Posts

AALO REMBAAVAAY-28

Image
     పాశురము-28    ************ " కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి   కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"    "స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు. "కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి భాగ్యశాలియో రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."   ఇరువది ఎని...

AALO REMBAAVAAY-27

Image
       పాశురము-27       ************   "సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము   సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము."    మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం  ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను     ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు, "అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమ...

AALO REMBAAVAAY-26

Image
         పాశురము-26      *************   " శరణార్థులు నీ సంశ్లేషమునే కోరువారని గ్రహించు    శంఖములు-దీపములు-కొలుచువారిని, అనుగ్రహించు"     స్వామి నీకు మాయందుగల వాత్సల్యము-మాకు నీయందుగల వ్యామోహము నీ నీలమణివర్ణ  పారదర్శకత పదేపదే చెబుతున్నది.అయినను మా మీది అనుగ్రహము నీతో పదేపదే "సంభాషించు భోగమును" ప్రసాదించుటకా యన్నట్లు" ఏమికావాలని ఏమీ తెలియనట్లు" ప్రశ్నించుచున్నావు  అని అంటున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరువది ఆరవ పాశురం ********************* మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్ మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్ ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే, కోళ విళక్కే,కొడియే,వితానమే ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!  మాలే-ఆశ్రితవాత్సల్య స్వరూపమా!  మణివణ్ణా-మా మనసులోని భావములను గ్రహించినవాడా!  యాం వేండువన కేట్టియేల్-మాకు కా...

AALO REMBAAVAAY-25

Image
   పాశురము-25  *********** "అఖిలాండ రక్షణముగా చేసితివి మాకొరకై అజ్ఞాతము  అనవరతకటాక్షముగాద  అవతార రహస్యజ్ఞానము." ఇరవై ఐదవ పాశురం ***************** ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్ ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర తరుకిల్లానాంగి తాంతీంగు నినైన కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్ నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్ తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!    ఏకము-అనేకముగా అనుగ్రహిస్తున్న వైనమును గోపికల ద్వారా మనకు తెలియచేస్తున్నది.వారు, 1.మగిళిందు వందోం-సంతోషముగా వచ్చారట 2.శెల్వముం-సేవగమం యాంపాడి-నీ యొక్క పరాక్రమము సంపదను పాడుతూ వచ్చాము.అంటున్నారు.  వారి సంతోషమునకు కారణము  ఓర్ ఇరవిల్ అంటున్నారు.  ఒక రాత్రి వారి సంతోషమునకు కారణమై ప్రకాశిస్తున్నదట.  బాహ్యమునకు విరుద్ధము. చీకటి తొలగితే కాని మనము ప్రకాశమును కాంచలేము.కాని వీరికి చీకటి ప్రకాశముగా భాసిస్తూ,ప్రమోదమును కలిగిస్తోందట.   పైగా మాకే కాదు ఆ ఒకే ఒక రాత్రి, 1.మధురా నగరమునకు సంతోషమును కలిగించినది జన్మస్థానమై. 2.దేవకీద...

AALO REMBAAVAAY-24

Image
           పాశురమునకు పోట్రి,        **********************   " మాయావుల మదమదచిన పాదములకు పల్లాండ్లు    మా యానగ నీదరిచేరలేవు మాధవ కడగండ్లు"   సుతుడనుచు దశరథుడు-హితుడనుచు సౌమిత్రి   క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని  అని త్యాగరాజుచే కీర్తించబడిన రామావతార విశేషములను "అన్రు" అని-కృష్ణావతార  విశేషములను "ఇన్రు" అంటూ భగవంతునితో-భాగవతులుగా వారికున్న సంబంధజ్ఞానమును సంకేతిస్తూ,శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా స్వామికి మంగళాశాసనములను అందించుటయే మహద్భాగ్యమనుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు "పోత్తి" పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరువది నాలుగవ పాశురం ************************* అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి ఎన్రెన్రు ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్ ఇన్రుయాం వ...

AALO REMBAAVAAY-23

Image
       పాశురము-23    *********** " స్వామి సౌకుమార్యమునకు ఆతసీపుష్పములు  సింహగతిని వీక్షించుచు  ఆనందభాష్పములు"   సర్వవాహనుడైన స్వామిని శీరియ సింహాసనారూఢినిగా మనకు దర్శింపచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.   అజ్ఞానము పురూరవ శాపముగా యాదవులకు సింహాసనాధిష్థత నిషేధముకదా మరి స్వామిని వచ్చి, శీరియసింహానముపై కూర్చుని వారిని అనుగ్రహించమనుచున్నారేమిటి? అని ప్రశ్నించవచ్చును.  ఇక్కడ స్వామి అధిష్ఠించవలసినిది రాజ్యసింహాసనము కాదు.రాజిల్లు హృత్పద్మసింహాసనము.అదియును శీరియసింగము వలె.లక్ష్మీనారాయణులుగా. ఇరవదిమూడవ పాశురం ********************* మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పుడయ  శీరియశింగాసనత్తు ఇరుందు యాం వంద కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్  "మృగానాంచ-మృగేంద్రోహం." అన్నాడు స్వయముగా పరమాత్మ- ...

AALO REMBAAVAAY-22

Image
     పాశురము-22    ***********  " అహమును వీడి రాజసము సర్వవాహనమగు సుందరరూపము    ఇహపరమని కాంచగనీయదు సహనము లేనిదగు మాదుశాపము" సరస సింగారభరితముగా భ్రమింపచేసిన సంసారమను,      తమోభూమిని వీడి తపోభూమిని ప్రవేశించినారు గోపికలు.కాని వారికి స్వామి దర్శనము లభించకపోవుటకు కారణము ఇంకను తమను వెంటాడుతున్న ,తమను పూర్తిగా విడువని శాపములేమో.స్వామి తన దృక్కులద్వారా వాటిని పరిహరించగలడను నమ్మకముతో,   "అకించిన్యం"-నా ఉపాధి సమర్థవంతము కానిది   "అనన్యగతిత్వం'-అది కదులుచున్నదంటే అది నీ అనుగ్రహమే అను భావనను "సర్వవాహన" సింహాసన !అను అందమైన ఉదాహరణలతో గోపికల పలుకుల ద్వారా అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఇరువది రెండవ పాశురము. ********************* అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన బంగమాయ్ వందునిన్   పళ్ళికట్టిల్ కీళే శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విళియావో తింగళుం   ఆదిత్తనియుం ఎళుందార్ పోల...