Posts

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH RUDRAM-PART-02

Image
   పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు.  రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు.  అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది.  రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు.  రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో  తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు.  ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు.   ఏకం-అ...

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH NAMAKAM -PART-01

Image
   మనుగడలోని ప్రశాంతతను అడ్డుకొనునది రోదనము.  స్వస్వరూపమును తెలిసికొననీయనిది రోదనము.  రోదనం ద్రావయతి ఇతి రుద్రః.  దుఖమును-శోకమును ద్రవింపచేయువాడు కనుక పరమాత్మ  రుద్రునిగా సంకీర్తింపబడుతున్నాడు.అంటే భద్రతను చేకూర్చు పరమాత్మయే రుద్రుడు.  ఆదిత్యహృదయ స్తోత్రము సైతము పరమాత్మ ప్రసన్నతను సూర్యమండలముగా భావిస్తూ,ప్రసాదగుణమును సూర్య రూపముగా ప్రస్తుతిస్తున్నది.  అంతే కాదు అనేకానేకములుగా మండలమునుండి విస్తరిస్తున్న కిరణములను అనేకానకములుగా విస్తరించుచున్న రుద్రులుగా భావిస్తున్నారు.భాసిస్తున్న కిరణములు భవసాగరమును దాటించు రుద్రులు అన్నమాట.  పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.   ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.  కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న  "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SARVASATRUVINASAKAM)

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ARGHYASEVITAAYA NAMAHA)

Image
   సనాతన పూజావిధానములో జలమునకు ప్రాధాన్యత ఉంది.పూజా ప్రారంభమునందు చేయు ఆచమనీయము,షోదశపూజలో చేయు అర్ఘ్యము-పాద్యము-శుద్ధ ఆచమనీయము,శుద్ధోదక స్నానము,ఉదకశాంతి ఎంతో ముఖ్యమైనవి.   బాహ్యమునకు సుచియై చతిలో జలమును గాయత్రీమంత్రపూర్కముచేస్ ఊర్ధ్వ దిశగా చేయు సంధ్యావందన ప్రకృఇయగా భావిస్తారు.కొందరు మూడు సంధ్యలయందును సూర్యునికి అర్ఘ్యమును సమర్పించే విధానమును పాటిస్తారు.   దీనివలన వాతావరణ పారిశుభ్రమునకు ఆటంకము కలిగించే సూక్ష్మజీవులు నశించి పర్యావరణము పచ్చగా ఉంటుందని సమర్థిస్తారు.ఇది కాదనలేని అంసమే.   ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే గరుడ పురాణములో చెప్పబడినట్లు మనకు సూర్యునికి మధ్య అడ్డముగా మందేహులు అనే అసురులు ముసురుకుంటారని వారిని మంత్రపూరిత(గాయత్రీ) జలముతో-దోసిలి నింపుకుని పైకి విసిరిన అద్దకులు తొలగిపోవునని భావిస్తారు.అదియును కాదనలేని విషయమే.   శ్రీ లలితారహస్య సహస్ర నామ స్తోత్రములో చెప్పబడినట్లు,  కేవాలా-కైవలానర్ఘ్యా-కైవల్యపదదాయిని" అన్న శ్లోకమును విచారిస్తే అర్ఘ్య అన్న పదమును గడియగా భావించి,గడియలులేని కైవల్యమును కేవలానర్ఘ్యగా అమ్మను అనుగ్రహించేదానిగా కీర్తిస్తారు.  మన-...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VISVAKARMA-TVASHTA NAMOSTUTE)

Image
   ఋగ్వేద "హిరణ్యగర్భ సూక్తము" పరమాత్మ యొక్క త్వష్ట నామధేయమును సోదాహరణముగా వివరించుచున్నది.  సామాన్యార్థములో మలచువాడు-తొలచువాడు గా వ్యవహరింబడు త్వష్ట.కాని సకలభువనభాండములను పద్ధతిగా ప్రకటించిన పరమాత్మ విశ్వకర్మ.అంతే కాదు పంచభూతములు ఏ విధముగా ఒకదానినొకటి సమన్వయపరచుకుంటూ ప్రపంచముగా ప్రకాశించాలో నిర్దేశిస్తూ,వాటికి అడ్దుగా ఉన్న వాటిని తీసివేస్తూ ,  వేదెఒపాసనగా . " కస్మైదేవాయ హవిః విధేయ? అన్న ప్రశ్నకు సమాధానముగా  " ఏకస్మై దేవాయ-ప్రణతోస్మి" అని సమాధానమిచ్చినది  హిరణ్యగర్భసూక్తము. "తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.హిరణ్య శబ్దమునకు విజ్ఞానమును సమన్వయించుకుంటే,  యస్యేమె హిమవంతొ,సముద్రో,దిక్పాలక ప్రస్తుతిస్తున్నారో వారే విశ్వకర్మ.వారే త్వష్ట.ప్రపంచ వనరులను ,నింగి-నేలలను నిర్దిష్ట పరచు నిత్యచైతన్యమా,నిన్ను ఆపోహ యత్ బృహతి విశ్వం అయాన్ గర్భం  దధానా జయంతి అగ్నిం-తతో దేవానాం...అని ప్రస్తుతిస్తున్నది వేదము.   తం సూర్యం ప్రణమామ్యహం.  

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(HIRAnYARETA NAMOSTUTE)

Image
  " లోకంబులు లోకేశుడు     లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం     జీకటికవ్వలనెవ్వం     డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".                -బమ్మెర పోతనామాత్యుడు.   అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.   సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.  అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అసలే కానరాని అయోమయస్థితి.    మనము ఆధారములుగా-కారణములుగా వీటిని పరిగణిస్త...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( SADAA RAAKSHASA SEVITAM)

Image
    విశ్వసృష్టి విస్తరణకై బ్రహ్మ ఆదేశానుసారముగా కశ్యప మహర్షి తీవ్రతపమొనరించెను.దాని ఫలితముగా అనంత తేజము అతని నుండి బయల్వెడలెను.బ్రహ్మాదేశానుసారము దానిని సముద్రప్రవేశము చేయించి తదుపరి కార్యక్రమముగా అండజములను,స్వేదజములను,బుద్బుజములను,భూరుషములను,జలచరములను,భూచరములను,ఖేచరములను అనేకానేక ఉపాధులతో సృష్టిచేసెను.వీటిలో కొన్ని త్రిగుణములకు సంబంధించినవి.  కశ్యప ప్రజాపతి-దితికి జన్మించిన సంతానమే దైత్యులుగా-రాక్షసులుగా వ్యవహరింపబడుచున్నారు.నిజమునకు వీరు తమోగుణ ప్రధానులు.  రాక్షసులు సూర్యరథమును ముందుకు జరుపుచుందురు అని సనాతనము చెప్పుచున్నది.  తిమిరహరుడు,దినకరుడు-దివాకరుడు-భాస్కరుడు చీకట్లను పారద్రోలుటకు సంసిద్ధమగుచున్నాడనుటయే రాక్షసులు సూర్య రథమును వెనుక నుండి ముందుకు జరుపుచున్నారన్న మాటలోని రహస్యము.  1.మధుమాసములో-హేతి అను రాక్షసుడు  2.మాధవ మాసములో-ప్రహేతి అను రాక్షసుడు  3.శుక్ర మాసమునందు-పౌరసేయుడను రాక్షసుడు  4.శుచి మాసములో-సహజన్యుడు  5.నభ మాసములో-వార్య రాక్షడును  6.నభస్య మాసములో-వ్యాఘ్ర రాక్షుడును  7.ఇష మాసములో-బ్రహ్మపేత రాక్షసుడును  8...