా అని లోపలనున్న గోపికను ప్రశ్నించుచున్నది.  ప్రస్తుత పాశురములో నాసికను సైతము జాగృతముకమ్మని   ఆయిచ్చ్నర్ వాసనరుం కుళల్   గొల్లపడుచుల సుగంధకేశపాశముల పరిమళములను ఆస్వాదించుము అని మరొక ఇంద్రియ ప్రస్తావన తెచ్చినది.  నారాయణమూర్తి కేసవనై-పాదవుం  అంటూ వాక్కును సైతము హెచ్చరించినది.  నిదురించుచున్న వార...

AALO REMBAAVAAY-06

Image
   ఆరవ పాశురం. *************  ఆండాళ్ తల్లికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, అనుగ్రహించినంత మేరకు మేల్కొలుపుల ప్రారంభ పాశురమైన ఆరవ పాశురమును అనుసంధానము చేసే ప్రయత్నమును చేసుకుందాము. పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో? పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.  వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై  ***********************   పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా.          మూలవిరాట్టు  దర్శనమునకు ముందు ఆలయ ప్రాకార ప్రదక్షిణము వలె భాగవత గృహ ప్రదక్షిణమును మనతో గోదమ్మ  చేయిస్తున్నది.   ఇంద్రియములు ప్రకృతిని అనుసంధానముచేసుకుంటే ప్రపంచము.అవే ఇంద్రియములు పరాత్పరుని అనుసంధానము చేసుకోగలిగితే పారమార్థికము.  ఆ విషయమును మనము సులభముగా గ్రహించుతకై గోదమ్మ "పుళ్ళుం"శబ్దమును ప్రయోగించినది.  పుళ్ళుం అంటే తెలుగుభాషలో పక్షులు.అ...

AALO REMBAAVAAY-05

Image
   ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనరూపా గోపాలా-ఊహాతీతము నీ లీల ******************** " పూర్ణమదం-పూర్ణమిదం  పూర్ణాత్ పూర్ణమిదుచ్యతే"  అన్నది వేదవాక్యము.దానిని విశదముగా ఈ ఐదు పాశురములలో సమన్వయపరచినది గోదమ్మ.మరింత స్పష్టము చేయుచు,నారాయణుడని వైకుంఠ ప్రస్తావనచేసినది పూర్ణస్వరూపమునే.దాని పొందుట బహుదుర్లభము.సుదీర్ఘ ప్రయాసతో కూడుకొనిన ప్రయత్నము.ఘోర తపశ్శక్తి  సంపన్నులకు మాత్రమే సాధ్యము.దానికంటె కొంచము సులభమైనది క్షీరాబ్ధిశయనుని  శయనునిది పూర్ణస్వరూపమే( పొందగలుగుట).బ్రహ్మాది దేవతలకు తమ వినతులను మాత్రమే సమర్పించుకొను సదవకాశమును కల్పించునది.అందరికి దుర్లభము.దానికంటె  కొంచము సులభతరమైనది అవతారమును  పూర్ణస్వరూపమే. వైభవము.కాని అది కాలపరిమితిని-కారణ పరిమితిని అనుసరించు ని...

AALO REMBAVAY-04

Image
     నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః *********************  గోకులములోని వారందరు తాము వింటున్నది-కంటున్నది-అంటున్నది కృష్ణునినే తక్క అన్యము కాదని భావించు భాగ్యశాలురు.వారి సమయము-సంభాషణము-సమస్తము శ్రీకృష్ణుడే.వారెవరిని తలచుకొనినా-కలుసుకొనినా-పిలుచుకొనినా వారి సంబోధనము మాత్రము ఒక్కటే.అదే, కణ్ణా! గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ పంచాయుధములను-పంచభూతములను-పంచేంద్రియములను సమన్వయపరుస్తూ,ప్రళయానంతరమున ప్రకటింపబడిన, పద్మనాభస్వామిని వరుణదేవునిగా ప్రార్థిస్తున్నది.  భావములోన-బాహ్యమునందున గోవింద గోవింద అన్నది వారి జీవనము.  నిత్యకర్మానుష్ఠానమునకు/మార్గళి స్నానమునకు కావలిసిన జలములను పుష్కలము నిమ్మని వారు స్వామిని వేడుకుంటున్నారు.   మగిళిందు మార్గళి నీరాడ   మనస్ప...