Posts

KADAA TVAAMPASYAEYAM-10

Image
   కదా   త్వాం  పశ్యేయం-10   *********************  " జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం  లోకశంకరం".   " ప్రభుః త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే    ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః    త్వ యైవ క్షంతవ్యాః శివ మత్ అపరాధశ్చ సకలాః    ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః"  అంటూ  ఆ దీనబంధువుని మనో ఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.   విస్తుబోయి ఆ తుమ్మెదవంక తదేకముగా చూస్తున్న సంకరయ్య కన్ను,తన పనిని చెవికి అప్పగించిందా అన్నట్లుగా,  " సకలము నీవేనని తెలియని తెలివిని పెంచి    వికలము చేసినవి మనమును తలపులు పొంచి    తికమక వీడినది శివ-శివా కటాక్షము మెచ్చి    సకలము మీరేనని తెలిపినది శివాభ్యాం నమామి"   అని,  భృంగికృత శివస్తోత్రమును శ్రావ్యముగా పాడుతూ,పూజముగించుకుని వస్తున్నారు తాతగారు..  అయ్యో-అయ్యో అపచారము తుమ్మెదను చూపిస్తూ మహాదేవుడంటావురా నీవు ,నీ పిల్లచేష్టలు అని మనమని మందలిస్తూ...

KADAA TVAAM PASYAEYAM-09

Image
    కదా త్వాంపశ్యేయం-09 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." " యోగక్షేమధురంధరస్య సకల శ్రేయః ప్రదోయోగినో దృష్ట్వాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యమ్మయా శంభో! త్వంపరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యహం." శంకరయ్యా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి.మనము త్వరగాబయటకు వెళ్ళాలి.సిద్ధమైతే అన్నాడు శివయ్య ఆత్రుతగా. ఈ రోజే వెళ్ళాలా?ఇప్పుడే వెళ్ళాలా శివయ్యా అన్నాడు అయిష్టంగా శంకరయ్య. . ఎందుకో శంకరయ్యకు ఎక్కడికి వెళ్ళాలనిపించటంలేదు.ఎవ్వరిని చూడాలనిపించటంలేదు.రాత్రి వచ్చిన స్వప్నము నుండి బయటకు రావాలనిపించటము లేదు. మౌనముగా ఉన్న శంకరయ్యను చూస్తూ,ఏదో ఆలోచనలో పడ్డట్లున్నావు. నిమ్మకు నీరెత్తినట్లు నిదానముగా అన్నాడు నిష్టూరముగా. ఉలిక్కిపడ్డ శంకరయ్య ఏమిటి విశేషం శివయ్యా.చాలా హడావిడి పెట్టేస్తున్నావు ... అదా! నిన్న నీవు గురువుగారితో మాట్లాడుతున్నప్పుడు-కాసేపు అలా అలా వెళుతుంటే ఒక తుంటరి పిల్లవాడు శివుడు --లో ఉంటాడు..... తో,ఆడుకుంటుంటాడ...

KADAA TVAAMPASYAEYAM-08

Image
        కదా  త్వాం  పశ్యేయం-08   ******************   " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః  అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."   "సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే    సామీప్యం శివభక్తిదుర్య జగతా సాంగత్య సంభావతే    సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యనౌ భవానీపతే    సాయుజ్యం మమసిద్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్థోస్యహం."    బహుముఖముల భాసించే  భవానీపతిని,మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.    అమ్మపిల్లవాడిని కోప్పడినప్పటికిని వాడు తల్లి ఒడినే కోరుకుంటాడు.అదియే మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము.అదే విధముగాభగవంతుడు పాపకర్మక్షయమునకి ఎన్ని కడగండ్లను జీవులకు కలిగిస్తున్నప్పటికిని వారు భవత్సాన్నిధ్యముననే ఊరటను పొందగలుగుతారు అన్న విషయమును ఆదిశంకరులు అర్థమయ్యేలా అనుగ్రహించారు.   ఆలోచిస్తూ మెల్లగా పాదాలను కదుపుతున్నాడు శంకరయ్య.    ఆక్షేపిస్తూ తాను పావులను కదుపుతున్నాడు శివయ్య.   శంకరయ్యా! నీవు ఈమధ్యన అదోలా ప్రవర్తిస్తున్నావు. ఎప్ప...

KADAA TVAAMPASYAEYAM-07

Image
        కదా త్వాంపశ్యేయం-07   *****************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః  అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."    ' ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘః      సముద్యన్మనో మంథనం దృఢభక్తి రజ్జు సహితం      కృత్వా మథిత్వా  ...." అనుగ్రహించే స్వామిని మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.  పంతులు గారు ఏ మంత్రం వేసారో-కనికట్టు చేసారో  తెలియదు కాని,గిరిజను చూస్తాను అని బడికి తీసుకువచ్చింది  కన్ను తన పని అయిపోయినట్లుగా,చెవికి ఆ బాధ్యతను అప్పగించింది.మూడుకన్నుల వాని మాటను జవదాటగలదా కలలోనైనా.   త్రినయనం-త్రిగుణాకారం నమో-నమః.   కాసేపు నేను అలా చల్లగాలికి తిరిగివస్తాను అని శంకరయ్యను అక్కడే వదిలేసి చల్లగా జారుకున్నాడు శివయ్య.   గురువుగారు,ఏవో శ్లోకాలను చదువుతున్నారు ఉపదేశలహరులను ఉరకలు వేయిస్తూ,   శంకరయ్య వంకచూస్తూ నవ్వుతూ,  శివయ్య నాతో చెప్పాడు లెండి  మీరు వాడిని ఎప్పుడు చూస్తామా? అని బయలు దేరారట.  అసహనముగా ఉన్న...

