Posts

INTRODUCTION

Image
   ప్రియ మిత్రులారా ,శరత్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.    శ్రీ మాత్రే నమః.  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌః"    పార్వతీ-పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె-పూవు-తావి వలె,శబ్దము-అర్థము వలె నిత్య సంబంధము కలవారు.తన రఘువంశ కావ్యారంభములో వారిని,వాగర్థ ప్రతిపత్తికై/ప్రతిభా-పాటవములకై వాగర్థస్వరూపులైన వారిని నమస్కరించి వరప్రసాదుదైన మహా కవి కాళిదాశుని కనికరించిన తల్లి ,మనలనందరిని కనికరించుచున్నదా యనునట్లు మహాకవిచే మరొక అమృత లహరి/అద్భుత వాగ్ఝరి అయిన 'కాళికా దసశ్లోకి" అను మరొక 13 శ్లోకము అంబాస్తుతిని మానవాళికి అనుగ్రహింపచేసినది.అతివేగముగా అమ్మ వారి అనుగ్రహమును పొందగలిగిన స్తోత్ర రాజము అమ్మవారిక్షిప్రప్రసాద గుణమునునకు ప్రతీకగా "అశ్వధాటీ స్తొత్రముగా" వాసికెక్కినది.వేగముగా పరుగులు తీయుచునంబ ఆడుగుఱ్ఱపు డెక్కల సవ్వడి వంటి శబ్ద వేగముతో,కళ్లకు గంతలు కట్తుకుని అటు-ఇటు చూడని ఏకాగ్రత కు మారుగా,గమ్యమును చేర్చుటకు పూనుకొనిన ఆ జగజ్జనని సాక్షిగా,ఏ మాత్రము అర్హత-అనుభవము -పాండిత్యము లేని ఈ ఉపాధి దుస్సాహసమును చేయుచున్నది. 13 శ్లోక...

KURYAAT KATAKSHAMKALYAANI-13

     ప్రార్థన  ప్రదీప జ్వాలాభిః దివసకర నీరాజన విధిః   సుధాసూతే చంద్రో ఫలజలం వైరర్ఘ్యరచనా  స్వకీయైః అంభోభిః సలిలవిధి సాహిత్యకరనం  త్వదీయాభి@ః వాగ్భిః తవ జననివాచాం స్తుతి రియం.. శ్లోకం   ఇంధాన కీల మణిబంధా భవే హృదయ బంధా వతీవ రసికా   సంధావతీ భువన సంధారణేప్యమృత సింధా వుదార నిలయా   గంధానుభావ ముహురంధాలి పీత కచబంధా సమర్పయతు మే   శం ధామ భానుమపిః ఉంధానం ఆశుపద సంధానః అప్యనుగతా.

KURYAT KATAKSHAM KALYANI-12

   ప్రార్థన     తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం   తమీడే సంవర్తం జననీ మహతీం తాం చ సమయాం   యదాలోకే లోకాన్ దహయతి మహతి క్రోధకలితే   దయార్ద్రా యా దృష్టిః శిశిరం ఉపచారం రచయతి.   శ్లోకము  కూలాతిగామి భయ తూలావళి జ్వలనకీలా నిజస్తుతి విధా  కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాలపోషణనభా  స్థూలాకుచే జలదనీలా,కచే కలిత లీలా కదంబ విపినే  శూలాయుధ ప్రణతి శీలావిభాతు హృది శైలాధిరాజ తనయా.

KURYAT KATAKSHAMKALYANI-11

  ప్రార్థన   కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం     సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం  తవేదం నఃఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం  యదాలోక్యా శంకాకులిత హృదయో హాస జనకః  స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి.  శ్లోకము      యత్రాశయోలగతి తత్రాగజ వసతు కుత్రాపి నిస్తుల శుకా  సుత్రామ కాలముఖసత్రాసకప్రకర సుత్రాణకాలిచరణా  ఛత్రానిలాతిరయ పత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ  కుత్రాసహీన మణి చిత్రాకృతి స్పురిత పుత్రాదిదాన నిపుణా.తాం రంజనమమీ. 1.    స్తోత్ర పూర్వపరిచయము.  *******************  ముగురమ్మలను మూడువిధములుగా స్తుతించి,ముచ్చటగా మూడు వరములను కోరిన మహాకవిని,ఆ" భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షిణి,ఆ" సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాతాలోక పూజ్యుని చేయదలచినదేమో.  కనుకనే మహాకవి ప్రస్తుత శ్లోకములో,చాందోగ్య ఉపనిషత్ మహావాక్యమైన. "తత్-త్వం-అసి" ని బహుచమత్కారముగా మనకు పరిచయము చేస్తున్నారు.  కంకాళ పక్షి విషయే అంటు మన ఉపాధి విషయమును ప్రస్తావించువేళ,ప్రజ్ఞానం బ్రహ్మ అను మొదటి వాక్యమును చెప్పకనే చెప్పినారు.బృందార బృంద ...

KURYAT KATAKSHAM KALYANI-10

Image
           కుర్యాత్  కటాక్షంకళ్యాణి-10     ****************************  ప్రార్థన  ***** " అరాలైః స్వాభావ్యాత్ అలికలభన శ్రీ భిరలకైః    పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం    దరస్మరేయస్మిన్ దశన రుచికింజల్క రుచిరే    సుగంధౌముద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః"  శ్లోకము  *****  వందారు లోక వర సందాయినీ విమల కుందవదాత రదనా  బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా  మందానిలా కలిత మందారదామభిః అమందాభిరామ మకుటా  మందాకినీ జననభిందాన వాచమరవిందాసన దిశతుమే.  స్తోత్ర పూర్వ పరిచయము  ******************   దుష్ట శిక్షణ-శిష్ట రక్షణమే  తన కరుణగా  లీలా బ్రహ్మాండ రూపిణి,శివాపరాధముగా తన తండ్రియైన దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగమును అడ్డుకుని,పరమేశ్వరునిచే దక్షుని మేథను సంస్కరింప చేసినది.కాఠిన్యము-కారుణ్యము తన చూపులుగా,ప్రసరించుచున్న తల్లి,ప్రస్తుత శ్లోకములో ముగురమ్మల రూపముగా ముజ్జగములను ఏవిధముగా కరుణించుచున్నదో దర్శింపచేస్తున్నారు. అమ్మవారి రదనకాంతి,చరణకాంతి,కిరీట కాం...

KURYAAT KATAAKSHAM KALYAANI-09

Image
    ప్రార్థన   ధునోతు ధ్వాంతం నస్తులిత దలితేందీవరవనం   ఘనస్నిగ్ధ శ్లక్ణం చికుర నికురంబం తవ శివే   యదీయం సౌరభ్యం సహజముపలబ్దుం సుమనసో   వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం.  శ్లోకము  దాక్షాయణీ దనుజశిక్షావిధౌ వితత దీక్షా మనోహర గుణా  భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దస్ఖాధ్వర ప్రహరణా  వీక్షాం విధేహి దక్షా స్వకీయ జనపక్షా విపక్ష విముఖీ  యక్షేశ సేవిత నిరాపేక్షశక్తి జయలక్ష్మ్యావధాన కలనా. స్తోత్ర పూర్వపరిచయము    కాళీ-రాజరాజేశ్వరి-సరస్వతి అను మూడు నామరూపములతో తమోగుణ-రజోగుణ-సత్వగుణ సంకేతముగా ప్రకటితమగుచున్నప్పటికిని జగదంబ త్రిగుణాతీత.బాల-కౌమారి-ప్రౌఢ అను వివిధ దశలలో  తనకరుణను ప్రకటిస్తున్నప్పటికిని అమ్మ సర్వావస్థా వివర్జిత.విశ్వ వపుషిని వాగ్భవకూట-కామరాజకూట-శక్తికూట త్రయినిగా సంభావిస్తూ శంకీర్తిచినప్పటికిని  పరాశక్తి అనవద్యాంగీ.  ఇక్కడ మనమొకవిషయములను గమనించవలెను.    అంగములన్నియును దృశ్యరూపములు.అంగములున్నను-లేలున్నను అందియుండగలదు.కాని అంగి లేనిదే అంగములుండజాలవు.  ప్రపంచమను దృశ్యరూపమునకు అంగి పరమేశ్వరి.శ...

KURYAAT KATAAKSHAMKALYAANI-08

Image
   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-08    *************************  ప్రార్థన  ****  వహత్యంబ స్తంబేర మదనుజ కుంభ ప్రకృతిభిః  సమరబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికా  కుచాభోగ బింబాధర రుచిభిరంత శబలితాం  ప్రతాప వ్యామిశ్రాం పురదమయితః కీర్తిమివతే.   శ్లోకము   ****   జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచసంభావ్య హార లతికా   రంభాకరీంద్ర దంభాపహోరు గతి డింభా అనురంజితపదా   శంభా ఉదార పరిరంభా కురాత్ పులక దంభానురాగ పిశునా   శం భాసుర ఆభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా.  స్తోత్ర పూర్వ పరిచయము  ****************         మహాకవి ఆరు శ్లోకములో అమ్మనుకోరినవరములకు భిన్నముగా ఏడవ శ్లోకములో ఉపాధి నైజమును వివరిస్తూ-ప్రత్యేకతను వ్యక్తి పరముగా ఎలా ఉపయోగపడుతుందో-అమ్మ పాదారవిందములనుచేర్చుటకు ఏకైక సాధనము సుమా అని తెలియచేశారు.     కాని అంత వేదాంతమును-పరమార్థమును సెలవిచ్చిన మహాకవి తరువాతి శ్లోకములో అమ్మ యొక్క కామరాజకూటమైన వక్షములను-వాటిపై ధరించినముత్యాలహారమును,శక్తికూటమైన ఊరువుల వైభవమును స్తుతించారు. అంటే కథ మళ...