KADAA TVAAM PASYAEM -06

Image
          కదా  త్వాం  పశ్యేయం-06    *********************   "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం  లోక శంకరం".   "ఆనందామృత పూరితా హరి పదాంభోజాలవాలోద్యతా    స్థైర్యోపఘ్నం ఉపేత్య భక్తి లతికా   శాఖోపశాఖాన్వితా   నిత్యాభీష్ట ఫలప్రదుని,"  భక్తులను శాఖోపశాఖలుగా విస్తరింపచే       సుకొనిన ఆనందామృత పూరితుని,మన మనోFఅలకమునందు స్థిరముగా నిలుపుకుంటూ,ఈనాటి బిల్వార్చనను ప్రారంభించుకుందాము.    శివయ్యా రాత్రంతా ఆ గిరిజ చిన్న గుడారమును తీసుకుని వచ్చి నా ముందేనిలుచున్నట్లున్నదయ్యా.ఎంత చక్కగా అభినయించింది చక్రాల్లా కళ్ళను తిప్పుకుంటూ.ఆ చిన్నారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది.ఒక్కసారి బడి దగ్గరకు వెళ్ళివద్దామా అన్నాడు శంకరయ్య.  అది బడి కాడు.నీ ఒరవడిని మార్చేసే గుడి అని మనసులో అనుకుంటూ అయితే త్వరగా బయలుదేరుదాం పదండి అని ఇద్దరు బయలుదేరారు.    తస్మై శ్రీ గురవే నమః.   పాఠశాలలో పాఠము చెబుతున్నారండి.మీరు గిరిజను ఇప్పుడు కలిసి మాట్...

KADAA TVAAMPASYAEYAM-05

Image
    కదా  త్వాం పశ్యేయం-05   *******************    " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామిభగవత్పాదం శంకరం లోక శంకరం."  " మనస్తే  పాదాబ్జే    నివసతు వచః స్తోత్ర ఫణితౌ     కరౌ చాభ్యర్చాయాం     శ్రుతిరపి కథాకర్ణనా విధౌ    తవ ధ్యానే బుద్ధిః     నయన యుగళే మూర్తి విభవం"    మనమనోఫలకముపై ముద్రించుకుని ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.    మిత్రులారా శంకరయ్య లా పరమాత్మను ,   (దూషిస్తూ బిల్వార్చన అంటుందేమిటి అన్న అనుమానము మీలో కలుగ వచ్చును.న-ఇతి,  ఇది కాదు ఇదికాదు అన్న తత్త్వమును అర్థము చేసుకునే ప్రహసనములో అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ అయినప్పటికిని ఆదిదేవుడు నా అపరాధములను మన్నించి,తన అక్కున చేర్చుకుంటాడన్న ఆశతో,) ఇంక థలోనికి వస్తే,   వాడు( నా)పరవశుదే  అనుకుంటూ నడుస్తున్నాడు శంకరయ్య.   వీడు (నా)పర- వశుడే అనుకుంటూ అనుసరిస్తున్నాడు శివయ్య.   వారిరువురి పరవశమునకు భంగము కలిగిస్తూ,   హరహర మహాదేవ్-హరహర మహాదేవ్ ...

KADAA TVAAM PASYAEYAM-04

Image
కదా త్వాం పశ్యేయం-04 *********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం. నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.". " త్వత్పాదాంబుజం అర్చయామి పరమంత్వాం చింతయామన్వహం త్వాం ఈశం శరణం వ్రజామి వచసా" అని శరణు వేడుతూ.ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. లేడు-కలండన్నవాడు కలడో-లేడో అంటూ తికమకపడుతున్న శంకరయ్యను చూస్తూ, మీరింకా ఆ చిన్నపిల్ల మాటనే నమ్ముతున్నట్లున్నారు.ఆ పిల్లకు ఎవరు ఏమనిచెప్పారో,ఏమి అర్థముచేసుకుందో కాని మీరు మాత్రం నా మాటలపై సందేహముతో నున్నారనిపిస్తున్నది శంకరయ్యగారు అన్నాడు మనసులో ఎక్కడ మనసు మార్చుకుని, " కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చన" అంటాడేమో అన్న అనుమానముతో. శివయ్య మాటలకు తెప్పరిల్లిన శంకరయ్య అయితే ఆ చిన్నపిల్ల అలా ఊహించుకుందా! పాపం అన్నాడు, జాలిగా. అంతేగా.అంతేగా.కాకపోతే ఎంతమంది మా ఊళ్ళో అనుకుంటారు ... అయినా నాకెందుకులెండి ఆ విషయాలు. ఏదో మీతోపాటు వచ్చి నా పనిచేసుకు పోతాను.ఒకవేళ మీరు పట్టుకోవద్దులే అంటే ........ ఆలోచనలో పడ్డాడు శంకరయ్య.అసలు నేను కదా వాడిని నమ్మనిది.పట్టుకోవాలనుకున్నది.ప్...